tsunami fear
-
సునామీ భయం ప్రాణాలు తోడేసింది
మనీలా: సునామీ భయం ఫిలిప్పీన్స్ పర్వతప్రాంత ప్రజల ప్రాణాలు తీసింది. అక్కడ కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితం భారీ అలలు వచ్చి పడటంతో సునామీ ముంచుకొస్తోందని మగుందనావో ప్రావిన్స్‌లోని కుసియాంగ్ గ్రామవాసులు భయపడ్డారు. గతంలో ఆ గ్రామాన్ని భయంకర సునామీ ముంచెత్తింది. నాటి నేటికీ వెంటాడుతున్నాయి. దాంతో వారంతా హుటాహుటిన కొండ వద్దకు చేరుకున్నారు. అప్పటికే కుండపోతగా కురుస్తున్న వర్షాల ధాటికి అక్కడ మట్టి, బురదచరియలు విరిగిపడి ఉన్నాయి. ఆ ఊబిలో చిక్కి దాదాపు 20 మంది సజీవ సమాధి అయ్యారు. అయితే, ఈసారి మృత్యువు మరో రూపంలో వారిని కబళించింది. వాయవ్య ఫిలిప్పీన్స్‌ను అతలాకుతలం చేస్తున్న నాల్గే తుపాను కారణంగా ఆయా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయ. ఈ తుపాను ప్రభావ వర్షాల కారణంగానే కుసియాంగ్ గ్రామంలో బురదచరియలు విరిగిపడ్డాయి. ‘ఏటా ఇక్కడి వారు సునామీ వస్తే ఎలా అప్రమత్తంగా ఉండాలనేది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఘటన జరిగినప్పుడు సైతం వార్నింగ్ బెల్స్ మోగడంతో చాలా మంది కొండ వద్ద ఉన్న చర్చి వద్దకు పరుగులు తీశారు. అదే వారి ఉసురు తీసింది’’ అని ఆ ప్రావిన్స్ మంత్రి చెప్పారు. -
భారీ భూకంపం.. సునామీ అలెర్ట్
జకార్తా: సునామీ అలెర్ట్‌తో ఇండోనేషియా తీర ప్రాంతం గజగజలాడింది. మంగళవారం ఫ్లోర్స్ ద్వీపానికి సమీపంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.7 తీవ్రతతో భూకంపం చోటుచేసుకోవటంతో ఇండోనేషియా సునామీ హెచ్చరికలను జారీ చేసింది. ఈ ఏడాది మే నెలలో కూడా సుమత్రా ద్వీపం వాయువ్య తీరంలో 6.6 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. అయితే మంగళవారం చోటు చేసుకున్న భారీ భూకంపంతో ఇండోనేషియా ప్రజలు వణికిపోతున్నారు. చదవండి: దక్షిణాఫ్రికా అధ్యక్షుడికి కోవిడ్ పాజిటివ్ గతంలో 26 డిసెంబర్ 2004లో ఇండోనేషియా సముద్రతీరంలో వచ్చిన భూకంపం.. సునామీగా మారటంతో దేశం అల్లకలోక్లమైన విషయం తెలిసిందే. వాయువ్య సుమత్రా తీరంలో 9.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఇండోనేషియా, శ్రీలంక, భారతదేశం, థాయ్‌లాండ్ మరో తొమ్మిది దేశాల్లో బీభత్సం సృష్టించింది. అప్పటి సునామి పలు దేశాల్లో వేల మందిని పొట్టనబెట్టుకుంది. ప్రస్తుతం చోటు చేసుకున్న భారీ భూకంపం 2004 సునామీని రిపీట్ చేస్తుందా? అనే ఆందోళనలో ఇండోనేషియా ప్రజలు భయపడిపోతున్నారు. -
భారీ భూకంపం.. సునామీ ప్రమాదం
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 7.9గా నమోదైంది. ఇండోనేషియాకు నైరుతి దిశగా ఈ భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ తెలిపింది. పడాంగ్ నగరానికి 808 కిలోమీటర్ల నైరుతి దిశలో భూకంప కేంద్రం ఉందని, ఇది భూమికి 10 కిలోమీటర్ల లోతులో ఉందని చెప్పింది. ఇండోనేషియా ప్రభుత్వం ఇప్పటికే సునామీ హెచ్చరికను కూడా జారీచేసింది. పశ్చిమ సుమత్రా, ఉత్తర సుమత్రా, అచె తదితర ప్రాంతాలకు ఈ సునామీ హెచ్చరిక జారీ చేశారు. ఇండోనేషియాలో ప్రధానంగా సుమత్రా, అచె ప్రాంతాలు 2004 నాటి సునామీలో తీవ్రంగా దెబ్బతిన్నాయి. పశ్చిమ ఆస్ట్రేలియా ప్రాంతానికి కూడా సునామీ ముప్పు పొంచి ఉన్నట్లు తొలుత హెచ్చరికలు జారీ అయ్యాయి. అయితే కొంతసేపటి తర్వాత ఆస్ట్రేలియా ఆ సునామీ హెచ్చరికలను ఉపసంహరించుకుంది. ఇండోనేషియా పశ్చిమతీరంలోని మెంటవాయ్ ప్రాంతంలో కమ్యూనికేషన్ల వ్యవస్థ మొత్తం కుప్పకూలింది. రేడియో ద్వారా అక్కడి అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడ ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం ఏమీ లేదని ఇండోనేషియా అధికారులు చెబుతున్నారు. తాజా భూకంపం వల్ల సంభవించిన ఆస్తినష్టం, ప్రాణనష్టాలకు సంబంధించిన సమాచారం ఏదీ ఇంతవరకు అందలేదు గానీ.. నష్టం ఎక్కువగానే ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. భూకంప తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. 2004లో వచ్చిన స్థాయిలో సునామీ వచ్చే ప్రమాదం కూడా ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. కాగా, ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో సంభవించిన ఈ భారీ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు ఇంతవరకు రిపోర్టులేవీ రాలేదని నేషనల్ మెట్రోలాజికల్ ఏజెన్సీ అధికారులు తెలిపారు.