Tragic shadows
-
గ్రామాల్లో విషాద ఛాయలకు సర్కారే కారణం!
ఆర్మూర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం కారణంగా గ్రామాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయని పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్ విమర్శించారు. శనివారం పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ ప్రజలకు రంగుల ప్రపంచం చూపించి, మాయ మాటలు చెప్పాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కుతున్నాడని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో విద్యుత్ కోతలతో పంట పొలాలు బీళ్లు వారుతూ పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రాకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వృద్ధాప్యంలో ఆసరాగా ఉండే పింఛన్ రాకపోవడంతో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు హఠాన్మరణాలకు గురవుతున్నారన్నారు. దీంతో గ్రామాల్లోని ప్రతీ ఇంట్లో విషాద ఛాయలే ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ నాయకులు, ప్రజా ప్రతినిధులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారి ఇళ్లకు వెళ్లి ధైర్యం చెప్పే పరిస్థితి కూడా లేదన్నారు. ఆరు నెలల టీఆర్ఎస్ పాలనలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతులు, పింఛన్ దారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఈ అంశాలపై విచారణ జరపడానికి నియమించిన త్రిసభ్య కమిటీ అతీ గతీ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన వారి కుటుంబాలకు రూ. ఐదు లక్షల నష్ట పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. 9న అంకాపూర్‌లో వేడుకలు.. ఈ నెల 9న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ జన్మదినంతో పాటు అదే రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించిన సందర్భంగా ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో భారీ ఎత్తున వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. -
ఎడతెగని నిరీక్షణ..
బియాస్ దుర్ఘటన జరిగి నేటికి నెల ఇంకా తీరని వేదన.. ఆగని రోదన గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు మరణించిన విద్యార్థుల ఇళ్ల వద్ద తొలగని విషాద ఛాయలు సాక్షి, సిటీబ్యూరో/నల్లకుంట/జగద్గిరిగుట్ట: బియాస్ ఘటన జరిగిన నేటికి సరిగ్గా నెల.. అయినా ఇంకా తీరని వేదన.. ఆగని రోదన.. ఈ ఘటనలో నగరానికి చెందిన 16 మంది విద్యార్థులు మరణించారు. గల్లంతైన వారిలో మరో ముగ్గురి ఆచూకీ లేకుండా పోయింది. గల్లంతైన విద్యార్థులు శ్రీనిధి (కరీంనగర్), రిషితారెడ్డి (బాచుపల్లి), కల్లూరి శ్రీహర్ష (నల్లకుంట) కోసం కన్నవారు కళ్లలో వేయి వత్తులు వేసుకొని ఎదురు చూస్తున్నారు. నిద్రాహారాలు మాని తమ వారి కోసం ఎడతెగని నిరీక్షణతో భారంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక దుర్ఘటనలో మృత్యువాత పడిన 16 మంది నగర విద్యార్థుల ఇళ్ల వద్ద కూడా ఇంకా విషాదఛాయలు తొలిగిపోలేదు. బంధుమిత్రుల పరామర్శలతో, ఆత్మీయుల పలకరింపులతో నేటికీ ఉద్విగ్నవాతావరణం నెలకొంది. బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాలలో సెలవుల అనంతరం సోమవారం తరగతులు పునఃప్రారంభమయ్యాయి. తోటి విద్యార్థులను కోల్పోయి షాక్‌కు గురైన పలువురు విద్యార్థులు భారంగా కాలేజీకి వచ్చారు. మొన్నటివరకు తమ మిత్రులతో కళాశాల ఆవరణలో గడిపిన తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడంతో కళాశాల వాతావరణం ఉద్విగ్నంగా మారింది. కళాశాల వద్ద విషాద ఛాయలు దుర్ఘటన జరిగి నెలైనా వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కాలేజీ విద్యార్థులు ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. సెలవుల అనంతరం సోమవారం పునఃప్రారంభమైన బాచుపల్లిలోని కళాశాల ప్రాంగణంలో ఉద్విగ్నత నెలకొంది. నదీ ప్రవాహంలో 24 మంది విద్యార్థులు గల్లంతు కాగా వారిలో 21 మంది మృత్యువాతపడడం, మరో ముగ్గురు విద్యార్థుల ఆచూకీ తెలియకపోవడంతో తోటి విద్యార్థులు తీవ్రంగా కలత చెందారు. తమ తోటి వారితో గడిపిన స్మృతులను, కళాశాల ప్రాంగణంలో వారితో కలిసి మెలిసి గడిపిన సంఘటనలను గుర్తుచేసుకొని తల్లడిల్లారు. ప్రతి విద్యార్థి ముఖంలోనూ విషాద ఛాయలే కనిపించాయి. కళాశాల ఆవరణలో విద్యార్థులతోపాటు, సిబ్బంది, ఫ్యాకల్టీలు మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాలేజీకి సెలవు ప్రకటించడంతో విద్యార్థులు బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు తిరిగి వెళ్లారు. పరిహారంపై సర్కార్ల నిర్లక్ష్యం.. దుర్ఘటనలో మృత్యువాత పడిన విద్యార్థుల కుటుంబాలకు హిమాచల్ ప్రదేశ్, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ప్రభుత్వాలు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించాయి. కానీ ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు ఏ ఒక్క ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదని బాధితుడు సంజయ్‌కుమార్ (మిట్టపల్లి అఖిల్ తండ్రి) ‘సాక్షి’కి తెలిపారు. విద్యారుణాలను మాఫీ చేస్తామని, కళాశాలకు చెల్లించిన ఫీజులను తిరిగి తల్లిదండ్రులకు ఇస్తామన్న వాగ్దానాలు సైతం మాటలకే పరిమితమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ప్రాణాలు కోల్పోయిన నగర విద్యార్థులు వీరే.. బియాస్ నదిలో గల్లంతైన వారిలో 16 మంది నగర విద్యార్థులు మృత్యువాత పడ్డారు. వీరిలో విజేత, లక్ష్మీగాయత్రి, ఐశ్వర్య, రాంబాబు, దేవాశీష్బోస్, సాబేర్ హుస్సేన్, అరవింద్, పరమేశ్వర్, పి.వెంకటదుర్గ తరుణ్, అశీష్మంతా, మాచర్ల అఖిల్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బైరినేని రిత్విక్, కిరణ్‌కుమార్, మిట్టపల్లి అఖిల్ ఉన్నారు. రిషితా ఎక్కడున్నావమ్మా... కూతురు రిషితారెడ్డి జాడ తెలియక తల్లి మంచం దిగడంలేదు. చెల్లెలి కోసం చెమ్మగిల్లిన కళ్లతో అన్న.. ఏమి చేయాలో తెలియని నిస్సహాయ స్థితిలో నేను కొట్టుమిట్టాడుతున్నాం. కూతురి జాడ కోసం నెల రోజులుగా ఎదురు చూస్తున్నాం. హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన హెల్ప్‌లైన్ నంబర్లకు నిత్యం ఫోన్‌చేసి సమాచారం తెలుసుకుంటున్నాం. ప్రాణాలతో వస్తుందనే ఆశతోనే బతుకుతున్నాం. దుర్ఘటనకుకాలేజీ యాజమాన్యమే కారణం. విద్యార్థులను స్టడీ టూర్‌కి తీసుకెళ్లిన కళాశాల యాజమాన్యంతోపాటు ఫ్యాకల్టీలు అడుగడుగునానిర్లక్ష్యంగా వ్యవహరించారు. - కృష్ణారెడ్డి (గల్లంతైన రిషితారెడ్డి తండ్రి) శ్రీహర్ష కోసం వేయికళ్లతో.. బియాస్ నదిలో గల్లంతైన కల్లూరి శ్రీహర్ష (19) కోసం తల్లిదండ్రులు కేఆర్‌కేబీ ప్రసాద్, స్వర్ణలతలు కళ్లలో వత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఎప్పటికైనా తమవాడు తిరిగివస్తాడన్న ఆశతో జీవిస్తున్నారు. నల్లకుంట శివం రోడ్డు బతుకమ్మకుంట సబ్‌స్టేషన్ ఎదురు వీధిలోని శ్రీమత్ రాజాస్ రెసిడెన్సీలో (ఇంటి నంబర్ 2-2-1118/ఏ) వారు నివాసముంటున్నారు. కేఆర్‌కేబీ ప్రసాద్ వృత్తిరీత్యా అడ్వకేట్. జూన్ 3న వీఎన్ఆర్ కళాశాల నుంచి హిమాచల్‌ప్రదేశ్ స్టడీ టూర్‌కు వెళ్లిన వారిలో ప్రసాద్ కుమారుడు శ్రీహర్ష కూడా ఉన్నాడు. అదే నెల 8న స్నేహితులతో కలిసి ఫొటోలు దిగుతూ బియాస్ నదిలో గల్లంతైన విషయం విదితమే. నెల రోజులు గడుస్తున్నా నేటికీ ఆచూకీ లభించలేదు. తమ కుమారుడు ఇంకా ప్రాణాలతోనే ఉన్నాడని, ఏదో ఒక రోజు క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడని శ్రీహర్ష తల్లిదండ్రులు ఆశతో కుమారుని కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురు చూస్తుండడం అందరినీ కలచివేస్తోంది. కుటుంబ సభ్యులతోపాటు బందువులు, స్నేహితులు శ్రీహర్ష జాడకోసం ప్రత్యేక పూజలు చేస్తున్నారు. క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నారు. చాలా బాధగా ఉంది... బియాస్ ఘటన దురదృష్టకరం. ఇంత మంది మృతి చెందడం ఎంతో బాధకలిగించింది. కాలేజీలోని ప్రతి విద్యార్థి ఇప్పటికి ఈ షాక్ నుంచి తేరుకోలేక పోతున్నారు. - రాజేశ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ ఎక్కడ చూసినా అదే చర్చ.. ఈ రోజు కాలేజీకి రాగానే బియాస్ ఘటననే గుర్తుచేసుకున్నాం. మరణించిన విద్యార్థులను తలచుకుంటేనే ఎంతో ఆవేదన కలుగుతోంది. వారి తల్లిదండ్రులకు భగవంతుడు ధైర్యం ఇవ్వాలి. - రామ్, ఎంటెక్, ఫస్ట్ ఇయర్ తలచుకుంటేనే భయంగా ఉంది.. మా తోటి విద్యార్థులు నది ప్రవాహంలో కొట్టుకుపోవడం.. ఆపై మరణించడం తలచుకుంటేనే భయంగా ఉంది. ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరం. - రఘువీర్, బిటెక్, తృతీయ సంవత్సరం మరువలేని చేదు జ్ఞాపకం... బియాస్ నదిలో మా స్నేహితులను కోల్పోవడం జీవితంలో ఓ చేదు జ్ఞాపకం. ఈ దురదృష్టకర సంఘటన నిజం కాకుంటే బాగుండు అనిపించింది. - చైతన్య, బిటెక్, తృతీయ సంవత్సరం -
కడుపుకోత...
బియాస్ నదిలో గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యం - మిన్నంటిన తల్లిదండ్రుల రోదన - వరంగల్ గిర్మాజీపేట, నర్సంపేటలో విషాదఛాయలు - నేడు హైదరాబాద్‌కు మృతదేహాలు - జిల్లాకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేసిన అధికారులు ప్రమాదం నుంచి తప్పించుకుని బతికి ఉంటారనే ఆశతో ఉన్న ఆ తల్లిదండ్రులకు నిరాశే ఎదురైంది. 14 రోజుల నుంచి కుమారుల రాక కోసం ఎదురుచూస్తున్న వారికి కడుపుకోతే మిగిలింది. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బియూస్ నదిలో గల్లంతైన నర్సంపేటకు చెందిన చిందం పరమేశ్వర్, వరంగల్ నగరంలోని 21వ డివిజన్ గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు ఆదివారం లభ్యమయ్యూరుు. విద్యార్థులు కానరాని లోకాలకు పోయారని టీవీల ద్వారా తెలుసుకున్న వారి కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. కడుపుకోత మిగిల్చి.. కానరాని లోకాలకు.. - బియాస్ నదిలో లభ్యమైన పరమేశ్వర్, అఖిల్ మృతదేహాలు - శోకసంద్రంలో కుటుంబ సభ్యులు - గిర్మాజీపేట, నర్సంపేటలో విషాద ఛాయలు ఆ తల్లిదండ్రులు ఏది జరగకూడదని అనుకున్నారో.. అదే జరిగింది. ఎక్కడో ఒకచోట తమ కుమారులు బతికి ఉండే ఉంటారని.. క్షేమంగా రావాలని వారు చేసిన ప్రార్థనలు ఫలించలేదు. నవ్వుతూ ఇంట్లో నుంచి వెళ్లిన విద్యార్థులు విగతజీవులుగా బియాస్ నదిలో లభ్యమయ్యారు. కన్నవారికి తీరని కడుపు కోత మిగిల్చి వెళ్లారు. నర్సంపేటకు చెందిన పరమేశ్వర్, గిర్మాజీపేటకు చెందిన అఖిల్ మృతదేహాలు లభ్యమయ్యాయని పిడుగులాంటి వార్త తెలియగానే తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా బోరున విలపించారు. అయ్యో కన్నా.. అఖిల్ వరంగల్ చౌరస్తా : వరంగల్ నగరంలోని గిర్మాజీపేటకు చెందిన మిట్టపల్లి సంజయ్, సునీత దంపతులకు కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురు మౌనిక హన్మకొండలోని అల్లూరి ఇనిస్టిట్యూట్‌లో ఎంబీఏ చేస్తుండగా, అఖిల్(23) హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞాన్ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్(ఈఐఈ) రెండో సంవత్సరం చదువుతున్నాడు. 1995 జూన్ 12న పుట్టిన అఖిల్ ఈనెల 3న ఇండస్ట్రీయల్ టూర్లో భాగంగా తోటి విద్యార్థులతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు వెళ్లాడు. ఈనెల 8న సాయంత్రం అక్కడి బియాస్ నదిలో గల్లంతయ్యాడు. ఆ రోజు నుంచి అతడి రాక కోసం కుటుంబ సభ్యులు నిరీక్షిస్తున్నారు. నాలుగు గంటల మిస్టరీ బియాస్ నదిలో గాలిస్తున్న రెస్క్యూటీమ్‌కు ఆదివారం ఒక్కరోజే నాలుగు మృతదేహాలు లభించాయి. మృతుల్లో ఒకరు నర్సంపేటకు చెందిన పరమేశ్వర్‌గా, మరో ఇద్దరు హైదరాబాద్, ఖమ్మం జిల్లాకు చెందినవారిగా గుర్తించారు. సాయంత్రం కనుగొన్న విద్యార్థి మృతదేహం ఏ మాత్రం గుర్తుపట్టలేని విధంగా మారింది. మృతదేహం ఎవరిదనే సందేహాలు వెలువడ్డాయి. దీంతో అక్కడ గాలింపు చర్యల్లో నిమిగ్నమైన రాష్ట్రానికి చెందిన అదనపు డీజీపీ రాజీవ్ త్రివేది అఖిల్ పెద్దనాన్న సంజీవరావు, అక్క మౌనికతో ఫోన్లో మాట్లాడారు. అఖిల్ ఒంటిపై ఉన్న గుర్తులు, దుస్తులు, ఇతర వివరాల కోసం ఆరా తీశారు. అఖిల్ చేతి మణికట్టుకు ఉన్న దీపావళి కేదారి వ్రతం, ఆంజనేయ స్వామి దారాలతో గుర్తించగలిగారు. చివరికి ఈ చేదువార్తను రాత్రి 7.55 గంటలకు అఖిల్ కుటుంబ సభ్యులకు తెలిపారు. శోకసంద్రంలో కుటుంబ సభ్యులు కొడుకు కోసం పదిహేను రోజులుగా ఎదురు చూస్తున్న ఆ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. గుండెలు బాదుకుంటూ బోరున విలపించారు. సమాచారం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు అతడి స్వగృహానికి చేరుకున్నారు. అఖిల్ కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు స్థానికులను కంటతడి పెట్టించాయి. ఇదిలా ఉండగా సోమవారం రాత్రి