TRS pleenary
-
అమరవీరులకు నివాళి.. తెలంగాణ తల్లికి పుష్పాంజలి
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశాలు శుక్రవారం ఉదయం 11:30 గంటలకు ఘనంగా ప్రారంభమయ్యాయి. సభా వేదికపై ఏర్పాటు చేసిన పార్టీ జెండాను అధ్యక్షుడు కేసీఆర్ ఆవిష్కరించడంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. అనంతరం అమరవీరులకు నివాళి అర్పించిన ఆయన తెలంగాణ తల్లికి పుష్పాంజలి ఘటించారు. తర్వాత అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ సభ నిమిషం పాటు మౌనం పాటించింది. అనంతరం పార్టీ ప్రధాన కార్యదర్శి బస్వరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు. ‘‘కేసీఆర్ నేతృత్వంలో నడుంబిగించి సుభిక్షమైన రాష్ట్రంలో సగర్వంగా తలెత్తుకుని జీవిస్తున్నాం. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరిలో సంతోషం కనిపిస్తోంది. 2001లో స్వరాష్ట్రం కోసం నడుంబిగించినట్టే ఇప్పుడు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ప్రయత్నిస్తున్న నాయకుడికి అండగా నిలవాలి.’అని ఆయన అన్నారు. సభ పెట్టిన్రా... సర్కస్ పెట్టిన్రా సౌండ్ సిస్టమ్ సరిగా పనిచేయకపోవడంతో కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. బస్వరాజు మాట్లాడిన వెంటనే కేసీఆర్ మైక్ తీసుకొని.. ‘సారయ్య మాట్లాడింది ఎవరికైనా అర్థం అయిందా?’అని సభికులను ప్రశ్నించారు. మైకుల నుంచి ఎందుకు రీసౌండ్ వస్తోందని ప్రశ్నించారు. వెంటనే వేదికపై ఉన్న ఏసీలు బంద్ చేయించి సౌండ్ సిస్టం సరిచేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కళ్లల్లోకి కొడుతున్న లైట్లను ఆపేయాలని సూచించారు. కొంతసేపటి తర్వాత కూడా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ‘ఏం తమాషానా.. సభ పెట్టిన్రా.. సర్కస్ పెట్టిన్రా’అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత మైకులు సరిచేయడంతో సభా కార్యకలాపాలు కొనసాగాయి. ముందు వరుసలో మంత్రులు సభావేదికపై కేసీఆర్‌తోపాటు ముందు వరుసలో మంత్రులు ఆసీనులయ్యారు. పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు ముందు వరుసలోనే కూర్చున్నారు. వెనుక వరుసల్లో పార్టీ పదవుల్లో ఉన్న నేతలు కూర్చున్నారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలందరూ ప్రతినిధుల గ్యాలరీల్లోనే కూర్చున్నారు. రాష్ట్ర మంత్రులు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వేలాది మంది ప్రతినిధులు హాజరయ్యారు. కవిత సెల్ఫీల హంగామా ఉదయం 10:30 గంటల సమయంలో సభా ప్రాంగణానికి చేరుకున్న నిజామాబాద్ ఎంపీ కవిత సెల్ఫీలతో హంగామా చేశారు. సభా ప్రాంగణమంతా కలియ తిరుగుతూ కార్యకర్తలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, వలంటీర్లు ఆమెతో సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం కనబరిచారు. అందరితో ఓపిగ్గా సెల్ఫీలు దిగిన కవిత ప్రతినిధుల మధ్యనే కూర్చున్నారు. ప్రత్యేక ఆకర్షణగా మంగ్లీ ప్లీనరీ సమావేశాలకు రేలారే రేలారే ఫేం మంగ్లీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ధూంధాం నిర్వహించిన పాటల కార్యక్రమంలో ఆమె ‘రేలారే రేలారే..’పాటతోపాటు కేసీఆర్‌పై ప్రత్యేకంగా రాసిన పాటను పాడి అలరించారు. రసమయి నేతృత్వంలోని కళాకారుల బృందం ఆటపాటలతో సభికులను ఆకట్టుకున్నారు. అన్ని వసతులు.. ప్లీనరీకి హాజరైన ప్రతినిధులకు అన్ని సౌకర్యాలు కల్పించారు నిర్వహకులు. మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. మహిళల కోసం ప్రత్యేక గ్యాలరీతో పాటు భోజన ఏర్పాట్లు చేశారు. పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, పోలీసు సిబ్బంది, ప్రతినిధులకు విడివిడిగా భోజన ఏర్పాట్లు చేశారు. అయితే ప్రతినిధులకు ఏర్పాటు చేసిన భోజనశాలల వద్ద చివర్లో హడావుడి కనిపించింది. అన్నం అయిపోవడం, ప్లేట్లు లేకపోవడంతో ప్రతినిధులు భోజనం కోసం కాసేపు నిరీక్షించాల్సి వచ్చింది. -
