అల్లు అర్జున్ మామకి టీఆర్ఎస్ టిక్కెట్ | Hero Allu Arjun's father-in-law contest form Ibrahimpatnam | Sakshi
Sakshi News home page

అల్లు అర్జున్ మామకి టీఆర్ఎస్ టిక్కెట్

Published Wed, Apr 9 2014 9:53 AM | Last Updated on Fri, Aug 17 2018 8:03 PM

అల్లు అర్జున్ మామకి టీఆర్ఎస్ టిక్కెట్ - Sakshi

అల్లు అర్జున్ మామకి టీఆర్ఎస్ టిక్కెట్

టాలీవుడ్ ప్రముఖ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి అలియాస్ శేఖర్ రెడ్డికి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ టికెట్ ఖరారు చేసింది. టీఆర్ఎస్ తుది విడద అభ్యర్థుల జాబితాను బుధవారం హైదరాబాద్లో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ విడుదల చేశారు. దుబ్బాక - సోలిపేట రామలింగారెడ్డి, కుసుకుంట్ల - ప్రభాకర్ రెడ్డి, పాలేరు - రావెళ్ల రవీందర్, ఇల్లెందు -చుంచు నాగేశ్వరరావులకు కేటాయించారు.

 

అయితే ప్రముఖ సిని నిర్మాత అల్లు అరవింద్ వియ్యంకడు శేఖర్ రెడ్డి గతంలో మిర్యాలగుడా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో దిగేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అ క్రమంలో శేఖర్ రెడ్డి వియ్యంకుడి బావ, కేంద్ర మంత్రి చిరంజీవితో పలుమార్లు సమావేశమై చర్చించారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ శేఖర్ రెడ్డిని వరించలేదు ఎందుకో తెలియరాలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement