TPF
-
న్యూజెర్సీలో తెలుగు పీపుల్ ఫాండేషన్ వార్షికోత్సవ వేడుకలు
-
‘ఇవాంకా’ వ్యతిరేక ఆందోళన..
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు హాజరైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు, ఆయన కుమారై ఇవాంకా పర్యటనను నిరసిస్తూ తెలంగాణ ప్రజా ఫ్రంట్ (టీపీఎఫ్) చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద ఇవాంక రాకను వ్యతిరేకిస్తూ టీపీఎఫ్ ప్రదర్శన చేపట్టింది. సదస్సు పేరుతో రూ.వందల కోట్లు ప్రజా ధనం వృథా చేస్తున్నారని ఈ సందర్భంగా ఆందోళనకారులు విమర్శించారు. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లో మన పాలకులు కీలుబొమ్మల్లా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. టీపీఎఫ్ నేతలు నలమాస కృష్ణ, రవిచంద్ర, మమత, రాణి, సంధ్య తదితరులను పోలీసులు ముందస్తుగానే అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ‘జీఈఎస్’ ఎంట్రీపాస్ల గందరగోళం సదస్సుకు హాజరుకాకుండానే వెనుదిరిగిన అనేక మంది విదేశీ డెలిగేట్లు నగరంలో జరుగుతున్న గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్ సదస్సులో పాల్గొనేందుకు విదేశాల నుంచి వచ్చిన వందలాది మంది డెలిగేట్లు నిర్వాహకుల అత్యుత్సాహం కారణంగా మంగళవారం తొలిరోజున ఎంట్రీ పాసులు లభించక గంటల తరబడి హైటెక్స్ ఆవరణలో పడిగాపులు పడ్డారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అమెరికా తదితర దేశాల నుంచి వందలాది డెలిగేట్లు తరలివచ్చారు. వీరందరూ హైటెక్స్‌లోని జీఈఎస్ సమ్మిట్ జరిగే హాలు లోనికి ప్రవేశించేందుకు అవసరమైన పాస్‌ల జారీ విషయంలో నిర్వాహకులు పలు రకాల ప్రశ్నలతో డెలిగేట్లను వేధించారని..ఇప్పటికే రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నవారు తమ మొబైల్లో ఆ వివరాలు చూపినా లోనికి అనుమతించలేదని నగరానికి చెందిన ఓ డెలిగేట్ ‘సాక్షి’తో ఆవేదన పంచుకున్నారు. ఒకసారి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకొని ఆహ్వానం అందినవారిని భద్రతా కారణాల నెపంతో హైటెక్స్ ఆవరణలో భద్రతా విధుల్లో పాల్గొన్న సిబ్బందితోపాటు నీతిఆయోగ్ అధికారులు ఎంట్రీపాస్‌లు లేవంటూ లోనికి అనుమతించకుండా అమర్యాదగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. కాగా రెండోరోజు సదస్సు నాటికి ఈ సమస్యను పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు. కాగా తొలిరోజు సదస్సుకు లోనికి అనుమతి లేకపోవడంతో విదేశీ అతిథుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోవడం కనిపించింది. -
అతడి వల్లే మా జీవితాలు అస్తవ్యస్తం
హైదరాబాద్: నయీమ్ వల్లే తమ జీవితాలు అస్తవ్యస్తమయ్యాయని నయీమ్ బాధితులు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. అతడి ముఠా ఆగడాల వల్లే అయినవారు తమకు లేకుండా పోయారని.. కుటుంబాలన్నీ ఛిన్నాభిన్నమైపోయాయని వారు వాపోయారు. నయీమ్ అనుచరులు, ఆ ముఠాతో సంబంధం ఉన్న రాజకీయ నాయకులు, ప్రభుత్వ, పోలీసు అధికారులను శిక్షించి, బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద తెలంగాణ ప్రజాఫ్రంట్ (టీపీఎఫ్) ఆధ్వర్యంలో నయీమ్ బాధితులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నయీమ్ వల్ల ఆచూకీ లేకుండా పోయిన, మరణించిన వారికి సంబంధించి జోడు ఆంజనేయులు తల్లి బాలమ్మ, భార్య సత్యలక్ష్మి, హక్కుల నేత పురుషోత్తం కూతురు శ్వేత, బెల్లి లలిత సోదరి బెల్లి సరిత, బెల్లి కృష్ణ కుమారుడు చంద్రశేఖర్, పటోళ్ల గోవర్ధన్ రెడ్డి భార్య విద్యారెడ్డి, కె. అంజప్ప భార్య కె. ఈశ్వరమ్మ తదితరులు మాట్లాడారు. నయీమ్, అతడి ముఠా ఆగడాలతో తమ కుటుంబాలు ఎలా ఛిన్నాభిన్నమయ్యాయో కన్నీళ్లతో వివరించారు. ఈ ధర్నాలో సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులు నారాయణ మాట్లాడుతూ నయామ్ వ్యవహరంలో ప్రభుత్వమే ముద్దాయని అన్నారు. ప్రభుత్వం అండ లేకుండా నరహంతక నయీమ్ ఇంచుకూడా కదలలేడని, అతడి ఆగడాలు సాగవని, సీఎం, హోం మంత్రి, డీజీపీలందరికీ తెలుసన్నారు. 