TPAD Vanabhojanalu
-
టీపాడ్ ఆధ్వర్యంలో ఘనంగా తెలుగువారి వనభోజనం
డాలస్ మురిసేటట్టు.. ప్రకృతి పరవశించేటట్టు.. తెలుగువారి వనభోజనం అమెరికాలోని డాలస్ మహానగరంలో జాతరను మరిపించింది. తెలంగాణ పీపుల్స్ అసోసియేషన ఆఫ్ డాలస్ (టీపాడ్) ఆధ్వర్యంలో ఆర్గైల్‌లోని పైలట్ నాల్ పార్క్ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఇక్కడ స్థిరపడిన తెలుగువారి హృదయాలను ఆకట్టుకున్నది. టీపాడ్ బృందం సభ్యులు ఫ్లాష్‌మాబ్‌తో హుషారు నింపుతూ సుమారు 2500 మంది అతిథులకు ఆత్మీయ స్వాగతం పలికారు. షడ్రసోపేతమైన భోజనాన్ని వడ్డించడమే కాకుండా వీనులవిందైన సంగీతం, నయనానందకరమైన నృత్య ప్రదర్శనలతో మరపురాని వినోదాన్ని పంచారు. అందాల సరస్సు చెంత ఏర్పాటు చేసిన ఈ ఆటవిడుపు కార్యక్రమం అందరి చింతలను పక్కనపెట్టి హాయిగొలిపిందనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత దగ్గరి బంధువులను కలుసుకున్న అనుభూతితో పాటు ప్రతి ఒక్కరిలో ఆత్మీయత ప్రస్ఫుటమైంది. అనుబంధాలను నెమరువేసుకున్నారు. చిన్నా, పెద్దా ఆటపాటలతో ఉల్లాసంగా గడిపారు. ఎప్పటికీ గుర్తుండిపోయేలా టీపాడ్ బృందం సభ్యులు కార్యక్రమాన్ని అద్భుతంగా రూపొందించారు. విభిన్నంగా స్టేజ్ నిర్మించి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డల్లాస్ యువత ఒకరిని మించి మరొకరు పోటాపోటీగా నృత్య ప్రదర్శనలిచ్చి అతిథులను అలరించారు. సరస్సు ఒడ్డున 60 ఎకరాల్లో విస్తరించిన పైలట్ నాల్ పార్క్... 2500 మంది తెలుగువారితో రద్దీగా, కళకళలాడుతూ కనిపించింది. హైదరాబాదీ దమ్-చికెనబిర్యానీ, బగారారైస్, పచ్చిపులుసు, పికిల్స్.. తెలంగాణ టేస్ట్‌ను ఎంజాయ్ చేసేందుకు జనం ఉత్సాహం చూపించారు. భోజనానికి బారులు తీరకుండా, నిమిషాల తరబడి ఎదురుచూసే పరిస్థితి లేకుండా నిర్వాహకులు పకడ్బందీ ఏర్పాట్లు చేయడం అందరి ప్రశంసలు అందుకున్నది. తెలుగురాషా్ట్రల్లో జాతరలప్పుడు ప్రత్యేక దుకాణాలు కొలువుదీరిన రీతిలో.. ఇక్కడ 17 వెండర్బూత్లకు అవకాశం కల్పించారు. ఫేస్ పెయింటింగ్, మెహందీ ఆర్టిస్టులకు భలే డిమాండ్ లభించింది. కార్యక్రమంలో భాగంగా రఫెల్ ప్రైజులు అందజేశారు. టీపాడ్ వనభోజన కార్యక్రమానికి ఏటేటా విశేష స్పందన లభిస్తుండడంతో.. ఈ ఏడాది ఇంకా వినూత్నంగా ఆర్గనైజ్ చేయాలన్న టీపాడ్ సభ్యుల ఆరువారాల కసరత్తుకు అందరి మద్దతు దొరకడమే కాకుండా ఊహించని ఆదరణ లభించడం విశేషం. టీపాడ్ ఘనంగా నిర్వహించిన ఈ వనభోజన కార్యక్రమాన్ని రఘవీర్ బండారు (చైర్ ఆఫ్ ఫౌండేషన కమిటీ), సుధాకర్ కలసాని (చైర్ ఆఫ్ బీవోటీ), లింగారెడ్డి ఆల్వ (ప్రెసిడెంట్), రోజా ఆడెపు (కోఆర్డినేటర్) మార్గదర్శకత్వంలో మధుమతి వైశ్యరాజు సమన్వయం చేశారు. రావు