Transco employees
-
1200 మంది విద్యుత్ ఉద్యోగులకు ఊరట
తెలంగాణ ట్రాన్స్‌కోలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రాంత ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. ఆ ఉద్యోగుల రిలీవింగ్ వివాదంపై హైకోర్టులో సోమవారం విచారణ సాగింది. ఏపీ ఉద్యోగులను రిలీవ్ చేయడంపై ఉన్న స్టేను ఎత్తేయాలంటూ తెలంగాణ ట్రాన్స్‌కో హైకోర్టును ఆశ్రయించింది. అయితే, గతంలో ఆంధ్రప్రదేశ్‌కు పంపిన 1200 మంది విద్యుత్ ఉద్యోగులకు జీతాలను తెలంగాణ ట్రాన్స్కోయే చెల్లించాలని హైకోర్టు తాజాగా ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేసింది. -
ట్రాన్స్ కో అధికారుల అత్యుత్సాహం
అనంతపురం: అనంతపురం జిల్లా డి.హీరేహల్ మండలం సిద్ధరాంపురం తండాలో శనివారం ఉదయం ట్రాన్స్ కో అధికారులు అత్యుత్సాహానికి పాల్పడ్డారు. తండాలో కొత్త మీటర్లు అమర్చుకోలేదని విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. ఈ సందర్భంగా రైతుల విషయంలో విద్యుత్ శాఖ అధికారుల వైఖరిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రావు తీవ్రంగా ఖండించారు. -
సమ్మె చీ‘కట్’లు
హన్మకొండ, న్యూస్‌లైన్: వేతన సవరణ (పీఆర్సీ) కోసం విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన సమ్మె సోమవారం రెండో రోజుకు చేరింది. ఉద్యోగుల సమ్మెతో గణపురం మండలం చెల్పూరు శివారులోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ (కేటీపీపీ)లో విద్యుత్ ఉత్పత్తి సగానికి పైగా పడిపోయింది. ఐదు వందల మెగావాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి 300 మెగావాట్లకు పడిపోగా... సోమవారం సాయంత్రానికి 200 మెగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలోని ఆయా థర్మల్ కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉండడంతో... ప్రైవేట్ సంస్థలు, ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్‌ను అత్యవసరంగా కొనుగోలు చేశారు. ఒక్కరోజు 66.30 లక్షల యూనిట్ల విద్యుత్‌ను అధిక ధరకు కొనుగోలు చేసి సరఫరా చేశారు. థర్మల్ ఉత్పత్తి కేంద్రాల నుంచి ఒక్క యూనిట్‌కు రూ. 3.30 చొప్పున చెల్లిస్తుండగా... సమ్మె కారణంగా అత్యవసరంగా ప్రైవేట్ సంస్థల నుంచి సగటున రూ. 6.15 చొప్పున కొన్నారు. ఈ లెక్కన ఒక్క యూనిట్‌కు అదనంగా రూ. 2.85 వెచ్చించారు. ఉద్యోగుల మెరుపు సమ్మెతో ఇప్పటివరకు రూ.1.88 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ భారమంతా వినియోగదారులపైనే పడనుంది. నిరసన ప్రదర్శనలు రెండు రోజుల నుంచి ఆయా యూనియన్ల నేతలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చలు విఫలం కావడంతో విద్యుత్ ఉద్యోగులు సోమవారం సమ్మెను యధాతథంగా కొనసాగించారు. కార్యాలయాలన్నింటికీ తాళాలు వేసి... నిరసన