Total Services
-
మొబైల్ డేటా లేకున్నా చాటింగ్
న్యూఢిల్లీ: మొబైల్ డేటా లేకపోయినా చాటింగ్, వార్తలు, రైలు టికెట్ల బుకింగ్, చెల్లింపులు వంటి సదుపాయాలు పొందే విధంగా మెసేజింగ్ సేవల సంస్థ హైక్ తాజాగా ’టోటల్’ పేరిట కొత్త సర్వీసును ఆవిష్కరించింది. యూఎస్ఎస్డీ టెక్నాలజీపై ఇది పనిచేస్తుందని హైక్ మెసెంజర్ సీఈవో కవిన్ మిట్టల్ తెలిపారు. చౌక ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్స్‌లో దీన్ని పొందుపర్చేలా ఇంటెక్స్, కార్బన్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. మెసేజింగ్, న్యూస్, స్పోర్ట్స్ స్కోర్లు మొదలైనవన్నీ ఈ సర్వీసుతో పొందవచ్చని.. అయితే, ఫొటోలు పంపేందుకు మాత్రం డేటా అవసరమవుతుందని మిట్టల్ తెలిపారు. ఇందుకోసం 4జీ స్పీడ్‌తో 20 ఎంబీ డేటా ప్యాకేజీలను రూ. 1 నుంచి అందించేలా అటు ఎయిర్టెల్, వొడాఫోన్, ఎయిర్‌సెల్, బీఎస్ఎన్ఎల్తో కూడా ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన చెప్పారు. రిలయన్స్ జియో తదితర సంస్థలతో కూడా చర్చలు జరుపుతున్నట్లు తెలియజేశారు. ఎంపిక చేసిన ఇంటెక్స్, కార్బన్ ఫోన్లు కొనుగోలు చేసిన వారు టోటల్ సర్వీసుల కోసం సైన్ అప్ చేయగానే.. వారి హైక్ వాలెట్లో రూ.200 జమవుతాయని మిట్టల్ తెలిపారు. కేవైసీ ప్రక్రియ పూర్తయ్యాక డేటా ప్లాన్ల కొనుగోలుకు, ఇతరత్రా ఎవరికైనా పంపేందుకు కూడా ఈ మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చన్నారు. -
ఆర్టీఏ సేవలన్నీ ఆన్లైన్లోనే..
ఆగస్టు 2 నుంచి అందుబాటులోకి మొదలైన స్లాట్ బుకింగ్ అయినా దళారులదే హవా! సంగారెడ్డి టౌన్: రవాణా శాఖకు సంబంధించిన అన్ని సేవలు ఆగస్టు 2 నుంచి ఆన్లైన్లోనే నిర్వహిస్తామని జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రకటించారు. రెండు రోజుల క్రితమే ఆన్లైన్ స్లాట్ బుక్ ప్రారంభమైంది. డ్రైవింగ్ లైసెన్సుల మాదిరిగానే వాహన రిజిస్ట్రేషన్లు, యాజ మాన్య బదిలీ, చిరునామా మార్పిడి, రెన్యువల్, డూప్లికేట్ తదితర సేవల కోసం ఎవరైనా ఆన్లైన్లోనే స్లాట్ పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆన్లైన్లో నమోదు చేసుకున్న నిర్దేశిత సమయానకి కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్టీఏ వెబ్సైట్లో అవసరమైన సేవలకు సంబంధించి వివరాలు నమోదు చేసుకున్న తర్వాత కంప్యూటర్ ఒక అప్లికేషన్ నంబరును సదరు అభ్యర్థికి కేటాయిస్తుంది. దాని సమాచారం సదరు వ్యక్తి మొబైల్ నంబరుకు ఎస్ఎంఎస్ ద్వారా వస్తుంది. సంబంధిత ఫీజు ఆన్లైన్లో కాని, ఈసేవ, మీ సేవలో కానీ చెల్లించి, నిర్ణీత స్లాట్ రోజున అవసరమైన ధ్రువపత్రాలను కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుంది. కార్యాలయంలో అభ్యర్థి ఫొటో, సంతకం, వేలిముద్రలు తీసుకొని అభ్యర్థికి అవసరమైన సేవలు అందిస్తారు. దళారుల బెడద తప్పేనా...? డ్రైవింగ్ లైసెన్సుల సేవలు గత ఏడాది నుంచి ఆన్లైన్లోనే అందిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా సేవలు పారదర్శకంగా జరుగుతున్నాయా అంటే లేదనే సమాధానం వస్తోంది. ఆన్లైన్ స్లాట్ పొందినా దళారుల ద్వారా వెళ్లిన వారికే పని తర్వగా పూర్తవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. స్లాట్ పొంది లైన్లో గంటల తరబడి నిల్చున్నా పట్టికోని అధికారులు, దళారుల ద్వారా వెళ్లిన వారికి వెంటనే పని పూర్తవుతోందని చెప్పారు. అన్ని సేవలు ఆన్లైన్లో అందించినా దళారుల బెదడ తప్పేట్టు లేదని పలువు అభిప్రాయపడుతున్నారు.