కల్వల, అజయ్‌రెడ్డి, ఉపేందర్ తెలుగు, రవికాంతరెడ్డి మామిడి (మాజీ అధ్యక్షుడు).. ఈవెంట్ ఆద్యంతం సజావుగా సాగేలా నిరంతరం పర్యవేక్షించారు. ఉమ గడ్డం నేతృత్వంలో మాధవి సుంకిరెడ్డి, ఇందు పంచరుపుల, లక్ష్మి పోరెడ్డి, రూప కన్నయ్యగారి, మంజుల తొడుపునూరి, రేణుక చనుమోలు, నరేష్ సుంకిరెడ్డి, అశోక్ కొండల, విజయ్ తొడుపునూరి, శ్రీధర్ వేముల, గోలి బుచ్చిరెడ్డి స్వయంగా వండివార్చారు. ఆడియో, వీడియో, సోషల్‌మీడియా వ్యవహారాల ఇనచార్జిగా అనురాధ మేకల (టీపాడ్ వైస్ ప్రెసిడెంట్) వ్యవహరించారు. మాధవి లోకిరెడ్డి సాంస్కృతిక కార్యక్రమాలను సమన్వయం చేశారు. స్వప్న తుమ్మకాల, గాయత్రి గిరి, హరిశంకర్ రేసు, శివ కుడిత్యాల, బాల గనపవరపు.. బహుమతులు, పూజలు, ఇతరత్రా బాధ్యతలు చూసుకున్నారు. అతిథులందరూ లొట్టలేసుకుటూ తినేలా గ్రిల్డ్ స్వీట్‌కార్న్, చికెనబార్బిక్యూను అప్పటికప్పుడు వేడివేడిగా అందించేందుకు శ్రమించిన కరన పోరెడ్డి, రత్న ఉప్పల, శ్రీనివాస్ అన్నమనేని, సురేందర్ చింతల, ఆదిత్య గాదెలకు పలువురి నుంచి ప్రశంసలు దక్కాయి. వనభోజనం ఆసాంతం సజావుగా, అంచనాలకు మించి విజయవంతంగా సాగడానికి కారకులైన స్పాన్సర్లకు, తెలుగువారందరికీ టీపాడ్ బృందం కృతజ్ఞతలు తెలిపింది. -
డాలస్‌లో సందడిగా టీపాడ్ వనభోజనాలు
తెలుగువారి వనభోజనం డాలస్‌లోనూ సందడి చేసింది. మనం మరిచిపోతున్న సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కొత్త అనుభూతుల రుచి చూపింది. ప్రకృతి ఒడిలో ఆటలాడుతూ, సేద తీరుతూ, ఆదివారాన్ని ఆసాంతం ఆస్వాదించేలా చేసింది. ఏటా వేలాదిమందితో బతుకమ్మ పండుగను విశేషంగా నిర్వహిస్తూ ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రజల దృష్టిని ఆకర్షించిన ‘డాలస్ తెలంగాణ ప్రజాసమితి (తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డాలస్- టీపాడ్) ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చింది. అర్గిల్‌లోని పైలట్‌నాల్ పార్క్‌లో ఆదివారం టీపాడ్ నిర్వహించిన ఈ వనభోజనాల కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. డాలస్, టెక్సాస్ పరిధిలో నివాసముంటున్న సుమారు మూడువేల మంది తెలుగువారు హాజరై తెలంగాణ వంటకాలను రుచి చూసి మైమరిచిపోయారు. వనభోజనాల వేడుక ఆరంభంలో స్థానిక కళాకారుల బృందం ‘డాలస్ పరై కుజు’ ప్రదర్శించిన డప్పు డ్యాన్స్ ఉర్రూతలూగించింది. అనంతరం తెలుగు వారందరూ ఫ్లాష్‌మాబ్‌లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పిల్లలు పతంగులను ఎగురవేశారు. లెమన్ స్పూన్ తదితర ఆటలను ఎంజాయ్ చేశారు. పెద్దలు టగ్ ఆఫ్ వార్ లాంటి ఆటలాడి తాము మరచిపోతున్న గతానుభూతులను నెమరువేసుకున్నారు. ముఖానికి