trs ticket
-
అల్లు అర్జున్ మామకి టీఆర్ఎస్ టిక్కెట్
టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది. టీఆర్ఎస్ తుది విడద అభ్యర్థుల జాబితాను బుధవారం హైదరాబాద్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడుదల చేశారు. దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి, కుసుకుంట్ల - ప్రభాకర్ రెడ్డి, పాలేరు - రావెళ్ల రవీందర్, ఇల్లెందు -చుంచు నాగేశ్వరరావులకు కేటాయించారు. అయితే ప్రముఖ సిని నిర్మాత అల్లు అరవింద్ వియ్యంకడు శేఖర్ రెడ్డి గతంలో మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అ క్రమంలో శేఖర్ రెడ్డి వియ్యంకుడి బావ, కేంద్ర మంత్రి చిరంజీవితో పలుమార్లు సమావేశమై చర్చించారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ శేఖర్ రెడ్డిని వరించలేదు ఎందుకో తెలియరాలేదు. -
సొంత మనిషికి టీఆర్ఎస్ టికెట్ ఇప్పించిన సర్వే!!
రాజకీయాలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. నిన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిత్వం కోసం తీవ్రంగా ప్రయత్నం చేసి.. తీరా అది దక్కకపోవడంతో నిరాశకు గురై, స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేద్దామనుకునే సమయానికి టీఆర్ఎస్ టికెట్ వరించింది. కేంద్ర మంత్రి, మల్కాజిగిరి ఎంపీ సర్వే సత్యనారాయణ అనుచరుడు రామ్మోహన్ గౌడ్. ఈయన ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగాలని ఉత్సాహపడ్డారు. తన మనిషికి ఎలాగైనా ఆ టికెట్ ఇప్పించాలని సర్వే తీవ్రంగా ప్రయత్నించారు. అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాత్రం ఢిల్లీ స్థాయిలో మంతనాలు జరిపి, తన టికెట్ ఖరారు చేయించుకున్నారు. దీంతో రామ్మోహన్ గౌడ్ తీవ్ర నిరాశకు గురయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగానైనా ఎల్బీనగర్ బరిలోకి దిగాలనుకున్నారు. సరిగ్గా ఇక్కడే మళ్లీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ చక్రం తిప్పారు. టీఆర్ఎస్లో తనకున్న పరిచయాలతోనే చేశారో, ఇంకేం చేశారో గానీ.. తెల్లవారేసరికి టీఆర్ఎస్ విడుదల చేసిన రెండో జాబితాలో రామ్మోహన్ గౌడ్ పేరు కనిపించింది. ఒక్కసారిగా నియోజకవర్గ ప్రజలతో పాటు.. నాయకులు కూడా విస్తుపోయారు. సోమవారం వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఆ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించిన ఆయన అసలు ఎప్పుడు టీఆర్ఎస్లో చేరారో, ఎప్పుడు టికెట్ కోసం ప్రయత్నించారో, ఎలా సాధించారో ఎవ్వరికీ తెలియలేదు. టికెట్ మాత్రం ఇట్టే వచ్చేసింది. -
టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి: శంకరమ్మ
అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ హెచ్చరిక సాక్షి, హైదరాబాద్: పాలకుర్తి అసెంబ్లీ నుండి టీఆర్ఎస్ టికెట్ ఇవ్వకుంటే ఆత్మాహుతి చేసుకుంటానని అమరుడు శ్రీకాంతాచారి తల్లి కాసోజు శంకరమ్మ హెచ్చరించారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలోనే శంకరమ్మ బుధవారం కలిశారు. వరంగల్ జిల్లా పాలకుర్తి శాసనసభ స్థానం నుండి పార్టీ టికెట్‌ను ఇవ్వాలని కోరారు. అమరవీరుల కుటుంబాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రశ్నించారు. పాలకుర్తి టికెట్ ఇవ్వడం సాధ్యం కాదని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీ టికెట్‌ను ఇస్తానని కేసీఆర్ హామీనిచ్చారు. ఎమ్మెల్యే టికెట్నే ఇవ్వాలని, ఎమ్మెల్సీ వద్దని శంకరమ్మ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ టికెట్‌ను ఇవ్వకుంటే శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకున్న ఎల్బీ నగర్ చౌరస్తాలోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. 3 రోజుల సమయం ఇవ్వాలని, ఆలోచించి చెబుతానని కేసీఆర్ కోరినట్టుగా శంకరమ్మ విలేకరులకు వివరించారు. -
