transfors
-
విద్యుత్ శాఖలో బదిలీల లొల్లి..
కొత్తపల్లి(కరీంనగర్) : ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలో చేపట్టిన సాధారణ బదిలీల ప్రక్రియ శనివారం రాత్రి ఓ కొలిక్కి వచ్చింది. సబ్ ఇంజినీర్లు సహా ఆఫీసు, ఫీల్డ్ విభాగానికి సంబంధించిన ఉద్యోగుల బదిలీలు చేస్తూ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా.. ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించి బదిలీల ప్రక్రియపై లొల్లి నెలకొంది. ఈనెల 15వ తేదీ సాయంత్రం వరకే బదిలీలు పూర్తి చేసి లిస్టు ప్రదర్శించాల్సిన అధికారులు ట్రేడ్ యూనియన్ల ఒత్తిళ్లకు తలొగ్గి బదిలీల ప్రక్రియను ఆలస్యం చేశారు. దీంతో ఉద్యోగులు, సిబ్బంది పోస్టింగ్‌ల కోసం ఎస్ఈ కార్యాలయం ఆవరణలో పడిగాపులు కాస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంజినీర్ల బదిలీల్లో నిబంధనలు పాటించడం లేదంటూ, ఒకే యూని యన్‌కు అనుకూలంగా ఎస్ఈ వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ శనివారం తెలంగాణ స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ) కరీంనగర్ బ్రాంచి ఆధ్వర్యంలో ఎస్ ఈ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎస్ఈకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బైఠాయించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఈఏ కరీంనగర్ బ్రాంచి సెక్రటరీ కె.అంజయ్య మాట్లాడుతూ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టారీతిన ఇంజినీర్ల బదిలీలు చేపడుతున్నారని, ఓ యూనియన్‌కు వత్తాసు పలుకుతూ ఎస్ఈ చేపడుతున్న బదిలీలు సరికావని ఆరోపించారు. మహిళలని చూడకుండా గతంలో అటవీ ప్రాంతాకు సమీపంలో పోస్టింగ్‌లు ఇచ్చారని, ప్రస్తుతం కూడా అదే పద్ధతి అవలంబించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. విద్యుత్ శాఖను భ్రష్టు పట్టిస్తున్న ఎస్ఈ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం బదిలీలు చేపట్టే వరకు ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ ధర్నాలో కోశాధికారి జి.రఘు, వివిధ జిల్లాల అధ్యక్షులు ఎన్.అంజయ్య, ఎ.శ్రీనివాస్‌రెడ్డి, వి.ప్రదీప్, కె.గంగారాం, కార్యదర్శులు పి.అశోక్, ఎ.నరేష్, డీఈలు గంగాధర్, బాలయ్య, ఏడీలు వి.ప్రభాకర్, సాగర్, ఏఈలు పాల్గొన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కార్యాలయ గేట్ ఎదుట చేపడుతున్న ఇంజినీర్ల నిరసనపై స్పందించిన ఎస్ఈ కె.మాధవరావు వారిని చర్చలకు ఆహ్వానించారు. ఎస్సీ, ఎస్టీ సంఘం నాయకులు సైతం ఆందోళన చేపట్టారు. పలు విభాగాల్లో పోస్టింగ్‌లు.. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) కరీంనగర్ సర్కిల్ పరిధిలోని సాధారణ బదిలీల ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండు రోజులుగా నిరీక్షిస్తున్న ఉద్యోగులకు శనివారం రాత్రి ఊరట లభించింది. ఇంకనూ ఇంజినీర్ల బదిలీల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. శుక్రవారంతో బదిలీల ప్రక్రియ ముగియాల్సి ఉండగా.. పైరవీలు, ఒత్తిళ్ల మేరకు పలు విభాగాల పోస్టింగ్‌లు శనివారం ప్రకటించారు. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్ (జేఏఓ) 12, జూనియర్ అసిస్టెంట్ 48, సీనియర్ అసిస్టెంట్ 20, ఆఫీసు సబార్డినేట్స్ 18, స్వీపర్లు 3, ఫోర్‌మెన్ (గ్రేడ్ 1) 7, సబ్ ఇంజినీర్ 18లను బదిలీ చేస్తూ కరీంనగర్ సర్కిల్ ఎస్ఈ కె.మాధవరావు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా.. సర్కిల్ పరిధిలోని కరీంనగర్ డివిజన్ పరిధిలోని లైన్ ఇన్స్పెక్టర్ 5, లైన్మెన్ 67, అసిస్టెంట్ లైన్మెన్ 3, జూనియర్ లైన్మెన్ 2 బదిలీ లిస్టును శనివారం రాత్రి డీఈ రాజారెడ్డి ప్రకటించారు. ఇందులో కొంతమందికి ఆప్షన్ ప్రకారం, మరికొంత మందికి ఆప్షన్‌కు విరుద్ధంగా పోస్టింగ్‌లు కేటాయించడంతో అసంతృప్తి వ్యక్తమైంది. రెండు రోజులుగా పోస్టింగ్‌ల కోసం సిబ్బంది ఎదురుచూస్తుండటంతో ఎస్ఈ కార్యాలయం సందడిగా కనిపించింది. పారదర్శకంగా బదిలీలు కరీంనగర్ సర్కిల్ పరిధిలోని సాధారణ బదిలీలన్నీ పారదర్శకంగా చేపట్టాం. అన్ని యూనియన్ల నాయకులతో చర్చించాకే బదిలీలు చేపడుతున్నాం. ఇంజినీర్ల బదిలీలపై ఓ తుది నిర్ణయం వెలువడకముందే నిందారోపణలు వేయడం సరికాదు. అందరికీ ఆమోదయోగ్యంగానే బదిలీలు జరుగుతాయి. – కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ -
ఐదు వేల మందికి స్థానచలనం!
ఆదిలాబాద్‌టౌన్ : ఉపాధ్యాయ బదిలీల కోసం జిల్లా విద్యాశాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సినియారిటీ, ఖాళీల జాబితాను ఇప్పటికే సిద్ధంచేశారు. ప్రభుత్వం నుంచి షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. బుధవారం షెడ్యూల్ విడుదల అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే బదిలీలను ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన చేపట్టనున్నారు. దాదాపు 5వేల మంది ఉపాధ్యాయులకు స్థానచలనం జరిగే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలకు సంబంధించిన ఖాళీల జాబితా, తప్పనిసరి బదిలీ టీచర్ల వివరాలను ఆదిలాబాద్ డీఈవోకు సమర్పించారు. బదిలీలను వెబ్ కౌన్సెలింగా లేక.. మ్యాన్వల్లో చేపడుతారో తెలియక ఉపాధ్యాయుల ఆందోళనలో ఉన్నారు. షెడ్యూల్ విడుదలైన తర్వాత తుది జాబితాను విడుదల చేయనున్నారు. అయితే గతంలో 2015 సంవత్సరంలో బదిలీల ప్రక్రియ జరిగింది. దూర ప్రాంతాలు, మండలాల్లో ఉన్న ఉపాధాయయులు బదిలీల కోసం మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన.. ఉపాధ్యాయ బదిలీలను ఉమ్మడి జిల్లా ప్రతిపాదికన చేపట్టనున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని టీచర్ల ఖాళీలను షెడ్యూల్ విడుదల అయిన తర్వాత ప్రకటించనున్నారు. అలాగే అయా పాఠశాలల్లో ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారికి, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులకు తప్పనిసరిగా స్థాన చలనం జరుగనుంది. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసిన వారు బదిలీలకు దరఖాస్తులు చేసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 5వేల మందికి బదిలీలు జరిగే అవకాశాలు ఉన్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాల వారీగా.. ఆదిలాబాద్ జిల్లాలో 3,176 మంజూరు పోస్టులు కాగా ప్రస్తుతం 2,669 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 509 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకొని తప్పని సరిగా బదిలీ అయ్యే ఉపాధ్యాయులు 685 మంది ఉన్నారు. అలాగే ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 