triple hundred
-
40 బంతుల్లో శతక్కొట్టిన టీమిండియా ట్రిపుల్ సెంచూరియన్
వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత టెస్ట్‌ల్లో భారత్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన కరుణ్ నాయర్.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న మహారాజా టీ20 టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే లీడింగ్ రన్‌స్కోరర్‌గా కొనసాగుతున్న నాయర్.. గుల్భర్గా మిస్టిక్స్‌తో ఇవాళ (ఆగస్ట్ 28) జరుగుతున్న రెండో సెమీఫైనల్లో 40 బంతుల్లోనే శతక్కొట్టి, తన జట్టు (మైసూర్ వారియర్స్) భారీ స్కోర్ సాధించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 42 బంతులు ఎదుర్కొన్న నాయర్.. 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 107 పరుగులు చేసి, అజేయంగా నిలిచాడు. నాయర్‌కు ఆర్ సమర్థ్ (50 బంతుల్లో 80; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), ఎస్ కార్తీక్ (23 బంతుల్లో 41; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేసిన మైసూర్ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 248 పరుగుల భారీ స్కోర్ చేసింది. Karun Nair continues his dream run in the Maharaja T20 League 2023. pic.twitter.com/MojOUiPtim — CricTracker (@Cricketracker) August 28, 2023 నాయర్ విధ్వంసం ధాటికి గుల్భర్గా బౌలర్లు అభిలాష్ షెట్టి (4-0-63-1), విజయ్‌కుమార్ వైశాక్ (4-0-45-0), అవినాశ్ (3.4-0-44-1), నొరోన్హా (2-0-36-0) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనంతరం 249 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన గుల్భర్గా.. 9 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గుల్భర్గా ఇన్నింగ్స్‌లో చేతన్ 28, ఆనీశ్ 23, నొరోన్హా 39 నాటౌట్, స్మరణ్ 0, అమిత్ వర్మ 11, హసన్ ఖలీద్ 4 నాటౌట్ పరుగులు చేశారు. మైసూర్ బౌలర్లలో జగదీశ సుచిత్ 2, మోనిశ్ రెడ్డి, గౌతమ్ మిశ్రా తలో వికెట్ పడగొట్టారు. ఇదిలా ఉంటే, టెస్ట్‌ల్లో భారత్ తరఫున సెహ్వాగ్ 2, కరుణ్ నాయర్ ఓసారి ట్రిపుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. సెహ్వాగ్ 2004లో పాకిస్తాన్‌పై తన తొలి ట్రిపుల్ సెంచరీని (309) (భారత్ తరఫున మొట్టమొదటిది), 2008లో సౌతాఫ్రికాపై తన రెండో ట్రిపుల్ హండ్రెడ్ను (319) బాదాడు. ఆ తర్వాత 2016లో కరుణ్ నాయర్ ఇంగ్లండ్‌పై చెన్నైలో ట్రిపుల్ సెంచరీని (303 నాటౌట్) సాధించి, భారత్ తరఫున టెస్ట్‌ల్లో సెహ్వాగ్ తర్వాత ఆ ఘనత సాధించిన రెండో క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. -
చరిత్ర సృష్టించిన షోయబ్ మాలిక్ మేనల్లుడు.. అరుదైన రికార్డు
కరాచీ: పాకిస్థాన్ వెటరన్ ఆల్‌రౌండర్ షోయబ్ మాలిక్, భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా మేనల్లుడు మహమ్మద్ హురైరా పాకిస్థానీ దేశవాళీ టోర్నీలో ట్రిపుల్ సెంచరీతో విధ్వంసం సృష్టించాడు. ఖైద్ ఏ ఆజమ్ ట్రోఫీలో భాగంగా నార్తర్న్ జట్టు తరఫున బరిలోకి దిగిన 19 ఏళ్ల హురైరా.. బలూచిస్థాన్‌పై అజేయ త్రిశతకం(341 బంతుల్లో 311 నాటౌట్; 40 ఫోర్లు, 4 సిక్సర్లు) సాధించి, అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన రెండో పాకిస్థానీ క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు. హురైరాకు