అఖిల్ మృతదేహం హైదరాబాద్‌కు చేరుకునే అవకాశాలున్నట్లు బంధువులు తెలిపారు. కాగా జిల్లా యంత్రాంగం నుంచి అఖిల్ కుటుంబ సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. పరమేశా.. అప్పుడే నా కొడుకును తీసుకెళ్లావా.. నర్సంపేట : ఓ పరమేశా.. నీ పేరు పెట్టుకుంటే నా కొడుకు నిండు నూరేళ్లు జీవిస్తాడనుకున్నా.. ప్రమాదం జరిగి 14 రోజులైనా నా కొడుకు బతికి వస్తాడనుకున్నా.. నీ పేరు పెట్టుకున్న కొడుకును నీ వద్దకే తీసుకెళ్లి నాకు కడుపుకోత మిగిల్చావా తండ్రీ.. అన్ని దేవతలకూ మొక్కుకున్నా ఏ దేవునికీ నా మొరముట్టలేదా నాయనా.. మమ్మీ టాటా అని చెప్పుకుంటూ పోతివి కదరా కొడుకా.. అంటూ హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన చిందం పరమేశ్వర్ తల్లి ఉమ రోదనలు మిన్నుముట్టాయి. పరమేశ్వర్ మృతదేహం ఆదివారం ఉదయం లభ్యమైన విషయం టీవీ వార్తల్లో వస్తుండగా చూసి కుటుంబ సభ్యులు గొల్లుమన్నారు. నర్సంపేట పట్టణానికి చెందిన చిందం వీరన్న-ఉమల దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరిలో చిన్నవాడు పరమేశ్వర్(24) బియాస్ నదిలో గల్లంతైన విషయం విధితమే. ప్రమాదం జరిగిన నాటి నుంచి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, అతని స్నేహితులు పరమేశ్వర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుతూ మొక్కని దేవుడు లేడు. ఎక్కడో ఒక చోట బతికే ఉంటాడని భావించారు. చివరికి వారి ఆశలు నిరాశలయ్యాయి. మృతదేహం లభించిన విషయంతో తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు పరమేశ్వర్ ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. నేడు మృతదేహం తరలింపు పరమేశ్వర్ మృతదేహం బియాస్ నదిలో గల్లంతైన ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో లభ్యమైంది. మండీ ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాన్ని సోమవారం ఉదయం 6.30 గంట లకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు.. అక్క డి నుంచి నర్సంపేట తహసీల్దార్ సూర్యనారాయణ, ఆర్ఐ రాజు నర్సంపేటకు తీసుకురానున్నట్లు ఆర్డీఓ అరుణకుమారి తెలిపారు. మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. నేలరాలిన సరస్వతీ పుత్రుడు పరమేశ్వర్ చిన్ననాటి నుంచీ చదువులో ముందుండేవాడని, పాలిటెక్నిక్ కోర్సు చేస్తుండగానే ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కోసం కాల్‌లెటర్ వచ్చినా ఉన్నత స్థాయికి చేరోకోవాలనే లక్ష్యంతో ఆ అవకాశాన్ని వదులుకున్నాడని అతని సోదరుడు ప్రశాంత్ తెలిపాడు. పరమేశ్వర్ 1 నుంచి 5వ తరగతి వరకు పట్టణంలోని అరవింద పాఠశాల, 6 నుంచి 7 వరకు గీతాంజలి స్కూల్, 8 నుంచి టెన్త్ వరకు మహబూబాబాద్‌లోని మహర్షి పాఠశాలలో చదువుకున్నాడు. టెన్త్‌లో 500 పైచీలుకు మార్కులు సాధించాడు. తర్వాత హైదరాబాద్ ఈస్టు మారేడుపల్లి పాలిటెక్నిక్‌లో మూడున్నర సంవత్సరాలు అభ్యసించా డు. ఈ క్రమంలో థౌసెండ్ మిలియన్ కంపెనీలో ఉద్యోగ అవకాశం వచ్చినా వదులుకుని ఈసెట్ కోచింగ్‌కు వెళ్లి రాష్ట్రం లో 8వ ర్యాంక్ సాధించాడు. వీఎన్ఆర్ కళాశాలలో ఇన్సుమెంటేషన్ గ్రూపులో సీటు రావడంతో రెండేళ్లు పూర్తి చేశాడు.