tunnel route
-
ఇజ్రాయెల్ బాంబుల వర్షం.. అల్లాడిపోతున్న గాజా
జెరూసలేం: హమాస్ మిలిటెంట్ సంస్థ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ తీవ్రతరం చేస్తోంది. దానిపై భూతల దాడుల తీవ్రతను శనివారం మరింత పెంచింది. పదాతి దళం, సాయుధ వాహనాలు గాజాకేసి దూసుకెళ్తున్నాయి. వాటికి దన్నుగా విమానాలు, యుద్ధ నౌకల నుంచి భారీ రాకెట్ దాడులు కొనసాగుతున్నాయి. హమా స్ నిర్మించుకున్న భూగర్భ సొరంగాలే లక్ష్యంగా బాంబుల వర్షం కురుస్తోంది. వాటి తీవ్రత యుద్ధం మొదలైన ఈ మూడు వారాల్లో కనీవినీ ఎరగనంత ఎక్కువగా ఉందంటూ గాజావాసులు ఆక్రోశిస్తు న్నారు. వాటి దెబ్బకు గాజాలో ఇప్పటిదాకా మిగిలి ఉన్న అరకొర సమాచార వ్యవస్థలన్నీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. దాంతో గాజాలోని 23 లక్షల మందికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయినట్టేనని భావిస్తున్నారు. దాడుల ఫొటోల విడుదల గాజాలోకి నెమ్మదిగా ప్రవేశిస్తున్న యుద్ధ ట్యాంకుల వరుసలు తదితరాల ఫొటోలను ఇజ్రాయెల్ సైన్యం విడుదల చేసింది. భారీ సంఖ్యలో సైన్యం, ట్యాంకులు సరిహద్దులకు చేరుకుంటున్నాయి. ‘‘మా సైన్యాలు గాజాను కమ్ముకుంటున్నాయి. యుద్ధం కొనసాగుతోంది’’ అని సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగరీ ప్రకటించారు. మరోవైపు, యుద్ధం కీలక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ప్రకటించారు. ‘‘గత రాత్రి గాజాలో భూకంపం పుట్టించాం. నేలమీద, భూగర్భంలో ఉన్న హమాస్ స్థావరాలపై భారీగా దాడులకు దిగాం’’ అని వివరించారు. గాజాపై ఇప్పటిదాకా రాత్రిపూట దాడులకే సైన్యం పరిమితమవుతూ వచి్చంది. కానీ ఇక ఆ ప్రాంతమంతటినీ ఆక్రమించడమే ఇప్పుడు ఇజ్రాయెల్ లక్ష్యమని చెబుతున్నారు. అయితే హమాస్ విస్తృత భూగర్భ నెట్వర్క్ తదితరాలను నాశనం చేసేందుకు చాలా సమయం పడుతుందన్న సైన్యం వ్యాఖ్యల నేపథ్యంలో పోరుకు ఇప్పట్లో తెర పడే సూచనలు కని్పంచడం లేదు...! ఆస్పత్రే హమాస్ కేంద్రం! గాజాలోని అతి పెద్ద ఆస్పత్రి అయిన షిఫా నిజానికి హమాస్ మిలిటెంట్ సంస్థ ప్రధాన కార్యాలయమని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఆస్పత్రి కిందే దాని ప్రధాన స్థావరం దాగుందని పేర్కొంది. ఇందుకు సంబంధించి తమ దగ్గరున్న సమాచారం ఆధారంగా రూపొందించిన ఓ సిమ్యులేటెడ్ వీడియోను కూడా సైన్యం విడుదల చేసింది. వందలాది మంది హమాస్ మిలిటెంట్లు ఆస్పత్రి కింద తలదాచుకున్నారని పేర్కొంది. ‘‘ఆస్పత్రి కింద లెక్కలేనన్ని భూగర్భ కాంప్లెక్సులున్నాయి. ఉగ్రవాదులు వాటిని యథేచ్ఛగా వాడుకుంటున్నారు’’ అని ఆరోపించింది. ఆస్పత్రి కింద ఉన్న నెట్వర్క్ మొత్తాన్నీ బట్టబయలు చేసి తుడిచి పెట్టి తీరుతామని ప్రకటించింది. షిఫా ఆస్పత్రి కాంప్లెక్స్‌పై భారీ దాడికి సైన్యం సిద్ధమవుతున్నట్టు వార్తలు వస్తుండటం తెలిసిందే. హమాస్ దురాగతాలు ఐసిస్‌ను మించిపోయాయని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ దుయ్యబట్టారు. ఆస్పత్రులనే ప్రధాన స్థావరాలుగా మార్చుకునే నైచ్యానికి ఒడిగట్టారని మండిపడ్డారు. ఈ ఆరోపణలను హమాస్ ఖండించింది. గాజాకు స్టార్‌లింక్ కనెక్టివిటీ గాజాలో పాలస్తీనియన్లకు కనీస సౌకర్యాలు అందించేందుకు ప్రయతి్నస్తున్న అంతర్జాతీయ సంస్థలకు స్టార్‌లింక్ నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ తదితర కనెక్టివిటీ సౌకర్యం కలి్పస్తామని టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ శనివారం ప్రకటించారు. గాజాలో అన్ని సమాచార సదుపాయాలనూ ధ్వంసం చేయడం దారుణమంటూ అమెరికా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కొరెట్జ్ చేసిన వ్యాఖ్యలకు స్పందనగా మస్క్ ఈ మేరకు ప్రకటన చేశారు. స్టార్ లింక్ మస్క్ తాలూకు అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ ఎక్స్‌కు చెందిన ఉపగ్రహ నెట్వర్క్ వ్యవస్థ. 7,700 దాటిన మృతులు ► అక్టోబర్ 7న మొదలైన ఇజ్రాయెల్–హమాస్ పోరాటంలో గాజాలో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య ఇప్పటికే 7,700 దాటింది. ► వీరిలో చాలామంది బాలలు, మహిళలేనని పాలస్తీనా ప్రకటించింది. ► శుక్రవారం సాయంత్రం నుంచే కనీసం 550 మందికి పైగా మరణించినట్టు సమాచారం. ► గతంలో ఇజ్రాయెల్–హమాస్ మధ్య జరిగిన నాలుగు పోరాటాల్లోనూ కలిపి దాదాపు 4,000 మంది మరణించినట్టు అంచనా! ► అక్టోబర్ 7న హమాస్ జరిపిన మెరుపు దాడిలో 1,400 మంది దాకా ఇజ్రాయెలీలు మరణించడం తెలిసిందే. వీరిలో 311 మంది సైనికులని ప్రభుత్వం ప్రకటించింది. సర్వం స్తంభించింది... ఇజ్రాయెల్ దాడుల ధాటికి గాజాలో సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది. దాంతో వైద్య సేవలు పూర్తిగా పడకేసినట్టు ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి అష్రఫ్ అల్ఖిద్రా తెలిపారు. ► అంబులెన్స్‌లకు సమాచారమివ్వడం అసాధ్యంగా మారిపోయింది. ► అవసరమైన చోట్లకు ఎమర్జెన్సీ బృందాలను పంపడం నిలిచిపోయింది. ► ఇజ్రాయెల్ సైనిక వాహనాల హోరు, బాంబుల మోతల మధ్యే వైద్య బృందాలతో కూడి న వాహనాలు క్షతగాత్రుల కోసం చెదురుమదురుగా వెదుకులాడుతున్నాయి. ► చాలాచోట్ల గాయపడ్డవారిని పౌరులే తమ వాహనాలపై ఆస్పత్రులకు చేరుస్తున్నారు. ► బాంబు దాడుల ధాటికి నేలమట్టమవుతున్న ఒక వీధిలో నుంచి పాలస్తీనియన్లు హాహాకారాలు చేస్తూ పరుగులు తీస్తుండటం స్థానిక మీడియా విడుదల చేసిన వీడియోలో కనిపిస్తోంది. గాయాలతో కుప్పకూలి అల్లాడుతున్న ఒక వ్యక్తి అంబులెన్స్ అని అరుస్తుండటం అందులో కనిపిస్తోంది. ► తాము కేవలం హమాస్ మిలిటెంట్లను మాత్రమే లక్ష్యం చేసుకుని దాడులకు దిగుతున్నామని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. కానీ వారు పౌరులను అడ్డుపెట్టుకుంటున్నారని ఆరోపించారు. బందీల బంధువుల నిరసన అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు చెరపట్టిన 200 మంది పై చిలుకు ఇజ్రాయెలీల బంధువులు టెల్ అవీవ్ నగరంలో నిరసనకు దిగారు. ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ వచ్చి తమ గోడు వినాలంటూ నినాదాలు చేశారు. బందీలను విడిపించి వెనక్కు తీసుకొచ్చే ఆలోచన ఎవరూ చేయడం లేదంటూ మండిపడ్డారు. ► హమాస్ చెరలో 229 మంది ఉన్నట్టు సైనిక అధికార ప్రతినిధి హగరీ నిర్ధారించారు. అయితే వారిని విడుదల చేస్తే కాల్పులు విరమిస్తామని ప్రతిపాదించినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చారు. ► ఖతర్, ఈజిప్ట్ మధ్యవర్తిత్వం ఫలితంగా నలుగురు బందీలను హమాస్ ఇటీవల విడుదల చేయడం తెలిసిందే. -
టూమచ్: గడ్కరీ ట్వీట్ చేశాకే అందరికీ తెలిసింది
Kuthiran Tunnel: ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న ప్రాజెక్టు లాంఛింగ్ గురించి ఆ రాష్ట్ర ప్రభుత్వానికే కనీస సమాచారం లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కేరళ కుథిరన్ టన్నెల్.. ఎన్‌హెచ్ 544పై మన్నూథి-వడక్కన్‌చెరి మధ్య కేరళ సర్కార్ నిర్మించిన ఈ ట్విన్ ట్యూబ్ టన్నెల్(సొరంగ మార్గాలు). శనివారం ఎలాంటి సమాచారం లేకుండానే తెరుచుకోవడం అక్కడి మంత్రులు, అధికారుల్ని విస్మయానికి గురి చేసింది. తిరువనంతపురం: కుథిరన్(త్రిస్సూర్) వద్ద కేరళ-తమిళనాడు, కర్ణాటక జాతీయ రహదారులను కలుపుతూ మార్గం ఉంటుంది. అయితే ఇక్కడ ట్రాఫిక్‌జామ్‌లో గంటల తరబడి వాహనదారులు ఎదురు చూడాల్సి వచ్చేది. అంతేకాదు ఇరుకు రహదారి, ప్రమాదకరమైన మలుపులతో తరచూ ప్రమాదాలు కూడా జరుగుతుండేవి. దీంతో ఆరు లైన్ల రోడ్డుకి అనుసంధానిస్తూ.. పీచీ-వలహని వైల్డ్ లైఫ్ శాంక్చురీ వద్ద కొండల్ని తొలగించి సుమారు 964 మీటర్ల పొడవుతో రెండు సొరంగ మార్గాలు నిర్మించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఈ సొరంగం వల్ల కొచ్చి-కొయంబత్తూర్‌ల మధ్య దూరం 3 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ప్రధాన ట్రాఫిక్ సమస్య-ప్రమాదాలకు చెక్ పెట్టొచ్చని కేరళ భావించింది. హైదరాబాద్‌కు చెందిన కేఎంసీ కంపెనీ, సబ్‌కాంట్రాక్ట్‌తో ది ప్రగతి గ్రూప్‌లు ఈ ప్రాజెక్టులో భాగం అయ్యాయి. 2016, జూన్‌లో టన్నెల్ పేలుడుతో మొదలైన పనులు.. ఐదేళ్లుగా నడుస్తూ వచ్చాయి. దీంతో సౌత్‌లోనే ఇదొక సుదీర్ఘమైన ప్రాజెక్టుగా పేరు దక్కించుకుంది. సుమారు 200 కోట్లు(లెక్కల్లో 165 కోట్లు), ఐదేళ్ల తర్వాత ఎట్టకేలకు సొరంగ మార్గాల నిర్మాణం పూర్తైంది. అయితే ఒకవైపు నిర్మాణ సంస్థ నుంచి మరోవైపు ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) నుంచి ఈ సొరంగాలు ఎప్పుడు తెరుచుకుంటాయో అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది. దీంతో కేరళ ప్రభుత్వం కేంద్రాన్ని ఆరాతీయగా.. ఆగస్టులో ఈ టన్నెల్ లాంఛింగ్ ఉండొచ్చని బదులిచ్చింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేసేదాకా.. కేరళ అధికారులకు, మంత్రులకు, ఆఖరికి సదరు కంపెనీకి సైతం ఈ సొరంగ ప్రారంభోత్సవ కార్యక్రమం ఉంటుందనే విషయం తెలియకపోవడం విశేషం. We will open one side of the Kuthiran Tunnel in Kerala today. This is the first road tunnel in the state and will drastically improve connectivity to Tamil Nadu and Karnataka. The 1.6 km long tunnel is designed through Peechi- Vazahani wildlife sanctuary. pic.twitter.com/9yG0VhrsLq — Nitin Gadkari (@nitin_gadkari) July 31, 2021 ఇక సాయంత్రం ఐదు గంటలకు త్రిస్సూర్ జిల్లా కలెక్టర్ హరిత కుమార్‌కు, ఎన్హెచ్ఏఐ(నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) డైరెక్టర్‌కు మాత్రమే కేంద్రం నుంచి సమాచారం అందింది. దీంతో వాళ్లు టన్నెల్ దగ్గరికి చేరుకుని.. 7గం.55ని.ఎడమ టన్నెల్‌ను ప్రారంభించగా సామాన్యుల రాకపోకలను అనుమతి లభించింది. అయితే ఇది దారుణమని, అయినప్పటికీ ప్రజలకు పనికొచ్చే పని కావడంతో విమర్శలు-వివాదం చేయదల్చుకోలేదని అధికారులు అంటున్నారు. మరోవైపు కుడి సొరంగమార్గాన్ని డిసెంబర్ నాటికి ప్రారంభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక ప్రజల నుంచి టోల్ కలెక్షన్, మన్నూథి-వడక్కన్‌చెరీ ఆరులేన్ల రోడ్(కిలోమీటర్ మేర) పూర్తయ్యాకే వసూలు చేయాలని కేఎంసీ కన్ స్ట్రక్షన్స్ లిమిటెడ్‌కు కేరళ ప్రభుత్వం సూచించింది. ఎందుకంటే ఈ రోడ్ నిర్మాణ సమయంలో అవినీతి ఆరోపణలు పెద్ద ఎత్తునే వినిపించాయి కాబట్టి. -
ఉత్తరాఖండ్ జలవిలయం: ఓ కుక్క కథ!
డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్‌లో జలవిలయం సంభవించి నాలుగు రోజులు గడుస్తోంది. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగంలో చిక్కుకున్న వారికోసం సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్ట్ వద్ద ఉంటున్న ఓ నల్లకుక్క అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ ప్రాంతం, సొరంగంలో ఇరుక్కుపోయిన జనం, మొత్తం సంఘటనతో కుక్కకున్న సంబంధాన్ని తెలుసుకున్న వారి కళ్లు చెమర్చుతున్నాయి. తెలిసిన వారి కోసం మూడు రోజులుగా.. రెండేళ్ల భుటియా జాతికి చెందిన నల్ల కుక్క తపోవన్ విష్ణుగాడ్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ పనులు జరుగుతున్న ప్రాంతంలోనే జన్మించింది. అదే ప్రాంతంలోనే పెరిగింది. ప్రాజెక్టు పనులు చేస్తున్న వారు పెడితే తిని, వారివెంటే తిరిగేది. ప్రమాదం జరిగిన ఆదివారం రాత్రి రోజూలాగే కుక్క ఆ ప్రాంతంలో కాకుండా కిందున్న వేరే ప్రాంతానికి వెళ్లిపోయింది. ఆ తర్వాతే వరద ప్రాజెక్టును ముంచెత్తింది. దీంతో అక్కడ పనిచేస్తున్న వారు నీటిలో కొట్టుకుపోయారు. దాదాపు 25-35 మంది దాకా సొరంగంలో ఇరుక్కుపోయారు. ( అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు ) కుక్క తిరిగొచ్చి చూసే సరికి దానికి తెలిసిన వారెవరూ కనిపించలేదు. ఆ ప్రాంతం మొత్తం కొత్తవాళ్లతో నిండిపోయి ఉంది. సహాయక చర్యలు చేపడుతున్న వారు దాని గురించి తెలియక.. అక్కడికి వచ్చిన ప్రతీసారి దాన్ని తరిమేయటం మొదలుపెట్టారు. కానీ, అది మళ్లీ మళ్లీ అక్కడికి వచ్చేది. అయితే కొందరు వ్యక్తులు ఆ నల్లకుక్కను చాలా సార్లు ఇదే ప్రాంతంలో చూశామని, వారికి దాని కథ మొత్తం చెప్పారు. దీంతో అప్పటినుంచి సహాయక సిబ్బంది దానికి తినడానికి తిండి పెడుతూ, రాత్రిళ్లు పడుకోవటానికి గోనె సంచి ఏర్పాటు చేశారు. తన వాళ్లు ఎప్పుడైనా తిరిగొస్తారన్న ఆశతో రాత్రి, పగళ్లు సొరంగం బయటే వెయ్యికళ్లతో ఎదురుచూస్తోంది. (జల విలయం: ఆ రాళ్ల కుప్ప కుప్పకూలిందా ? ) -
అన్వేషణలో డ్రోన్లు, భారీ యంత్రాలు
డెహ్రాడూన్: హిమానీనదం వరదలతో అతలాకుతలమైన ఉత్తరాఖండ్‌లో ఇంకా 174 మంది ఆచూకీ లభించడం లేదు. ఎన్టీపీసీ హైడల్ ప్రాజెక్టు తపోవన్ సొరంగ ముఖద్వారం మట్టి, రాళ్ల పెళ్లలతో మూసుకుపోవడంతో సహాయ చర్యలు అత్యంత సంక్లిష్టంగా మారాయి. భారీ యంత్రాల సాయంతో వాటిని తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. దీంతో సొరంగంలో చిక్కుకుపోయిన 25–35 మంది కార్మికుల్ని కాపాడడానికి డ్రోన్లను, ఇతర ఆధునిక సాంకేతిక పరికరాలను మోహరించి గాలిస్తున్నారు. ‘‘సొరంగంలో చిక్కుకున్న వారిని కాపాడడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నాం. లోపలికి వెళ్లడానికి భారీగా పేరుకుపోయిన రాళ్లతో కూడిన బురద అడ్డంగా ఉంది. దానిని తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి’’అని ఉత్తరాఖండ్ డీఐజీ నీలేశ్ ఆనంద్ భార్నె చెప్పారు. సొరంగ మార్గంలో శిథిలాలతో కూడిన బురద ఎండిపోవడంతో గట్టిపడి లోపలికి వెళ్లడానికి వీల్లేకుండా ఉంది. ఇప్పటివరకు 80 మీటర్ల లోపలికి తవ్వకాలు జరిపారు. 100 మీటర్ల వరకు వెళితే లోపల చిక్కుకున్న వారీ ఆచూకీ తెలియవచ్చు’’అని వెల్లడించారు. అలుపెరుగని సాయం.. కేవలం సొరంగ మార్గం వద్ద సహాయ చర్యల కోసం ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, సహస్త్ర సీమ బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది 600 మందికి పైగా నిరంతరాయంగా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. పెద్ద పెద్ద మంచుపెళ్లల్ని పెకిలించడం, నీటిని భారీ యంత్రాలతో తోడుతున్నప్పటికీ ఇంకా బాగా వస్తూనే ఉంది’’అని ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ చెప్పారు. లోపల చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తామన్నారు. అయితే సొరంగానికి అడ్డంగా ఉన్న శిథిలాల తొలగింపు ఆలస్యమవుతున్న కొద్దీ లోపలున్న వారి పరిస్థితి ఎలాగ ఉందోనన్న ఆందోళన పెరుగుతోంది. ‘‘కాలం గడుస్తున్న కొద్దీ ఆ కార్మికులు సజీవంగా ఉంటారన్న నమ్మకం పోతోంది. అయితే ఏదైనా అద్భుతం జరిగితే వారిని కాపాడుకోవచ్చు’’అని రాష్ట్ర సహాయ బృందం సభ్యుడు పీయూష్ అన్నారు. ‘రేయింబగళ్లు శిథిలాలను తొలగిస్తున్నా పని పూర్తి అవడం లేదు. సొరంగం వెలుపల ఆక్సిజన్ సిలండర్లు, వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు’ అని ఐటీబీపీ అధికార ప్రతినిధి వివేక్ పాండే అన్నారు. -
అందుబాటులోకి అటల్ టన్నెల్
రోహ్తాంగ్: హిమాలయ పర్వత సానువుల్లో ఎంతో వ్యయప్రయాసలకోర్చి నిర్మించిన, ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగ మార్గా(టన్నెల్)న్ని ప్రధాని మోదీ శనివారం ప్రారంభించారు. హిమాచల్ ప్రదేశ్‌లోని మనాలి, లేహ్ మధ్య 46 కి.మీ. దూరాన్ని ఈ సొరంగ మార్గం తగ్గిస్తుంది. 9.02 కి.మీ.ల పొడవైన ఈ టన్నెల్ వల్ల ప్రయాణ సమయం 5 గంటలకు తగ్గిపో తుంది. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ) అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య, ఎన్నో సవాళ్లనెదుర్కొని ఈ సొరంగ మార్గాన్ని నిర్మించింది. దేశ రక్షణలో అత్యంత వ్యూహాత్మకమైన ఈ సొరంగ మార్గాన్ని ప్రారంభించిన మోదీ దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి కన్న కలలు సాకారమయ్యాయని అన్నారు. ఇదే సందర్భంగా ప్రతిపక్ష కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం దేశ భద్రతా ప్రయోజనాలపై రాజీ పడిందని దుయ్యబట్టారు. అటల్ సొరంగం, తేజాస్ యుద్ధ విమానాల తయారీ మొదలైన వాటిని గత ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ‘మాకు దేశ భద్రతే అత్యంత ముఖ్యం. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు ఈ స్థాయిలో ఎప్పుడూ జరగలేదు. 26 ఏళ్లలో పూర్తి కావాల్సిన పనిని మా ప్రభుత్వం ఆరేళ్లలో చేసింది. కేవలం సైనిక అవసరాలే కాదు, లేహ్, లద్దాఖ్ ప్రాంత ప్రజల బతుకు అవసరాలు కూడా ఈ సొరంగం తీరుస్తుంది’అని మోదీ అన్నారు. అటల్ టన్నెల్‌గా పేరు మార్పు 2000 సంవత్సరం జూన్ 3న వాజపేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. 2002 మే 26న ఈ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆరేళ్లలో దీనిని పూర్తి చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఇతర కారణాలతో నిర్మాణం సాగలేదు. మొదట్లో దీనిని రోహ్తాంగ్ సొరంగం అని పిలిచేవారు. 2019లో దీనికి అటల్ సొరంగం అని పేరు మార్చారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ ఈ టన్నెల్ నిర్మాణంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. సొరంగం పూర్తి చేయడానికి పదేళ్లు పట్టింది. సొరంగం విశేషాలు ► సముద్ర మట్టానికి 10వేల అడుగుల ఎత్తున నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత పొడవైన హైవే సొరంగమిది. నిర్మాణ వ్యయం రూ.3,300 కోట్లు. ► ఒకటే ట్యూబ్‌లో, డబుల్ లేన్‌తో ఈ సొరంగాన్ని నిర్మించారు. రోజూ 3వేల కార్లు , 1500 లారీలు రాకపోకలు సాగిం చేలా నిర్మించారు. దీంట్లో వాహనాల గరిష్టవేగం గంటకు 80 కి.మీ. ► సరిహద్దుల్లో రక్షణ పరంగా ఇది అత్యంత వ్యూహాత్మకమైనది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినా మిలటరీ సామగ్రిని తరలించడానికి ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. ► భారీగా మంచు కురవడం వల్ల ఏడాదిలో ఆరునెలలు లేహ్ ప్రాంతవాసులకి ఇతర ప్రాంతాలతో సంబంధాలు తెగిపోతాయి. ఈ సొరంగ మార్గంతో అక్కడ ప్రజలు కూడా ప్రయాణించే అవకాశం వచ్చింది. -
సరిహద్దుల్లో సొరంగం
జమ్మూ: భారత్‌లో చొరబాట్లకు జిత్తుల మారి పాకిస్తాన్ ఎప్పటికప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంది. జమ్మూలోని సాంబా సెక్టార్లో గాలార్ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి పాక్ వైపు వెళుతున్న ఒక సొరంగ మార్గాన్ని సరిహద్దు భద్రతా బలగాలు (బీఎస్ఎఫ్) కనుగొన్నట్టు శనివారం అధికారులు వెల్లడించారు. 25 అడుగుల లోతు, 20 అడుగుల పొడవు, 3–4 అడుగుల వెడల్పున ఈ సొరంగ మార్గం ఉంది. భారత్‌లోకి చొరబాట్లు, నార్కోటిక్ డ్రగ్స్, ఆయుధాలు రవాణా చేయడం కోసమే పాక్ దీనిని నిర్మించిందని అధికారులు వెల్లడిం చారు. సరిహద్దుల నుంచి భారత్ భూభాగం వైపు 50 మీటర్ల దూరంలో ఈ సొరంగమార్గం ఉంది. పాకిస్తాన్లో తయారైనట్టుగా గుర్తులు ఉన్న ఆకుపచ్చ రంగు ఇసుక బస్తాలతో సొరంగ మార్గాన్ని కప్పి ఉంచినట్టుగా బీఎస్ఎఫ్ దళాలు గుర్తించాయి. దీంతో బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ రాకేశ్ ఆస్తానా సాంబా సెక్టార్లో అణువణువు గాలించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఈ ఆపరేషన్ విస్తృతంగా సాగుతోంది. ఇటీవల కాలంలో భారీగా వర్షాలు కురవడంతో ఈ సొరంగ మార్గం ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల్లో మట్టి వదులుగా మారింది. ఎందుకిలా మట్టి ఉందన్న అనుమానంతో అక్కడ అంతా పరిశీలించి చూడగా పాకిస్తాన్లో తయారీ అయినట్టుగా చిహ్నాలు ఉన్న ఇసుక బస్తాల్ని బలగాలు గుర్తించాయి. వాటిని తొలగించి చూడగా 170 మీటర్ల పొడవైన సొరంగం కనిపించింది. సాంబా సెక్టార్లో వేల్‌బ్యాక్ శిబిరానికి దగ్గరగా ఈ సొరంగం ఉంది. కరాచి, శంకర్గఢ్ అని పేర్లు ముద్రించి ఉన్న 8–10 ప్లాస్టిక్ ఇసుక బస్తాలు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. ఈ ప్లాస్టిక్ బస్తాలపై ఉన్న తేదీలను బట్టి అవి ఇటీవల తయారైనట్టుగా తెలుస్తోంది. ఈ సొరంగం పాకిస్తాన్ వైపు సరిహద్దు శిబిరం గుల్జార్ వరకు కొనసాగిం దని అధికారులు చెప్పారు. ఈ సొరంగం ద్వారా పాక్ ఉగ్రవాదులు చాలా సులభంగా చొరబాట్లు చేయవచ్చునని వివరించారు. పాక్‌కు తెలిసే చేసింది ఈ సొరంగం నిర్మాణం గురించి పాకిస్తాన్ ప్రభుత్వానికి బాగా తెలుసునని బీఎస్ఎఫ్ ఇన్స్పెక్టర్ ఎన్ఎస్ జమ్వాల్ చెప్పారు. ఆ సొరంగాన్ని ఇటీవల తవ్వారని ప్రాథమిక విచారణలో తేలింద న్నారు. సాంబా సరిహద్దుల్లో పాక్ వైపు నుంచి సొరంగాన్ని తవ్వారన్న సమా చారం తమకు అందగానే సరిహద్దు బలగాలు రంగం లోకి దిగాయన్నారు. శుక్రవారం సాయం త్రానికి దీన్ని గుర్తించామని చెప్పారు. ప్రస్తుతం జమ్వాల్ సాంబ సెక్టార్లోనే ఉంటూ పాక్ ఇంకా ఎక్కడెక్కడ సొరంగాలు ఏర్పాటు చేసిందో తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. -
మోదీ భద్రత కోసం ప్రత్యేక సొరంగ మార్గం
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు భవనంకు మార్పులు చేర్పులు చేస్తున్న నేపథ్యంలో సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీ (సీఈపీటీ) యూనివర్శిటీలో సమావేశం జరిగింది. ప్రధాని నివాసం నుంచి ఆయన కార్యాలయానికి, పార్లమెంటు భవనంకు ప్రత్యేక రహదారిని నిర్మించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్ బిమాల్ పటేల్ ఒక ప్రత్యేక టన్నెల్‌ను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రధాని పార్లమెంటు భవనంకు లేదా అతని కార్యాలయానికి వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పార్లమెంటు భవనంకు కొన్ని ప్రత్యేక రహదారులు నిర్మించాలని పటేల్ చెప్పారు. తద్వారా సాధారణ ట్రాఫిక్ నుంచి ప్రధాని వంటి వీవీఐపీలను వేరు చేసేందుకు ఈ మార్గం ఉపయోగపడనుంది. ప్రధాని వంటి ఉన్నతస్థాయి వ్యక్తులు వెళ్లే సమయంలో సామాన్యులు ట్రాఫిక్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం నిత్యం మనం చూస్తునే ఉన్నాం. సెంట్రల్ విస్టాలో భాగంగా ఏర్పాటు చేసే ప్రత్యేక టన్నెల్ తో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని సెంట్రల్ విస్టా ప్రాజెక్టు రూపకర్త బిమల్ పటేల్ తెలిపారు. పైగా వీవీఐపీలకు భద్రత కల్పించడం కూడా వీలవుతుందని వెల్లడించారు. -
