‘ముఖ్యమంత్రివిసామ్రాజ్యవాద విధానాలు’
రాంపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ సామాజ్య్రవాద విధానాలు అవలంబిస్తున్నారని తెలంగాణ ప్రజాఫ్రంట్(టీపీఎఫ్) నాయకులు విమర్శించారు. నస్పూర్‌లోని సమంగళి ఫంక్షన్ హాల్‌లో ఐదు రోజులుగా నిర్వహిస్తోన్న టీపీఎఫ్ రాష్ట్ర స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు సోమవారం ముగిశాయి. ముగింపు శిక్షణ తరగతులకు టీపీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.మద్దిలేటి, నలమాస కృష్ణ హాజరయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పేదలకు పంచడానికి భూమి లేదని, కొని ఇస్తామని చెబుతూనే మరోవైపు బహుళజాతి సంస్థలకు లక్షల ఎకరాలు అప్పనంగా కట్టబెట్టడానికి సిద్ధపడిందని విమర్శించారు.
తెలంగాణలో భూమి లేని ఎస్సీ, ఎస్టీ కుటుంబాలు 18 లక్షలు ఉన్నాయని, వీరికి పంచడానికి 54 లక్షల ఎకరాల భూమి కావాలని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక 4 లక్షల ఉద్యోగాలు రద్దు చేశారని పేర్కొన్నారు. తెలంగాణకు గోదావరి, కృష్ణా నదుల్లో న్యా యంగా 1170 టీఎంసీల నీటి వాటా రావాలని, దీనిపై ఎవరూ మాట్లాడడం లేదన్నా రు. పోలవరం, టైగర్‌జోన్, ఓసీపీలతో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరుగుతోం దని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస వైద్యం అందక విషజ్వరాలతో అనేక మంది గిరి జనులు మృతి చెందుతున్నారని తెలిపారు. టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.నర్సింహారెడ్డి, కార్యదర్శి చెంచు రమేశ్, కార్యవర్గ సభ్యులు మచ్చ విద్యాసాగర్, అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు బంటు శ్రీనివాస్, మహిళా నాయకులు ఎడ్ల జయ, నాగభూషణం, జిల్లా అధ్యక్షుడు శ్రీమన్నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆడెపు సమ్మయ్య, నాయకులు దేవి సత్యం, చార్వాక, కుమారస్వామి పాల్గొన్నారు.