trust test
-
తొలిరోజే రచ్చ
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే సభలో వాతావరణం గందరగోళంగా మారింది. లోక్‌సభలో విశ్వాస పరీక్ష, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తదితర అంశాలపై పలు రాజకీయ పక్షాల పోటాపోటీ నినాదాలతో సభ దద్దరిల్లింది. అయితే ఈ గందరగోళంలోనూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రారంభించగానే తెలుగుదేశం, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేశారు. కాంగ్రెస్ సహాపలు పార్టీల సభ్యులు వివిధ అంశాలపై నినాదాలు చేశారు. ఎన్డీయే మాజీ భాగస్వామ్య పక్షమైన టీడీపీకి చెందిన ఎంపీలు ‘వి వాంట్ జస్టిస్’ అని ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఎస్పీ నేతలు కూడా వెల్‌లోకి దూసుకొచ్చి పలు డిమాండ్లతో నినదిం చారు. కాంగ్రెస్ ఎంపీలు తమ తమ స్థలాల్లోనే వివిధ అంశాలపై చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేశారు. కొత్త సభ్యుల ప్రమాణం సభ ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ సభకు చేరుకుని అధికార, విపక్ష సభ్యులందరికీ అభివాదం చేశారు. సమాజ్‌వాదీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌తో కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా సభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయానికి ముందే.. కొత్తగా ఎన్నికైన ఎంపీలు కుకాడే యశ్వంత్ రావ్ (ఎన్సీపీ), గవిట్ రాజేంద్ర (బీజేపీ), తోఖేహో (ఎన్డీపీపీ), తబస్సుమ్ బేగమ్ (ఆర్ఎల్డీ) ప్రమాణం చేశారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చబోం అటు, రాజ్యసభలోనూ విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు జరిగాయి. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీల్లో ఆందోళన నెలకొందని సీపీఐ సభ్యుడు డి.రాజా పేర్కొన్నారు. దీనికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమాధానమిచ్చారు. ఎస్సీ, ఎస్టీల హక్కులు కాపాడేందుకు ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందని.. ఇందుకోసం సంబంధిత చట్టాలకు సవరణలు జరుపుతున్నామన్నారు. ‘రాజ్యాంగం ప్రకారం ఎస్సీ, ఎస్టీలకుండే హక్కులను ఎట్టిపరిస్థితుల్లోనూ తగ్గించబోం. ఏ సంస్థ అయినా వ్యక్తులైనా ఈ హక్కులను కాలరాస్తే ఊరుకోం. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం’ అని సభకు తెలిపారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలపై 30 రాష్ట్రాల్లో 24 ప్రత్యేక కోర్టులను ఏర్పాటుచేయనున్నట్లు మరో మంత్రి హన్స్‌రాజ్ గంగారామ్ ఆహిర్ వెల్లడించారు. మానవ అక్రమరవాణా నిరోధక బిల్లు దేశ తొలి సమగ్ర మనుషుల అక్రమ రవాణా నిరోధక బిల్లును కేంద్ర మంత్రి మేనకా గాంధీ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఈ నేరాన్ని నిరోధించడంతో పాటు బాధితులకు రక్షణ, పునరావాసం కల్పించాలని ప్రతిపాదించారు. చాకిరి, భిక్షాటన, వివాహాల్ని కూడా దీని పరిధిలో చేర్చారు. ఆర్థిక నేరగాళ్ల బిల్లు కూడా..: ఆర్థిక నేరాలకు పాల్పడి, బ్యాంకుల రుణాలు ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకుంటున్న వారిని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు’గా ప్రకటించే బిల్లును ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
లవ్ ఇన్ బెంగళూరు..!
కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవం.. ఎన్డీయేతర ప్రాంతీయ పార్టీల ఐక్యతకు వేదికగా మారింది. సంకీర్ణ కూటమి భాగస్వామిగా కాంగ్రెస్ చీఫ్ రాహుల్, సోనియాలు హాజరైనా.. వేదికపై ప్రాంతీయ పార్టీల అధినేతల సందడి ప్రధానంగా కనిపించింది. ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ప్రాంతీయ పార్టీల నేతలు, బీజేపీయేతర రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. కన్నడనాట బీజేపీయేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటంలో కీలకంగా వ్యవహరించినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ని ఏపీ సీఎం చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. కాసేపు వీరిద్దరూ మాట్లాడుకున్నారు. సోనియా, మాయావతిల ఆత్మీయ ఆలింగనం అందరి దృష్టిని ఆకర్షించింది. సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్డీ కుమారస్వామి బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. కేంద్రంలో ఎన్డీయే కూటమికి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యకూటమి వేసిన తొలి అడుగుగా భావిస్తున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సోనియా సహా పలు రాష్ట్రాల సీఎంలు, ప్రాంతీయ పార్టీల అధినేతలు హాజరయ్యారు. కన్నడ సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ప్రాంతీయ పార్టీల మేళాను తలపించింది. దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీయేతర పక్షంలో ఉన్న దాదాపు అన్ని పార్టీల నేతలు వేదికపై కనిపించారు. కర్ణాటక విధానసౌధ ఆవరణలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సైద్ధాంతిక వైరుధ్యాలను పక్కనపెట్టి వీరంతా ఒకే వేదికను పంచుకున్నారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయ ఆలింగనాలు చేసుకున్నాను. సోనియా, మమతలు ఒకరినొకరు ప్రేమగా పలకరించుకోవడం, తేజస్వీ యాదవ్ మమత, మాయావతి, సోనియాల పాదాలకు నమస్కరించటం అందరి దృష్టిని ఆకర్షించాయి. రాహుల్‌ను ప్రశంసించిన బాబు ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక రాహుల్ దగ్గరికెళ్లిన చంద్రబాబు భుజం తట్టి అభినందించారు. చేయి కలిపి శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ కృషిని బాబు ప్రశంసించారు. సాధారణంగా రెండు వేళ్లు పైకెత్తి విక్టరీ సింబల్‌తో అభివాదం చేసే చంద్రబాబు.. ఈ వేదికపై మాత్రం చెయ్యి ఊపుతూ అభిమానులను పలకరించటం ఆసక్తిరేపింది. మమత, మాయావతి, అఖిలేశ్‌లతోనూ కబుర్లు చెప్తూ కనిపించారు. కార్యక్రమంలో చంద్రబాబు ఎక్కువసేపు మమతా బెనర్జీతో మాట్లాడుతూ కనిపించారు. మాజీ ప్రధాని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడ వేదికపైకి వచ్చిన అతిథులకు స్వాగతం పలికారు. హాజరైన ప్రముఖులు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్, యూపీఏ చైర్పర్సన్ సోనియా, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, బీఎస్పీ అధినేత్రి మాయావతి, పంజాబ్ సీఎం అమరీందర్, ఏపీ సీఎం చంద్రబాబు, కేరళ సీఎం విజయన్, పుదుచ్చేరి సీఎం నారాయణ స్వామి, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీపీఎం, సీపీఐల ప్రధాన కార్యదర్శులు ఏచూరి, సురవరం సుధాకరరెడ్డి, శరద్ యాదవ్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్, డీఎంకే నేత కనిమొళి, ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. తెలంగాణ సీఎం కేసీఆర్ మంగళవారం సాయంత్రమే కుమారస్వామిని కలిసి అభినందించి వెళ్లారు. వేదికపై అపురూప దృశ్యాలు శరద్ పవార్, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సీతారాం ఏచూరి వేదిక చివర్లో కూర్చుని మాట్లాడుకోవటం, అఖిలేశ్, మాయావతిల కబుర్లు, మాయావతి, సోనియా ఆత్మీయ ఆలింగనం వంటి ఆసక్తికర దృశ్యాలన్నీ వేదికపై కనిపించాయి. ఈ ప్రాంతీయ పార్టీల నేతలంతా కార్యక్రమానికి ముందు.. ప్రమాణస్వీకారం తర్వాత ఆప్యాయంగా పలకరించుకున్నారు. ‘అన్ని ప్రాంతీయ పార్టీలతో మేం టచ్‌లో ఉంటాం. తద్వారా దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి మేం కలిసి పనిచేసేందుకు వీలుంటుంది’ అని మమత అన్నారు. ముభావంగా వజూభాయ్! కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత నెలకొన్న పరిస్థితుల్లో బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించటం ద్వారా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న గవర్నర్ వజూభాయ్ వాలా కార్యక్రమంలో ముభావంగా కనిపించారు. కార్యక్రమం ముగిసిన వెంటనే వేదిక దిగి వెళ్లిపోయారు. కుమారస్వామి గవర్నర్‌కు వీడ్కోలు చెప్పలేదు. వర్షంతో ఇబ్బందులు ప్రమాణ స్వీకారోత్సవానికి వర్షం ఇబ్బంది కలిగించింది. మధ్యాహ్నం 1.30 నుంచే బెంగళూరును భారీ వర్షం ముంచెత్తింది. అక్కడే ప్రమాణ స్వీకారం జరుగుతుందా? అన్న అనుమానం కలిగింది. ఒక దశలో విధానసౌధ లోపల కార్యక్రమం నిర్వహించాలని ఆలోచించారు. సాయంత్రంకల్లా వర్షం తగ్గుముఖం పట్టడంతో ప్రాంగణంలోనే ప్రమాణం నిర్వహించారు. భారీ సంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు రావడంతో విధానసౌధ ఎదుట భారీగా ట్రాఫిక్‌జామ్ అయింది. విధానసౌధ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీతో తీవ్ర గందరగోళం నెలకొంది. నేతలకు ట్రాఫిక్ చిక్కులు ప్రత్యేక విమానంలో బుధవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న సోనియా, రాహుల్‌లు ఎయిర్‌పోర్టునుంచి వస్తుండగా ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జామ్ అయ్యాయి. నివాసం నుంచి విధానసౌధకు బయల్దేరిన జేడీఎస్ జాతీయాధ్యక్షుడు హెచ్డీ దేవెగౌడకు కూడా ట్రాఫిక్ చిక్కులు తప్పలేదు. బెంగళూరుకు చేరుకున్న తర్వాత సోనియా, రాహుల్ నేరుగా తమ ఎమ్మెల్యేలున్న హిల్టన్ హోటల్‌కు వెళ్లారు. వారందరితోనూ మాట్లాడారు. వారిని అభినందించారు. బలపరీక్ష పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యేలు హోటల్లోనే ఉండాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. కన్నడ ప్రజల సాక్షిగా.. గవర్నర్ వజూభాయ్ కుమారస్వామితో ప్రమాణం చేయించారు. సంప్రదాయ దుస్తులైన ధోతీ, తెల్లని షర్టు ధరించిన కుమారస్వామి ప్రమాణస్వీకారానికి హాజరయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు, దళిత నేత పరమేశ్వర ప్రమాణం చేశారు. బుధవారం ఉదయమే కేపీసీసీ చీఫ్‌గా పరమేశ్వర రాజీనామా చేశారు. ఈ సంకీర్ణ సర్కారు శుక్రవారం విశ్వాస పరీక్ష ఎదుర్కొనుంది. ఆ తర్వాతే మిగిలిన మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం కార్యక్రమం అనంతరం కుమారస్వామి కూడా ఒక్కొక్క నాయకుడి దగ్గరకు వెళ్లి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన తన తల్లి చెన్నమ్మ పాదాలకు నమస్కారం చేశారు. కుమారస్వామి, డీకే శివకుమార్‌లు చేయిచేయి కలిపి కార్యకర్తలకు అభివాదం చేశారు. విధానసౌధ ప్రాంగణంలో ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది కార్యకర్తలు ప్రమాణస్వీకార వేదికపై నుంచి అభివాదం చేస్తున్న పవార్, సోనియా, మాయావతి, రాహుల్, ఏచూరి, కుమారస్వామి, అఖిలేశ్ తదితరులు. ఆప్యాయంగా పలకరించుకుంటున్న మాయావతి, సోనియా. కుటుంబ సభ్యులతో కుమారస్వామి -
కూటమి సవాల్ కాదు.. బీజేపీదే అధికారం
న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఓటమిని కూడా విజయంగా చెప్పుకునేందుకు ఆ పార్టీ సరికొత్త కారణాలు వెతుక్కుంటోందని సోమవారమిక్కడ అన్నారు. ప్రాంతీయ విపక్ష కూటమితో కలసి కాంగ్రెస్ బలమైన కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ‘2014లోనూ ఈ పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించాయి. 2019లోనూ వీరం తా కలిసి పనిచేయటం మాకు ఇబ్బందేం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ కూటమిలోని చాలాపార్టీలకు వారి రాష్ట్రాల బయట పెద్దగా ప్రభావం లేవని.. అలాంటప్పుడు ఈ కూట మి అదనపు ఓట్లను ఎలా పొందగలుగుతుందన్నా రు. కాంగ్రెస్ మంత్రులు ఓటమిపాలైనప్పటికీ.. ఎం దుకు సంబరాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ చెప్పాలని షా డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం యడ్యూరప్ప ఏడ్రోజుల గడువు అడిగినట్లు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ లాయర్ అబద్ధమాడారన్నారు. -
నేడు యడ్యూరప్ప ప్రమాణం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయ సస్పెన్స్‌కు తాత్కాలికంగా తెరపడింది. బుధవారం చోటుచేసుకున్న పలు నాటకీయ పరిణామాల అనంతరం.. ప్రభుత్వం ఏర్పాటుచేయాలంటూ బీజేపీ పక్షనేత యడ్యూరప్పను గవర్నర్ వజూభాయ్ వాలా ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చారు. ఈలోగా విశ్వాసపరీక్షను ఎదురుకోవాలన్నారు. దీంతో గురువారం ఉదయం 9 గంటలకు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మాజీ అటార్నీ జనరల్‌లు సోలీ సొరాబ్జీ, ముకుల్ రోహత్గీలను సంప్రదించిన తర్వాతే గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. కాగా, తమకు అవసరమైన బలముందని లేఖలు సమర్పించినా.. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వటాన్ని కాంగ్రెస్, జేడీఎస్ తీవ్రంగా ఖండించాయి. గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ అర్ధరాత్రి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ కేసును తక్షణమే విచారణకు స్వీకరించాలని సీజేఐని కోరింది. అటు, కాంగ్రెస్, జేడీఎస్ రిసార్టు రాజకీయాలను ప్రారంభించాయి. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా కాంగ్రెస్, జేడీఎస్‌లు వారందరినీ బెంగళూరు శివార్లలోని ఈగల్టన్ రిసార్టులోకి ప్రత్యేక బస్సుల్లో తరలించాయి. యడ్డీ ఒక్కరే! కాంగ్రెస్–జేడీఎస్ నేతల వ్యతిరేకతలు, హెచ్చరికల మధ్య బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించారు. దీంతో బీజేపీ పక్షనేత యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా గురువారం ఉదయం 9 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బలనిరూపణలో గెలిచిన తర్వాతే మంత్రులతో ప్రమాణం చేయిస్తారు. యడ్డీ ప్రమాణానికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షా హాజరుకాకపోవచ్చని సమాచారం. బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే ఆందోళనలు చేస్తామంటూ కాంగ్రెస్ నేతలు హెచ్చరించిన నేపథ్యంలో రాజ్‌భవన్ చుట్టూ భద్రత కట్టుదిట్టం చేశారు. నగరంలోనూ భద్రతను పటిష్టం చేయాలని పోలీసుశాఖను ఆదేశించినట్లు తెలిసింది. ఉదయం నుంచీ హైడ్రామా! హంగ్ తీర్పుతో రాజుకున్న కన్నడ రాజకీయాల్లో బుధవారం కూడా సస్పెన్స్ కొనసాగింది. ప్రభుత్వం ఎవరు ఏర్పాటుచేస్తారు? గవర్నర్ ఎవరిని ఆహ్వానిస్తారనేదానిపై స్పష్టత రాకపోవడం. బలాన్ని కాపాడుకునేందుకు జేడీఎస్–కాంగ్రెస్ కూటమి, బలం పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేయటంతో పరిస్థితి ఆసక్తికరంగా మారింది. అయితే, సోమవారం గవర్నర్‌కు సమర్పించిన కూటమి ఎమ్మెల్యేల మద్దతు లేఖలో ముగ్గురు ఎమ్మెల్యేల సంతకాల్లేకపోవటం మధ్యాహ్నం కలకలం రేపింది. వీరంతా బీజేపీతోనే ఉన్నారనే ప్రచారం జోరందుకుంది. దీనికి తోడు బీజేపీ కూడా కాంగ్రెస్‌లోని లింగాయత్ ఎమ్మెల్యేలు, జేడీఎస్ కూటమిలోని ఆరుగురు తమతోనే ఉన్నారని లీకులు ఇవ్వడంతో ప్రత్యర్థి కూటమిలో ఆందోళన నెలకొంది. జేడీఎస్‌తో జవదేకర్ చర్చలు! బీజేపీ ఎమ్మెల్యేలంతా బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో సమావేశమై యడ్యూరప్పను తమపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ బుధవారం ఉదయం జేడీఎస్ అధినేత కుమారస్వామితో రహస్యంగా మంతనాలు జరిపారు. ఇవి విఫలం కావడంతో జేడీఎస్‌లో తమ ఎమ్మెల్యేలను కాపాడుకోవాలనే ఆందోళన పెరిగింది. కాగా, రాణీ బెన్నూరు స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బీజేపీ సీనియర్‌నేత ఈశ్వరప్పపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఒక్క ఎమ్మెల్యేను కాపాడుకోలేరా?’ అని మండిపడ్డారు. అయితే, శంకర్ బుధవారం బీజేపీకి మద్దతు ప్రకటించారు. అటు, పలువురు కాంగ్రెస్ నేతలు రాష్ట్ర నాయకత్వంతో టచ్‌లో లేకుండా పోయారన్న వార్తలను ఆ పార్టీ నేత, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఖండించారు. వారు ఎక్కడున్నా తమకే మద్దతు తెలుపుతారన్నారు. బీజేపీ ప్రలోభాలు: కుమారస్వామి తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని జేడీఎస్ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. ‘ఆపరేషన్ కమల్’ను ఎట్టిపరిస్థితుల్లో విజయవంతం కానీయబోమన్నారు. బుధవారం బెంగళూరులోని ఓ ప్రముఖ హోటల్లో జేడీఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కుమారస్వామిని తమ పక్షనేతగా ఎన్నుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా ఎమ్మెల్యేలకు బీజేపీ గాలం వేస్తోంది. ఒక్కొక్కరికి రూ.100 కోట్ల నగదుతో పాటు మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేస్తోంది. మేం తలుచుకుంటే బీజేపీ నుంచి రెట్టింపు ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారు’ అని పేర్కొన్నారు. కాగా సమావేశానికి ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు. వీరిద్దరూ ఫోన్లోనూ అందుబాటులో లేరని తెలుస్తోంది. కాగా, తను బీజేపీతో చేతులు కలుపుతున్నట్లు వచ్చిన వదంతులను దేవేగౌడ రెండో కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ తోసిపుచ్చారు. కుమారస్వామిని జేడీఎస్ పక్ష నేతగా ఎన్నుకున్నామని తెలిపారు. కుమారస్వామి ఆరోపణలను జవదేకర్ ఖండించారు. అంతపెట్టి ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం లేదన్నారు. మోదీ ప్రోద్బలంతోనే తమ ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు జరుపుతోందని సిద్దరామయ్య అన్నారు. శెట్టర్ గెలుపును నిర్ధారించిన ఈసీ సాక్షి, బళ్లారి: హుబ్లీ–ధార్వాడ సెంట్రల్ నియోజకవర్గంలో బీజేపీ నేత, మాజీ సీఎం జగదీశ్ శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల సంఘం(ఈసీ) ప్రకటించింది. మంగళవారం ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా పోలైన ఓట్లకు, ఈవీఎంలో నమోదైన ఓట్ల మధ్య స్వల్ప తేడా వచ్చింది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి మహేశ్ నలవాడ ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడంతో ఫలితాన్ని నిలిపివేశారు. సమగ్ర పరిశీలన అనంతరం మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత శెట్టర్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో బీజేపీ బలం 104కు చేరుకుంది. రాజ్‌భవన్‌కు క్యూ కట్టిన పార్టీలు .బుధవారం మధ్యాహ్నం రాజ్‌భవన్ ముందు ఆసక్తికర పరిస్థితులు నెలకొన్నాయి. యడ్యూరప్ప, ఇతర బీజేపీ సీనియర్ నేతలు తమ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతివ్వాలని కోరారు. అతిపెద్ద పార్టీగా నిలిచినందుకు తమకే అవకాశమివ్వాలని కోరారు. మరోవైపు, 2008 తరహాలోనే ఈసారి కూడా తమ ఎమ్మెల్యేలను లాక్కుంటుందనే అనుమానంతో కాంగ్రెస్‌పార్టీ చాలా జాగ్రత్తపడింది. వెంటనే పార్టీ రాష్ట్ర కార్యాలయానికి రావాలని ఆదేశించింది. అనంతరం జేడీఎస్–కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకున్న ఈ పార్టీ నేతలు రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమయ్యే సంఖ్యా బలం తమకుందని ప్రభుత్వ ఏర్పాటుకు తమకు అవకాశం ఇవ్వాలంటూ కోరారు. అయితే ఇరు పక్షాలకూ గవర్నర్ ఒకే సమాధానం ఇచ్చారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో చర్చించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. -
మరో పరీక్ష తప్పదా?
♦ ఎడపాడి ప్రభుత్వంపై సుప్రీం కోర్టులో పిటిషన్ ♦ మరోసారి విశ్వాస పరీక్ష పెట్టాలని పన్నీర్ వినతి ♦ స్వీకరించిన ద్విసభ్య ధర్మాసనం ♦ 11వ తేదీన విచారణ సాక్షి ప్రతినిధి, చెన్నై: సీఎం ఎడపాడి ప్రభుత్వానికి మరో విశ్వాస పరీక్ష పెట్టాలని మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ప్రయత్నాలు చేస్తున్నారు. పన్నీర్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించగా ఎడపాడి ప్రభుత్వం మరో పరీక్షకు సిద్ధంకా క తప్పదా అనే చర్చ మొదలైంది. ఎడపాడిపై పన్నీర్ సెల్వం మరో బ్రహ్మాస్త్రం ప్రయోగించారు. ఫిబ్రవరిలో జరిగిన బల పరీక్ష చెల్లదని, మరోసారి విశ్వాసపరీక్ష నిర్వహించేలా ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే అల్లకల్లోలంగా మారిపోగా పార్టీ, ప్రభుత్వంపై శశికళ ఆధిపత్యం ప్రారంభమైంది. ముఖ్యమంత్రిగా ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ప్రభుత్వ, పార్టీ బాధ్యతలు చేపట్టారు. అయితే సీఎం సీటుపై కన్నేసిన శశికళ పన్నీర్‌సెల్వం చేత బలవంతంగా రాజీనామా చేయడంతో పార్టీలో ముసలం పుట్టింది. శశికళపై పన్నీర్‌సెల్వం తిరుగుబాటుచేసి పార్టీని చీల్చారు. పార్టీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన శశికళ సీఎం అయ్యేలోగా ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. తన స్థానంలో ఎడపాడిని శాసనసభాపక్ష నేతగా ఎన్నికచేసి ఆమె జైలుకెళ్లారు. సీఎం పీఠంపై పన్నీర్‌సెల్వం పోటీపెంచగా చెన్నై శివార్లు కూవత్తూరులోని ఫాంహౌస్‌లో క్యాంపు రాజకీయాల తరువాత గవర్నర్ ఆదేశాల మేరకు ఎడపాడి సీఎం అయ్యారు. అయితే పార్టీ ఎమ్మెల్యేలను మభ్యపెట్టి, ప్రలోభపెట్టి మద్దతు కూడగట్టుకున్నారనే ఆరోపణలతో గవర్నర్ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 18వ తేదీన ఎడపాడి విశ్వాస పరీక్షను ఎదుర్కొనాల్సి వచ్చింది. ఎంతో ఉత్కంఠ నడుమ 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ఎడపాడి నెగ్గారు. అయితే ఆనాటి విశ్వాసపరీక్ష తీరును పన్నీర్‌సెల్వం, ప్రతిపక్ష డీఎంకే తీవ్రంగా తప్పుపట్టింది. పన్నీర్ వర్గం నేతలు ఇటీవల సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ బుధవారం న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఏఎమ్ కన్నివిలగర్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది. పన్నీర్ సెల్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు గోపాల్ సుబ్రమణియన్, సునీల్ ఫెర్నాండజ్ వాదించారు. ఎమ్మెల్యేలను కూవత్తూరు ఫాంహౌస్‌లో ఉంచి బెదిరింపులకు గురిచేయడంతో ఎడపాడి విశ్వాస పరీక్షలో రహస్య ఓటింగ్ విధానాన్ని అమలుచేయాలని ఒత్తిడి చేశామని న్యాయవాదులు తెలిపారు. అయితే ఇందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించిన స్పీకర్ ధనపాల్.. ఎడపాడి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారని అన్నారు. ఏకపక్షంగా సాగిన ఆనాటి విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని, రహస్య ఓటింగ్ విధానంతో మరోసారి నిర్వహించేలా ఆదేశించాలని న్యాయవాదులు కోరారు. పన్నీర్ సెల్వం వర్గం న్యాయవాదుల వాదన విన్న తరువాత సదరు పిటిషన్‌ను స్వీకరిస్తున్నట్లు న్యాయమూర్తులు ప్రకటించారు. ఈనెల 11వ తేదీకి వాయిదావేసి విచారణ చేపట్టనున్నట్లు వెల్లడించారు. సుప్రీం కోర్టు నుంచి సానుకూల పవనాలు వీచడంతో పన్నీర్‌సెల్వం గురువారం తన అనుచర ఎమ్మెల్యేలతో, ఇతర నేతలతో సమావేశమయ్యారు. బలహీనమైన నాటి బలం: ఎడపాడి ప్రభుత్వం విశ్వాసపరీక్షను ఎదుర్కొన్న నాటికి నేటికీ పార్టీలో పరిస్థితులు పూర్తిగా తారుమారయ్యాయి. అన్నాడీఎంకేలో శశికళ, పన్నీర్ వర్గాలు మాత్రమే ప్రత్యర్థులుగా నిలవగా కొత్తగా శశికళ వర్గం నుంచి ఎడపాడి, దినకరన్, ప్రభాకరన్ వర్గాలు పుట్టుకొచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటులో శశికళ వైపుండిన 122 మందిలో కొందరు దినకరన్, ప్రభాకరన్ వైపు వెళ్లిపోయి ఎడపాడిని వ్యతిరేకిస్తున్నారు. ఇక పన్నీర్‌సెల్వం వర్గం ఎలానూ ఉంది. అసెంబ్లీలో ఎడపాడి బలం తగ్గిపోయిన స్థితిలో మరోసారి విశ్వాసపరీక్షకు ఒకవేళ సుప్రీం కోర్టు ఆదేశిస్తే, ఎడపాడి ఎదుర్కోవాల్సి వస్తే పరిస్థితులు ఊహించడం కష్టం. వెయిట్ అండ్ సీ.