పెయింటింగ్‌తో పిల్లలు, పెద్దలు చాలా ఉత్సాహంగా గడిపారు. భోజనాలు, ఆటపాటలతో సాగిన ఈ కార్యక్రమాన్ని టీపాడ్ ఫౌండేషన్ కమిటీ చైర్ అజయ్‌రెడ్డి, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ చైర్ ఇంద్రాని పంచెర్పుల, ప్రెసిడెంట్ రమణ లష్కర్, వైస్ ప్రెసిడెంట్ మాధవి లోకిరెడ్డి, ట్రస్టీలు లింగారెడ్డి అల్వా, రఘువీర్ బండారు. మాధవి సుంకిరెడ్డి, లక్ష్మి పోరెడ్డి, మంజుల తొడుపునూరి విజయవంతంగా నిర్వహించారు. వనభోజనాల్లో భాగంగా కొందరు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వనభోజనాలకు వెళ్లే సంస్కృతి తగ్గిపోయిందని, కానీ ఇక్కడ చాలా గొప్పగా ఏర్పాటు చేశారంటూ నిర్వాహకులకు కితాబునిచ్చారు. పిల్లల కోసం తల్లిదండ్రులు అమెరికా వచ్చారంటే నాలుగు గోడలకే పరిమితమవ్వాల్సి ఉంటుందన్న అపవాదును చెరిపివేశారని, ఇక్కడ ఇంతమందితో కలిసి వనభోజనాలకు హాజరవ్వడం తనకెంతో తృప్తినిచ్చిందంటూ చెమర్చిన కళ్లతో నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. డాలస్‌లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీనివాస కల్యాణం నిర్వహిస్తున్నట్టు టీపాడ్ నిర్వాహకులు ప్రకటించారు. అలెన్‌లోని అలెన్ ఈవెంట్ సెంటర్లో , డాలస్ హిందూ కమ్యూనిటీ సహకారంతో జూన్ 25న స్వామి వారికి, అమ్మవార్లకు వైభవంగా వివాహమహోత్సవం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి జరిపిస్తారని, హాజరైన వారందరికీ తిరుమల వెంకన్న ప్రసాదంతో పాటు వస్త్రాన్ని అందజేయనున్నట్టు అందరి కరతాళ ధ్వనుల మధ్య టీపాడ్ బాధ్యులు వివరించారు. చదవండి: చెట్టు కింద వంట సంబరాలు -
టీప్యాడ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
తెలంగాణ ప్రజా సమితి డాలస్ ఆధ్వర్యంలో వనభోజనాల కార్యక్రమం నిర్వహించనున్నారు. 2022 మే 22న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుంది. పైలట్ నాల్ పార్క్, 218ఏ ఆర్కిడ్హిల్ ఎల్ఎన్, ఆర్గిలే, టెక్సా్స్లో ఈ వేడుకలు నిర్వహిస్తామని టీప్యాడ్ ప్రకటించింది. -
డాలస్‌లో టీపాడ్ ఆధ్వర్యంలో వనభోజనాలు
డాలస్ : డాలస్ తెలంగాణ ప్రజాసమితి (టీపాడ్) ఆధ్వర్యంలో జూన్ 15వ తేదీన వనభోజన కార్యక్రమం నిర్వహించారు. వృక్షసంపదతో విలసిల్లే ‘పైలట్ నాల్ పార్కు’ ఆర్గయిల్లో ఈ వేడుక జరిగింది. 