న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికల్లో ప్రజాతీర్పు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఓటమిని కూడా విజయంగా చెప్పుకునేందుకు ఆ పార్టీ సరికొత్త కారణాలు వెతుక్కుంటోందని సోమవారమిక్కడ అన్నారు. ప్రాంతీయ విపక్ష కూటమితో కలసి కాంగ్రెస్ బలమైన కూటమి ఏర్పాటుకు చేస్తున్న ప్రయత్నాలతో బీజేపీకి ఎలాంటి నష్టం ఉండదన్నారు. ‘2014లోనూ ఈ పార్టీలన్నీ బీజేపీని వ్యతిరేకించాయి. 2019లోనూ వీరం తా కలిసి పనిచేయటం మాకు ఇబ్బందేం కాదు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ భారీ మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వస్తుంది’ అని ఆయన చెప్పారు. ఈ కూటమిలోని చాలాపార్టీలకు వారి రాష్ట్రాల బయట పెద్దగా ప్రభావం లేవని.. అలాంటప్పుడు ఈ కూట మి అదనపు ఓట్లను ఎలా పొందగలుగుతుందన్నా రు. కాంగ్రెస్ మంత్రులు ఓటమిపాలైనప్పటికీ.. ఎం దుకు సంబరాలు చేసుకుంటున్నారో కాంగ్రెస్ చెప్పాలని షా డిమాండ్ చేశారు. విశ్వాస పరీక్ష కోసం యడ్యూరప్ప ఏడ్రోజుల గడువు అడిగినట్లు సుప్రీంకోర్టులో కాంగ్రెస్ లాయర్ అబద్ధమాడారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment