trafic problems
-
సిటీ ట్రాఫిక్.. ఓ జీవనది
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ అనేది ఒక జీవనది అని, పరిస్థితులను బట్టి పెరగడం–తగ్గడం ఉంటాయి తప్ప.. ఆగడం, లేకపోవడం అనేది జరగదని నగర పోలీసు కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి అన్నారు. దీని నిర్వహణలో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. నగర ట్రాఫిక్ విభాగంలో వలంటీర్లుగా (ట్రాఫిక్ ఫరిస్టే) పని చేస్తున్న వారిని హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (హెచ్సీఎస్సీ) గురువారం సన్మానించింది. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో జరిగిన ఈ కార్యక్రమానికి హెచ్సీఎస్సీ చైర్మన్‌గా ఉన్న కొత్వాల్ శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కౌన్సిల్ పోలీసులకు విరాళంగా ఇచ్చిన అంబులెన్స్‌ను ప్రారంభించడంతో పాటు ఫ్రీ లెఫ్ట్ సైనేజ్ బోర్డులను ఆయన ఆవిష్కరించారు. అనివార్య కారణాలతో.. సాధారణంగా ప్రతి మెట్రో నగరంలోనూ ట్రాఫిక్ సమస్యలు ఉంటాయని, అనివార్య కారణాల వల్ల సిటీలో ఇవి కొద్దిగా ఎక్కువని కొత్వాల్ అన్నారు. అన్ని చోట్లా సమాన వెడల్పులో ఉన్న రోడ్లు లేకపోవడం, రహదారులకు మధ్యలో ప్రార్థనా స్థలాలు ఉండటంతో పాటు రద్దీ ప్రాంతాల్లోకీ అన్ని వేళల్లో, అన్ని రకాల వాహనాలను అనుమతించడం, ఆక్రమణలు ప్రధాన కారణాలని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక అలవెన్స్ సహా అనేక రకాలుగా ప్రభుత్వ ఆదుకోవడంతో సంక్షేమం విషయంలో ముందున్నామని పేర్కొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు తగిన ప్రాధాన్యం ఇస్తూ అన్ని వ్యవస్థలు కలిసి పని చేయాలని, కేవలం ట్రాఫిక్ పోలీసులనే బాధ్యులుగా చూస్తారని సీపీ వ్యాఖ్యానించారు. ఉల్లంఘనులకు జరిమానా విధింపు అనేది అసలైన ఎన్ఫోర్స్మెంట్ కాదని, వాహనాలు నియంత్రణే దీని కిందికి వస్తుందని స్పష్టం చేసిన శ్రీనివాసరెడ్డి రద్దీ వేళల్లో చలాన్లు విధించవద్దని అధికారులను ఆదేశించారు. కొన్ని కీలక చర్యలపై లోతుగా అధ్యయనం... పీక్ అవర్స్‌లో అదనపు సీపీ నుంచి ప్రతి అధికారి కచ్చితంగా రోడ్డుపై ఉండి, వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేయాలని సీపీ పునరుద్ఘాటించారు. ట్రాఫిక్ అంశంలో పాఠశాల స్థాయి నుంచి 2 వరకు చదువుతున్న వారిని భాగస్వాముల్ని చేయడం, ట్రాఫిక్ క్విజ్‌ల నిర్వహణ, ఎంపిక చేసిన రోడ్ల పైకి రద్దీ వేళల్లో వేగంగా నడిచే వాహనాల నియంత్రణ, ఆటోలపై సమగ్ర విధానం, తేలికపాటి వాహనాలకు సంబంధించి ‘సరి–బేసి’ విధానం అమలు, కార్ పూలింగ్ను ప్రోత్సహించడం సహా మరికొన్ని కీలక చర్యలపై అధ్యయనం చేస్తున్నామని కొత్వాల్ శ్రీనివాసరెడ్డి వివరించారు. ట్రాఫిక్ విభాగంలో పని చేసే వాళ్లు అన్సంగ్ హీరోలు కాదని, వారి పనిని గుర్తించి, ఆ మేరకు ఫలితాన్ని అందిస్తామన్నారు. ట్రాఫిక్ నిర్వహణలో అవగాహనకే పెద్దపీట... ప్రస్తుతం నగర ట్రాఫిక్ పోలీసులకు సహకరించడానికి దాదాపు 80 మంది ఫరిస్టేలు ఉన్నారని, ఈ సంఖ్యలో తొలి దశలో 310కి పెంచడమే లక్ష్యమని ట్రాఫిక్ చీఫ్ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. ఈ బాధ్యతలను స్థానిక ఇన్స్పెక్టర్లకు ఆ బాధ్యతలు ఇస్తూ ఠాణాల్లో అప్లికేషన్లు అందుబాటులో ఉంచుతామని, ఔత్సాహికులు ముందుకు వచ్చి వలంటీర్లుగా చేరాలని కోరారు. పదో తరగతి ఉత్తీర్ణులు అర్హులని ఆయన వివరించారు. ట్రాఫిక్ నిర్వహణలో 80 శాతం అవగాహన (ఎడ్యుకేషన్), 20 శాతం చలాన్ల విధింపు (ఎన్ఫోర్స్మెంట్) పాత్రలు ఉంటాయని విశ్వప్రసాద్ అభిప్రాయపడ్డారు. -
ఇక ట్రాఫిక్ కష్టాలకు చెల్లు.. ‘గూగుల్’ సాయంతో దూసుకెళ్లడమే!
బెంగళూరు: పెరిగిపోతున్న జనాభాతో పట్టణాల్లో ట్రాఫిక్ కష్టాలు సైతం పెరుగుతున్నాయి. ట్రాఫిక్‌లో చిక్కుకుని గంటల తరబడి ఇబ్బందులు పడుతుంటాం. అయితే.. ఆ సమస్యలకు చెక్ పెట్టనున్నారు బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు. అందుకోసం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. గూగుల్ సాయంతో ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెబుతున్నారు. అదేలా అంటారా?. నగరంలోని ట్రాఫిక్ సిగ్నల్స్‌ను త్వరలోనే గూగుల్‌తో అనుసంధానిస్తామని, దాని ద్వారా పెద్ద మార్పు రాబోతోందని పేర్కొంటున్నారు ఉన్నతాధికారులు. రోడ్లపై భారీగా వాహనాలతో ట్రాఫిక్‌ను నియంత్రించటం బెంగళూరు పోలీసులకు తలనొప్పిగా మారింది. దీంతో ట్రాఫిక్‌ను సులభంగా నియంత్రించి, కష్టాలను తీర్చేందుకు సాంకేతిక దిగ్గజం గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పోలీసులు గూగుల్‌తో నేరుగా చేతులు కలపటం దేశంలోనే తొలిసారిగా పేర్కొన్నారు బెంగళూరు పోలీస్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి. ‘నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రించి, ఇబ్బందులు తప్పించేందుకు గూగుల్‌తో చేతులు కలపటం చాలా గర్వంగా ఉంది. ఇది లక్షల మంది ప్రయాణికులు రోజువారీ జీవనంపై సానుకూలు ప్రభావం చూపిస్తుంది. ఇటీవలే ట్రాఫిక్ లైట్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేసే పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించాం. అది సిగ్నల్స్ వద్ద వెయిటింగ్ టైమ్‌ను చాలా వరకు తగ్గించింది. నగరంలో తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యకు గూగుల్ నుంచి ఇన్పుట్స్ తీసుకుంటాము. కృత్రిమ మేథా ద్వారా నగరంలోనే ట్రాఫిక్ ను అంచనా వేసి పోలీసుకు సమాచారం ఇస్తుంది గూగుల్. దాంతో కొత్త ప్లాన్‌ను అమలు చేస్తాం. ఇప్పటికే గూగుల్ ఇచ్చిన డేటా ప్రకారం.. ఇప్పటికే సుమారు 20శాతం వెయిటింగ్ టైమ్ తగ్గింది. సమయం తగ్గటమే కాదు.. ఇంధనాన్ని ఆదా చేస్తుంది, నగరంలో అనవసరం ట్రాఫిక్ జామ్‌లను నియంత్రిస్తుంది.’ అని పేర్కొన్నారు. బెంగళూరు నగరంలో కోటికిపైగా వాహనాలు ఉన్నాయి. త్వరలోనే అన్ని సిగ్నల్స్‌ను గూగుల్‌తో ఆప్టిమైజ్ చేస్తామన్నారు కమిషనర్. రహదారులపై ట్రాఫిక్ వివరాలను రియల్ టైమ్‌లో గూగుల్ అందిస్తుందని, ఆ సమచారాన్ని ప్రయాణికులకు అందించటం వల్ల ఇబ్బందులు తప్పుతాయన్నారు. అలాగే.. గూగుల్ మ్యాప్స్‌లో స్పీడ్ లిమిట్స్‌ను ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ఓవర్ స్పీడ్లను కట్టడి చేయవచ్చన్నారు. ఇదీ చదవండి: Kochi: మొదట బుల్లెట్.. ఇప్పుడు బస్! స్టీరింగ్ ఏదైనా ‘లా’గించేస్తుంది! -
నగరంలో భారీ వర్షం: సీపీ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో హైదరాబాద్‌లోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలుచోట్ల వర్షపు నీరు రోడ్డపై నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని హైదరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. ట్రాఫిక్‌ను క్లియర్ చేయడానికి సిబ్బంది అంతా విధుల్లోనే ఉన్నారని, లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. పలుచోట్ల రోడ్లపై నిలిచిన నీటిని బయటకు పంపి వాహనాలను పంపించామని వెల్లడించారు. జీహెచ్ఎంసీ, మెట్రో అధికారలతో మాట్లాడి సమస్య సరిష్కారాలను కనుకుంటున్నట్లు సీపీ తెలిపారు. అవసరమైతే జేఎన్టీయూ సలహాలు, సూచనలు కూడా తీసుకుంటామన్నారు. వర్షం కారణంగా ప్రజలకు కొంత ఇబ్బందులు