tota narasimham
-
నాడు కపట ప్రేమ.. నేడు మొసలి కన్నీరు
న్యూఢిల్లీ: ఏపీకి ఎమ్మెల్సీ స్థానాలు పెంచేందుకు అనువుగా తీసుకొచ్చిన ఏపీ పునర్విభజన సవరణ బిల్లుపై మంగళవారం లోక్ సభలో తెలుగుదేశం పార్టీ పక్ష నేత తోట నరసింహం మాట్లాడుతూ రాష్ట్ర పునర్విభజన సవరణ బిల్లును తాను సమర్ధిస్తున్నానని అన్నారు. దీనివల్ల ఏపీ ఎమ్మెల్సీల సంఖ్య పెరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా విభజన చేశారని చెప్పారు. కాంగ్రెస్ నిర్వాకంతోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఇబ్బుందుల పడుతున్నారని చెప్పారు. అప్పట్లో ఆంధ్రప్రదేశ్‌పై కాంగ్రెస్ పెద్దలు కపటప్రేమను ప్రదర్శించారు.. ఇప్పుడు ముసలికన్నీరు కారుస్తున్నారని విమర్షించారు. ఆంధ్రప్రదేశ్ పై ప్రేమ ఉన్నట్లు సోనియాగాంధీ మాట్లాడటం అభినందనీయమన్నారు. విభజనకు ముందు ఒక్క నిమిషం ఏపీ గురించి మాట్లాడినా అంతా మంచి జరిగి ఉండేదని చెప్పారు. అశాస్త్రీయంగా విభజించడంవల్లే నేడు రాష్ట్రం అనేక ఇబ్బందులను ఎదుర్కొంటుందని చెప్పారు. మరోపక్క, ఎంపీ సౌగత్ రాయ్ మాట్లాడుతూ ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రమే నిధులు నివ్వాలని డిమాండ్ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు స్నేహభావంతో మెలగాలని ఆయన కోరారు. అలాగే, ఒడిశా ప్రాంత ఎంపీ ఆర్కే జానా మాట్లాడుతూ పోలవరాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తామని, ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని కూడా తాము వ్యతిరేకిస్తామని చెప్పారు. పోలవరంతో తమ ప్రాంతాలు చాలా వరకు ముంపు బారిన పడతాయని చెప్పారు. -
వీరవరం గరంగరం
కిర్లంపూడి, న్యూస్‌లైన్ : తనకు ఓట్లు తక్కువ పడ్డాయనే అక్కసుతో స్వగ్రామంలో దాడులకు బరి తెగించిన మాజీ మంత్రి, కాకినాడ ఎంపీ తోట నరసింహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆదివారం నిరశన దీక్షలు చేపట్టారు. తోట స్వగ్రామమైన తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం వీరవరంలో టీడీపీ కన్నా వైఎస్సార్ సీపీకి ఎక్కువ ఓట్లు రావడంతో విచక్షణ కోల్పోయిన నరసింహం, ఆయన వర్గీయులు శుక్రవారం రాత్రి విజ యోత్సవ ర్యాలీలో, శనివారం వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లపై దాడులకు దిగి, గాయపరిచారు. అది జరిగి 24 గంటలైనా పోలీసులు నరసింహంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితులైన తోట గాంధీ, గొల్లపల్లి సూరిబాబు, గరగా భీమరాజు, గంగారావు ఆదివారం గ్రామకూడలిలో రోడ్డుకు అడ్డంగా టెంట్ వేసి నిరశన దీక్ష చేపట్టారు. పలువురు గ్రామస్తులు వారికి మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. జగ్గంపేట సీఐ సుంకర మురళీమోహన్, కిర్లంపూడి ఎస్సై సి.హెచ్.