12 మంది ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో మంజూరు పోస్టులు 2,854 ఉన్నాయి. ప్రస్తుతం 2,547 మంది పనిచేస్తున్నారు. ఎనిమిది, ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు 801 మంది ఉన్నారు. అలాగే 300 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. వ్యాప్తంగా మొత్తం 2,228 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఐదు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నవారు 2421 ఉన్నారు. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 1048 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఎనిమిది, ఐదేళ్ల సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 288 మంది ఉన్నారు. నిర్మల్ జిల్లాలో 317 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. ఐదు, ఎనిమిదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు 647 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ఇలా ఉమ్మడి జిల్లాబదిలీల కోసం ఎదురుచూపు.. గత కొన్నేళ్లుగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. మారుమూల మండలాల్లో, భార్యభార్తలు వేరువేరు చోట ఉండి పనిచేస్తున్న వారు ఇబ్బందులు పడుతున్నారు. బదిలీ షెడ్యూల్ కోసం అలాంటి వారు ఆశగా ఎదరుచూస్తున్నారు. అయితే అత్యధికంగా కుమురంభీం జిల్లాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల ప్రాంతాల్లో ఖాళీల కోసం ఎదురుచూస్తున్నారు. దహెగాం, బెజ్జూరు, కౌటల, తిర్యాణి, భీమిని తదితర మండలాల్లో పనిచేస్తున్నవారు మైదాన ప్రాంతంలోకి బదిలీపై వెళ్లేందుకు అసక్తి చూపుతున్నారు. ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ తర్వాత విద్యావాలంటీర్ల నియామకాలు చేపట్టే అవకాశం ఉంది. -
పైరవీ బదిలీలు!
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్ : ఏళ్ల తరబడి బదిలీలు లేకపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులను ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆయన స్పందించి త్వరలోనే బదిలీలు ఉంటాయని.. ఇందుకోసం షెడ్యూల్ విడుదల చేస్తామని వెల్లడించారు. అయితే, ఇంకా షెడ్యూల్ విడుదల కాకపోగా అర్హులైన ఉపాధ్యాయ, ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే కొందరు ఉపాధ్యాయులు పలువురు రాజకీయనాయకుల అండదండలతో రాష్ట్ర సచివాలయం నుంచే నేరుగా బదిలీ చేయించుకునేలా పైరవీలు ప్రారంభించారు. ఇలా ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 14 మంది ఉపాధ్యాయులకు బదిలీ ఉత్తర్వులు అందాయి కూడా! దీంతో అర్హులైన ఉపాధ్యాయులు ఆ స్థానాలను నష్టపోయినట్లుగా భావించాల్సి వస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి షెడ్యూల్ ప్రకారమే బదిలీల ప్రక్రియ నిర్వహించాలే తప్ప ఎవరికి కూడా ముందస్తు ఉత్తర్వులు ఇవ్వొద్దని పలువురు కోరుతున్నారు. 2015 జూన్‌లో చివరిసారి.. గతంలో చివరిసారిగా ఉపాధ్యాయుల బదిలీలు 2015 జూన్‌లో జరిగాయి. అప్పటి నుండి మళ్లీ బదిలీలకు సంబందించి ఎటువంటి ప్రస్తావన రాలేదు. చాలా మంది ఉపాధ్యాయుల అవసరాలు, ఇబ్బందులతో పాటు ఉపాధ్యాయ సంఘాల డిమాండ్‌తో ప్రభుత్వం ఎట్లకేలకు బదిలీలు చేపట్టేందుకు అంగీకరించింది. దీనికి సంబంధించి రెండు మూడు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కొందరు ఉపాధ్యాయులు నేరుగా రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దల అండదండలతో బదిలీ చేసుకునేందుకు పైరవీలు చేస్తున్నారు. 