హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీకి ఒక్కరోజే రూ.20.41 కోట్ల విరాళాలు వచ్చాయి. పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతల నుంచి ఈ విరాళాలు అందాయి. శుక్ర వారం హైదరాబాద్‌లోని కొంపల్లిలో జరిగిన పార్టీ ప్లీనరీలో విరాళాలను ప్రకటించారు. ఇప్పటివరకు రూ.42.08 కోట్ల ఆదాయం సమకూరినట్లు పార్టీ అధినేత, సీఎం చంద్రశేఖర్‌రావు తెలిపారు. విరాళాలు అందించిన నేతల పేర్లను కేసీఆర్ చదివి వినిపించారు.
పార్టీ సభ్యత్వం, ఇతర వనరుల ద్వారా రూ.50 కోట్లకు పైగా గతంలోనే వసూలయ్యాయని వెల్లడించారు. అందులో మరణించిన కార్యకర్తల జీవిత బీమా కింద రూ.20 కోట్లు ఖర్చు కాగా, మరికొంత డబ్బు స్టేషనరీ తదితర అవసరాలకు ఖర్చు అయినట్లు తెలిపారు. అందులో రూ.21.67 కోట్లు మిగిలాయని, శుక్రవారం అందిన విరాళాలు కలుపుకొని పార్టీ మొత్తం ఆదాయం రూ.42 కోట్లు ఉందని చెప్పారు.
విరాళాలివీ..
ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రూ.2 కోట్లు. సి.మల్లారెడ్డి (మల్కాజిగిరి ఎంపీ), రాజశేఖర్‌రెడ్డి, జితేందర్‌రెడ్డి, మాజీ ఎంపీ జి.వివేక్, సరోజా వివేక్, ఎండీ సలీం, నితిన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, భాను ప్రసాద్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి తదితరులు రూ.కోటి చొప్పున. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి 75 లక్షలు, ఎంపీ పాటిల్ 51 లక్షలు, దండె విఠల్, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, కొత్త మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు రూ.50 లక్షలు. గంగుల కమలాకర్, వి.వెంకటేశ్వర్‌రావు, కె.నారాయణరెడ్డి, రామ్మోహన్‌రావు, పి.శ్రీనివాస్‌రెడ్డి, జి.సుధారాణి, సంపత్‌కుమార్, మహేశ్ బిగాల, రాజేందర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఆరూరి రమేశ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు 25 లక్షలు.
Comments
Please login to add a commentAdd a comment