ఒక్కరోజే రూ.20.4 కోట్లు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీకి ఒక్కరోజే రూ.20.41 కోట్ల విరాళాలు వచ్చాయి. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల నుంచి ఈ విరాళాలు అందాయి. శుక్ర వారం హైదరాబాద్‌లోని కొంపల్లిలో జరిగిన పార్టీ ప్లీనరీలో విరాళాలను ప్రకటించారు. ఇప్పటివరకు రూ.42.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు తెలిపారు. విరాళాలు అందించిన నేతల పేర్లను కేసీఆర్ చదివి వినిపించారు. పార్టీ సభ్యత్వం, ఇతర వనరుల ద్వారా రూ.50 కోట్లకు పైగా గతంలోనే వసూలయ్యాయని వెల్లడించారు. అందులో మరణించిన కార్యకర్తల జీవిత బీమా కింద రూ.20 కోట్లు ఖర్చు కాగా, మరికొంత డబ్బు స్టేషనరీ తదితర అవసరాలకు ఖర్చు అయినట్లు తెలిపారు. అందులో రూ.21.67 కోట్లు మిగిలాయని, శుక్రవారం అందిన విరాళాలు కలుపుకొని పార్టీ మొత్తం ఆదాయం రూ.42 కోట్లు ఉందని చెప్పారు. విరాళాలివీ.. ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.2 కోట్లు. సి.మల్లారెడ్డి (మల్కాజిగిరి ఎంపీ), రాజశేఖర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, సరోజా వివేక్, ఎండీ సలీం, నితిన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, భాను ప్రసాద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు రూ.కోటి చొప్పున. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 75 లక్షలు, ఎంపీ పాటిల్ 51 లక్షలు, దండె విఠల్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కొత్త మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు రూ.50 లక్షలు. గంగుల కమలాకర్, వి.వెంకటేశ్వర్రావు, కె.నారాయణరెడ్డి, రామ్మోహన్రావు, పి.శ్రీనివాస్‌రెడ్డి, జి.సుధారాణి, సంపత్‌కుమార్, మహేశ్ బిగాల, రాజేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆరూరి రమేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు 25 లక్షలు. -
హర్షధ్వానాల మధ్య ఆరు తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 17వ ప్లీనరీలో మొత్తం ఆరు తీర్మానాలను ప్రవేశపెట్టారు. ఎంపీ కె.కేశవరావు ‘దేశ రాజకీయ వ్యవస్థలో గుణాత్మక మార్పు కోసం ఉద్యమం’పేరుతో మొదటి తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎంపీ వినోద్‌తోపాటు టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ బలపరిచారు. సంక్షేమంపై ఎమ్మెల్యే రసమయి రెండో తీర్మానాన్ని ప్రతిపాదించగా.. టీఆర్ఎస్ నేత గట్టు రామచందర్‌రావు బలపరిచారు. ఈ సందర్భం గా రసమయి మాట్లాడుతూ.. ‘‘గత ప్రభుత్వాల మేనిఫెస్టోలు చూశాం. ఆ మేనిఫెస్టోల్లో పెట్టిన అంశాలు కేవలం కాగితాలకు మాత్రమే పరిమితం అయ్యాయి. కానీ టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేసి చూపిస్తున్నాం. రూ.40 వేల కోట్లతో 40 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వమిది. ఎవరికీ ఆలోచన రాని విధంగా.. మానవీయ కోణంలో ఆలోచించి అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు’’అని పేర్కొన్నారు. ఆ ఘనత కేసీఆర్‌దే.. వ్యవసాయ విధానంపై ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మూడో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మహబూబాబాద్ ఎంపీ సీతారాంనాయక్ బలపరిచారు. రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వ్యవ సాయాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించారన్నారు. ఈ ఏడాది నుంచి ఎకరాకు రూ.8 వేలు పంట పెట్టుబడి ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు పం ట రుణాలను మాఫీ చేసిన ఘనత కేసీఆర్‌దేన్నారు. ప్రభు త్వం రైతులకు 24 గంటల కరెం ట్ ఇస్తోందని, పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిందని కొనియాడారు. మైనార్టీల సంక్షేమంపై బోధన్ ఎమ్మెల్యే షకీల్ నాలుగో తీర్మానం ప్రతిపాదించగా.. ఇంతియాజ్ అహ్మ ద్ బలపరిచారు. షకీల్ మాట్లాడుతూ.. గత ప్ర భుత్వాలు ముస్లింలను ఓటు బ్యాంకుగా వాడు కున్నాయని, కానీ సీఎం కేసీఆర్ వారికోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని తెలిపారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు భగీరథ మౌలిక సదుపాయాల కల్పనపై పద్మాదేవేందర్‌రెడ్డి ఐదో తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఈ తీర్మానాన్ని ఎమ్మెల్యే వివేకానందగౌడ్ బలపరిచారు. పద్మాదేవేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆడబిడ్డల గోస తీర్చేందుకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచినీరు అందించబోతున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌కు తెలంగాణ ఆడబిడ్డలు ఎప్పుడూ రుణపడి ఉంటారన్నారు. టీఎస్ఐపాస్తో పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. టీ హబ్ ఇంక్యుబేటర్ వల్ల స్టార్టప్ కంపెనీలు ఏర్పాటవుతున్నాయని, ద్వితీయ శ్రేణి నగరాలకూ ఐటీ కంపెనీలను విస్తరిస్తామన్నారు. చివరగా పాలనా సంస్కరణలపై ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆరో తీర్మానాన్ని ప్రవేశపెట్టగా మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డి బలపరిచారు. -
దేశానికి దిశను చూపే ప్లీనరీ
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాలకు దిశ దశను నిర్దేశించే విధంగా టీఆర్ఎస్ 17వ ప్లీనరీ ఉంటుందని హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి టీఆర్ఎస్ ప్లీనరీ వేదిక వద్ద మీడియా సెంటర్‌ను మంగళవారం ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 2001లో ఏప్రిల్ 27న ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఎన్నో అవమానాలను, ఆటుపోట్లను ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించిందని అన్నారు. టీఆర్ఎస్ది సెక్యులర్ ప్రభుత్వమని, తెలంగాణలో అన్నివర్గాలు సామరస్యంగా జీవిస్తున్నాయని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామాకాలు నినాదంతో తెలంగాణ ఉద్యమం సాగిందని, వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని సీఎం కేసీఆర్ ఎక్కడా చెప్పలేదని నాయిని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోబోమని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి పథకాలతో కాంగ్రెస్ పార్టీ కాళ్ల కింద భూమి కదులుతోందని అన్నారు. ప్రధాని మోదీ మీద భ్రమలు తొలగిపోయాయని, కాంగ్రెస్, బీజేపీల తీరు చూసే దేశంలో గుణాత్మక మార్పు రావాలని కేసీఆర్ కోరుకుంటున్నారని చెప్పారు. దేశంలోనే నంబర్ వన్: మహమూద్ అలీ తెలంగాణ దేశంలో అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా నిలిచిందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న అభివృద్ధి పథకాలను దేశం అంతటా ఆదరణ లభిస్తున్నదన్నారు. ఏ రాష్ట్రం వెళ్లినా ప్రజలు సీఎం కేసీఆర్ పాలనను, తెలంగాణ అభివృద్ధిని కొనియాడుతున్నారని చెప్పారు. రైతులకు రూ.12 వేల కోట్లతో పెట్టుబడి సాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసిందని, ఇది రైతు ప్లీనరీ అని శాసనమండలిలో ప్రభుత్వ విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రదర్శించబోయే సాంస్కృతిక కార్యక్రమా లకు రిహార్సల్స్ మంగళవారం ప్రారంభమయ్యాయి. కొంపల్లిలోని గార్డెన్లో మూడు రోజులపాటు ఈ రిహార్సల్స్ కొనసాగుతాయి. -