'టీపాడ్ వనభోజనాల' కార్యక్రమాన్ని టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రారెడ్డి పోలీస్, టీపాడ్ ప్రెసిడెంట్, ఫౌండేషన్ కమిటీ చైర్ జానకి రామ్ మందాడి, బోర్ద్ ఆఫ్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, జాయింట్ సెక్రటరీ లక్ష్మి పోరెడ్డి, ట్రెసరర్ అనురాధ మేకల, సెక్రెటరి మాధవి లొకిరెడ్డి సహాయముతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిల్ల పెద్దలతో పాటు రెండువేల మందికి పైగా డాలస్ వాసులు హాజరయ్యారు. శశి రెడ్డి కర్రి, మధుమతి వ్యాసరాజు స్వాగతము పలకరింపు పలుకలతో, ఫొటో షూట్ అలంకరణలతొ పరిసరాలను అందంగా తీర్చిదిద్దారు. తొలుత గణేశుడికి టీపాడ్ సభ్యులు, డాలస్ వాసులు కలిసి పూజ నిర్వహించారు. అనంతరం 'ఫాదర్స్ డే' సందర్బంగా టీపాడ్ సంస్థ తండ్రులందరికి ‘కేక్ కట్టింగ్’ జరిపి అభినందనలను తెలియచేసింది. వనభోజనాల కార్యక్రమంలో ఏర్పాటు చేసిన 'ఫ్లాష్ మాబ్'లో కార్యవర్గ బృందంతో పాటు అక్కడికి వచ్చిన యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వప్న తుమ్మపాల.. చిన్నారులకి పరుగు పందెం, స్పూన్ విత్ లెమన్, గాలి పటాలు వంటి పోటీలను నిర్వహించారు. ఈపోటీల్లో గెలుపొందినవారికి టీపాడ్ సంస్థ బహూమతులను ప్రదానం గావించింది. ఈ కార్యక్రమానికి టీపాడ్ సంస్థ కార్యవర్గ బృందం అందరూ కలిసి పచ్చటి చెట్ల క్రింద కావాల్సిన గ్యాస్ స్టవ్ లు, వంట సామగ్రి, ఆహార వస్తువులు అన్ని సమకుర్చారు. సుధాకర్ కలసాని, కరణ్ పోరెడ్డి, రత్నఉప్పాల, రఘు వూత్కూరి, శ్రీనివాస్ అన్నమనేని, చిరంజీవి మేఘాంశ్ రెడ్ది, చిరంజీవి నివేద్ రెడ్డి వేడి వేడి బార్బిక్యూ చికెన్, వేడిగా కాల్చిన మొక్కజొన్న పొత్తులని వనభోజనాలకు వచ్చిన వారందరికి అప్పటికప్పుడే చేసి ఇచ్చారు. ఉమ బండారు పర్యవేక్షనలో జయ తెలకలపల్లి, ఇంద్రాణి పంచార్పుల, మంజుల తొడుపునూరి, ఫణి, శ్రీనివాస్ వేముల,లింగారెడ్డి అల్వా, శంకర్ పరిమళ్, శారద సింగిరెడ్డి ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన కార్యక్రమంలో ఉప్మా, టీ, కాఫీలు అందజేశారు. ఆ తర్వాత మటన్ బిర్యాని, భగార అన్నం, వైట్ రైస్, ఆకుకూర పప్పు, పచ్చిపులుసు, ఆలు టమాట కుర్మా, కోడి కూర, టమాటా పచ్చడి, పైనాపిల్ రవ్వ కేసరి తీపి పదార్థము, పెరుగుతో రైతా, క్యారెట్స్-కీర, నిమ్మకాయ సలాడ్ మొదలగు రుచికరమైన కమ్మని వంటలు చేసి ప్రేమానురాగాలతో వొచ్చిన వారందరికి మధ్యాహ్నం భోజనములో వడ్డించారు. తర్వాత సాయంత్రం చల్లని మజ్జిగ, చల్లని వాటర్ మెలన్ ముక్కలను, ఐస్‌క్రీమ్‌లు, వేడి వేడిగా టీ , కాఫీలను అందజేశారు. రూపకన్నయ్య గిరి, రోజా అడెపు, అపర్ణ కొల్లూరి, శరత్ పున్ రెడ్డి, గాయత్రి గిరి, రేణుక చనుమోలు , కళ్యాణి తాడిమెట్టి, వేణు భాగ్యనగర్, సునిత రెడ్డి, సుధీర్, దీపిక మరియు శ్రీలత వడ్డించడము, కూరగయలు కత్తిరంచడము మొదలగు పనులు మిగతా కార్యవర్గ బృందం తో కలిసి చక్కగా చేసారు. టీపాడ్ ఫౌండేషన్ కమిటీ, అజయ్ రెడ్డి, రావు కలవల, మహేందర్ కామిరెడ్డి, రాజ వర్ధన్ గొంది, ఉపేందర్ తెలుగు, బోర్డు అఫ్ ట్రస్టీ కో