Tubectomy
-
కోతుల కథ.. జనం వ్యథ!
విపరీతంగా సంతతి.. అడవుల్లో పండ్ల చెట్లు తగ్గడం, కోతుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో జనావాసాలపై పడుతున్నాయి. దాదాపు 25–30 ఏళ్లు జీవించే ఆడ కోతి మూడేళ్ల వయసు నుంచే గర్భం దాలుస్తుంది. ఏడాదికోసారి చొప్పున తన జీవితకాలంలో అటూఇటూగా 20–22 పిల్లలను కంటుంది. ఇలా వాటి సంతతి వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు అటవీ ప్రాంతాలున్న జిల్లాలకే పరిమితమైన కోతులు.. ఇప్పుడు మైదాన ప్రాంతాల్లోనూ గుంపులుగా ఉంటున్నాయి. ఆహారం, నీళ్ల కోసం జనావాసాలపైకి దండెత్తుతున్నాయి. ఎవరైనా వాటిని అదిలిస్తే.. వెళ్లగొట్టేందుకు ప్రయత్నిస్తే గుంపులుగా దాడికి పాల్పడుతున్నాయి. ‘హిమాచల్’ప్రయోగం మొదలుపెట్టినా.. ఇంతగా ఇబ్బందిపెడుతున్న కోతులను చంపేందుకు చట్టాలతోపాటు నమ్మకాలు కూడా అడ్డువస్తున్నాయి. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితే ఉండటంతో.. ఆ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేసింది. కోతులను పట్టుకుని ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేసి వదిలేసి.. వాటి సంతతిని నియంత్రణలో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. దీనిని స్టడీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని గండిరామన్న హరితవనంలో 2020 డిసెంబర్లో ‘మంకీ రిహాబిలిటేషన్ సెంటర్’ను ఏర్పాటు చేసింది. ఇందులో కోతులకు ట్యూబెక్టమీ, వేసెక్టమీ ఆపరేషన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ చిత్రంలో విరిగిన చేయితో, పక్కనే కర్ర, గులేర్ పెట్టుకుని పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడి పేరు ధనుంజయ్. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలోని ఎల్లారెడ్డిపేట ప్రాథమిక పాఠశాలలో టీచర్. రోజూ మధ్యాహ్న భోజన సమయంలో కోతులు విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నాయి. వంటలు, భోజనం చేసేప్పుడు ఒకరిద్దరు విద్యార్థులు పొడవాటి కర్రలను పట్టకుని కాపలా ఉండాల్సి వస్తోంది. ఇటీవల అలా వచ్చిన కోతుల గుంపును తరిమేసేందుకు ధనుంజయ్ ప్రయత్నించారు. కానీ అవి ఒక్కసారిగా ఆయనపై దాడికి రావడంతో కిందపడ్డారు. చేయి విరిగింది. ఇప్పటికీ ఇలా భయంభయంగానే పాఠాలు బోధిస్తున్నారు. ఈ చిత్రంలోని వృద్ధురాలి పేరు చాతరబోన నర్సవ్వ (70). కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆమె ఈనెల 2న మధ్యాహ్నం ఇంట్లోనే వంట పాత్రలు కడుగుతోంది. అక్కడ పడేసిన అన్నం మెతుకులను చూసిన కోతుల మంద ఒక్కసారిగా ఆమెపై దాడిచేసింది. ఇష్టారీతిన ముఖం, గొంతు, మెడ, నడుము భాగంలో రక్కాయి. చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు మహిళలు భయపడి ఇళ్లలోకి వెళ్లిపోయారు. కోతుల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నర్సవ్వను ఆస్పత్రికి తీసుకెళ్లినా బతకలేదు. .. ఇలాంటి ఒకటి రెండు ఘటనలు కాదు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి. ‘‘అరె.. ఇవేం కోతులు పొద్దున లేచినప్పటి నుంచే పరేషాన్ చేస్తున్నయ్. బయటికి అడుగు పెట్టనిస్తలేవు. పిల్లలను బడికి పంపుదామంటే మందలకు మందలు తిరుగుతున్నాయ్. ఏమైనా అంటే మీదికి వస్తున్నయ్..’’అనుకుంటూ జనం పరేషాన్ అవుతున్నారు. గుంపుగా మీదపడి రక్కుతుండటంతో భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. కుక్కల దాడులపై అంతంత మాత్రమైనా స్పందిస్తున్న ప్రభుత్వం.. కోతుల బాధను మాత్రం అసలే పట్టించుకోవడం లేదని జనం వాపోతున్నారు. ఊరిపైకి కోతులదండు వచ్చిందని తెలిస్తే.. పనులు మానుకొని మరీ, ఇళ్లలో తలుపులు వేసుకుని ఉండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. నామ్‌కే వాస్తేగానే చర్యలు.. మంకీ రిహాబిలిటేషన్ సెంటర్లో ఒక పశువైద్యాధికారి, ఒక అసిస్టెంట్‌తోపాటు నలుగురు అటవీశాఖ సిబ్బంది ఉన్నారు. ఈ కేంద్రానికి తీసుకువచ్చిన కోతులకు వారు ఆపరేషన్లు చేస్తున్నారు. కానీ ఇక్కడికి కోతులను తీసుకురావడం దగ్గరే సమస్య నెలకొంది. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. కోతులను పట్టుకుని ఇక్కడి తీసుకువచ్చే బాధ్యతను స్థానిక సంస్థలకే అప్పజెప్పింది. మొదట్లో కొన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అలా కోతులను తెచ్చాయి. అయితే కోతులను పట్టుకోవడం, వాటిని అంతదూరం తరలించడం ఇబ్బందిగా మారిందంటూ తర్వాత పట్టించుకోవడం మానేశారు. దీనితో ఇప్పటివరకు 1,176 కోతులకు మాత్రమే ఆపరేషన్లు చేయడం గమనార్హం. కోతుల బెడద నివారణలో ఎంతోకొంత ఫలితమిచ్చే ఈ అంశాన్ని సర్కారు నిర్లక్ష్యం చేస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు హిమాచల్‌ప్రదేశ్ 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా.. రాష్ట్రంలో ఒక్కటే పెట్టి వదిలేశారు. ఇక కోతుల బెడదను తప్పించేందుకు పండ్ల చెట్లతో ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా.. ఆ దిశగా పెద్దగా చర్యలు లేవని జనం వాపోతున్నారు. కోతులను తేవాలన్నా.. స్పందన తక్కువగానే.. మా కేంద్రానికి తెచ్చిన కోతులకు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేస్తున్నాం. ఇప్పటివరకు దాదాపు 528 ఆడ కోతులకు ఆపరేషన్ చేశాం. అవి మరో పదేళ్ల వరకు పిల్లలు కనే వయసు ఉన్నవే. అంటే దాదాపు 5,280 కోతులు పుట్టకుండా చేయగలిగాం. గ్రామాల్లో కోతులను పట్టి తీసుకురావాలని సూచిస్తూనే ఉన్నాం. కానీ స్పందన తక్కువగానే ఉంటోంది. – డాక్టర్ శ్రీకర్రాజు, మంకీ రిహాబిలిటేషన్ సెంటర్ -
కు.ని.ఆపరేషన్‌తో నలుగురు మృతి.. ఇంతకూ ట్యూబెక్టమీ అంటే ఏంటి?
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు ప్రాణాలు విడిచారు. 35 గంటల వ్యవధిలోనే నలుగురు మహిళలు మృత్యువాత పడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అంతేగాక రాష్ట్రంలో ఇంతటి దుర్ఘటన చోటుచేసుకోవడం ఇదే మొదటిసారని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. మరణాలకు కారణాలపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రాథమిక అంచనాకు రాలేమని తెలిపారు. కు.ని ఆపరేషన్లు కేవలం ఆడవారికే పరిమితమతున్నాయని, దీనివల్ల మహిళలకు ఇబ్బంది ఆవుతోందని తెలిపారు. తెలంగాణలో జరిగే కు. ని ఆపరేషన్లలో మగవారి శాతం కేవలం మూడేనేనని, ఈ పరిస్థితి మారాలని ఆకాంక్షించారు. చదవండి: తెలంగాణలో ఇలాంటి ఘటన ఇదే తొలిసారి.. విచారణకు ఆదేశించాం: డీహెచ్ ట్యూబెక్టమీ అంటే మహిళలకు లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక దాంపత్య జీవితాన్ని కొనసాగించవచ్చు. మహిళలకు రిస్క్.. అయితే, కుటుంబ నియంత్రణ కోసం మహిళలకు చేసే ట్యూబెక్టమీ ఆపరేషన్ పురుషులకు చేసే వ్యాసెక్టమీ ఆపరేషన్‌తో పోల్చితే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. కు.ని కోసం ఆపరేషన్లు విఫలమైన సందర్భాలు ఎక్కువగా మహిళల్లోనే కనిపిస్తుంది. మరోవైపు పురుషుల కంటే శస్త్రచికిత్సలు చేయించుకుంటున్న వారిలో మహిళలే అధికంగా ఉన్నట్లుగా వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం ప్రసవానంతరం మహిళలే ట్యుబెక్టమీ చేయించుకోవడం రివాజుగా మారిపోయింది. పురుషులు దూరంగా.. వంద మంది మహిళలు ట్యుబెక్టమీ ఆపరేషన్లు చేయించుకుంటుంటే.. పురుషులకు చేసే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వెసక్టమీ చేయించుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మహిళలకు ట్యుబెక్టమీ చేయడం మేజర్ ఆపరేషన్ లాంటిదని.. అదే పురుషుల విషయంలో వెసక్టమీ మాత్రం చాలా సులువైన, సులభమైన ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. పురుషులకు కు.ని. ఆపరేషన్ చాలా సులభమని ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పురుషులు చొరవ తీసుకోకపోవడం కలవరానికి గురిచేస్తోంది. ఈ ఆపరేషన్ల విషయంలో సరైన అవగాహన లేకపోవడం వల్లే పురుషులు ముందుకు రావడం లేదని తెలుస్తోంది. చదవండి: కుడి చేతిపై లవ్ సింబల్.. భార్య ప్రవర్తనతో భర్త షాక్.. చివరికి ఏం చేశాడంటే? ఎటువంటి కోతలు, కుట్లు అవసరం లేకుండానే సాంకేతిక పరిజ్ఞానంతో వెసక్టమీ ఆపరేషన్లు చేస్తున్నారు. అయినా కు.ని.ఆపరేషన్ చేయించుకుంటే లైంగిక జీవితంలో ఇబ్బందులు ఎదురవుతాయోమోననే భయం, అపోహతోనే పురుషులు ఈ ఆపరేషన్‌కు దూరంగా ఉంటున్నారని పలు సర్వేలు తేల్చిచెప్పాయి. అయితే పురుషులకు సంబంధించి 90 శాతానికి పైగా ఆపరేషన్లు విజయవంతమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అలాగే వారి లైంగిక జీవితానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. అయినప్పటికీ పురుషులు ముందుకు రాకపోవడం గమనార్హం. -
Gynecology: పిల్లలు కాకుండా ఆపరేషన్.. అప్పుడే మళ్లీ మునుపటిలా భర్తతో..
నాకిప్పుడు 35 ఏళ్లు. పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ఎన్. సుకన్య, ఆమ్రబాద్ లాపరోస్కోపిక్ ట్యూబెక్టమీ అనే డే కేర్ ఆపరేషన్ ద్వారా కుటుంబ నియంత్రణకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. ఈ చికిత్సలో గర్భం రాకుండా ఫాలోపియన్ ట్యూబ్స్‌ను బ్లాక్ చేసేస్తారు. జనరల్ ఎనస్తీషియా ఇచ్చి, పొట్ట మీద పెద్ద గాట్లేమీ లేకుండా చిన్నగా రెండు రంధ్రాలు చేసి ఈ చికిత్స చేస్తారు. ఆపరేషన్ తర్వాత కొన్ని గంటల్లోనే ఇంటికి వెళ్లిపోవచ్చు. పొట్ట మీద ఆపరేషన్ తాలూకు మచ్చలు కూడా చాలా చిన్నగా చర్మంలో కలిసిపోయేలా ఉంటాయి. ఈ చికిత్సకు అరగంట నుంచి నలభై నిమిషాల సమయం పడుతుందంతే! ఎనస్తీషియా ప్రభావం తగ్గాక కాస్త నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి తెలియకుండా ఉండడానికి పెయిన్ కిల్లర్స్, వాంతి రాకుండా మందులు ఇస్తారు. ఆపరేషన్ అయిన కాసేపటి తర్వాత మంచి నీళ్లు, తేలికపాటి ఆహారాన్ని ఇస్తారు. బొడ్డు దగ్గర ఒకటి, పొట్ట సైడ్‌లో ఒకటి కట్స్ ఉంటాయి. వీటిని బ్యాండ్ ఎయిడ్‌తో కవర్ చేసుకోవాలి. ప్రతిరోజూ స్నానం చేసిన తర్వాత కట్స్ దగ్గర శుభ్రంగా తుడుచుకొని, డ్రెస్సింగ్ చేసుకోవాలి. ఇతర ఆరోగ్య సమస్యలేమీ లేకపోతే ఆపరేషన్ అయిన వారానికి అంతా మానిపోయి చక్కగా కోలుకుంటారు. కుట్లు తీయాల్సిన అవసరం లేదు. వారం వరకు విశ్రాంతి తీసుకోవాలి. ఈ కట్స్ దగ్గర చీము పట్టినా, జ్వరం వచ్చినా, బాడీ రాష్ ఉన్నా, నొప్పి ఉన్నా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. కొంతమందికి ఒకటి రెండు రోజులు కొంచెం స్పాటింగ్ అవచ్చు. కంగారు పడొద్దు. మీ శరీర తత్వాన్ని బట్టి రెండు రోజుల్లో తేలికపాటి రోజూవారీ పనులు చేసుకోవచ్చు. కానీ బరువులు ఎత్తడం, దూర ప్రయాణాలు వంటివి చేయకూడదు. బోర్లా పడుకోవద్దు. వ్యాయామాలు, జిమ్‌కి వెళ్లడం వంటివి నెల రోజుల తరువాతే మొదలుపెట్టాలి. శారీరకంగా, మానసికంగా పూర్తిగా కోలుకున్నాక భర్తతో కాపురం చేయొచ్చు. మేడమ్.. మా మేనత్తకు ఈ మధ్యే పాప్ టెస్ట్ చేశారు. పాప్ టెస్ట్ అంటే ఏంటో చెప్పగలరు? – కె. సబిత, కంచిలి గర్భాశయ ముఖ ద్వారాన్ని సెర్విక్స్ అంటారు. ఇక్కడ అంటే ఈ సెర్విక్స్ లేదా సర్వైకల్ సెల్లో ఏవైనా మార్పులు ఉంటే పాప్ టెస్ట్ చేస్తారు. సాధారణంగా సర్వైకల్ సెల్లో కనిపించే మార్పులు క్యాన్సర్‌గా మారడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కొన్నిసార్లు అవి నార్మల్ అవచ్చు కూడా. కాబట్టి ఈ టెస్ట్‌లో అబ్నార్మల్ రిజల్ట్ వస్తే అడ్వాన్స్డ్ టెస్ట్‌ని సూచిస్తారు డాక్టర్లు. ఆ పరీక్షల్లో కూడా మార్పులు కనిపిస్తే అప్పుడు ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. పాప్ టెస్ట్‌ను నెలసరి అయిన వారంలోపు చేయాలి. అదీ గైనిక్ అవుట్ పేషంట్ వార్డ్‌లోనే చేస్తారు. పది నిమిషాలు పడుతుంది. వారంలో టెస్ట్ రిపోర్ట్ వస్తుంది. ఈ వైద్య పరీక్ష వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ టెస్ట్ వల్ల సెర్విక్స్ క్యాన్సర్‌ను తొందరగా పసిగట్టవచ్చు. దాంతో వెంటనే చికిత్స అంది, త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. పాప్ టెస్ట్‌ను పాతికేళ్లు వచ్చినప్పటి నుంచి ప్రతి మూడేళ్లకొకసారి చేయించుకోవాలి. యాభై నుంచి అరవై అయిదేళ్ల మధ్య వయస్కులు ప్రతి అయిదేళ్లకు ఒకసారి చేయించుకోవాలి. ఈ టెస్ట్‌లో హెచ్‌పీవీ టెస్ట్‌ను కూడా కలిపి చేయించుకోవచ్చు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌తో హెచ్‌పీవీ ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షణ పొందవచ్చు. ∙మేడమ్.. నాకు డెలివరీ అయ్యి నెలవుతోంది. బేబీకి నా పాలే ఇస్తున్నాను. కానీ రెండు రోజుల (ఈ ఉత్తరం రాస్తున్నప్పటికి) నుంచి బ్రెస్ట్‌లో ఒకటే నొప్పి, చలి జ్వరం. ఈ టైమ్‌లో బేబీకి నా పాలు పట్టొచ్చా? – పి. సుధారాణి, తిరుపతి తల్లి పాలు ఇచ్చేప్పుడు బ్రెస్ట్‌లో నొప్పి, మంట ఉంటాయి కొంచెం. వేడినీళ్లతో కాపడం పెడితే తగ్గుతుంది. కానీ జ్వరం కూడా ఉంది అంటున్నారు కాబట్టి.. బ్రెస్ట్‌లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందేమో చెక్ చేయించుకోవడానికి డాక్టర్‌ను సంప్రదించాలి. దీనిని Mastitis అంటారు. బేబీ నోటిలో, ముక్కులో ఉండే సాధారణమైన బ్యాక్టీరియా తల్లి బ్రెస్ట్ ఇన్ఫెక్షన్కు కారణం కావచ్చు. త్వరగా గమనించి చికిత్స చేస్తే జ్వరం రాదు. దీనివల్ల బ్రెస్ట్‌లో విపరీతమైన నొప్పి, జ్వరం, తలనొప్పి కూడా వస్తాయి. బ్యాక్టీరియా బ్రెస్ట్ నిపిల్ మీది పగుళ్ల ద్వారా లోపలికి వెళ్లి మిల్క్ డక్ట్‌ను ఇన్ఫెక్షన్తో బ్లాక్ చేస్తుంది. మీకు డయాబెటిస్ లేదా నిపిల్ మీద పగుళ్లు ఉంటే బ్రెస్ట్‌లో గడ్డ అయ్యే చాన్స్ పెరుగుతుంది. మీరు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. చూసి, కొన్ని రక్త పరీక్షలు చేసి యాంటిబయాటిక్ మందులు ఇస్తారు. అవీ పాలు తాగే బిడ్డకు సురక్షితంగా ఉండేవే. ఈ టైమ్‌లో కూడా మీరు మీ బిడ్డకు డైరెక్ట్గానైనా లేదా పాలను పిండైనా పట్టవచ్చు. నిపిల్ పగుళ్లకు క్రీమ్ ఇస్తారు. ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండానికి చనుమొనలను శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే రెండు రొమ్ముల నుంచి సమంగా పాలు పట్టాలి. పోషకాహారం, మంచి నీళ్లను ఎక్కువగా తీసుకోవాలి. త్వరగా Mastitisకు చికిత్సను అందిస్తే అది గడ్డలా మారదు. ఇన్ఫెక్షన్ ఎక్కువై, రొమ్ములో వాపు వస్తే చిన్న ఆపరేషన్ చేసి పాలగడ్డలను, చీమును తీయవలసి వస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు పాలిస్తూ ఉండాలి. జ్వరం ఉన్నా బిడ్డకు తల్లిపాలు పట్టొచ్చు. పాలిచ్చే సమయంలో శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. ఇలాంటి ఇన్ఫెక్షన్ తగ్గిన తరువాత కూడా బ్రెస్ట్ పంప్‌తో ఎక్కువైన పాలను తీసేస్తూ జాగ్రత్తగా ఉండాలి. -డా. భావన కాసు గైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్ హైదరాబాద్