బలప్రదర్శన
సంగారెడ్డి టీఆర్ఎస్లో టికెట్ల లొల్లి సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కేంద్రం సంగారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ దక్కించుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ ఎవరికి వారుగా ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎదుట ఇరువర్గాలు ఇటీవల బలప్రదర్శన కూడా చేసినట్లు సమాచారం. గతంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆర్.సత్యనారాయణ వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సదాశివపేట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ చింతా ప్రభాకర్ తర్వాతి కాలంలో టీఆర్ఎస్లో చేరారు. అప్పటి నుంచే అటు సత్యనారాయణ, ఇటు చింతా ప్రభాకర్ నడుమ విభేదాలు కొనసాగుతున్నాయి. ఆ తర్వాతి కా లంలో ప్రభాకర్‌కు నియోజకవర్గ ఇన్చార్జి పదవి అప్పగించడంతో విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ప్రభాకర్ నియోజకవర్గానికి దూరంగా ఉండటం, జిల్లా అధ్యక్షుడిగా సత్యనారాయణకు పదవి కట్టబెట్టడంతో నియోజకవర్గ టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు కొం తకాలం స్తబ్దుగా ఉన్నాయి. ఇటీవల ప్రభాకర్ క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో అంతర్గత విభేదాలు మళ్లీ తెరమీదకు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్.సత్యనారాయణ తన వాదన వినిపించేందుకు ఓ బృందాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ‘ఆరేళ్ల పదవీ కాలాన్ని త్యాగం చేసిన వ్యక్తికి వచ్చే ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలంటూ’ ఈ బృందం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేసేందుకు ప్రయత్నించింది. అయితే అనారోగ్య కారణాల వల్ల సదరు బృందంతో కేసీఆర్ భేటీ చివరి నిమిషంలో రద్దయినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోమారు కేసీఆర్‌ను కలిసేందుకు సత్యనారాయణ మద్దతుదారులు ప్రయత్నిస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌లో పనిచేసిన ఓ ముఖ్య నేతను పార్టీలో చేర్చేందుకు ఆర్. సత్యనారాయణ మంతనాలు సాగిస్తున్నారు. కేసీఆర్ ఎదుట బలప్రదర్శన ఆర్. సత్యనారాయణ ప్రయత్నాలు పసిగట్టిన టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చింతా ప్రభాకర్ తన మద్దతుదారులతో కేసీఆర్ ఎదుట బలప్రదర్శన జరిపారు. ఈ నెల మూడో తేదీన నియోజకవర్గ పరిధిలోని పలువురు నాయకులు, క్రియాశీల కార్యకర్తలను వెంటబెట్టుకుని కేసీఆర్ వద్దకు వెళ్లారు. ‘సంగారెడ్డిలో పార్టీని బలోపేతం చేయాల్సిందిగా’ సూచించిన కేసీఆర్ పరోక్షంగా ప్రభాకర్‌కు అనుకూలంగా సంకేతాలు ఇచ్చినట్లు ఆయన వర్గీయులు చెప్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నా టికెట్ ఆశిస్తున్న నేతలను పిలిచి పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఎవరు పోటీ చేస్తారనే అంశంపై స్పష్టత ఇవ్వకపోవడాన్ని పార్టీ శ్రేణులు తప్పు పడుతున్నాయి.