కలిగాయన్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మాదాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్ నగర్, సికింద్రాబాద్, కోఠి, దిల్సుఖ్నగర్, చైతన్యపురి, కొత్తపేట, సరూర్‌నగర్, మలక్‌పేట, ఎల్బీ నగర్, సంతోష్‌నగర్, అల్వాల్, బొల్లారం, మెహదీపట్నంలలో ఆదివారం భారీ వర్షం పడింది. కుత్బుల్లాపూర్‌లో భారీ వర్షం కురవడంతో పలు రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనదారులతోపాటు ఆయా కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కూకట్‌పల్లిలో డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. గంటపాటు వర్షం కురిస్తేనే రోడ్లు చెరవులను తలపించడంపై నగరవాసులు మండిపడుతున్నారు. మరోవైపు నేడు ఆదివారం సెలవు దినం కావడంతో ఉద్యోగస్తులు చల్లటి వాతావరణాన్నిఆస్వాదిస్తున్నారు. -
‘టోల్’ ఫికర్
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ చేపట్టనున్న ప్రగతి నివేదన సభకు భారీగా జనసమీకరణ చేస్తున్న దరిమిలా సెప్టెంబర్ 2న లక్షలాదిమంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. మరోవైపు సభ జరిగే కొంగరకలాన్ వైపునకు వేలాది వాహనాలు వెళ్లనున్న నేపథ్యంలో తెలంగాణలోని వివిధ టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌ల గండం పొంచి ఉంది. ఆర్టీసీ నుంచి ఏకంగా 7వేలకుపైగా బస్సులను అడుగుతున్నారంటూ ప్రచారం జరుగుతున్న వేళ ఆ రోజు ప్రయాణాలు పెట్టుకున్నవారిలో ఆందోళన రేగుతోంది. ఆర్టీసీ వద్ద సుమారు 10,500 బస్సులు ఉన్నాయి. వీటిలో రోజూ 97 లక్షల మంది ప్రయాణిస్తారు. నిజంగా 7వేల బస్సులను సభ కోసం పంపిస్తే.. దాదాపుగా 50 లక్షలకుపైగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. టోల్ జామ్‌లు తప్పవా? సభకు 25 లక్షల మందిని తరలించేందుకు లక్ష వాహనాలను వినియోగిస్తామని టీఆర్ఎస్ నేతలు ప్రకటించిన నేపథ్యంలో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ భయం వెంటాడుతోంది. తెలంగాణలో విజయవాడ, పుణే, ముంబై, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారులు, రాజీవ్ రహదారి, నార్కెట్‌పల్లి –అద్దంకి హైవేలతో కలిపి 17కుపైగా టోల్గేట్లు ఉన్నాయి. పండుగ సమయాల్లో ఈ టోల్గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్‌లు సహజమే. ఆర్టీసీ బస్సులు కొరత, పెళ్లిళ్ల నేపథ్యంలో ఆరోజు ప్రైవేటు వాహనాలు, సభకు వెళ్లే వాహనాలు ఒకేసారి బయటకి వస్తే ఈ ఇబ్బంది రెట్టింపయ్యే అవకాశాలు ఉన్నాయి. మినహాయించాలని టోల్గేట్లను ఆదేశిస్తారా? రాష్టంలోని 17 టోల్ గేట్ల నుంచి బీవోటీ కాంట్రాక్టర్లకు రోజూ దాదాపు రూ.2.5 కోట్ల ఆదాయం సమకూరుతోంది. ఎంత సభ ఉన్నా.. నిబంధనల్లో పేర్కొన్న సభ్యులకు తప్ప ఇతరులు ఎవరైనా సరే.. టోల్ చార్టీ చెల్లిస్తేనే అనుమతిస్తామని టోల్నిర్వాహకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సభకు వెళ్లే వాహనాలకు మినహాయింపు వస్తుందని కొందరు నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆరోజు మినహాయింపు ఇవ్వాల్సి వస్తే.. ఆ టోల్ ఛార్జీలను ఎవరు చెల్లిస్తారన్న ప్రశ్న ఇపుడు ఆసక్తికరంగా మారింది. ఏర్పాట్లు చేయడం లేదు: రైల్వే సభ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ఎలాంటి ప్రత్యేక రైళ్లు వేయడం లేదు. ఈ విషయంలో ఎలాంటి అధికారిక ఆదేశాలు అందలేదని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్ఫష్టం చేస్తున్నారు. దీంతో తెలంగాణలో రైలు మార్గంతో అనుసంధానమై ఉన్న ప్రాంతాల ప్రజలంతా మరింత నీరుగారిపోతున్నారు. -
వర్షబీభత్సం
-
ఇక పరుగులే..!
♦ ‘మెట్రో’కు తొలగిన వారసత్వ చిక్కులు ♦ బేగంపేట్‌లో లైన్ క్లియర్ ♦ అల్లావుద్దీన్, జబ్బార్ బిల్డింగ్‌ల కూల్చివేత ♦ ట్రాఫిక్ కష్టాలు తొలగించాలని సీఎస్ ఆదేశం బేగంపేట్ వైపు మెట్రో రైలు దూసుకుపోయేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక పనులు ఊపందుకోనున్నాయి. ప్రధాన రహదారిపై మెట్రో ప్రాజెక్టుకు అవరోధంగా మారిన వారసత్వ కట్టడాల చిక్కులు ఎట్టకేలకు తొలగిపోయాయి. పాత ఎయిర్పోర్ట్ ఫ్లైఓవర్, షాపర్స్టాప్ వద్ద మెట్రో పనులకు తాజాగా లైన్ క్లియరైంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రెండు భవంతుల కూల్చివేత కార్యక్రమాన్ని మంగళవారం జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. ఆ ప్రాంతాల్లోని అల్లాఉద్దీన్ బిల్డింగ్, జబ్బా ర్ బిల్డింగ్‌లను వారసత్వ కట్టడాలుగా పేర్కొంటూ గత 30 ఏళ్లుగా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. దీంతో గతంలో రహదారి విస్తరణలో వీటిని తొలగించడం సాధ్యం కాలేదు. హైకోర్టు తాజా ఆదేశాలతో అల్లావుద్దీన్ భవనంలో 666 చదరపు అడుగులు, జబ్బార్ బిల్డింగ్‌లో 635 అడుగుల స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు పరిహారాన్ని అందజేసిన తర్వాతే భవనాలను కూల్చివేసినట్లు హెచ్ఎంఆర్ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ప్రాంతంలో రహదారిని మరో 40 అడుగుల మేర విస్తరించేందుకు అవకాశం ఏర్పడిందన్నారు. ఆస్తుల సేకరణ వేగవంతం చేయడ ంతో సీఎస్ రాజీవ్ శర్మ జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్ అధికారులను ప్రత్యేకంగా అభినందించినట్లు తెలిపారు. ట్రాఫిక్ ఇక్కట్లు తొలగించండి:సీఎస్ మెట్రో పనులు జరుగుతున్న ప్రధాన రహదారులపై ట్రాఫిక్ చిక్కులు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ప్రధాన మెట్రో కారిడార్లలో అధికారులు పర్యటించి ప్రజలకు పరిష్కారం చూపాలని సూచించారు. మంగళవారం మెట్రో పనులపై జరిగిన టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశంలో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. ఇటీవల పనులను వేగవంతం చేసేందుకు వీలుగా నగరంలో 22 ఆస్తులను తొలగించామని, మరో 204 ఆస్తులను సేకరించాల్సి ఉందని హెచ్ఎంఆర్ ఎండీ ఎన్వీఎస్రెడ్డి సీఎస్‌కు వివరించారు. పిల్లర్ల నిర్మాణానికి వీలుగా పంజాగుట్ట-నిరంకారీ భవన్, గ్రీన్‌ల్యాండ్స్ జంక్షన్-అమీర్‌పేట్ జంక్షన్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో ట్రాఫిక్ అనుమతులు లభించాయన్నారు.పిలర్లు పూర్తయిన వెంటనే బారికేడ్లను తొలగించాలని సీఎస్ ఆదేశించారు. సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి బీ.ఆర్మీనా తదితరులు పాల్గొన్నారు.