1996 నుంచి ఉన్న సీఎంలు, హోం మంత్రులు, డీజీపీలకు నార్కో టెస్టులు నిర్వహించాలని.. నిజాలు రాకపోతే ఇందిరాపార్కు వద్ద తాను ఉరి వేసుకుంటానని సవాలు చేశారు. నయీ మ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు, హైకోర్టు సిట్టింగ్, లేదా రిటైర్డ్ జడ్జితో న్యాయ విచారణ జరపాలని, సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనైనా విచారణ జరపాలని వరవరరావు కోరారు. సీపీఎం రాష్ర్ట కార్యవర్గ సభ్యులు రాములు మాట్లాడుతూ నిజాయితీ పరుడైన జడ్జితో విచారణ జరిపించాలని, లేదంటే రాజకీయ ప్రత్యర్థులను అణిచి వేయడానికి ప్రభుత్వం నయీమ్డైరీని ఉపయోగించుకునే ప్రమాదం ఉందన్నారు. మానవ హక్కుల వేదిక అధ్యక్షులు జీవన్‌కుమార్, తెలంగాణ ఉద్యమ నేత చెరుకు సుధాకర్, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు సాధినేని వెంకటేశ్వర్రావు, టీపీఎఫ్ నాయకులు నల్లమాస కృష్ణ, న్యూడెమోక్రసీ నాయకులు హన్మేష్, నయీం హంతక ముఠా వ్యతిరేకపోరాట కమిటీ నాయకులు బుచ్చారెడ్డి, న్యాయవాది రఘునాథ్ మాట్లాడారు. -
ముగిసిన టీపీఎఫ్ బస్సు యాత్ర
పట్టణంలో ర్యాలీ నిర్వహించిన నాయకులు నర్సంపేట : హరితహరం పేరుతో పోడు భూములను ఫారెస్టు అధికారులు లాక్కుం టున్నారని దీనిని నిరసిస్తూ టీపీఎఫ్ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహించడం జరిగిందని , శనివారంతో యాత్ర ముగిసిందని టీపీఎఫ్ ప్రధాన కార్యదర్శి మెంచు రమేష్ అన్నా రు. అనంతరం పట్టణంలోని అం»ే ద్కర్ సెంటర్ నుంచి వరంగల్ రోడ్డు కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ తెలంగాణ ప్రజాఫ్రంట్ ఆధ్వర్యంలో పోడు భూముల ఆక్రమణ నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న హన్మకొండ నుంచిlబయలుదేరిన బస్సు యాత్ర 5 రోజుల పాటు వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పెద్ద గూడూరు, పాకాల, కొత్తగూడ, ఇల్లం దు, గుండాల, టేకులపల్లి, కాచనపల్లి, కొత్తగూడెం, చంద్రుగొండ, మండలా ల్లో కొ నసాగిందన్నారు. హరితహారం పేరుతో ప్రభుత్వం సాగుచేసుకుంటు న్న పోడు భూములను గుంజుకుం టు న్న గ్రామాలను పర్యటించి ఆదివాసీ ప్రజలకు సమావేశాలు ఏర్పాటు చేసి, వారి పోరాటానికి సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వం చేస్తున్న ్రçపజా వ్యతి రేక విధానాలను వివరించడం జరిగిందన్నారు. అనంతరం నర్సంపేటకు చే రుకుని ముగింపు ర్యాలీని పట్టణంలో ని అంబేద్కర్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు కొనసాగించామన్నారు. కార్యక్రమంలో టీపీఎఫ్ నాయకులు సాయన్న, జనగాం కుమారస్వా మి, స్వప్న, నవీన్, గణేష్, శ్రీనివాస్, శాంత, వెంకన్న, సైదులు,యాదయ్య, శ్రీనివాస్,శాంత, వెంకన్న, సైదులు, మమత, యాకయ్య పాల్గొన్నారు. -
కలసి పోరాడుదాం: ప్రొ. కోదండరాం
-చిన్నరాష్ట్రాలొచ్చినా..చిన్న కులాలకు రాజ్యాధికారం రాలేదు:గద్ధర్ హైదరాబాద్ ప్రజాస్వామిక విస్తరణ కోసం పార్టీలకు అతీతంగా కార్యాచరణను కొనసాగించాలని ప్రజాసంఘాలకు తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. సమస్యల పరిష్కారంపై వెనక్కు వెళ్లేది లేదని అన్నారు. మంగళవారం హోటల్ అశోకాలో జరిగిన తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం నూతన డైరీ-2016 ఆవిష్కరణ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇతర ప్రభుత్వ విభాగాలతో పోల్చితే మున్సిపల్ విభాగంలో కిందిస్థాయి ఉద్యోగుల పరిస్థితి భిన్నంగా ఉంటుందన్నారు. సమాజంలో మాదిరిగానే కార్యాలయాల్లోనూ వివక్షకు గురవుతున్నారని చెప్పారు. కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగానే చిన్న ఉద్యోగులపై వేధింపులు ఎక్కువయ్యాయన్నారు. ఉద్యోగుల పరిరక్షణ అంటే.. కేవలం ఆర్ధిక లబ్ది మాత్రమే కాదని, అందరికీ సమాన గౌరవం లభించినపుడే రాష్ట్ర పురోభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రజాసంఘాల పాత్ర, కార్యాచరణ, సైద్ధాంతిక అంశాలపై స్పష్టత కొరవడిందని అన్నారు. రాష్ట్రం వచ్చినా.. రాజ్యాధికారం ఏదీ..? దేశంలో చిన్న రాష్ట్రాలు ఏర్పడితే.. చిన్న కులాలకు రాజ్యాధికారం వస్తుందని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అభిప్రాయపడ్డారని, అయితే.. తెలంగాణ చిన్నరాష్ట్రం ఏర్పడినా చిన్నకులాలకు అధికారం మాత్రం దక్కలేదని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. జనాభాలో కేవలం 0.4 శాతం ఉన్న కులం వారికి అధికారం వచ్చిందన్నారు. ప్రస్తుతం సిద్ధాంత పరమైన ఉద్యమాలకు జనం సిద్ధంగా లేరని చెప్పారు. అయితే.. ప్రజల్లో ఇప్పటికీ ఐక్యత, పోరాటపటిమ(యూనిటీ అండ్ స్ట్రగుల్) ఏమాత్రం తగ్గలేదన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఉద్యోగుల, కార్మికుల సంఘం అధ్యక్షుడు తిప్పర్తి యాదయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి నరేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఆంధ్రజ్యోతి ఎడిటర్ శ్రీనివాస్, టీఎన్జీవో నేతలు దేవీప్రసాదరావు, రవీందర్‌రెడ్డి, తెలంగాణ యునెటైడ్ ఫ్రంట్ చైర్మన్ విమలక్క తదితరులు పాల్గొన్నారు. -
టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కన్నుమూత
హైదరాబాద్: తెలంగాణ ప్రజా ప్రంట్ రాష్ట్ర అధ్యక్షులు మద్దిలేటి అనారోగ్యంతో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందారు. మద్దిలేటి మృతి విషయం తెలిసిన పలువురు ప్రజాసంఘాల నాయకులు బాగ్‌లింగంపల్లిలోని టీపీఎఫ్ రాష్ట్ర కార్యాలయానికి చేరుకొని ఆయన భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. విప్లవ రచయితల సంఘం నాయకుడు వరవరరావు, ప్రొఫెసర్ కోదండరామ్, చాడవెంకట్‌రెడ్డి, తమ్మినేని వీరభద్రం, నారాయణ, గద్దర్, ప్రభాకర్లతో పాటు పలువురు ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేశారు. -
‘ముఖ్యమంత్రివిసామ్రాజ్యవాద విధానాలు’
రాంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజ్య్రవాద విధానాలు అవలంబిస్తున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) నాయకులు విమర్శించారు. నస్పూర్‌లోని సమంగళి ఫంక్షన్ హాల్లో ఐదు రోజులుగా నిర్వహిస్తోన్న టీపీఎఫ్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముగింపు శిక్షణ తరగతులకు టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మద్దిలేటి, నలమాస కృష్ణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంచడానికి భూమి లేదని, కొని ఇస్తామని చెబుతూనే మరోవైపు బహుళజాతి సంస్థలకు లక్షల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టడానికి సిద్ధపడిందని విమర్శించారు. తెలంగాణలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 18 లక్షలు ఉన్నాయని, వీరికి పంచడానికి 54 లక్షల ఎకరాల భూమి కావాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల ఉద్యోగాలు రద్దు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో న్యా యంగా 1170 టీఎంసీల నీటి వాటా రావాలని, దీనిపై ఎవరూ మాట్లాడడం లేదన్నా రు. పోలవరం, టైగర్‌జోన్, ఓసీపీలతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వైద్యం అందక విషజ్వరాలతో అనేక మంది గిరి జనులు మృతి చెందుతున్నారని తెలిపారు. టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.నర్సింహారెడ్డి, కార్యదర్శి చెంచు రమేశ్, కార్యవర్గ సభ్యులు మచ్చ విద్యాసాగర్, అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్, మహిళా నాయకులు ఎడ్ల జయ, నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు సమ్మయ్య, నాయకులు దేవి సత్యం, చార్వాక, కుమారస్వామి పాల్గొన్నారు.