అయిదు నెలల కనిష్టానికి రుపీ
ముంబై: దేశీయ కరెన్సీ శుక్రవారం మరింత బలహీనపడింది. డాలర్ మారకపు విలువలో రూపాయి 32పైసలు నష్టపోయి 68 దిగువకు పడిపోయింది. దిగుమతిదారుల నుంచి డాలర్‌కు డిమాండ్ భారీగా ఉండడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రారంభంలోనే పతనాన్ని నమోదు చేసింది. రూ.68 దిగువకు చేరి 5నెలల కనిష్టాన్నితాకింది. ప్రస్తుతం 25 పైసల నష్టంతో 68.08 వద్ద ట్రేడవుతోంది. దేశీస్టాక్స్లో ఎఫ్ఐఐల నిరవధిక అమ్మకాలు, ప్రపంచ ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 14నెలల గరిష్టానికి చేరడం దిగుమతిదారుల నుంచి డాలర్ కు భారీ డిమాండ్ లాంటి అంశాలు కారణమని విశ్లేషకులు పేర్కొన్నారు. దీంతోపాటుగా విదేశీ ఫండ్ ప్రవాహాల రూపాయిపై ఒత్తిడి ఉంచింది చేసిందని డీలర్లు చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జానెట్ యెల్లెన్ డిసెంబర్ లో క్రింది వడ్డీ రేటు పెంపు సూచనలు అందించడంతో డాలర్ మద్దతు లభించిందని చెబుతున్నారు. ఇది దేశీయ కరెన్సీని మరింత దెబ్బతీసిందన్నారు..
అటు దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభనష్టాలమధ్య ఊగిసలాడుతండగా,పసిడి ధరలు కూడా బలహీనంగానే ఉండటం గమనార్హం.