ముందు పాక్ లెజెండరీ క్రికెటర్ జావెద్ మియాందాద్ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ 1975లో 17 ఏళ్ల 310 రోజుల్లో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. హురైరా 19 ఏళ్ల 239 రోజుల వయసులో ఆ ఘనత సాధించాడు. ఓవరాల్‌గా పాకిస్థాన్ గడ్డపై ఇది 23వ ట్రిపుల్ సెంచరీ కాగా, ఆ ఘనత సాధించిన 22వ ఆటగాడిగా హురైరా నిలిచాడు. పాక్‌లో త్రిశకం బాదిన ఆటగాళ్లలో మైక్ బ్రేర్లీ(ఇంగ్లండ్), మార్క్ టేలర్(ఆసీస్), వీరేంద్ర సెహ్వాగ్(భారత్) ఉన్నారు. చదవండి: మూడు ఫార్మాట్లతో పాటు ఐపీఎల్‌లోనూ అతడే.. ప్రపంచ క్రికెట్లో ఒకే ఒక్కడు Northern's Mohammad Huraira who scored his maiden triple-century in the Quaid-e-Azam Trophy 2021-22 final-round clash against Balochistan talks about his heroic effort. #QeAT #HarHaalMainCricket pic.twitter.com/dz7n3MkZN7 — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 MONUMENTAL EFFORT! 19-year-old Mohammad Huraira becomes the second youngest Pakistan batter to score a first-class triple century! 👏👏#HarHaalMainCricket pic.twitter.com/QtYRKDRCKT — Pakistan Cricket (@TheRealPCB) December 20, 2021 -
జడేజా చెప్పాక ట్రిపుల్ గురించి ఆలోచించా
న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో చెన్నై టెస్టులో అజేయ ట్రిపుల్ సెంచరీ చేశాక టీమిండియా యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ స్టార్ క్రికెటర్ అయ్యాడు. ఈ ఘనత సాధించిన రెండో భారత క్రికెటర్‌గా కరుణ్ తన మూడో టెస్టులోనే రికార్డు నెలకొల్పడం విశేషం. తద్వారా టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే దిశగా ముందడుగు వేశాడు. అందరూ దీని గురించి మాట్లాడుకోవడం మొదలెట్టిన తర్వాత తన ట్రిపుల్ సెంచరీ విలువ అర్థమైందని కరుణ్ చెబుతున్నాడు. ఓ ఇంటర్వ్యూలో అతను పలు విషయాలు వెల్లడించాడు. ‘కుటుంబ సభ్యులు, టీమ్ మేనేజ్మెంట్ ఎంతో మద్దతుగా నిలిచారు. ట్రిపుల్ సెంచరీ చేశాక ఎంతో మంది అభినందించారు. గతంతో పోలిస్తే ప్రత్యేకంగా చూస్తున్నారు. అభినందిస్తూ చాలా మెసేజ్‌లు వచ్చాయి. ఈ సంతోష క్షణాలను ఆస్వాదించాను. అభినందనలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు. మ్యాచ్ లో సెంచరీ చేశాక ఒత్తిడి నుంచి బయటపడ్డాను. జట్టుకు ఆధిక్యం లభించాక స్వేచ్ఛగా ఆడాల్సిందిగా నాకు సూచనలు వచ్చాయి. ట్రిపుల్ సెంచరీ చేయడానికి జట్టు సూచనలు ఉపయోగపడ్డాయి. నా శైలిలో స్వేచ్ఛగా షాట్లు ఆడా. నేను 280 పరుగులు చేశాక ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశముందని బ్యాటింగ్ పార్టనర్ రవీంద్ర జడేజా చెప్పాడు. దీంతో చేయగలననే ఆలోచన వచ్చింది. ఆ తర్వాత ట్రిపుల్ కోసం ఆడాను. ట్రిపుల్ సెంచరీ చేశాక డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ సంతోషంగా స్వాగతం పలికారు. ట్రిపుల్ సెంచరీ చేసిన రోజు సంబరాలు చేసుకోలేదు. మరుసటి రోజు మ్యాచ్ గెలిచిన తర్వాత సంబరాలు చేసుకున్నాం. అనిల్ కుంబ్లే పిలవడం వల్ల మా తల్లిదండ్రులు ఈ మ్యాచ్‌ను చూసేందుకు స్టేడియానికి వచ్చారు. అమ్మనాన్నలు ట్రిపుల్ సెంచరీని ప్రత్యక్షంగా చూసినందుకు సంతోషంగా ఉంది’ అని నాయర్ చెప్పాడు.