14మందికి ఉత్తర్వులు ప్రభుత్వ పెద్దలు, కొన్ని సంఘాల నేతల అండ దండలతో ఉపాధ్యాయులు రాష్ట్ర స్థాయిలో బదిలీ కోసం పైరవీలు ప్రారంభించారు. దీంతో ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని 14 మంది ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి ఉత్తర్వులు గురువారం జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ప్రతులు మహబూ బ్‌నగర్ జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి చేరాయి. ఇందులో మహబూబ్‌నగర్ జిల్లా పరిధి లో విధులు నిర్వహిస్తున్న ఆరుగురికి ఇతర జిల్లాలకు బదిలీ అయింది. ఇక జిల్లాలోనే వివిధ మండలాలకు ఐదుగురికి బదిలీ కాగా.. నాగర్‌కర్నూల్, జోగుళాంబ గ ద్వాల, వనపర్తి జిల్లాల నుండి ఒక్కొక్కరు చొప్పున మహబూబ్‌నగర్ జిల్లాకు బదిలీ అయ్యారు. ముందస్తు బదిలీలతో పోస్టుల్లో తగ్గుదల ఉపాధ్యాయల సౌలభ్యం కోసం చేపట్టే సాధారణ బదిలీల ప్రక్రియలో కేవలం జిల్లా స్థాయిలో మాత్రమే ఉంటాయి. ఈ ప్రక్రియ ఆయా పాఠశాలల వారి ఖాళీలు, అవసరం ఉన్న ఉపాధ్యాయుల సంఖ్య మేరకు భర్తీ చేస్తారు. కానీ ప్రస్తుతం సెక్రటరీయేట్ స్థాయిలో జరిగే బదిలీలు జిల్లాల పరిధి దాటి జరుగుతున్నాయి. దీని కారణంగా జిల్లాలో గతంలో ఖాళీ పోస్టుల సంఖ్య తగ్గిపోతుంది. జిల్లా స్థాయిలో బదిలీ జరిగితే మొదటి స్థానాన్ని ఖాళీగా చూపించే అవకాశముంటుంది. కానీ వేరే జిల్లా నుంచి ఇక్కడకు ఉపాధ్యాయులు రావడంతో ఆ స్థానం నిండిపోయి ఖాళీల్లో తగ్గుదల ఉంటుంది. తద్వారా ఏళ్ల తరబడి బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారు నష్టపోయే అవకాశముంటుంది. అర్హులకు అన్యాయం ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీల ప్రక్రియను ఈసారి ఆన్లైన్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సందర్భంగా వాస్తవ ఖాళీలను తొలుత గుర్తించి.. ఒక్కరొక్కరుగా ఉపాధ్యాయుల బదిలీ జరగగానే ఆ స్థానం ఖాళీగా చూపించేలా సాఫ్ట్వేర్ రూపొందిస్తారు. తొలి ప్రాధాన్యతగా చాలాకాలంగా ఒకే చోట పనిచేస్తున్న వారు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారు, శారీరక వికలాంగులు, వితంతువులు, వయస్సు పైబడిన వారితో పాటు భార్యాభర్తలు ఒకే చోట(స్పౌజ్)కు వచ్చేలా బదిలీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇంతలో కొందరు అక్రమంగా బదిలీ చేయించుకుంటుండడంతో తొలి ప్రాధాన్యత క్రమంలో బదిలీ జరగాల్సి వారికి నష్టం జరుగుతుంది. దీనిని పలు ఉపాధ్యాయ సంఘాల నాయకులు వ్యతిరేకిస్తుండగా.. మరికొన్ని సంఘాల బాధ్యులు స్థబ్దుగా వ్యవహరిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి షెడ్యూల్ విడుదల చేసే వరకు ఎవరిని కూడా రాష్ట్ర స్థాయిలో బదిలీ చేయొద్దనే విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అక్రమంగా ఉత్తర్వులు ఇవ్వొద్దు.. జిల్లాలో పలువురు ఉపాధ్యాయులకు సంబం ధించి నిబంధనలకు విరుద్ధంగా చేపడుతున్న బదిలీలను వెంటనే నిలిపివేయాలి. ప్రభుత్వం ఓవైపు బదిలీలు చేసేందుకు కసరత్తు చేస్తుంటే.. ప్రభుత్వ పెద్దలతో పలుకుపడి ఉన్నవారు అక్రమంగా బదిలీలు చేయించుకోడం బాధాకరమైన అంశం. దీని ద్వారా వాస్తవంగా లబ్ది పొందాల్సిన ఉపాధ్యాయులకు తీవ్ర అన్యాయం జరుగుతుంది. – దుంకుడు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు, టీపీఆర్టీయూ నిధులు విడుదల కాలేదు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు నిధులు మంజూరు కాలేదు. ఒకటి, రెండు రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. ఏటా మాదిరిగానే ఆవిర్భావ ఉత్సవాలను కచ్చితంగా నిర్వహిస్తాం. అందుకు సంబంధించిన ప్రణాళికను కూడా త్వరలో ఖరారు చేస్తాం. వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన వారికి అందజేసే పురస్కారాల విషయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, డీఆర్వో -
బదిలీలు ఆన్లైన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో టీచర్ బదిలీలు ఇక ఆన్లైన్ విధానంలో జరగనున్నాయి. ప్రభుత్వం ఈ దిశగా యోచిస్తోంది. ఈ వేసవి సెలవుల్లోనే అందుకు శ్రీకారం చుట్టే అవకాశం కన్పిస్తోంది. ఇప్పటివరకు కౌన్సెలింగ్ విధానంలో బదిలీలు చేస్తున్నారు. అయితే ఇందులో అనేక అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఆన్లైన్ బదిలీల వైపు ప్రభుత్వం మొగ్గుచూపుతోంది. శనివారం సచివాలయంలో జరిగిన సమావేశంలో ఈటల రాజేందర్, కె.తారకరామారావు, జి.జగదీశ్‌రెడ్డిలతో కూడిన మంత్రుల కమిటీ కూడా ఇదే విషయాన్ని ఉపాధ్యాయ సంఘాల నేతలకు తెలిపింది. అందుకు ఉపాధ్యాయ సంఘాలు సైతం అంగీకరించాయి. ఈ భేటీలో టీచర్లకు సంబంధించిన 36 రకాల సమస్యలు, డిమాండ్లపై చర్చించారు. గతంలో జరిగిన బదిలీల్లో అవకతవకల కారణంగా ముగ్గురు డీఈవోలు సస్పెండ్ అయ్యారని, దాంతో ప్రభుత్వం అభాసుపాలైందని మంత్రుల కమిటీ పేర్కొన్నట్లు తెలిసింది. కోర్టులో ఉన్న సర్వీసు రూల్స్ అంశంపై వాదించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమించేందుకు కమిటీ స్పష్టమైన హామీ ఇచ్చిందని సంఘాలు తెలిపాయి. ఈలోగా సర్వీసు రూల్స్ సమస్య పరిష్కారం కాకపోతే పాత రూల్స్ ప్రకారం ఎవరి మేనేజ్మెంట్లో వారికి పదోన్నతులు ఇచ్చేందుకు చర్యలు చేపడతామని వెల్లడించిందని వివరించాయి. వీటితోపాటు ఇతర సమస్యల పరిష్కారం పట్ల మంత్రుల కమిటీ సానుకూలత వ్యక్తం చేసిందని సంఘాల నేతలు వెల్లడించారు. ఆర్థిక భారంతో కూడుకున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించి రోటీన్‌గా చేయాల్సిన అంశాల్లో పీఆర్సీ ఉందని, ఇందుకు సంబంధించి కమిషన్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మంత్రుల కమిటీ తెలిపింఇ. ఒకవేళ నివేదిక, అమలు ఆలస్యమైతే మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటిస్తామని పేర్కొన్నట్లు సంఘాల నేతలు చెప్పారు. అలాగే ప్రతి మండలంలో ఐదెకరాల స్థలం కలిగిన పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్‌గా అభివృద్ధి చేసి, క్లస్టర్ హాస్టళ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు పేర్కొన్నారు. సర్వీసు రూల్స్, బదిలీలు, పీఆర్సీ ఏర్పాటు, ఇతర సమస్యల పరిష్కారంపైనా ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలన్నింటనీ క్రోడీకరించి సీఎంకు నివేదిక అందజేస్తామని పేర్కొంది. ఈ సమావేశంలో మండలి చీఫ్ విప్ సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్, జేసీటీయూ నాయకులు రఘనందన్, అంజిరెడ్డి, రఘుశంకర్‌రెడ్డి, మల్లయ్య, అంజిరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, చెన్నకేశవరెడ్డి, సదానంద్ గౌడ్, చావ రవి, మైస శ్రీనివాస్, ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం ప్రధాన కార్యదర్శి వీరాచారి తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే పరిష్కారిస్తాం: మంత్రి ఈటల రాజేందర్ ఉద్యోగ, ఉపాధ్యాయుల డిమాండ్లను ఐదు రకాలుగా విభజించాం. అందులో ఒకటి రొటీన్‌గా చేయాల్సినవి. బదిలీలు, పదోన్నతులు, విద్యార్థులు ఉన్న చోటికి టీచర్లను పంపించడం. వీటి పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉంది. రెండోది న్యాయ వివాదాలతో ముడిపడిన అంశాలు. ముఖ్యంగా సర్వీసు రూల్స్ అంశం కోర్టులో ఉంది. ఇందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టే రాష్ట్రపతి ఆమోదం తీసుకువచ్చాం. సీఎం దృష్టికి తీసుకువెళ్లి కేసుపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిని నియమిస్తాం. మూడోది పాఠశాలల్లో సదుపాయాల కల్పన. ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇంకా> చేస్తాం. నాలుగోది ఆర్థిక భారంతో కూడిన అంశాలు. ఎన్టీఆర్ హయాంలో రూ.398 వేతనంతో నియమించిన టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇచ్చే అంశంపై సానుకూలంగా ఉన్నాం. పీఆర్సీ నియామకం చేయాల్సిందే. దానిపై సానుకూలంగా ఉన్నాం. ఐదో అంశం సీపీఎస్. దీనిపై ముఖ్యమంత్రికి అవగాహన ఉంది. గత ప్రభుత్వాలు వెట్టి చాకిరీ చేయించుకున్నాయి. ఇప్పుడు అలా లేదు. ఉద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాం. కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలను పెంచాం. పండిట్, పీఈటీ సమస్యలు పరిష్కరిస్తాం. ప్రభుత్వం, ఉద్యోగులు వేర్వేరు కాదు. రాబోయే కాలంలో ఈ సంబంధం మరింత బలోపేతమై కొనసాగుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభంలోగా వీలైనన్ని సమస్యలు పరిష్కరిస్తాం. సానుకూలంగా స్పందించారు: సరోత్తంరెడ్డి, పీఆర్టీయూ–టీఎస్ అధ్యక్షుడు సీపీఎస్ రద్దుపై సీఎంతో చర్చిద్దామని చెప్పారు. ఏకీకృత సర్వీసు రూల్స్ అంశం హైకోర్టులో ఉంది. సుప్రీం న్యాయవాదిని నియమించి జూన్ 6న వాదనలు వినిపించాలని కోరాం. అందుకు సానుకూలంగా స్పందించారు. బదిలీలు, పదోన్నతులు పాఠశాలలు ప్రారంభం కావడానికి ముందే చేపట్టాలని, అందుకు న్యాయపరమైన ఇబ్బందులు ఉంటే ఆయా అంశాలపై దృష్టి సారించాలన్నాం. 2003 డీఎస్సీ టీచర్ల సమస్యపై చర్చించాం. వేసవిలో మధ్యాహ్న భోజనం విధులు నిర్వర్తించిన టీచర్లకు 24 రోజుల ఈఎల్స్పై చర్చించాం. కమిటీ ప్రతి సమస్యను పరిష్కరించేలా సానుకూలంగా స్పందించింది. 34 డిమాండ్లలో ఒకటే పరిష్కారం అయింది. మిగతా వాటిని పరిష్కరించాలని విన్నవించాం. ఎయిడెడ్, కేజీబీవీ మోడల్ గిరిజన టీచర్ల సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లాం. పాత జిల్లాల ప్రకారం బదిలీలకు ఒకే: భుజంగరావు, ఎస్టీయూ అధ్యక్షుడు త్వరలో సీఎంతో సమావేశం నిర్వహించేందుకు ఓకే చెప్పారు. ఆర్థిక పరమైన సమస్యలపైనా సీఎంతో చర్చిద్దామన్నారు. కచ్చితంగా బదిలీలను పాత జిల్లాల ప్రకారమే చేస్తామని హామీ ఇచ్చారు. హెచ్ఎంలకు అదనపు బాధ్యతలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఒక్క స్కూల్ ఉండేలా చూడమని కోరాం. ఎస్సీ, ఎస్టీ టీచర్లకు ఉన్నత చదువులకు వెళ్లే ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. మేనేజ్మెంట్ వారీగా పదోన్నతులను హెడ్ మాస్టర్లకే పరిమితం చేయకుండా కిందిస్థాయి టీచర్ల వరకు వర్తింపజేయాలని కోరాం. పీఆర్సీ ఏర్పాటుకు ఓకే: నర్సిరెడ్డి, యూటీఎఫ్ అధ్యక్షుడు వీటిని ప్రాథమిక చర్చలుగా భావిస్తున్నాం. సానుకూల దృక్ఫథంతో ఉన్నాం. పాఠశాలల అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రికి పూర్తి అధికారాలు ఇవ్వాలన్నాం. ఆర్థిక సమస్యల విషయంలో మాత్రమే సీఎం చొరవ తీసుకొని వెంటనే చర్యలు చేపట్టాలి. పీఆర్సీ, ఐఆర్ ఇస్తామన్నారు. స్వాగతిస్తున్నాం. -
ఉపాధ్యాయులకు తీపి కబురు
టీచర్ల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ షురూ 27 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు 5 నుంచి 16 వరకు బదిలీలు, పదోన్నతులు 249 మందికి పదోన్నతి జిల్లాలో 350 వరకు మిగులు పోస్టులు ఆదిలాబాద్ టౌన్ : మూడేళ్లుగా బదిలీలు, పదోన్నతుల కోసం నిరీక్షిస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఎట్టకేలకు పదోన్నతులు లభించనున్నాయి. ఉపాధ్యాయుల బదిలీ, పదోన్నతుల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమైంది. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 22 నుంచి 27వరకు ఆన్లైన్లో బదిలీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బదిలీలకు సంబంధించిన ఖాళీలను సోమవారం ప్రకటించాల్సి ఉండగా.. సాయంత్రం వరకు అధికారులు ఖాళీలు ప్రకటించలేదు. ఇందుకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు, ఉద్యోగులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఖాళీలకు సంబంధించిన తుది జాబితాను ఈ నెల 26న ప్రకటించనున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28, 29వ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన, 30న సీనియార్టీ జాబితా విడుదల చేయాల్సింది. జూలై 1న అభ్యంతరాల స్వీకరణ, 2, 3వ తేదీల్లో అభ్యంతరాలపై విచారణ చేపడుతారు. జూలై 4న చివరి సారిగా ఖాళీల ప్రకటన చేయనున్నారు. 5న ప్రధానోపాధ్యాయుల బదిలీ ప్రక్రియ, 7 నుంచి 9 వరకు స్కూల్ అసిస్టెంట్, ఎల్ఎఫ్ఎం హెచ్ఎంల బదిలీలు, 12 నుంచి 16 వరకు ఎస్జీటీల బదిలీలు నిర్వహించనున్నారు. కాగా, బదిలీ కొరుకునే ఉపాధ్యాయులకు కనీస అర్హత రెండేళ్లుగా నిర్ణయించారు. ప్రధానోపాధ్యాయులకు గరిష్ట కాలం ఐదేళ్లు, ఇతర కేటగిరీల ఉపాధ్యాయులకు ఎనిమిదేళ్లుగా నిర్ణయించారు. జిల్లాలో దాదాపు 2 వేల మందికి స్థాన చలనం జరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. 249 మంది టీచర్లకు పదోన్నతులు.. జిల్లాలో 249 మంది ఉపాధ్యాయులకు పదోన్నతి లభించన్నుట్లు విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. జూలై 6న స్కూల్ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారికి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి లభించనుంది. ఎస్జీటీ కేటగిరీలో ఉపాధ్యాయులకు 10, 11వ తేదీల్లో స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతి ప్రక్రియ చేపట్టనున్నారు. మిగులు పోస్టులు.. ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ జీవో ప్రకారం జిల్లాలో 350 వరకు ఉపాధ్యాయ పోస్టులు మిగులుగా ఉన్నాయి. 0 నుంచి 30 మంది విద్యార్థులున్న ప్రాథమిక పాఠశాలల్లో ఒక ఉపాధ్యాయున్ని మాత్రమే ఉంచి మిగిత పోస్టులను విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న పాఠశాలలకు బదిలీ చేయనున్నారు. 50 మంది విద్యార్థుల సంఖ్య కన్న తక్కువ ఉన్న పాఠశాలలను సమీపంలోని పాఠశాలల్లో విలీనం చేయనున్నారు. దీంతో ప్రాథమిక పాఠశాల పరిస్థితి అధ్వానంగా మారనుంది. పేద విద్యార్థులకు అన్యాయం జరగనుంది. -
ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి
-
ఐదేళ్లు దాటితే బదిలీ తప్పనిసరి
- నేటి నుంచి బదిలీల జాతర - మార్గదర్శకాలు విడుదల హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల బదిలీలకు తెరలేచింది. ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఒకేచోట రెండేళ్లు పూర్తి చేసిన వారిని పరిపాలన అవసరం మేరకు బదిలీ చేస్తారు. జిల్లా ఇన్చార్జి మంత్రి చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్, సంబంధిత జిల్లా శాఖాధిపతి సభ్యులుగా ఉద్యోగుల బదిలీలకు జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు (జీవో ఎంఎస్ 57) జారీ చేసింది. సోమవారం (18వ తేదీ) నుంచి ఈ నెల 31వ తేదీ వరకు బదిలీలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆ మధ్య సమయంలో బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జీవో సోమవారం రాత్రి విడుదల కావడంతో మంగళవారం నుంచి బదిలీల జాతర ప్రారంభం కానుంది. ఇవీ బదిలీల మార్గదర్శకాలు.. - ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరి. ఈ ఏడాది జూన్ 30లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులను బదిలీ చేయరాదు. ఒకే చోట రెండేళ్లు పనిచేయని వారినీ బదిలీ చేయరాదు. - ఒకే చోట రెండేళ్లు పూర్తి అయిన ఉద్యోగులను పరిపాలన అవసరాలు లేదా ఇతర కారణాలతో బదిలీ అవకాశం. - రెండేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను బదిలీ చేయాలంటే 40% వికలాంగులై ఉండాలి, భార్య, భర్తల కేసులో ఒకరికే అవకాశం. - కేన్సర్, ఓపెన్ హార్ట్సర్జరీ, న్యూరోసర్జరీ వంటి చికిత్సల్లో కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే, ఆ ఉద్యోగులు కోరిన చోటుకు.. - మానసిక వైకల్యం గల పిల్లలు ఎవరైనా చికిత్స పొందుతుంటే సంబంధిత ఉద్యోగులు కోరిన చోటుకు.. - ఉన్నత, గెజిటెడ్ స్థాయి అధికారులకు సొంత జిల్లాల్లో, ఇతర ఉద్యోగులకు సొంత మండలాల్లో పోస్టింగ్ ఇవ్వరాదు. సొంత జిల్లా అనేది సర్వీసు రిజిష్టర్ ప్రామాణికం. - పదోన్నతిపై ఏదైనా ఉద్యోగి బదిలీ కావాల్సి వస్తే, బదిలీ అయ్యే చోట పోస్టు లేకుంటే బదిలీ చేయరాదు. - బదిలీ చేసిన ఉద్యోగి ఐదు పనిదినాల్లోగా రిలీవ్ కావడంతో పాటు బదిలీ చేసిన చోటుకు వెళ్లి చేరాలి. - వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, ట్రెజరీ, రవాణా రంగాల ఉద్యోగుల బదిలీలకు ఈ ఉత్తర్వులు వర్తిం చవు. వీరికి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు. - పాఠశాల, ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ రంగాల్లోని ఉద్యోగులు, వైద్యులకు, ఉపాధ్యాయలకు, అధ్యాపకులకు బదిలీలకు ఈ ఉత్తర్వులు వర్తించవు. వారికి విడిగా ఉత్తర్వులు జారీ చేస్తారు.