చైర్ మాధవి సుంకిరెడ్డి, బోర్డు అఫ్ ట్రస్టీ బుచ్చి రెడ్డి గోలి, రవికాంత్ రెడ్డి మామిడి వైస్ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ కమిటీ దీప్తి సూర్యదేవర, శరత్ ఎర్రం, అడ్వైజరి కమిటీ సభ్యులు విక్ర,మ్ జంగం, విజయ్ రెడ్డి,న రేష్ సుంకిరెడ్డి, సతీష్ నాగిళ్ల , కొలాబరేషన్ కమిటీ వంశీ కృష్ణ, స్రవణ్ నిడిగంటి, మాధవి మెంట, లావణ్య యరకాల ఆధ్వర్యములో కార్యక్రమము విజయవంతగా జరిపించారు. ఫౌండేషన్ కమిటీ రఘువీర్ బండారు విలువైన సలహాలు, సూచనలతో కార్యక్రమం రూపుదిద్దుకొని వనభోజనాల కార్యక్రమం సంతోషంగా కొనసాగి విజయవంతమైంది. పాస్ట్ బోర్ద్ ఆఫ్ ట్రస్టీస్ రాం అన్నాడి, అశోక్ కొండల ఈవెంట్ కి సంబంధించిన లాజిస్టిక్స్ సమకూర్చె విషయములో కీలక పాత్రను పొషించారు. ప్రతి సంవత్సరం పచ్చటి వాతావరణములో 'టీపాడ్ వనభోజనాలు' కార్యక్రమం నిర్వహించడం ద్వారా తెలుగు వారికే కాకుండా భారత దేశం నలుమూలల నుండి వచ్చే వారి మధ్య చక్కటి అనుబంధాలకు తోడ్పడుతోంది. కార్యక్రమం చివరిగా టీపాడ్ ప్రెసిడెంట్ చంద్రా రెడ్డి పోలీస్, బోర్డు ఆప్ ట్రస్టీ చైర్ పవన్ గంగాధర, వనభోజనాల కార్యక్రమ సమన్వయ కర్తలు లక్ష్మి పోరెడ్డి, అనురాధ మేకల సంయుక్తంగా, పనిచేసిన కార్యకర్తలందరికి, స్థానిక మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులకు, పత్రిక మరియు ప్రసార మాధ్యమాలకు, వనభోజనాలు నిర్వహించటానికి కావాల్సిన ప్రాంగణ వసతులు కల్పించిన పైలట్ నాల్ పార్క యాజమాన్యానికి, దాతలకు, సహాయ పడిన ‘ఫార్మ్ టు కుక్’ యాజమాన్యానికి కృతఙ్ఞతా పూర్వక అభినంనములు తెలియజేశారు. -
టిపాడ్ ఆధ్యర్యంలో ఘనంగా వనభోజనాలు
అమెరికాలోని తెలంగాణ పీపుల్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టిపాడ్) వనభోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫ్రిస్కోలోని హిడెన్ కోవ్ పార్కులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అమెరికాలోని ఎన్ఆర్ఐలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మొదటగా శ్రీకృష్ణ, లక్ష్మీదేవి విగ్రహాలకు పూజలు నిర్వహించారు. పిల్లలతో కలిసి అంత్యాక్షరి, గేమ్స్, మ్యూజిక్ మస్తీలతో వనభోజనాల కార్యక్రమం సందడిగా సాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతిని నేటి తరానికి తెలియజేయడానికే ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. తెలంగాణ వంటకాలు, ఆట పాటలతో వనభోజనాల కార్యక్రమం అంగరంగవైభవంగా జరిగింది. టిపాడ్ ప్రెసిడెంట్ శ్రీని గంగాధర, బీఓటీ చైర్మన్ శారద సింగిరెడ్డి, శ్రీని వేముల, జయ తెలకలపల్లి, ఇందూ పంచర్పుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో.. టిపాడ్ సభ్యులు రఘువీర్ బండారు, జయకిరణ్ మండది, ఉపేందర్ తెలుగు, అజయ్ రెడ్డి, రావు కల్వల, రాజ్వర్ధన్ గొంది, మహెందర్ కామిరెడ్డి, పవన్ కుమార్ గంగాధర, మనోహర్ కాసగాని, అశోక్ కొండల, రామ్ ఆన్నాడి, మాధవి సుంకిరెడ్డి, సుధాకర్ కలసాని, ఎగ్జిక్యూటీవ్ కమిటీ సభ్యులు రమణ లష్కర్, కరణ్ పోరెడ్డి, చంద్ర పోలీస్, సత్య పెర్కారి, రవికాంత్ మామిడి, రూప కన్నయ్యగారి, లింగారెడ్డి అల్వా, సురెందర్ చింతల, ఆడెపు రోజా, శరత్ ఎర్రమ్, మధుమతి, మాధవి లోకిరెడ్డి, దీప్తి సూర్యదేవర, శంకర్ పరిమల్, వేణు ఉప్పాల, సతీష్ నాగిళ్ల, కళ్యాణి తడిమెటి, లక్ష్మీ పోరెడ్డి, పల్లవి తోటకూర, రోహిత్ నరిమేటి, అనూష వనం, నితిన్ చంద్ర, శిరిష్ గోనె, మాధవి ఓంకార్, అపర్ణ సింగిరెడ్డి, కామేశ్వరి దివకర్ల, కవిత బ్రహ్మదేవర, అనురాధ మేకల, సునిత, నితిన్ కొర్వి, శశిరెడ్డి కర్రి, మంజుల తొడుపునూరి, మాధవి ఓంకార్, సుగత్రి గూడూరు, మాధవి మెంటా, లావణ్య యారాకల, ధనలక్ష్మీ రావుల, మంజుల రెడ్డి ముప్పిడి, శాంతి నూతి, శ్రీనివాస్ కోటికంటి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకున్న టీపీఏడీ వన భోజనాల కార్యక్రమం
డల్లాస్: గత వారం టెక్సాస్ లోని ఫ్రిక్స్ హిడెన్ పార్క్ లో తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్ (టీపీఏడీ) నిర్వహించిన వన భోజనాల కార్యక్రమం ఆకట్టుకుంది. సుమారు 1500 మంది తెలుగు ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమం ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా సాగింది. వన భోజనాల సాక్షిగా ఇక్కడకు విచ్చేసిన వారు తమకు నచ్చిన ఆట పాటలతో అలరించి తెలుగు జాతిలో గొప్పదనాన్ని చాటుకున్నారు. ఇక్కడ చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా కలిసి ఆనందం సంబరాల్లో మునిగి తేలారు. పురుషులు క్రికెట్, వాలీబాల్ వంటి గేమ్ లను ఆడగా, మహిళలు టగ్ ఆఫ్ వార్, మ్యూజికల్ చైర్స్ తదితర కార్యక్రమాలతో కనువిందు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులు ప్రత్యేకంగా సాంస్కృతిక నృత్యాలతో ఆకట్టుకోగా, 40 మందికి పిల్లలు ఫ్లాష్ మోబ్ డ్యాన్స్ తో ఉర్రూతలూగించారు. మే 2 వ తేదీన టీపీఏడీ నిర్వహించిన ఈ వన భోజనాల కార్యక్రమం తెలుగు జాతి స్పూర్తికి, ఆకర్షణకు నిదర్శమని నిర్వాహకులు తెలిపారు. ప్రధానంగా 1500 మందికి భోజనాలను వండి వడ్డించడాన్ని మహిళలు ఛాలెంజ్ గా తీసుకున్నారన్నారు. ఇందులో డజనుకు పైగా నాన్ వెజిటేరియన్, వెజిటేరియన్ ఆహార పదార్థాలను తయారు చేశామని స్పష్టం చేశారు. తెలుగు వారి అభ్యున్నతికి సహకరించే ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా నిర్వహిస్తామన్నారు.