విద్యాసాగర్ ఆందోళన విరమించాలని నచ్చచెప్పబోయారు. అయితే తమ ఇళ్లపైకి వచ్చి దాడి చేసిన ఎంపీ తోటపై చట్టపరమైన చర్యలు తీసుకునే వరకు ఆందోళన విరమించేది లేదని బాధితులు తేల్చిచెప్పారు. వైఎస్సార్ సీపీ నేతలు, జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, దాడిశెట్టి రాజా వీరవరం చేరుకుని ఆందోళనకారులకు సంఘీభావం వ్యక్తం చేశారు. ఒకానొక సమయంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనడంతో వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. గ్రామంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసిన సీఐ పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలిపారు. చివరికి రెండురోజులు వ్యవధి ఇస్తే ఎంపీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు. దాంతో జ్యోతుల ఆందోళనకారులకు నచ్చచెప్పి శాంతింపజేశారు. ఈ ఆందోళనలో తోట ఈశ్వరరావు, తోట సర్వారాయుడు, వీర వెంకట సత్యనారాయణమూర్తి, తోట రామస్వామి తదితరులు పాల్గొన్నారు. హామీ నెరవేర్చకపోతే తీవ్ర పరిణామాలు : జ్యోతుల ఆందోళన విరమణ అనంతరం జ్యోతుల విలేకరులతో మాట్లాడుతూ పోలీసు వ్యవస్థపై గౌరవం, నమ్మకం ఉన్న తాము సీఐ హామీతో తాత్కాలికంగా ఆందోళన విరమించామన్నారు. రెండు రోజుల్లో నరసింహంపై చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. మెట్ట ప్రాంతంలో వైఎస్సార్ సీపీ నేతలు సీమ సంస్కృతిని తెస్తున్నారన్న ఎంపీ నరసింహం ఆరోపణను ఖండించారు. ఓట్లు వేయలేదనే కక్షతో ఫ్యాక్షనిస్టుగా వ్యవహరించినది ఆయనేనని అందరికీ తెలుసన్నారు. భారీగా పోలీసు బలగాల మోహరింపు ఎలాంటి ఉద్రిక్తతలూ చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యగా వీరవరంలో భారీగా పోలీసు బలగాలను మోహరించినట్టు సీఐ మురళీమోహన్ తెలిపారు. ఇరు వర్గాల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేశామన్నారు. జరిగిన సంఘటనలపై పూర్తి స్థాయిలో విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
అధికార మదంతోనే టీడీపీ దాడులు
కాకినాడ, న్యూస్‌లైన్ : అధికారం చేతికి రాగానే తెలుగుదేశం నేతలు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా ఎస్సీ సెల్ కన్వీనర్ శెట్టిబత్తుల రాజబాబు ఆరోపించారు. పార్టీ శ్రేణులు సంయమనం పాటించి దాడులను తిప్పికొట్టాలన్నారు. కాకినాడలో ఆదివారం విలేకర్లతో మాట్లాడుతూ కోట్లు కుమ్మరించి అడ్డదారుల్లో అధికారం చేజిక్కించుకున్న టీడీపీ నాయకులు వైఎస్సార్ సీపీపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడున్నారని ధ్వజమెత్తారు. కేవలం 2 శాతం స్వల్ప ఓట్లు తేడాతో అధికారాన్ని చేజిక్కించుకున్న టీడీపీ అధికారమదంతో విర్రవీగుతుందన్నారు. కాకినాడ ఎంపీ తోటనరసింహం తాను ఎంపీనన్న స్పృహను కూడా కోల్పోయి ఒక వీధి రౌడీలా వైఎస్సార్ సీపీ నాయకుల ఇళ్లల్లోకి చొరబడి దాడులకు తెగపడడం చూస్తుంటే మున్ముందు వీరి ఆగడాలు ఏ స్థాయి లో ఉంటాయో అర్థమవుతుందన్నారు. ఎస్సీల ఇళ్లల్లోకి కూడా వెళ్లి ఆడ, మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైనా భౌతిక దాడులకు దిగడం టీడీపీ నేతల రౌడీయిజానికి పరాకాష్టగా మారిందన్నారు. ఇదే రీతిలో టీడీపీ శ్రేణులుంటే మాత్రం వైఎస్సార్ సీపీ శ్రేణులు చూస్తూ ఊరుకోబోరని తగిన రీతిలో ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. -
‘తోట’కు..ముళ్లబాట
ఎమ్మెల్యేగా సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. మూడేళ్లు మంత్రి పదవిని వెలగబెట్టినా జిల్లాలో చెప్పుకోడానికి ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమమూ చేపట్టలేదు. పైగా మంత్రిగా ఉన్న సమయంలో చుట్టుముట్టిన అవినీతి ఆరోపణలు.. ఇలాంటి నేపథ్యమున్న తోట నరసింహానికి అధిష్టానం పిలిచి పీట వేసినా.. తాము మాత్రం సహకరించేది లేదంటూ తెలుగు తమ్ముళ్లు తెగేసి చెబుతున్నారు. మాజీ మంత్రిని వెంటాడుతున్న ఓటమి భయం ఆయనొస్తే పడే ఓట్లూ పడవేమోనని భయం ముఖం చాటేస్తున్న అసెంబ్లీ అభ్యర్థులు సహాయ నిరాకరణ చేస్తున్న టీడీపీ క్యాడర్ మామ మెట్ల, కుటుంబ సభ్యులతోనే ప్రచారం సాక్షి, కాకినాడ : కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవిని వెలగబెట్టి, ఎన్నికల ముందు తెలుగుదేశంలోకి ఫిరాయించి, కాకినాడ ఎంపీ టిక్కెట్‌ను దక్కించు కున్న తోట నరసింహానికి ‘దేశం’ శ్రేణులు ఏ మాత్రం కలిసి రావడం లేదు. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబీ ్లసెగ్మెంట్లలో పార్టీ అభ్యర్థుల నుంచే పూర్తిస్థాయి సహకారం లభించడం లేదు. అవకాశవాదంతో వలసవచ్చిన నేతకు సహకరించేది లేదంటూ తెగేసి చెబుతుండడంతో నరసింహం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఉద్యోగం చేసుకుంటున్న నరసింహం.. అన్న మరణంతో ఆయన వారసునిగా రాజకీయ రంగంలోకి వచ్చారు. వ్యక్తిగతంగా ఎలాంటి ప్రభావమూ చూపలేని ఆయన 2004, 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చలవతో ఎమ్మెల్యే అయ్యారు. వైఎస్ అకాల మరణం తర్వాత స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రి పదవి పొందిన తోట.. ఎమ్మెల్యేగా నియోజకవర్గానికి గానీ, మంత్రిగా జిల్లాకు గానీ ఒరగబెట్టిందేమీ లేదన్న అప్రతిష్టను మూటగట్టుకున్నారు. దీనికి తోడు మంత్రిగా అవినీతి ఆర్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలకూ కొరత లేదు. అప్పట్లో ‘చంద్రబాబు అవినీతి సమ్రాట్’ అంటూ నరసింహం నిప్పులు చెరిగితే నరసింహం అవినీతిపై టీడీపీ నేతలు దుమ్మెత్తి పోసేవారు. ఆరునూరైనా కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రగల్భాలు పలికిన నరసింహం ఇప్పుడు రాజకీయపబ్బం గడుపుకొనేందుకు మామగారైన డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు రాయబారంతో టీడీపీ పంచన చేరారు. కాకినాడ ఎంపీ టిక్కెట్టునూ దక్కించుకున్నారు. అయితే ఆయనకు కలసిరాని టీడీపీ శ్రేణులు చుక్కలు చూపిస్తున్నాయి. తలకిందులైనా.. ఓటమి తథ్యం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక్క అభ్యర్థి కూడా నరసింహం కోసం