తెలిపారు. ఉన్నతాధికారులను కార్యాలయాల్లోకి రానీయకుండా అడ్డుకున్నారు. ఉదయం నుంచి పలు యూనియన్ల ఆధ్వర్యంలో ఎస్ఈ కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా ఎస్ఈ కార్యాలయం ఎదుట విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో పలు యూనియన్లు ధర్నా చేపట్టారుు. ఉద్యోగులు సుమారు గంటపాటు అక్కడే బైఠాయించారు. పీఆర్సీ ఇవ్వకుంటే... తడాఖా చూపిస్తామని నినాదాలు చేశారు. ధర్నాలో పవర్ జేఏసీ నేతలు తిరుపతిరెడ్డి, నార్ల సుబ్రమణ్యేశ్వర్‌రావు, మధుసూధన్‌రెడ్డి, శ్రీకాంత్, రవీందర్, ప్రభావతి, బండారి ప్రభాకర్, రౌతు రమేష్, ప్రభాకర్, వాలూ నాయక్, శ్రీరాం నాయక్‌తోపాటు పలువురు పాల్గొన్నారు. అంధకారంలో గ్రామాలు అత్యవసర పరిస్థితుల్లో విద్యుత్‌ను కొనుగోలు చేసినా... సాయంత్రం 4 గంటల నుంచి సరఫరా నిలిచిపోయింది. సరిపడా విద్యుత్ లేకపోవడంతో ముందుగా గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్ కోత పెట్టారు. పరిశ్రమలకు విద్యుత్ ఫీక్ అవర్స్ ఆదేశాలిచ్చారు. పరిశ్రమల నిర్వాహకులు ప్రస్తుతం వెలుతురు కోసమే విద్యుత్‌ను వినియోగించాలి. రూరల్ ప్రాంతాల్లోని 23 సబ్స్టేషన్ల పరిధిలో రాత్రి ఏడు గంటల వరకు సరఫరా ఆపేశారు. ఆదివారం నుంచి వ్యవసాయ విద్యుత్ వినియోగానికి బ్రేక్ వేశారు. సోమవారం కూడా సరఫరా చేయలేదు. ఉదయం నుంచి కోతలు విధిస్తూనే ఉన్నారు. సరఫరా తగ్గడంతో సాయంత్రం 4 గంటల నుంచి గ్రామాలకు కోత పెట్టారు. నష్టం రూ.1.88 కోట్లు విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడంతో కేటీపీపీ, ఎన్టీపీసీ, కేటీపీఎస్, వీటీపీఎస్, ఆర్టీపీఎస్ ఉత్పత్తి కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఆయా థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి నిలిచిపోవడంతో సరఫరాపై ఆందోళన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అత్యవసరంగా ప్రైవేట్, ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలుకు ప్రభుత్వం అవకాశమిచ్చింది. ఈ మేరకు జిల్లాకు 66.30 లక్షల యూనిట్లు కొని సరఫరా చేశారు. దీంతో విద్యుత్ కొనుగోలుపైనే రూ. 1.88 కోట్ల అదనపు భారం పడింది. పీఆర్సీ అమలు చేసే వరకూ సమ్మె... గణపురం : వేతన సవరణ అమలు చేసే వరకూ సమ్మె కొనసాగుతుందని ఏపీ పవర్,ఎంఫ్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటి కేటీపీపీ రిజనల్ చైర్మన్ సదానందం అన్నారు. గణపురం మండ లం చెల్పూరు శివారులోని కేటీపీపీ విద్యుత్ ఉద్యోగులు రెండో రోజూ సమ్మలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సదానందం మాట్లాడుతూ సీమాం ధ్రలో ఇప్పటికే చీకట్లు అలముకున్నాయని, సమ్మె కొనసాగితే తెలంగాణలో విద్యుత్ పరిస్థితి దారుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఏక్షణ మైనా... విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవచ్చన్నారు. రెండో రోజు సమ్మెలో ఇ.రఘోత్తం, కిరణ్, బుచ్చయ్య, సంతోష్, వీరయ్య, తిరుపతిరావు, మాధవరావు, నరేష్,శ్రీలక్ష్మి ,అశోక్, రమేష్‌బాబు, రవిందర్, విశ్వనాధ్, లీలా, భానుశ్రీ,ఉమ,రాజేందర్, జమీర్‌పాషా,రంగారావు, తిరుపతి, శంకరయ్య, రాజిరెడ్డి, తదితరులు పా ల్గొన్నారు.ములుగు డీఎస్పీ మురళీధర్‌రావు. సీఐ శ్రీధర్, గణపురం ఎస్సై రవికుమార్ బందోబస్తు చర్యలు చేపట్టారు. -
సమ్మెతో పల్లెల్లో చీకట్లు
అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో ఉద్యోగుల మెరుపు సమ్మెతో పల్లెల్లో చీకట్లు అలుముకున్నాయి. సమ్మె కారణంగా విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడడంతో పవర్ గ్రిడ్ ఫెయిల్ అవుతుందనే ఉద్దేశంతో సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ పల్లెలకు కరెంట్ కట్ చేశారు. వేతన సవరణ కమిటీ వేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం నుంచి ట్రాన్స్‌కో ఉద్యోగులు సమ్మె బాట పట్టారు. ఆదివారం ఉద్యోగుల సెలవురోజు కావడంతో సమ్మె ప్రభావం పెద్దగా కనిపించలేదు. సోమవారం నాటికి ఉత్పత్తి తగ్గిపోవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడ్డాయి. జిల్లా కేంద్రంలో దాదాపు 2 నుంచి 3 గంటలకు పైగా కోత విధించారు. పట్టణ ప్రాంతాల్లో 4 నుంచి 6 గంటల పాటు కోత విధించారు. పల్లెల్లో ఉదయం పోయిన కరెంట్ రాత్రి 11 గంటల వరకూ రాలేదు. 63 మండలాల పరిధిలోని పలు పల్లెలో చీకట్లు అలుముకున్నాయి. శనివారం ట్రాన్స్‌కో ఉద్యోగులతో విద్యుత్ సంస్థలు జరిపిన చర్చలు విఫలం కావడంతో సమ్మెకు దిగారు. సోమవారం మరోమారు చర్చలు జరుపుతారని, దాదాపు ఈ చర్చలు ఫలిస్తాయని ట్రాన్స్‌కో జిల్లా ఉన్నతాధికారులు భావించినా.. సాయంత్రం వరకు చర్చలు జరపలేదు. పల్లెలకు కరెంట్ సరఫరా నిలిపివేత విషయంపై ట్రాన్స్‌కో ఎస్ఈ ప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ.. ఉత్పత్తి లోటు ఏర్పడడం వలన కరెంట్ సరఫరా చేస్తే లోడ్ ఎక్కువై గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశముందని, దీంతో పల్లెలు, పట్టణాల్లో కోతలు విధించాల్సి వచ్చిందని వివరించారు. కాగా, సోమవారం రాత్రి చర్చలు సఫలం కావడంతో ఉద్యోగులు సమ్మె విరమించారు. -
కరెంటు.. ఇక్కట్లు
సాక్షి, కడప : అసలే విద్యుత్ కోతలు, ఆపై విద్యుత్ సమ్మె. వెరసి ప్రజలు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. విద్యుత్ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో సంక్షోభం నెలకొంది. ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో ఆర్టీపీపీలోని ఐదు యూనిట్లలో 1050 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఆదివారం రాత్రి నుంచే ఆగిపోయింది. దీంతోపాటు రాష్ట్రంలోని వీటీపీఎస్, కేటీపీఎస్, శ్రీశైలం కుడిగట్టు వద్ద విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే గ్రిడ్ ఫెయిలయ్యే అవకాశం ఉందని విద్యుత్ ఉద్యోగులు పేర్కొన్నారు. అయితే సోమవారం రాత్రి విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సమ్మె కొనసాగిఉంటే జిల్లాలోని అత్యవసర సేవలకు సైతం తీవ్ర విఘాతం కలిగేది. ఇప్పటికే పరిశ్రమలకు పూర్తి స్థాయిలో అధికారులు కోత విధించారు. జిల్లాకు రావాల్సిన కోటా కంటే 50 శాతం తక్కువగా విద్యుత్ సరఫరా జరుగుతుండటంతో వాణిజ్య, గృహావసరాలకు సైతం కోతలను పెంచారు. సమ్మె విరమణ జరిగి ఉండకపోతే జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో సోమవారం రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయి ఉండేదని విద్యుత్‌శాఖ ఉన్నతాధికారి ‘సాక్షి’తో పేర్కొన్నారు. విధులను బహిష్కరించిన ఉద్యోగులు వేతన సవరణకు సంబంధించి అగ్రిమెంటుపై ప్రభుత్వం తరపున అధికారులు సంతకం చేయాలని విద్యుత్ జేఏసీ చైర్మన్ సుధాకర్, కో చైర్మన్ నరసింహారావులు డిమాండ్ చేశారు. జిల్లాలో ఆపరేషన్స్‌కు సంబంధించి రెండు వేల మంది, ట్రాన్స్‌కో ఉద్యోగులు వెయ్యి మంది, ఆర్టీపీపీలో 2500 మంది ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులతో కలుపుకుని పూర్తి స్థాయిలో అందరూ సమ్మెలో పాల్గొనడంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జిల్లా కేంద్రంలోని శంకరాపురం 220 కేవీ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఎదుట, ఆర్టీపీపీలో ఉద్యోగులు, కార్మికులు విధులను బహిష్కరించి ఆందోళన చేపట్టారు. -
విద్యుత్ కోతను నిరసిస్తూ రైతుల ధర్నా
భూదాన్‌పోచంపల్లి, న్యూస్‌లైన్: అప్రకటిత విద్యుత్ కోతను నిరసిస్తూ మండలంలోని శివారెడ్డిగూడెం గ్రామానికి చెందిన రైతులు ఆదివారం పోచంపల్లి సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రేవనపల్లి ఫీడర్ నుంచి గ్రామానికి కరెంట్ సరఫరా అవుతుందని తెలిపారు. మూడు రోజులుగా కేవలం రోజుకు మూడు గంటలు మాత్రమే కరెంట్ సరఫరా అవుతుందని, దీంతో వరినాట్లు ఎండిపోతున్నాయని ఆరోపిం చారు. లో ఓల్టేజీ సమస్య కూడా ఉందని అన్నారు. విద్యుత్ కోతలను ఎత్తివేయాలని ట్రాన్స్‌కో అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా స్పందన కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్‌ను సమస్యను పరిష్కరించకపోతే బిల్లుల చెల్లింపు నిలిపివేస్తామని హెచ్చరించారు. తెగిపోతున్న కరెంట్ తీగలను కూడా మార్చాలని కోరారు. కార్యక్రమంలో మేక ల నర్సిరెడ్డి, వారాల నర్సిరెడ్డి, జంగారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, మల్లారెడ్డి, భగవంతరెడ్డి, బస్వారెడ్డి, బాలకృష్ణారెడ్డి పాల్గొన్నారు. -
సమ్మెలో 2,200 మంది విద్యుత్ ఉద్యోగులు
సాక్షి, చిత్తూరు: రాష్ట్ర విభజనను వ్యతిరే కిస్తూ ట్రాన్స్‌కో ఉద్యోగులు చేస్తున్న మెరుపు సమ్మె రెండో రోజూ కొనసాగింది. విద్యుత్ ఉద్యోగులు సోమవారమూ సరఫరా నిలిపేసి తమ పవర్ పంచ్ చూపించారు. ఉదయం 6 నుంచి రాత్రి 7 గంటల వరకు సరఫరాను ఆపేశారు. జిల్లా మొత్తానికి హెచ్‌టీ లైన్ల నుంచి విద్యుత్ సరఫరా చేసే కలికిరి, రేణిగుంట, చిత్తూరు 220 కేవీ ప్రధాన సబ్స్టేషన్లను విద్యుత్ ఉద్యోగులు షట్‌డౌన్ చేశారు. జిల్లాలో హెల్పర్ల నుంచి డీఈల వరకు 2,200 మంది ఉద్యోగులు సమ్మె లో ఉన్నారు. ఫ్యూజ్‌కాల్స్, బ్రేక్డౌన్లు వేటికీ అటెండ్ కావడం లేదు. జిల్లాలోని 33 కేవీ సబ్స్టేషన్లు 295, 11కేవీ విద్యుత్ ఫీడర్లు 1100 పడకేశాయి. ప్రైవేట్ ఆస్పత్రులు, హోటల్స్, కంప్యూటర్ సెంటర్లు, జిరాక్స్ దుకాణాలు, వెల్డర్లు, పిండిమరలు, లేత్‌మిషన్లు, చిన్న పరిశ్రమలు, వాటర్‌సర్వీసు స్టేషన్లు, బేకరీల్లో కార్యకలాపాలు పూర్తిగా స్తంభించాయి. రక్షిత మంచినీటి పథకాలకు మోటర్లు పనిచేయక గ్రామాల్లో జనం నీటి కోసం అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా కోట్ల రూపాయల వాణిజ్య కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. తిరుపతి నుంచి బయల్దేరే రైళ్ల పైన విద్యుత్ సమ్మె ప్రభావం పడింది. అన్ని రైళ్లకు డీజిల్ ఇంజిన్లు తగిలించి పంపింపేందుకు ఏర్పాట్లు చేశారు. రేణిగుంట, చిత్తూరు, వెంకటగిరిలోని విద్యుత్, రైల్వేట్రాక్షన్ సబ్స్టేషన్లకు విద్యుత్ సరఫరా నిలిపేశారు. ఆదివారం రాత్రి నుంచి కాట్పాడి (తమిళనాడు) రైల్వే ట్రాక్షన్కు విద్యు త్ సరఫరా తీసుకున్నారు. తిరుపతి పాస్‌పోర్టు కార్యాలయంలో పాస్‌పోర్టుల జారీ కోసం జనరేటర్లను ఏర్పాటు చేసుకున్నారు. 10 మిలియన్లకు లక్ష యూనిట్లే సరఫరా జిల్లావ్యాప్తంగా రోజూ హెచ్‌టీ, ఎల్టీ సర్వీసులకు 10 మిలియన్ యూనిట్లు అవసరం కా గా లక్ష యూనిట్లు సరఫరా కావడం లేదు. విద్యుత్ ఉత్పత్తి చేసే ముద్దనూరు, విజయవాడ వీటీఎస్ల్లో ఉత్పత్తి స్తంభించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. విద్యుత్ సరఫరా లేకపోవడంతో సబ్స్టేషన్లను, ఫీడర్లను సైతం ఉద్యోగులు మూసేశారు. ఆస్పత్రులకు విద్యుత్ కష్టాలు జిల్లాలోని తిరుపతి, చిత్తూరులోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రులకు మాత్రం విద్యుత్ సరఫరా నిరంతరాయంగా అందే ఏర్పాట్లు చేశా రు. స్విమ్స్, రూయా, బర్డు, జిల్లా ప్రధాన ప్రభుత్వాస్పత్రులకు సరఫరా అందింది. కుప్పం, పుత్తూరు, శ్రీకాళహస్తి, నగరి ఏరియా ఆస్పత్రుల్లో సరఫరా బంద్ కావడం, జనరేటర్లు లేకపోవడంతో వైద్యసేవలకు అంత రాయం ఏర్పడింది. పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులు గంటల కొద్దీ జనరేటర్లతో నిర్వహించలేక కార్యకలాపాలు వాయిదా వేశాయి. పరిశ్రమలకు దెబ్బ జిల్లాలోని శ్రీనిఫుడ్స్, అమరరాజ బ్యాటరీస్, ల్యాంకో ఇండస్ట్రీస్, జ్యూస్ ఫ్యాక్టరీలు, పిగ్ఐరెన్, చిత్తూరు గ్రానైట్ ఫ్యాక్టరీస్, గాజుల మండ్యం పారిశ్రామికవాడల్లోని పరిశ్రమల్లో కార్యకలాపాలు స్తంభించాయి. బీఎస్ఎన్ఎల్ సెల్‌టవర్లకు జనరేటర్లు పూర్తిగా నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో సిగ్నల్స్ పని చేయలేదు. వినియోగదారులు ఫోన్లు చేసుకోలేక ఇబ్బంది పడ్డారు. చిత్తూరు కేంద్రంగా ఉన్న పౌల్ట్రీ హేచరీస్‌లో కోడిపిల్లల ఉత్పత్తిపై ప్రభా వం పడింది. జనరేటర్లు ఉన్నా ఉష్ణోగ్రత అవసరమైన మేరకు నిర్వహించే పరిస్థితి లేదు. విమానాశ్రయంలో.. రేణిగుంట, న్యూస్‌లైన్: రేణిగుంట విమానాశ్రయంలో ఉదయం 6 గంటల నుంచి కరెంటు సరఫరా నిలిపి వేశారు. టెర్మినల్ బిల్డింగ్ టెక్నికల్ బ్లాక్‌లోని ఉద్యోగులు ఎయిర్పోర్ట్ అగ్నిమాపక కేంద్రంలోని జనరేటర్ సాయంతో కార్యకలాపాలు నిర్వర్తించారు. సాయంత్రం వరకూ స్పైస్‌జెట్, ఎయిరిండియా, జెట్‌లైట్ విమానాల రాకపోకలకు జనరేటర్తోనే సందేశాలను అందించారు. రైల్వేలో కరెంట్ ఎఫెక్ట్ తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: కరెంటు కోతల ప్రభావం రైల్వే వ్యవస్థపైనా పడింది. తిరుపతి రైల్వేస్టేషన్లో రైళ్ల రాకపోకలు సూచించే డిస్ప్లే బోర్డులు పనిచేయక ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రిజర్వేషన్ కార్యాల యం, డెప్యూటీ స్టేషన్ మేనేజర్ కార్యాలయం, ఎంక్వయిరీ కౌంటర్, బుకింగ్ కౌంటర్లు జనరేటర్ సాయంతో కొనసాగాయి. జ్యూస్ స్టాల్స్, వాణిజ్య సముదాయాలు, లిఫ్ట్‌లు, రిజర్వేషన్ విచారణ మిషన్లు పనిచేయలేదు. వెయిటింగ్ హాళ్లలో అంధకారం అలముకుంది. వెయిటింగ్ హాళ్లలో ఏసీలు పనిచేయక ప్రయాణికులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. రైల్వే స్టేషన్ నుంచి ఈస్టు పోలీసుస్టేషన్ వరకు, ఉత్తరం వైపు నాలుగు కాళ్ల మండపం వరకు అంధకారం నెలకొనడంతో యాత్రికులు ఇబ్బందిపడ్డారు. రైల్వే భద్రతా కార్యాల యాల్లో ఇంటర్నెట్ వ్యవస్థ పనిచేయకపోవడంతో ఉన్నతాధికారులకు సమాచారం చేరవేయలేక ఇబ్బంది పడ్డారు. రెండో రోజూ డీజిల్ ఇంజన్లే తిరుపతి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైళ్లను రెండో రోజైన సోమవారమూ డీజిల్ ఇంజన్లతోనే నడిపారు. ఢిల్లీ, ముంబయి, భువనేశ్వర్ తదితర బయట రాష్ట్రాల నుంచి తిరుపతి మీదుగా నడిచే రైళ్లకు విద్యుత్ అంతరాయం లేకుండా తమిళనాడులోని కాట్పాడి నుంచి సరఫరాను రేణిగుంట వరకు ప్రత్యేక దశలో కొనసాగించారు. దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌ను సోమవారం రాత్రి రద్దు చేసినట్లు స్టేషన్ మేనేజర్ కూర్మారావు తెలిపారు.