వరంగల్ సభ తర్వాత అసెంబ్లీ: కేసీఆర్
– నకిలీ విత్తన వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని వెల్లడి ‘‘ఈ ప్లీనరీ సందేశం రైతే రాజు. ఆ రైతును ఆదుకునేందుకు ఎంతదాకా అయినా వెళ్తాం..’’అని సీఎం కేసీఆర్ చెప్పారు. రైతులను దగా చేస్తున్న కల్తీ విత్తనాల వ్యవహారాన్ని ఇక ఉపేక్షించబోమని స్పష్టంచేశారు. ‘‘కల్తీ విత్తనాలు సరఫరా చేసి రైతుల గోస పోసుకునే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఉక్కుపాదం మోపుతం. ఇందుకు ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తం. అసెంబ్లీ ఇంకా ప్రోరోగ్ కాలేదు కాబట్టి వరంగల్ బహిరంగ సభ తర్వాత ఒక రోజు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాం. కల్తీ విత్తనాలకు అడ్డుకట్ట వేసి కంపెనీలపై చర్యలు తీసుకునేందుకు బిల్లును పెడతాం’’అని ప్లీనరీ ముగింపు సందర్భంగా ప్రసంగిస్తూ వెల్లడించారు. కల్తీ విత్తనాలతో రైతులు ఎంత నష్టపోతే అంత నష్ట పరిహారాన్ని సంబంధిత విత్తన కంపెనీల నుంచి ఇప్పిస్తామని స్పష్టంచేశారు. ‘‘సుదీర్ఘ కాలం రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీ పూర్తిగా అవినీతమయమైనవి. వారి హయాంలో జరిగిన అవినీతి అంతా ఇంతా కాదు. వారి నాయకత్వమే దోపిడీలో వాటా కలిగి ఉండేది. దీనికి ఒక్క ఉదాహరణ చెబుతా.. ఇసుక వ్యాపారంలో కాంగ్రెస్ దోపిడీ మామూలుగా జరగలేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు రాష్ట్రంలో ఇసుక ద్వారా వచ్చే ఆదాయం రూ.22 కోట్లు. ఆ తర్వాత ఏడాది అది రూ.10 కోట్లకు చేరింది. తెలంగాణ ఏర్పాటు నాటికి ఇసుక ద్వారా ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం రూ.5 లక్షలు. మేం ఇసుక పాలసీ తెచ్చాక గత ఏడాది రాష్ట్రానికి రూ.370 కోట్ల ఆదాయం వచ్చింది. అది ఈ ఏడాది రూ.460 కోట్లకు చేరింది. రూ.5 లక్షల ఆదాయం ఎక్కడ? రూ.460 కోట్లు ఎక్కడ?’’అని అన్నారు. తాము కడుపు కట్టుకుని, నోరు కట్టుకుని పనిచేస్తున్నామని, అవినీతి రహితంగా ఉన్నామని తెఉలిపారు. ‘‘అనవసరమైన ఆరోపణలు చేస్తే ఉపేక్షించొద్దు. ఏ శాఖపై ఆరోపణలు చేస్తారో.. సంబంధిత మంత్రులు ఆలోచించాలి. కేసులు పెట్టాలి..’’అని సూచించారు. అవినీతికి దూరంగా ఉంటున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. సంక్షేమ పథకాల కోసం 130 జీవోలు జారీ చేశామని, ఈ విషయాన్ని ప్రజల వద్దకు తీసుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీ బాలికలకు 20 డిగ్రీ రెసిడెన్షియల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని, విడతల వారీగా రెవెన్యూ డివిజన్‌కు ఒకటి చొప్పున వీటిని నెలకొల్పుతామని చెప్పారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీ, ఆసుపత్రుల్లో అనవసర ఆపరేషన్లను నియంత్రించే అంశాలపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. -
రైతే రాజు..