పనిచేయడం లేదు. తమ పరిస్థితే అంతంతమాత్రంగా ఉండగా, నరసింహంను వెంటబెట్టుకొని వెళ్తే ఆ పడే నాలుగు ఓట్లు కూడా పడవేమోననే భయం వారిని వెన్నాడుతోంది. దాంతో వారు తోటకు దూరంగానే ప్రచారం సాగిస్తున్నారు. దీంతో తోటకు విధిలేక మామ మెట్లతో పాటు కుటుంబ సభ్యులతోనే ప్రచారం చేసుకుంటున్నారు. తోట ఓటమి తప్పదన్న సంకేతాలు ఇప్పటికే స్పష్టమైనా పిల్లనిచ్చిన మామగా మెట్ల తన సొంత నియోజకవర్గంలో పార్టీని గాలికొదిలేసి కుటుంబ సమేతంగా అల్లుడి ప్రచారం సాగిస్తూ చెమటోడుస్తున్నారు. పార్టీ శ్రేణులు కలిసి రాకున్నా.. రకరకాల ఎరలు, ప్రలోభాలతో ఓట్లు రాబట్టాలని తోట వ్యూహరచన చేస్తున్నట్టు కనిపిస్తోంది. సాధారణంగా ప్రచారం ముగిశాక మొదలయ్యేప్రలోభాలకు ఆయన వారం రోజుల ముందే తెరతీసినట్టు సమాచారం. అయితే ఆయన ఎన్ని పాట్లు పడినా ఓటమి తప్పదని ఆ పార్టీ శ్రేణులే తేల్చి చెబుతున్నారు. తోట గెలుపుపై పందాలు కాసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. -
టీడీపీని వీడని తోట ముడి
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ మంత్రి తోట నరసింహం తెలుగుదేశం పంచన చేరడం జిల్లాలో ఆ పార్టీలో మెజార్టీ నేతలకు పుండు మీద కారం చల్లినట్టుంది. పార్టీని అంటి పెట్టుకుని ఉన్న వారి మధ్య సీట్ల సిగపట్లే తేలని తరుణంలో.. తోట రాక పార్టీ పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెట్టింది. తోట రాకతో పడ్డ పీటముడి ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. తోట టీడీపీలోకి రావడంతోనే ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం టిక్కెట్టు ఖాయమైందని అనుచరులు ప్రచారం చేశారు. జగ్గంపేట నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు సహా పలువురు నేతలు ఇచ్చిన 24 గంటల అల్టిమేటమ్‌తో దిగొచ్చిన చంద్రబాబు వారిని హైదరాబాద్‌కు పిలిపించారని, జగ్గంపేట సీటు చంటిబాబుకే కేటాయిస్తున్నట్టు చెప్పి తాత్కాలికంగా బుజ్జగించగలిగారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇందులో వాస్తవమెంతనేది పక్కన బెడితే హైదరాబాద్ నుంచి తిరిగొచ్చిన తోట.. కాకినాడ పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నట్టు తనకు తానుగా ప్రకటించుకుని పార్టీలో మరో వివాదానికి తెర తీశారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్ప సమక్షంలోనే తోట ఇలా ప్రకటించారు. ఆ విషయాన్ని ఆ సమయంలో నాయకులు సీరియస్‌గా పరిగణించలేదు. అయితే కాకినాడ పార్లమెంటు సీటు ఆశిస్తున్న కెట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం ఆశలకు తోట గండి కొడుతున్నారనే సంకేతాలతో ఆ వర్గం తీవ్రంగా స్పందించడంతో వివాదం బజారుకెక్కింది. తోట చేరికతో మొదట జగ్గంపేటకే పరిమితమైన ప్రకంపనలు ఇప్పుడు కాకినాడను కూడా తాకాయి. గ త ఆరేడు నెలలుగా విశ్వం సీటు కోసం ప్రయత్నిస్తుండగా, ఇప్పుడు హఠాత్తుగా తోటను తీసుకువచ్చి, టీడీపీని వీడని ‘తోట’ ముడి ఆయన వైపు మొగ్గుచూపితే అధిష్టానానికి సరైన గుణపాఠం చెబుతామని విశ్వం అనుచరులు తెగేసి చెబుతున్నారు. తమ నిరసనను గత వారం రోజులుగా వివిధ రూపాల్లో వ్యక్తం చేస్తున్నారు. మామా, అల్లుళ్లు పార్టీని ముంచేస్తారా? తోటకు కాకినాడ పార్లమెంటు సీటు కేటాయిస్తున్నట్టు అధిష్టానం నుంచి ఎలాంటి సమాచారం లేనప్పుడు కంగారు పడాల్సిన పని లేదని పార్టీ జిల్లా నేతలు విశ్వం వర్గీయులకు నచ్చచెబుతున్నారు. తోట తనకు తాను ప్రకటించుకుంటే సరిపోదని బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. విశ్వం అనుచరులు, కైట్ విద్యార్థులు ఇటీవల ఆయనకే కాకినాడ పార్లమెంటు సీటు ఇవ్వాలని జిల్లా టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించిన సందర్భంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప చెప్పిన మాటలను బట్టి తోటకు సీటు ఇంతవరకు ఖాయమవలేదనే విషయం స్పష్టమైందంటున్నారు. అయితే.. అటు జగ్గంపేట అసెంబ్లీ సీటు, ఇటు కాకినాడ పార్లమెంటు సీటు విషయంలో తోట చిచ్చుపెట్టారని పార్టీ నేతలు, కేడర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు. ఁజిల్లా కాంగ్రెస్ పార్టీకి అడ్రస్ లేకుండా పోవడంతో టీడీపీలోకి వచ్చిన తోటకు సీటు ఇచ్చి ఇంత కాలం పార్టీ కోసం అనేక వ్యయప్రయాసలు ఎదుర్కొన్న వారికి అన్యాయం చేస్తారా?అని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. తోట మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో పొసగని పార్టీ జిల్లా అధ్యక్షుడు చినరాజప్ప ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తీసుకున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మామ మెట్ల, అల్లుడు తోట కలిసి పార్టీని ఏమి చేయదలుచుకున్నారో అర్థం కావడం లేదని, నమ్ముకున్న వారిని నట్టేట ముంచేస్తారా అని కేడర్ ప్రశ్నిస్తోంది. కాగా వారి ఎత్తుగడలను సాగనివ్వబోమని పార్టీ ముఖ్య నేతలు హెచ్చరిస్తున్నారు. -
‘దేశం’లో తోటాకు మంట
సాక్షి ప్రతినిధి, కాకినాడ : మాజీ మంత్రి తోట తెలుగుదేశం పార్టీలో చేరీ చేరగానే కాకినాడ పార్లమెంటు సీటు తనదేనంటూ పార్టీలో అన్నీ తానే అన్నట్టు ప్రకటించుకోవడం టీడీపీలో కొత్త చిచ్చురేపింది. అసలు తోట టీడీపీలోకి రావడంతోనే వివాదాలు మొదలయ్యాయని కేడర్ తలపట్టుకుంటోంది. తుది వరకు కాంగ్రెస్‌ను వీడేది లేదని ఇటీవలే ప్రగల్భాలు పలికిన తోట ఇంతలోనే ప్లేటు ఫిరాయించి మామ, మాజీ మంత్రి డాక్టర్ మెట్ల సత్యనారాయణరావుతో దౌత్యం నడిపించి, టీడీపీ పంచన చేరారు. ఆ పార్టీ తరఫున జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కూడా ప్రచారమైంది. దీంతో.. గత ఎన్నికల్లో ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓటమి పాలై, తిరిగి టిక్కెట్టుపై ఆశతో ఉన్న పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబు వర్గీయులు కన్నెర్రజేశారు. ఈ నేపథ్యంలో చంటిబాబు 24 గంటల అల్టిమేటమ్ ఇవ్వడంతో దిగొచ్చిన చంద్రబాబు చర్చలకు పిలిచి, జగ్గంపేట టిక్కెట్టు మరెవరికీ ఇచ్చేది లేదని చంటిబాబుకు చెప్పారు. ఇక ఆ సమస్య సద్దుమణిగిందని పార్టీ నేతలంతా కుదుటపడుతున్న తరుణంలో తోట తెలుగుదేశం పార్టీలో కొత్త చిచ్చు రేపారు. టీడీపీని ముంచేస్తారా? కాకినాడ ఎంపీ సీటు తనదేనని జిల్లా ముఖ్య నేతల సమక్షంలోనే తోట ప్రకటించ డం పార్టీ జిల్లా నాయకత్వాన్ని అవమానించినట్టు కేడర్ భావిస్తోంది. ‘కేడర్ లెస్ లీడర్’గా మిగిలిన తోట అక్కడ కాంగ్రెస్‌ను భూస్థాపితం చేసి ఇప్పుడు ఇక్కడ టీడీపీని కూడా నట్టేట ముంచేసే ఎత్తుగడలో ఉన్నట్టు కనిపిస్తోందని పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాకినాడ సీటు తనదేనని ప్రకటించుకోవడం ద్వారా తమను అవమానించినట్టు పార్టీ జిల్లా నాయకత్వం భావిస్తోంది. కాకినాడ పార్లమెంటు సీటుపై ఆశలు పెంచుకుని, గడచిన ఆరేడు నెలలుగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్న విశ్వంను రేసు నుంచి తప్పించేందుకు మామా, అల్లుళ్లైన మెట్ల, తోట ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. నరసింహానికి అంత సీన్ లేదు.. గతంలో తునిలో నిర్వహించిన కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో విశ్వంను ఎంపీ అభ్యర్థిగా పార్టీ ఎన్నికల కమిటీ చైర్మన్ యనమల రామకృష్ణుడు నేతలకు పరిచయం చేశారు. అంతకంటే ముందు పెద్దాపురం నియోజకవర్గ ఇన్చార్జి అని ప్రకటించారు. పెద్దాపురం టిక్కెట్టు కమ్మ సామాజికవర్గానికి ఇవ్వాలనే నిర్ణయంతో విశ్వం సీటు పెద్దాపురం నుంచి ఒకసారి పిఠాపురం అని, మరోసారి కాకినాడ రూరల్ అని..మార్చి, మార్చి ఇప్పుడు కాకినాడ ఎంపీ సీటుకు కూడా ఎసరు పెడుతున్నారని ఆయన అనుచరులు, కైట్ విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాకు దిగడంతో పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. నరసింహం టీడీపీలోకి రావడంతో ఇప్పటికే పార్టీలో ఉన్న వారికి మానసిక స్థిమితం లేకుండా చేస్తున్నారని నేతలు ఆవేదన చెందుతున్నారు. పార్టీ కార్యాలయ కార్యదర్శి మందాల గంగ సూర్యనారాయణ జిల్లా అధ్యక్షుడు నిమ్మకాయల చినరాజప్పతో.. ధర్నా చేస్తున్న విశ్వం అనుచరులను ఉద్దేశించి ఫోన్లో మాట్లాడించారు. ఈ విషయాలన్నీ తరచి చూస్తే కాకినాడ ఎంపీ సీటు తనదేనంటున్న తోటకు పార్టీలో తన సీటు తానే ప్రకటించుకునేంత సీన్ లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోందంటున్నారు. పార్టీ అధిష్టానం కాకినాడ పార్లమెంటు సీటుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఎవరికీ ప్రకటించలేదని రాజప్ప విశ్వం అనుచరులకు చెప్పడం పార్టీలో మరింత గందరగోళానికి దారితీసింది. అసలు తోటను పార్టీలోకి ఆహ్వానించడమెందుకు, ఆ కారణంగా పార్టీని ఎన్నటి నుంచో నమ్ముకున్న నేతల్లో అభద్రతను సృష్టించడం ఎందుకని.. అధినేత తీరుపై పార్టీ శ్రేణులు మండిపడుతున్నాయి. -
తోటకు సీటిస్తే ప్రతిఘటనే..
