tungabadra dam
-
తుంగభద్ర ప్రాజెక్టులో కొనసాగుతున్న నీటి వృథా
-
కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్ గేటు.. పోటెత్తిన నీరు
హోస్పేట్/కర్నూలు: కర్ణాటకలోని హోస్పేట్లో ఉన్న తుంగభద్ర డ్యామ్ 19వ గేటు ఊడిపోవడంతో నీరు బయటికి పోటెత్తింది. డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం(ఆగస్టు10) అర్ధరాత్రి డ్యామ్ గేట్లు మూసేందుకు అధికారులు ప్రయత్నించారు. ఈ సమయంలో 19వ గేటు చైన్ తెగి గేటు మొత్తం కొట్టుకుపోయింది. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటికి వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపడతామని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయాన్నే డ్యామ్‌ను కొప్పాల్ జిల్లా ఇంఛార్జ్ మంత్రి శివరాజ్ సందర్శించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్ నుంచి నీరు బయటికి వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు బయటికి పోతోంది. డ్యామ్ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద ఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అప్రమత్తంగా ఉండండి.. ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తుంగభద్ర డ్యామ్ కొట్టుకుపోవడంతో కర్నూలు జిల్లా కౌతాలం, కోసిగి, మంత్రాలయం, నందవరం మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ కోరింది. ఈ మేరకు సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. అవసరమైతే సహాయంకోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070,112, 18004250101 సంప్రదించాలని సూచించింది. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. కాలువలు వాగులు దాటే ప్రయత్నం చేయరాదని కోరింది. -
జలకళను సంతరించుకున్న తుంగభద్ర డ్యామ్
-
నీటి లెక్కలు తేలాకే ‘నవలి’పై చర్చిద్దాం
సాక్షి, అమరావతి: తుంగభద్ర డ్యామ్‌కు ఎగువన కర్ణాటకలో కొప్పళ జిల్లా నవలి వద్ద 52 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి అంగీకరించాలన్న ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తోసిపుచ్చింది. కర్ణాటక సర్కారు ఇప్పటికే ఎగువన తుంగ, భద్ర డ్యామ్, సింగటలూరు బ్యారేజీ, సింగటలూరు ఎత్తిపోతల ద్వారా కేటాయించిన నీటి కంటే అధికంగా మళ్లిస్తుండటం వల్ల తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత తగ్గుతోందని స్పష్టం చేసింది. కర్ణాటక అధికంగా తరలిస్తున్న నీటిని లెక్కించాకే నవలి రిజర్వాయర్‌పై చర్చిద్దామని స్పష్టం చేసింది. తుంగభద్ర బోర్డు సర్వసభ్య సమావేశాన్ని చైర్మన్ డి.రంగారెడ్డి గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించారు. పూడికతో నీటి లభ్యత తగ్గింది: కర్ణాటక తుంగభద్ర జలాశయం(టీబీ డ్యామ్)లో పూడిక పేరుకుపోవడం వల్ల నీటి లభ్యత తగ్గిందని బోర్డు సమావేశంలో కర్ణాటక జలవనరుల కార్యదర్శి అనిల్‌కుమార్ పేర్కొన్నారు. నవలి వద్ద రిజర్వాయర్‌తోపాటు శివపుర చెరువు సామర్థ్యాన్ని 4.25 టీఎంసీలకు, విఠల్‌పుర చెరువు సామర్థ్యాన్ని 1.56 టీఎంసీలకు పెంచి ఎడమ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామన్నారు. దీనివల్ల తుంగభద్ర జలాశయంపై ఒత్తిడి తగ్గి 3 రాష్ట్రాలు కేటాయింపుల మేరకు నీటిని వాడుకోవచ్చని ప్రతిపాదించారు. అధికంగానే తరలిస్తోంది: ఏపీ ఈఎన్సీ కర్ణాటక ప్రతిపాదనను ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తోసిపుచ్చారు. నవలి రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందన్నారు. 2008లో టోపోగ్రాఫిక్ సర్వేలో టీబీ డ్యామ్ నీటి నిల్వ సామర్థ్యం 100.86 టీఎంసీలుగా తేల్చారని, 2016 సర్వేలో మాత్రం 104.869 టీఎంసీలుగా లెక్క కట్టారని తెలిపారు. వీటిని పరిగణనలోకి తీసుకుంటే టీబీ డ్యామ్ నుంచి కర్ణాటక సర్కార్ భారీ ఎత్తున నీటిని తరలిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. నీటి లెక్కలను తేల్చాకే నవలి రిజర్వాయర్ అంశాన్ని చర్చించాలని స్పష్టం చేశారు. తుంగభద్ర వరద జలాలను ఒడిసి పట్టేందుకు హెచ్చెల్సీకి సమాంతరంగా రోజుకు ఒక టీఎంసీ తరలించే సామర్థ్యంతో వరద కాలువ తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరారు. డీపీఆర్‌లు అందచేస్తే పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని బోర్డు చైర్మన్ రంగారెడ్డి తెలిపారు. బోర్డు పరిధిలో చేపట్టే పనులకు రివర్స్ టెండరింగ్ వర్తింపచేస్తామన్నారు. కాగా, ఆర్డీఎస్ ఆధునికీకరణ పనులు చేపట్టేందుకు సహకరించాలన్న తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ ప్రతిపాదనపై ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కార్ నిధులు డిపాజిట్ చేస్తే తమ భూభాగంలో ఉన్న ఆర్డీఎస్ను ఆధునికీకరించే పనులు చేపడతామన్నారు. ఆర్డీఎస్ను తుంగభద్ర బోర్డు పరిధిలోకి తేవాలన్న వాదనను తిప్పికొట్టారు. పుష్కరాలు నిర్వహిస్తున్నందున తుంగభద్ర డ్యామ్ నుంచి 15 రోజుల్లో 8 టీఎంసీలు విడుదల చేయాలని కోరారు. చదవండి: ఏపీ: స్కూళ్లు, కళాశాలలకు ప్రత్యేక మార్గదర్శకాలు -
మూడు వైపుల నుంచి వరద
సాక్షి, హైదరాబాద్: ఎగువన కుండపోత వర్షాలు, ఉప్పొంగుతున్న వాగులు, వంకలు, ఉపనదుల్లో పెరుగుతున్న వరద ఉధృతితో కృష్ణానది రోజురోజుకూ మహోగ్ర రూపం దాల్చుతోంది. మహారాష్ట్ర, కర్ణాటకలో 15రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి ఏకంగా 6.30 లక్షల క్యూసెక్కులకు పైగా వరద వస్తోంది. జూరాల దిగువకు 2009 తర్వాత అంతటి స్థాయిలో శనివారం 6.10 లక్షల క్యూసెక్కులు (57.27 టీఎంసీ) ల మేర ప్రవాహం నమోదైంది. ఓ పక్క ఎగువ కృష్ణా నుంచి, మరోపక్క భీమా, ఇంకోపక్క తుంగభద్ర నుంచి వరద వస్తుండటంతో ఈ ప్రవాహాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. వచ్చిన నీటిని వచ్చినట్లుగా దిగువకు వదులుతుండటంతో శ్రీశైలం, నాగార్జునసాగర్‌లకు వరద పోటెత్తింది. మూడు నదుల ఉరకలు కృష్ణానది జన్మస్థానమైన మహాబలేశ్వర్ పర్వతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎగువ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి భారీగా వరద వస్తోంది. ఈ రెండు జలాశయాల నుంచి శనివారం సాయంత్రం నీటి విడుదలను 6.25 లక్షల క్యూసెక్కులకు పెంచారు. కృష్ణానదికి ప్రధాన ఉపనది అయిన భీమాపై మహారాష్ట్రలో నిర్మించిన ఉజ్జయిని ప్రాజెక్టు పూర్తి గా నిండింది. వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగు వకు విడుదల చేస్తుండటంతో 95 వేల క్యూసెక్కుల నీరు జూరాలకు చేరుతోంది. ఇక జూరాల నుంచి 6.30 లక్షల క్యూసెక్కుల నీటిని శ్రీశైలాన్ని చేరుతున్నాయి. బుధవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.49 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా నీటి నిల్వ 215 టీఎంసీలకు గానూ 205 టీఎంసీలకు చేరింది. ఈ వరద ఉధృతి ఆదివారానికి 5.50 లక్షలకు చేరుతుందని అధికార వర్గాలు అంచనా . ప్రస్తుతం శ్రీశైలం నుంచి 10 గేట్ల ద్వారా 5.65 లక్షల క్యూసెక్కుల నీటిని సాగర్‌కు వదులుతున్నారు. మరోవైపు.. కృష్ణా ప్రధాన ఉపనది అయిన తుంగభద్రలోనూ వరద పెరుగుతోంది. తుంగభద్ర ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తి 63,440 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సుంకేసుల నుంచి తుంగభద్ర వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తారు. ఈ జలాలు కృష్ణా ప్రవాహంతో కలిసి శ్రీశైలాన్ని చేరనున్నాయి. మూడు వైపుల నుంచి వరద చేరితే కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చనుంది. పదేళ్లలో ఎన్నడూ లేని రీతిలో ఈ ఏడాది కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 2009–10లో గరిష్టంగా 1,218.55 టీఎంసీల జలాలు వచ్చాయి. ఈ ఏడాది ఇప్పటికే శ్రీశైలం జలాశయంలోకి 230 టీఎంసీలకుపైగా వచ్చాయి. వరద ప్రవాహ ఉధృతికి గతంలో ఎన్నడూలేని రీతిలో.. ఆగస్టు 9నే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తడం గమనార్హం. -
బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతోంది
సాక్షి, హైదరాబాద్: కృష్ణమ్మకు వరద పోటెత్తుతోంది. ఎగువ మహారాష్ట్రలోని మహాబలేశ్వర్‌లో కురుస్తున్న వర్షాలకు తోడు, కర్ణాటక పరీవాహకంలో కురుస్తున్న వర్షాలతో బేసిన్ ప్రాజెక్టుల్లోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లోకి రోజురోజుకీ ప్రవాహాలు ఉధృతమవుతున్నాయి. బుధవారం ఈ ప్రాజెక్టుల్లోకి లక్ష క్యూసెక్కుల మేర వరద రాగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. మరోపక్క తుంగభద్రలోనూ వరద రెండ్రోజుల్లో లక్ష క్యూసెక్కుల నుంచి రెండు లక్షల క్యూసెక్కులకు పెరిగింది. మరో వారం రోజులపాటు ఇదే స్థాయిలో వరద ప్రవాహం కొనసాగే అవకాశం ఉండటంతో దిగువ శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారే అవకాశం ఉందని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మరో 63 టీఎంసీలు వస్తే శ్రీశైలం నిండుకుండ.. ఆల్మట్టిలోకి బుధవారం సాయంత్రం 1.08 లక్షల క్యూసెక్కుల మేర వరద ప్రవాహం వచ్చి చేరుతుండగా లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలతో నారాయణపూర్‌కు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతేనీటిని దిగువకు వదిలారు. మరో పక్క తుంగభద్రకు మంగళవారం 1.12 లక్షల క్యూసెక్కుల మేర వరద రాగా, అది బుధవారానికి 1.55 లక్షల క్యూసెక్కులకు పెరిగింది. ప్రాజెక్టులో 95 టీఎంసీల నిల్వ ఉండటంతో అక్కడి నుంచి 2లక్షల క్యూసెక్కులు వదిలేస్తున్నారు. ఎగువ ప్రవాహాలు పెరగడంతో రాష్ట్ర పరిధిలోని జూరాలకు లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, 1.05 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. జూరాల నుంచి వస్తున్న నీటికి తోడు తుంగభద్ర నుంచి వస్తున్నప్రవాహాలతో శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తోంది. దీంతో ప్రస్తుతం శ్రీశైలంలో 215 టీఎంసీలకుగానూ 152.16 టీఎంసీల నిల్వలున్నాయి. మరో 63 టీఎంసీలు చేరితే ప్రాజెక్టు నిండే అవకాశం ఉంది. గురువారం నుంచి వరద ఉధృతి పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్మట్టి నుంచి శ్రీశైలం, తుంగభద్ర నుంచి శ్రీశైలం వరకు నదీ గర్భంలోనే కనిష్టంగా 70 నుంచి 80 టీఎంసీల లభ్యత ఉంటుందని నీటిపారుదల వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ మేర శ్రీశైలానికి నీరు చేరినా, ప్రస్తుత సీజన్లో తెలుగు రాష్ట్రాల అవసరాలు తీరినట్టేనని అంటున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్ అవసరాల దృష్ట్యా శ్రీశైలం నుంచి 39,090 క్యూసెక్కుల నీటిని వదలడంతో సాగర్‌లోకి 31,802 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ప్రాజెక్టుమట్టం 312 టీఎంసీలకు గానూ 155.92 టీఎంసీలకు చేరింది. మరో 157 టీఎంసీల నీరు చేరితే సాగర్ నిండే అవకాశం ఉంది. అయితే శ్రీశైలం నుంచి ఏపీ ఎప్పటికప్పుడు పోతిరెడ్డిపాడు, హంద్రీనీవా, కేసీ కెనాల్ ద్వారా నీటిని తోడేస్తుండటంతో సాగర్ ఎప్పటిలోగా నిండుతుందనేది చెప్పడం కష్టంగా మారింది. -
తుంగభద్ర డ్యామ్‌లో పెరుగుతున్న నీటిమట్టం
- 26 టీఎంసీలకు పైగా చేరిన నీరు - ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకం సాక్షి, బళ్లారి : కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల జీవనాడి అయిన తుంగభద్ర డ్యాంలో నీటిమట్టం రోజు రోజుకు పెరుగుతోంది. తుంగభద్ర డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్ధ్యం 101 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 26 టీఎంసీలకు పైగా నీరు నిల్వ చేరడంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలతో పాటు అనంతపురం, కర్నూలు, కడప, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన రైతుల్లో ఆశలు చిగురించాయి. ప్రస్తుతం డ్యాంలోకి 26 వేల క్యూసెక్కుల నీరు ఇన్‌ఫ్లో రూపంలో చేరుతోంది. ఇదే ఇన్‌ఫ్లో మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని బోర్డు అధికారులు పేర్కొంటున్నారు. తుంగభద్ర డ్యాంలో గత ఏడాది ఇదే సమయానికి 13 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, ప్రస్తుతం 26 టీఎంసీల నీరు నిల్వ చేరడంతో రెండింతల నీరు వచ్చినట్లయింది. దీంతో ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఢోకా ఉండబోదని చెప్పవచ్చు. సకాలంలో ఆయకట్టు కాల్వలకు నీరు వదిలితే పంటలు సాగు చేసుకునేందుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. తుంగభద్ర డ్యాంకు ఎగువన నదీ పరివాహక ప్రాంతంలో మరోసారి భారీ వర్షాలు కురిస్తే జూలై నెలాఖరు కల్లా తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టీబీ డ్యాం నీటిమట్టం 1604.04 అడుగులు కాగా ఇన్‌ఫ్లో 26606 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 180 క్యూసెక్కులు, నీటి నిల్వ 25.131 టీఎంసీలు ఉందని, గత ఏడాది ఇదే సమయానికి డ్యాంలో నీటిమట్టం 1594.16 అడుగులు ఉండగా, ఇన్‌ఫ్లో 1703 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 205 క్యూసెక్కులు, నీటి నిల్వ సామర్ధ్యం 13.331 టీఎంసీలుగా ఉందని బోర్డు వర్గాలు తెలిపాయి.