► ఏటా రెండు పంటలకు రూ.4 వేల చొప్పున సాయం: కేసీఆర్ ► వచ్చే ఏడాది నుంచే రైతులకు అందిస్తాం ► పండ్ల తోటలకు కూడా వర్తింపజేస్తాం ► చిన్నాపెద్దా తేడా లేకుండా రైతులందరికీ ఇస్తాం ► గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ► రైతు సంఘాలు, సమాఖ్యలు ఏర్పడాలి ► రైతు సమాఖ్యకు వచ్చే బడ్జెట్లో 500 కోట్లిస్తాం ► ధనిక రైతులు.. యాదవులుండే రాష్ట్రంగా పేరు తెస్తా ► ‘ఉపాధి’ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలి ► వరంగల్ సభ తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ► టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో ముఖ్యమంత్రి సాక్షి, హైదరాబాద్ ‘‘రైతు రాజు కావాలన్నదే నా ధ్యేయం.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని రైతులందరికీ యాసంగి, వానాకాలంలో రెండు పంటలకు రూ. 4 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తాం.. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా, ఆంక్షలేమీ లేకుండా రైతులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తాం’’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పండ్ల తోటలకు సైతం ఈ పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పారు. ఎరువులు, యూరియా బస్తాలలే కాదు.. ఈ డబ్బుతో రైతు తన ఇష్ట ప్రకారం పంటకు అవసరమైనవేవైనా కొనుక్కోవచ్చని స్పష్టం చేశారు. కొంపల్లిలో శుక్రవారం జరిగిన టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో కేసీఆర్ ప్రారంభోపన్యాసం చేశారు. 2001లో కొంతమందితో ప్రారంభమైన టీఆర్ఎస్.. ఇప్పుడు దేశంలోనే 75 లక్షల సభ్యత్వమున్న పెద్దపార్టీగా అవతరించిందని అన్నారు. ఈ సందర్భంగా సమగ్ర వ్యవసాయ ప్రణాళికను సీఎం ఆవిష్కరించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని ప్రత్యేకంగా తీర్మానం చేశారు. తెలంగాణ సాధించినట్టు.. కరెంట్ కోత తీర్చినట్టుగా దేశంలోనే అత్యంత ధనిక రైతులున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు తెచ్చి పెడతానని వేదికపై శపథం చేశారు. ధనిక యాదవులు, గొల్ల కుర్మలున్న రాష్ట్రంగా, వృత్తి పనివాళ్లు గౌరవంగా బతుకుతున్న రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. కనీసం రూ.20 వేల ఆదాయం సంపాదించే చేనేత, పవర్‌లూం కార్మికులున్న రాష్ట్రంగా తెలంగాణ పేరు నిలబెడతానని హామీ ఇచ్చారు. రైతులందరికీ సాయం ‘‘వ్యవసాయం ఒకప్పుడు దండగ.. లాభసాటి కాదనే మాట. రైతులంటేనే సంఘంలో చులకన భావం. ఇదంతా మారాలి. రైతులు రాజులు కావాలి. తెలంగాణలో అయి తీరుతారు’’అని సీఎం చెప్పారు. ‘‘రైతు రాజు కావాలంటే వట్టి మాటలతో కాడు. ఎకరానికి రూ.4 వేలను యాసంగి పంటకు, వానకాలం పంటకు కూడా ఇస్తాం. రాష్ట్రంలో 2.5 ఎకరాల లోపు కమతాలున్నవాళ్లు 62 శాతం, ఐదెకరాలలోపు 24 శాతం, పది ఎకరాలలోపు 11 శాతం ఉన్నారు. 25 ఎకరాలకు మించి ఉన్నవాళ్లు కేవలం 0.28 శాతమే. అందుకే వాళ్లు వీళ్లు అని తేడా లేదు. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ అందరికీ ఇస్తున్నట్లే రైతులందరికీ పెట్టుబడి సాయం అందిస్తాం. ఈ పథకంలో దళారీలు రావద్దు. లంచం ఇచ్చే పరిస్థితి రావద్దు. సాలార్జంగ్ పుణ్యమా అని రెవెన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉంది. భూముల క్రయ విక్రయాలు, లావాదేవీలు జరిగినా రికార్డుల్లో ఉంటుంది. ఇవన్నీ గ్రామ రైతు సంఘం నిర్వహిస్తుంది. ప్రతి ఐదు వేల ఎకరానికో వ్యవసాయ విస్తరణాధికారి ఉంటారు. 2,112 మందిని నియమించాం. ఒక్కో అధికారి కింద రెండు వేల మంది రైతులుంటారు. భూములు, రైతుల వివరాలు వారి దగ్గర అందుబాటులో ఉంటాయి. అవసరమైన సమాచారం ఇచ్చేలా రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదేశాలిస్తాం. ఊరిలో రైతు సంఘం అధ్యక్షుడు, వీఆర్వో, వ్యవసాయ విస్తరణ అధికారి సంతకాలు చేసి సమర్పించిన జాబితాకు పెట్టుబడి సాయం అందిస్తాం. యాసంగి పంటకు మే నెలలో, వానాకాలం పంటలకు అక్టోబర్ నెలలో డబ్బు డిపాజిట్ చేస్తాం. దాదాపు రూ.7000 కోట్ల నుంచి 8000 కోట్లు ప్రభుత్వానికి ఖర్చవుతుంది. అదేం పెద్ద భారం కాదు. నేరుగా రైతులకు డబ్బులిచ్చిన ప్రభుత్వాలేమీ లేవు. రాష్ట్ర వ్యవసాయం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వికసించాలి. రాష్ట్ర రైతు సమాఖ్య అధ్యక్షుడు సీఎం వద్దకు వచ్చినా రెండు నిమిషాల్లో వాళ్ల పని చేసే పరిస్థితి రావాలి’’అని సీఎం అన్నారు. శుక్రవారం కొంపల్లిలో జరిగిన టీఆర్ఎస్ ప్లీనరీలో ప్రసంగిస్తున్న సీఎం కేసీఆర్ రైతు సంఘాలే ధరలు నిర్ణయిస్తాయి.. రైతులకు సొసైటీలు లేవని, అంతా సంఘటితం కావాలని సీఎం చెప్పారు. ప్రభుత్వమే ఈ బాధ్యత తీసుకుంటుందని పేర్కొన్నారు. ‘‘ఈ ఏడాది ప్రతి గ్రామంలో రైతు సంఘాల ఏర్పాటు జరుగుతుంది. అన్ని కులాలు, అన్ని వర్గాల రైతులు ఇందులో ఉంటారు. గ్రామ సంఘాల సమాహారంగా మండల రైతు సమాఖ్య ఉంటుంది. అదే తరహాలో జిల్లా సమాఖ్య, రాష్ట్ర రైతు సమాఖ్యలు ఏర్పాటు చేస్తాం. వచ్చే ఏడాది బడ్జెట్లో రాష్ట్ర రైతు సమాఖ్యకు ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయిస్తుంది. దీంతోపాటు రివాల్వింగ్ ఫండ్ ఉంటుంది. రైతులు రైతును ఆదుకోవాలి. ప్రతి టన్నుకు కొంత మొత్తం చొప్పున రైతుల నుంచి సేకరించి డబ్బును ఆదా చేయాలి. రెండు మూడేళ్లలో ఈ డబ్బు రూ.2000 కోట్ల నుంచి రూ.3000 కోట్లకు చేరుతుంది. రైతులు సంఘటితమయ్యాక.. ధాన్యం కళ్లాల వద్ద పంటలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. రైతు సంఘాలే వ్యాపారులతో మాట్లాడి పంటకు రేట్లను నిర్ణయిస్తాయి. రైతు సమాఖ్య వద్ద ఉన్న డబ్బును అత్యవసరం ఉన్న రైతులకు వడ్డీ లేకుండా సాయం అందించాలి. పంట ఉత్పత్తులు అమ్మేంత వరకు ఈ సాయం సరిపోతుంది. తెలంగాణను పంటల కాలనీలుగా విభజిస్తామని మూడేళ్ల కిందట తొలి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పినా. ఏ ప్రాంతంలో ఎంత పంట వేయాలి.. ఎవరు ఏ పంట.. ఎంత వేయాలో వచ్చే ఏడాది నాటికి సిద్ధం చేస్తాం. పంటలకు మంచి ధర రావాలంటే రైతు రాజు కావాలంటే క్రాప్ కాలనీలు తప్పనిసరి...’’అని చెప్పారు. ‘ఉపాధి’ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తా.. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ‘‘ఉపాధి హామీ పథకంతో పేదలకు లబ్ధి చేకూరుతోంది. కానీ వ్యవసాయ సీజన్లో కూలీలు దొరక్క రైతులు అవస్థలు పడుతున్నారు. అందుకే ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ నెల 23న ఢిల్లీలో జరగబోయే నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర ప్రజల ప్రతినిధిగా ఈ విషయాన్ని ఢంకా బజాయించి ప్రధాని మోదీకి తెలియజేస్తా..’’అని స్పష్టం చేశారు. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలకు రూ.40 వేల కోట్లు కేటాయిచినట్లు సీఎం చెప్పారు. ‘‘ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళలకు జీవనభృతి ఇస్తున్నాం, వసతి గృహాల్లో సన్నబియ్యం ప్రవేశపెట్టాం. రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సమస్య అధిగమించాం. భవిష్యత్‌లో ఇక విద్యుత్ కోతలు ఉండవు. మిషన్ భగీరథ ద్వారా ఈ ఏడాది చివరి నాటికే కృష్ణా, గోదావరి నీళ్లు తీసుకొస్తాం. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పటిష్టం కావాలి. రైతు బాగుపడితేనే అది సాధ్యమవుతుంది. కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నాం. చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయను ప్రపంచమంతా కొనియాడుతోంది’’అని అన్నారు. వాళ్లకు ఇంగిత జ్ఞానముందా? రైతులకు పెట్టుబడి సాయం అందించే పథకాన్ని వివరించిన సందర్భంగా పలుమార్లు కేసీఆర్ కాంగ్రెస్ నేతలపై విరుచుకుపడ్డారు. ‘ఈ పథకంపై మాట్లాడే కొందరికి ఇంగిత జ్ఞానముందా.. లేదా అని జాలేస్తుంది. మాయి నకల్ కొట్టిండు కేసీఆర్.. అని కాంగ్రెస్ వాళ్లు అంటున్నరు. ఏ మాత్రం పౌరుషమున్నా నేను ప్రకటించిన తర్వాతైనా అలా చెప్పొద్దు. ప్రజలు నవ్విపోతరు కదా. ఎరువులు, యూరియానే నా పథకమని అనుకున్నరు. కానీ కాదు.. రైతును రాజును చేసి చూపిస్తా. ఒక సన్నాసి వచ్చే ఏడాది ఎందుకు.. ఇప్పుడే ఇస్తే ఏంబాయే అని మాట్లాడిండు. ఆగమాగం మొదలుపెట్టి మనిషికిన్ని పంచుకొని బయటపడాలనేది కాంగ్రెస్ విధానం’’అని దుయ్యబట్టారు. ప్లీనరీ సైడ్‌లైట్స్ ప్లీనరీ ప్రాంగణానికి నలువైపులా సూర్యబింబం ఆకృతిలో ఉన్న కటౌట్ల మధ్యలో కేసీఆర్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. వేదిక వద్దకు దారితీసే అన్ని దారుల్లో పెట్టిన ఇలాంటి కటౌట్లు ఆకట్టుకున్నాయి. ప్లీనరీ వేదికపై ఏర్పాటు చేసిన అమరవీరుల స్థూపం, తెలంగాణ తల్లి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సభ ప్రారంభానికి ముందు నిమిషం పాటు మౌనం పాటించి అమరులకు ఘన నివాళులు అర్పించారు. ప్లీనరీ ప్రాంగణంలో మల్లారెడ్డి మెడికల్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటుచేశారు. గులాబీదండు నేతృత్వంలో వలంటీర్లు వాకీటాకీలు పట్టుకొని ఏర్పాట్లను పర్యవేక్షించారు. రాష్ట్ర సాంస్కృతిక సారథి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ నేతృత్వంలోని కళాకారుల బృందం నిర్వహించిన తెలంగాణ ఆటా..పాటా కార్యక్రమం కార్యకర్తల్లో జోష్‌ను నింపింది. ‘పచ్చ..పచ్చని పల్లె.. పచ్చాని పల్లె..’అన్న బతుకమ్మ పాటను స్టేజిపై కళాకారులు ఆలపించినప్పుడు గ్యాలరీలో పలువురు మహిళా కార్యకర్తలు బతుకమ్మ ఆడారు. సీఎం కేసీఆర్ ప్లీనరీ వేదిక వద్దకు రాగానే మహిళా కార్యకర్తలు సహా ప్రతినిధులంతా తమ చేతిలో ఉన్న గులాబీ జెండాలను ఊపుతూ అభివాదం చేశారు. కేసీఆర్ కూడా సభా వేదిక నలుమూలలకు తిరిగి కార్యకర్తలకు అభివాదం చేశారు. పార్టీ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన కేసీఆర్‌ను మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు బృందాలుగా తరలివచ్చి సన్మానించారు. యూకె, యూఎస్, బహ్రెయిన్, న్యూజిలాండ్, డెన్మార్క్‌ల నుంచి వచ్చిన పార్టీ నాయకులను కేసీఆర్ పేరుపేరునా ప్రస్తావించి అభినందనలు తెలిపారు. తాను ప్రసంగిస్తున్న సమయంలో.. ‘నేను చెబుతున్న విషయాలను రాసుకోవడానికి నిర్వాహకులు పెన్నులు, ప్యాడ్లు ఇవ్వలేదా.. మీరు రాయడం లేదు’అంటూ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలకు సీఎం చురకలు అంటించారు. హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్‌ను పిలిచి వెంటనే వారికి పెన్నులు, ప్యాడ్లు అందజేయాలని సూచించారు. ప్రతి పాయింట్ నోట్ చేసుకోవాలని ఆదేశించారు. ప్రతి తీర్మానం ఆమోదం సమయంలో పెద్దగా కరతాళ ధ్వనులు చేసి మద్దతు తెలపాలంటూ కేసీఆర్ సూచించినప్పుడల్లా కార్యకర్తలు, నేతల్లో నవ్వులు విరిశాయి. ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో ప్లీనరీ వేదికకు సమీపంలో స్టాల్ పెట్టి అంబలి పంపిణీ చేశారు. హాజరైనవారందరికీ మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లు అందుబాటులో ఉంచారు. ఎండ వేడిని తట్టుకొనేందుకు కూలర్లు, ఫ్యాన్లు ఏర్పాటు చేశారు. -
టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్
-
రైతన్నలపై సీఎం కేసీఆర్ వరాల జల్లు!
హైదరాబాద్: టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ రైతన్నలపై వరాల జల్లు కురిపించారు. సమాజంలో రైతులంటే చులకనభావం ఉందని, తెలంగాణలో ఆ భావాన్ని తొలగించాలని ఆయన అన్నారు. తెలంగాణలో రైతే రాజు అవుతాడని, ధనిక రైతులుండే రాష్ట్రంగా తెలంగాణ ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. కొంపల్లిలో శుక్రవారం ఉదయం ప్రారంభమైన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడారు. అణగారిన రైతన్నల జీవితాలను బాగుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా పెట్టుబడి ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఎకరానికి రూ. 4 వేల చొప్పున రైతుకు పెట్టుబడి అందిస్తామని, ఆ పెట్టుబడితో రైతు యూరియా కొనుక్కోవచ్చు లేదా ఏదైనా కొనుకోవచ్చు అని చెప్పారు. సాధారణ వ్యవసాయ పంటలకే కాక, పండ్ల తోటలకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని తెలిపారు. ఒక పంటకు కాదు రెండు పంటలకు ఈ పెట్టుబడి అందిస్తామని, ప్రతి మే నెలలో ఒకసారి, అక్టోబర్ నెలలో మరోసారి నేరుగా రైతుల ఖాతాల్లోకే డబ్బులు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఈ పథకంలోకి దళారులను రానివ్వొద్దని ఆయన కోరారు. ఈ పథకాన్ని అమలుచేసేందుకు ప్రతి ఊరిలోనూ గ్రామరైతు సంఘాలను ఏర్పాటుచేస్తామని, ఇవి చాలా శక్తివంతంగా పనిచేస్తాయని ఆయన చెప్పారు. తెలంగాణను పంటలకాలనీగా విభజించి.. ఆయా జిల్లాలలోని వాతావరణం, వర్షపాతం ఆధారంగా పంటలు పండించేలా చర్యలు తీసుకుంటామని, త్వరలోనే వ్యవసాయశాఖలో ఐదువేల పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఉపాధి హామీ పథకం వల్ల వ్యవసాయ సీజన్లో కూలీ సమస్య తలెత్తుతున్నదని, కాబట్టి ఈ పథకాన్ని వ్యవసాయంతో అనుబంధం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ప్లీనరీ వేదికగా విజ్ఞప్తి చేశారు. -
టీఆర్ఎస్ ఉంటుందో లేదో అన్నారు: కేసీఆర్
హైదరాబాద్: తనను వరుసగా ఎనిమిదోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు, శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై విశ్వాసం ఉంచినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. కొంపెల్లిలో ప్రారంభమైన టీఆర్ఎస్ 16వ ప్లీనరీలో ఆయన ప్రసంగించారు. 2001లో టీఆర్ఎస్ జెండా తొలిసారి ఎగిరినప్పుడు అన్నీ అనుమానాలే ఉండేవని, పార్టీ ఉంటుందో లేదోనని చాలామంది అనుమానపడ్డరని అన్నారు. ఈ 16 ఏళ్ల ప్రస్థానంలో మనం ఎన్నో అనుమానాలను ఎదుర్కొన్నామని పార్టీ నేతలను ఉద్దేశించి చెప్పారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 15 ఏళ్ల పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం భయంకరమైన జీవన విధ్వంసంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ వచ్చినప్పుడు అన్నీ సమస్యలే ఉన్నాయి 60 ఏళ్ల టీడీపీ, కాంగ్రెస్ పాలన అంతా అస్తవ్యస్తమే రాష్ట్రంలో అవినీతి రహిత పాలన సాగుతోంది పేదల సంక్షేమానికి పెద్దపీట వేశాం. వారి సంక్షేమం కోసం రూ. 40 కోట్ల బడ్జెట్‌ను వినియోగిస్తున్నాం మిషన్ భగీరథలో భాగంగా ఈ సంవత్సరం చివరినాటికి అన్ని గ్రామాలకూ కృష్ణ, గోదావరి నీళ్లు అందించే ప్రయత్నం చేస్తాం రైతుల మేలు కొరకు కోటి ఎకరాలకు నీరు అందించాలన్న లక్ష్యం అసంపూర్తి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేస్తున్నాం ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌లో నాలుగున్న లక్షల ఎకరాలకు నీరు అందించాం చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ పథకాన్ని తీసుకొచ్చాం కాంగ్రెస్, టీడీపీ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవడానికి దుష్ర్పచారం చేస్తున్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పాలి రాష్ట్రంలో నేషనల్ హైవేస్ విషయంలో జాతీయ సగటును మించిపోయాం అన్ని కులాలు వారు, అన్ని మతాలవారి సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటున్నాం. -
గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు
-
గులాబీ పండుగ: కేసీఆర్‌కు అభినందనలు
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ 16వ ప్లీనరీ గురువారం కొంపెల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా వరుసగా ఎనిమిదో సారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు (కేసీఆర్)ను పార్టీ నేతలు, శ్రేణులు అభినందించారు. అనంతరం సీఎం కేసీఆర్ తెలంగాణ అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించి ప్లీనరీని ప్రారంభించారు. టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రారంభోపన్యాసం చేస్తూ సీఎం కేసీఆర్, మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులకు స్వాగతం పలికారు. కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాల వివరాలు తెలుపుతూ.. సర్కారు సంక్షేమ కార్యక్రమాలను ప్రశంసించారు.