అధినాయత్వానికి జగ్గంపేట తెలుగు తమ్ముళ్ల అల్టిమేటం జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరిస్తామని వార్నింగ్ రాజకీయ సన్యాసం చేస్తానన్న కొండయ్యదొర 24 గంటల్లో చంటిబాబును జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ లేకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని స్పష్టీకరణ జగ్గంపేట, న్యూస్‌లైన్ : జగ్గంపేటలో తెలుగుదేశం రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. మాజీ మంత్రి తోట నరసింహం కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి జంప్ చేయడమే ఇందుకు కారణమైంది. జగ్గంపేట టీడీపీ టిక్కెట్టు ఆయనకు ఇస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంతో తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. నియోజవర్గ ఇన్చార్జి జ్యోతుల చంటిబాబుకు ఎమ్మెల్యే టిక్కెట్ లభిస్తుందని గంపెడాశతో ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు తాజా పరిణామాలతో గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టయింది. నరసింహం టీడీపీ తీర్థం పుచ్చుకోవడం, జగ్గంపేట టిక్కెట్టు విషయమై మూడు రోజులుగా చంటిబాబుకు వ్యతిరేకంగా పత్రికల్లో కథనాలు రావడంతో పార్టీ శ్రేణులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తక్షణమే మేల్కొనకపోతే తీవ్రంగా నష్టపోతామని భావించిన పార్టీ నాయకులు శుక్రవారం ఉదయం స్థానిక టీడీపీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఎస్వీఎస్ అప్పలరాజు సారథ్యంలో అత్యవసరంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఎవరేమన్నారంటే.. జ్యోతుల చంటిబాబు : జగ్గంపేట స్థానానికి వేరే పేరు వినిస్తుండడంతో మనోవేదనకు గురయ్యాం. లేనిపోని మెసేజ్ బయటకు వెళుతుందని అత్యవసరంగా ఈ సమావేశం ఏర్పాటు చేశాం. పార్టీ నాకు టిక్కెట్టు ఇస్తుందన్న నమ్మకం ఉంది. మార్పులు చేర్పులు చేయవలసివస్తే పార్టీ కొండయ్యదొర, అప్పలరాజుతో చర్చించేవారు. అవేమీ జరగలేదు. తేడా వస్తే మీరు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. కందుల కొండయ్యదొర, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు : మూడు రోజులుగా జగ్గంపేట అభ్యర్థిగా చంటిబాబును కాదని వేరే పేరు వస్తోంది. కార్యకర్తల నుంచి రోజూ వెయ్యి ఫోన్లు రావడంతో సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లను పట్టించుకోకుండా పెద్ద దిక్కుగా ఉన్న యనమల రామకృష్డుడు, చినరాజప్పల వద్దకు తిరిగాం. పత్రికల్లో వస్తున్న వార్తలను అవకాశమున్నా వారు ఖండించలేదు. నియోజకవర్గంలో కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీలను నెగ్గించుకోలేని వ్యక్తిని ఎవరికీ చెప్పకుండా పార్టీలోకి తీసుకున్నారు. తోట నరసింహానికి జగ్గంపేట సీటిస్తే ఇక్కడ టీడీపీ పరిస్థితి సీమాంధ్రలో కాంగ్రెస్‌లా అవుతుంది. ఎమ్మెల్యే సీటును 24 గంటల్లోగా చంటిబాబుకు ప్రకటించాలి. చంటిబాబును కాదని వేరే వ్యక్తికి సీటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. (అంటూ కన్నీరు పెట్టుకున్నారు.) మా డిమాండ్‌కు బదులు రాకపోతే శనివారం సాయంత్రం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటాం. ఎస్వీఎస్ అప్పలరాజు : కార్యకర్తలు ఆందోళన చెందవద్దు. అధిష్టానంతో మాట్లాడాం. సానుకూలంగా స్పందించకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. టీడీపీ గోకవరం, గండేపల్లి మండల అధ్యక్షులు దొడ్డా విజయభాస్కర్, పోతుల మోహనరావు : చంటిబాబుకు సీటు ఇవ్వకపోతే మా మండలాల నుంచి జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటాం.దాడి రంగారావు, కిర్లంపూడి : చంటిబాబుకు టిక్కెట్టు ఇవ్వకుంటే జెడ్పీటీసీకి వేసిన నామినేషన్ ఉపసంహరించుకుంటాను. కొత్త భైరవకృష్ణ, జగ్గంపేట : ఎమ్మెల్యే టిక్కెట్‌కు ప్రయత్నించడం మంచిది కాదని నరసింహానికి మూడు రోజుల క్రితం ఫోన్లో తెలిపాను.విలేకర్ల సమావేశంలో ఎస్వీ ప్రసాద్, ఉంగరాల రాము, తమటం నాగేశ్వరరావు, తాండ్రోతు రామారావు తదితరులు కూడా మాట్లాడారు. జ్యోతుల రామస్వామి, నిమ్మగడ్డ సత్యనారాయణతో పాటు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నుంచీ భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు. -
జగ్గంపేట టీడీపీలో ముసలం
జగ్గంపేట: తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట టీడీపీలో ముసలం రాజుకుంది. మాజీ మంత్రి తోట నర్సింహంను పార్టీలో చేర్చుకోవడాన్ని తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే టీడీపీ తరపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారు. ఇన్నాళ్లు టీడీపీ వ్యతిరేకంగా పనిచేసిన నర్సింహంను ఇప్పుడు ఎలా పార్టీలో చేర్చుకుంటారని జగ్గంపేట టీటీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. 2014 ఎన్నికలే కాదు 2019 ఆ తర్వాత ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ నుండే పోటీ చేసి గెలుస్తానని నరసింహం గొప్పలు పోయిన విషయాన్ని వారు గుర్తు చేశారు. తోట నర్సింహంకు జగ్గంపేట సీటిస్తే అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు. -
రాజకీయ క్రీడ
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘జరిగిపోయిన పెళ్లికి బాజా వాయించడం’లోని అనౌచిత్యం చిన్నపిల్లలకైనా తడుతుంది. అయితే అలాంటి ఉచితానుచితాల పట్టింపు అటు అమాత్యులకూ, ఇటు అధికారులకూ లేనట్టుంది. అందుకే కాకినాడలోని జిల్లా క్రీడామైదానంలో రెండు నెలల క్రితమే మొదలైన అభివృద్ధి పనులకు ఆదివారం శంకుస్థాపన తతంగాన్ని నిర్వహించారు. మైదానంలో రూ.1.54 కోట్లతో షాపింగ్ కాంప్లెక్స్, రూ.1.70 కోట్లతో జిమ్నాస్టిక్స్ హాలు, రూ.65 లక్షలతో టీటీ హాలు, రూ.74 లక్షలతో అకామడేషన్ హాలు, రూ.44 లక్షలతో సింథటిక్ టెన్నిస్ కోర్టు, రూ.32 లక్షలతో 400 మీటర్ల అథ్లెటిక్ ట్రాక్, రూ.15 లక్షలతో రెండు గేట్లు, రూ.17 లక్షలతో ప్రహారీ, రూ.11 లక్షలతో మరమ్మతు పనులు రెండు నెలలుగా జరుగుతున్నాయి. డిసెంబరు చివర్లో రాష్ట్ర పర్యాటక, క్రీడల మంత్రి వట్టి వసంతకుమార్ జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు పనులను పర్యవేక్షించి వెళ్లారు. అలాంటి పనులకు ఇప్పుడు శంకుస్థాపన అంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి తోట నరసింహం ఆదివారం హడావిడి చేయడం విమర్శలకు తావిచ్చింది. జరుగుతున్న పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ కోణం దాగి ఉందనే వాదన వినిపిస్తోంది. జిల్లా క్రీడామైదానం కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరుగుతాయనే సంకేతాలందుతున్న నేపథ్యంలో రూ.5.86 కోట్లతో క్రీడాభివృద్ధికి తన హయాంలోనే శ్రీకారం చుట్టానని చెప్పుకోవాలన్న తాపత్రయంతోనే అక్కడి అధికార పార్టీ ఎమ్మెల్యే కె.కన్నబాబు ప్రోద్బలంతో జరుగుతున్న పనులకే శంకుస్థాపన అంటూ హడావిడి చేశారని క్రీడాకారులు పేర్కొంటున్నారు. పనులు చేపట్టిన నాడు శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయని అధికారులు ఇప్పుడు చేయడంపై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు.