trigger
-
ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్ షార్ట్ ఫిలిం
-
మహిళా బ్యాంకుల విలీనానికి రంగం సిద్ధం?
2013లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేసిన భారతీయ మహిళా బ్యాంక్ (బిఎంబి)ను స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయాలని ఆర్థికశాఖ భావిస్తోంది. గత ఏడాది వార్తల్లో నిలిచిన ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మహిళా సాధికారిత కోసం మాజీప్రధాని మన్మోహన్ సింగ్ ప్రారంభించిన మహిళా బ్యాంకుల (బిఎంబి) విలీనానికి రంగం సిద్ధమైనట్టు కనిపిస్తోంది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా, విలీనానికి కేంద్రం శరవేగంగా పావులు కదుపుతోంది. దీంతో ఇది బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య రాజకీయ వివాదంగా మారనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బీఎంబీల విలీన అంశాన్ని పరిశీలిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి తెలిపారు. అటు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చిన బ్యాంక్స్ బోర్డు బ్యూరో (బీబీబీ) కూడా దీనిపై దృష్టిపెట్టింది. అయితే దీన్ని పూర్తిగా వ్యతిరేకించిన మాజీ ఆర్థికమంత్రి చిదంబరం ఇది భయంకరమైన ఆలోచని అని విమర్శించారు. యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన బ్యాంకు కావడంవల్లే విలీన ప్రతిపాదన వెనక్కి తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. మరోవైపు బీఎంబీ వర్గాల నుంచి దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. తమ బ్యాంకుల భవితవ్యంపై నిర్ణయాన్ని త్వరగా తేల్చాలని బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్ఎం స్వాతి చెప్పారు. ఈ అనిశ్చిత పరిస్థితి కొనసాగితే దీని ప్రభావం ఉద్యోగులపైనా, బ్యాంకులపైనా పడుతుందన్నారు. ఒకపక్క బ్యాంకులకు లైసెన్సులు ఇస్తూ, ఉన్న బ్యాంకులను విలీనం చేయడంపై బ్యాంకు సీనియర్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశంలో సముచిత వ్యాపారాలు నిర్వహించడానికి ఎక్కువ బ్యాంకులు అవసరమైనపుడు బీఎంబీతో సమస్య ఏంటని ప్రశ్నించారు. లాంచింగ్ తరువాత భారతీయ మహిళాబ్యాంకు విశిష్టతను కోల్పోయిందని, కస్టమర్లు, ఉద్యోగులు అందరూ పురుషులే ఉన్నారని ప్రధాన మేనేజింగ్ భాగస్వామి అశ్వినీ పరేఖ్ వ్యాఖ్యానించారు. కాగా గతంలో ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా విలీనంపై సానుకూలంగా స్పందించారు. క్యాబినెట్లో చర్చించి దీనిపై నిర్ణయం తీసుకోవాలని, భారతీయ మహిళా బ్యాంక్‌ను విలీనం చేసుకోవడానికి తమకెలాంటి ఇబ్బంది లేదని, కాకపోతే బిఎంబి చాలా చిన్న సంస్ధ అని అభిప్రాయపడ్డారు. -
ఎలక్ట్రానిక్ సిగరెట్లతోనూ ప్రమాదమే!
లండన్ః ఇటీవల అందుబాటులోకి వచ్చిన ఎలక్ట్రానిక్ సిగరెట్ గురించి వినే ఉంటారు. ధూమపాన ప్రియులకు ప్రత్యామ్నాయంగా ఈ ఇ-సిగరెట్ ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఆధునిక పరిజ్ఞానం కూడ ఒక్కోసారి నష్టాన్నే తెచ్చి పెడుతుందంటున్నారు తాజా పరిశోధకులు. సిగరెట్ వ్యసనం మానుకోవాలనుకునే వారికోసం సృష్టించిన ఇ-సిగరెట్లలో పొగాకు కు బదులుగా ఆవిరితో తయారయ్యే నికోటిన్ కలిసిన పొగతో ఎలక్ట్రానిక్ సిగరెట్ అందుబాటులోకి తెచ్చారు. అయితే ధూమపానం మానేయాలనుకునే వారికోసం కనిపెట్టిన వీటివల్ల కూడ అనేక అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం ఇ-సిగరెట్ల ను రద్దు చేసే యోచనలో పడింది. పొగరాయుళ్ళకు నికోటిన్ తో కూడిన నీటి ఆవిరిని పీల్చే పద్ధతిలో ఉపశమనాన్ని కలిగిస్తున్న ఇ-సిగరెట్లు తీవ్ర అనారోగ్యాలకు దారి తీస్తాయని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. పొగాకుతో తయారు చేసిన సిగరెట్ల వాడకాన్ని మానుకునే క్రమంలో లండన్ యువత ఎలక్ట్రానిక్ సిగరెట్లను ఆశ్రయిస్తున్నారని, ఇకపై వీటినికూడ వైద్యుల సలహా మేరకు తప్పించి వాడవద్దని అధికారులు ఆంక్షలు విధిస్తున్నారు. తక్కువ ధరలో దొరకడమే కాక, క్యాన్సర్ వంటి ఇతర సమస్యలకు దారి తీయకుండా ఉంటుందన్న ఆలోచనలో ఇ-సిగరెట్లను పరిచయం చేశారు. అయితే వీటి వాడకం కూడ అధికం అవ్వడంవల్ల సమస్యలు తలెత్తుతాయని, ఊపిరితిత్తులపై ప్రత్యక్ష ప్రభావం పడుతోందని సైంటిస్టులు చెప్తున్నారు. యువత అత్యధికంగా ఇ-సిగరెట్లకు బానిసలౌతున్నారంటూ పరిశోధకులు తమ అధ్యయనాల వివరాలను బీఎంసీ పబ్లిక్ హెల్గ్ ఓపెన్ యాక్సెస్ జర్నల్ లో ప్రచురించారు. వయోజనులు ధూమపాన వ్యసనాన్ని తగ్గించుకునేందుకు పరిచయం చేసిన ఇ-సిగరెట్లు యువతకు నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయని, ఈ విషయాన్ని పాలసీ మేకర్లు పరిగణలోకి తీసుకోవాలని బ్రిటన్ లోని స్టిర్లింగ్ విశ్వవిద్యాలయానికి చెందిన కాథరిన్ బెస్ట్ చెప్తున్నారు. స్కాట్లాండ్ లోని ఉన్నత పాఠశాలల్లో ఇ-సిగరెట్ల అంశంపై సర్వే నిర్వహించారు. దీనిలో 11 నుంచి 18 ఏళ్ళ మధ్య వయసున్న విద్యార్థుల్లో కొందరు వాటి గురించి విన్నామని, కొందరు ఇప్పటికే ఉపయోగించి చూశామని, మరి కొందరు మరో ఆర్నెల్లలో ప్రయత్నిద్దామనుకుంటున్నామని తెలిపారు. దీన్నిబట్టి భవిష్యత్తులో ఇ-సిగరెట్ల వాడకం మరింత పెరిగే అవకాశం ఉందని.. దీంతో క్రమంగా నికోటిన్ కు అలవాటుపడిన వారు మామూలు పొగాకు సిగరెట్లవైపు కూడ మొగ్గు చూసే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.