తటాకాలను తలపిస్తున్న సొరంగ నిర్మాణ ప్రాంతాలు
పెద్దదోర్నాల: మండల పరిధి కొత్తూరు వద్ద జరుగుతున్న వెలుగొండ ప్రాజెక్టు సొరంగ పనులకు సంబంధించి రెండో సొరంగ నిర్మాణ ప్రాంతంలో భారీ ఎత్తున నీరు చేరడంతో ఆ ప్రాంతం తటాకాన్ని తలిపిస్తోంది. ఇటీవల కురిసిన వర్షంతో పాటు సొరంగ మార్గం ద్వారా వచ్చే ఊట నీరు భారీగా చేరడంతో ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద ఈ పరిస్థితి నెలకొంది. సాధారణంగా సొరంగ మార్గాల నుంచి వచ్చే ఊట నీటిని పనులు జరిగే ప్రాంతం నుంచి బయటకు తరలించేందుకు ప్రత్యేకంగా పంపింగ్ వ్యవస్థను రూపొందించారు. ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ బకాయిలు భారీగా పేరుకు పోయాయన్న కారణంతో విధ్యుత్ శాఖాధికారులు గత నెల 24వ తేదీన ప్రాజెక్టుకు సంబంధించిన విద్యుత్ సరఫరాను నిలిపేశారు. గుత్తేదారులు గత్యంతరం లేని పరిస్థితుల్లో జనరేటర్ల ద్వారా విద్యుత్ సరఫరా చేసి మోటార్లతో నీరు తోడే కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, నిర్వహణలో అధిక ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంతో జనరేటర్లను రెండు విడతలుగా వినియోగించి నీరు తోడే పనులు చేపట్టారు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో జనరేటర్లను పొదుపుగా వినియోగిస్తుండటంతో సొరంగ నిర్మాణ ప్రాంతంలో తరుచూ నీరు నిలబడి మడుగును తలపిస్తోంది. -
‘సొరంగం’ మారింది
ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగ మార్గంతో సహా నిర్మించనున్న రోడ్ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలవాలని నిర్ణయించిన అధికారులు.. అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. అయితే గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈపీసీ పద్ధతికి ఆమోదం తెలిపారు. సాక్షి, సిటీబ్యూరో: ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు సొరంగమార్గంతో సహ నిర్మించనున్న రోడ్ కనెక్టివిటీ పనుల టెండర్లను ఈపీసీ పద్ధతిలో పిలవాలిచేందుకు సిద్ధమయ్యారు. తొలుత ఈ పనుల కోసం యాన్యుటీ పద్ధతిలో టెండర్లు పిలిచేందుకు అన్నీ సిద్ధం చేసిన అధికారులు అనుమతి కోసం ప్రభుత్వానికి నివేదించారు. రేపో మాపో అనుమతి రాగానే ఇక టెండర్లు పిలవాలనుకుంటున్న తరుణంలో ఈపీసీలో టెండర్లు పిలిచేందుకు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది. ఈ నిర్ణయం ఆమోదం కోసం ప్రభుత్వానికి నివేదించాలని తీర్మానించింది. దీంతో టెండర్ల ప్రక్రియకు మరికొంత జాప్యం జరగనుంది. అంతేకాదు.. ఈపీసీ పద్ధతిలో నిర్మించేందుకు సిద్ధం కావడంతో ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం నిధుల్ని జీహెచ్ఎంసీయే భరించాల్సి ఉంది. అంటే.. జీహెచ్ఎంసీ నెత్తిన మరో రూ.875 కోట్ల భారం పడనుంది. యాన్యుటీ పద్ధతిలో అయితే కాంట్రాక్టు పొందే సంస్థే తొలుత పెట్టుబడి పెడుతుంది. నిర్ణీత వ్యవధుల్లో దానికి చెల్లింపులు చేస్తారు. అలా తొలుత ఇనార్బిట్ మాల్ నుంచి ఫీనిక్స్ జంక్షన్ వరకు పనులు చేయాలనుకున్నారు. అందుకు దాదాపు రూ.1535 కోట్లు ఖర్చు కానుందని అంచనా. ఆమేరకు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేలోగా ఈ ప్రాజెక్టును యాన్యుటీ స్థానే ఈపీసీ పద్ధతిలో చేపట్టాలని ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ సూచించారు. అందుకనుగుణంగా స్టాండింగ్ కమిటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సొరంగ మార్గం లెక్క ఇదీ.. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇనార్బిట్ మాల్ వైపు నుంచి ఖాజాగూడ జంక్షన్ వరకు సొరంగ మార్గం నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండు సొరంగ మార్గాలు ఒక్కొక్కటి నాలుగు లేన్ల క్యారేజ్‌వేలతో ఏర్పాటు చేస్తారు. సొరంగం పొడవు 502.91 మీటర్లు. దీని అంచనా వ్యయం రూ. 215 కోట్లు. మారిన ప్రణాళిక.. ♦ ఖాజాగూడ నుంచి ఓఆర్ఆర్ దాటి విప్రో జంక్షన్ వైపు ఫీనిక్స్ రోడ్ వరకు సాఫీ ప్రయాణానికి రూపొందించిన ప్రణాళికలో మార్పు చేశారు. చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో పూర్తవుతుందని అంచనా వేశారు. ఇందులో రూ.100 కోట్లు భూసేకరణకు ఖర్చు కానుంది. రూ.875 కోట్లే కనుక యాన్యుటీ అవసరం లేదని మంత్రి అభిప్రాయపడిన నేపథ్యంలో తాజాగా ఈపీసీకి సిద్ధమయ్యారు. ♦ ఎస్సార్డీపీలో భాగంగా రూ.2631 కోట్లతో 18 జంక్షన్ల వద్ద మల్టీ లెవెల్ ఫ్లై ఓవర్లు తదితర పనులకు తొలుత యాన్యుటీ విధానంలోనే టెండర్లు పిలిచారు. కానీ కాంట్రాక్టర్ల నుంచి స్పందన రాకపోవడంతో వాటిని రద్దు చేసి వెయ్యికోట్ల మేర పనుల్ని ఈపీసీ విధానంలో పిలిచారు. ప్రస్తుతం ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. ♦ ఎస్సార్డీపీ పనులకు అవసరమైనన్ని నిధులు జీహెచ్ఎంసీ వద్ద లేకపోవడంతో బాండ్ల ద్వారా వెయ్యి కోట్లు సేకరించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా తొలివిడత రూ. 200 కోట్లు సేకరించారు. అవి దాదాపుగా ఖర్చయ్యాయి. మలివిడతగా మరో రూ.200 కోట్లు బాండ్ల ద్వారా సేకరించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుకు కూడా నిధుల్ని సేకరించాల్సి రావడంతో జీహెచ్ఎంసీపై భారం పెరగనుంది. నిధులు సేకరించినా తిరిగి ఎలా చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రాజెక్టులోని ముఖ్యమైన పనులు ఇవే.. ♦ దుర్గం చెరువు కేబుల్ స్టే బ్రిడ్జి కింద జంక్షన్‌ను అభివృద్ధి చేస్తారు. అక్కడి నుంచి టన్నెల్ వైపు రహదారిపై ఆయా ప్రాంతాల్లో ఫ్లై ఓవర్ నిర్మాణం ♦ టన్నెల్ వైపు నుంచి కేబుల్ స్టే బ్రిడ్జి వైపు కూడా ఇదే తరహాలో నిర్మాణం ♦ కేబుల్ స్టే బ్రిడ్జి, ఇనార్బిట్ మాల్ వైపు నుంచి టన్నెల్ వైపు ఫ్లై ఓవర్ ♦ టన్నెల్ వైపు నుంచి ఇనార్బిట్ మాల్ రోడ్ వైపు ఫ్లై ఓవర్ ♦ హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్ నుంచి టన్నెల్ వైపు వచ్చేవారి కోసం రోడ్డు వెంబడి ఎడమవైపు లూప్ ♦ టన్నెల్ నుంచి నానక్‌రామ్‌గూడ, ఓఆర్ఆర్ వైపు వెళ్లేవారికి అనువుగా చిత్రపురి కాలనీవైపు రెండో వరుసలో ఫ్లై ఓవర్ (ఇది రెండు వైపులా ఉంటుంది) ♦ బయో డైవర్సీటీ/గచ్చిబౌలి/ లింగంపల్లి వైపు నుంచి టన్నెల్ వైపు ఆప్ ర్యాంప్ ♦ టన్నెల్ వైపు నుంచి మూడు లేన్ల డౌన్ ర్యాంప్ రెండు లేన్లుగా విడిపోయి మెహదీపట్నం వైపు.. రెండు లేన్ల కుడివైపు లూప్ రెండో వరుస ఫ్లై ఓవర్‌ను మొదటి వరుస ఫ్లై ఓవర్ వద్ద (ఖాజాగూడ జంక్షన్) దాటి లింగంపల్లి/బయోడైవర్సిటీ వైపు వెళ్తుంది ♦ ఖాజాగూడ జంక్షన్ వద్ద అండర్‌పాస్ ♦ కేబుల్ స్టే బ్రిడ్జి కింద, ఖాజాగూడ వద్ద రోటరీలు గురువారం స్టాండింగ్ కమిటీ సమావేశంలోని ముఖ్య నిర్ణయాలు.. ♦ ఇనార్బిట్ మాల్ నుంచి చిత్రపురి కాలనీ వరకు రూ.875 కోట్లతో రోడ్నెట్వర్క్ పనులు ♦ జీహెచ్ఎంసీ అధికారులకు ఈఈఎస్ఎల్ ద్వారా అద్దెకు 20 ఎలక్ట్రిక్ వాహనాలు ♦ 26 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపు పనులకు రూ.7.55 కోట్లు ♦ హైటెక్‌సిటీ రైల్వే స్టేషన్ వద్ద రూ.59.09 కోట్లతో ఆర్యూబీ, కల్వర్టుల నిర్మాణం ♦ జీహెచ్ఎంసీలో మూడేళ్ల వరకు పద్దుల నిర్వహణ, ఈఆర్పీల నిర్వహణకు బ్లూమ్ సొల్యూషన్స్‌కు రూ.12.93 కోట్లు ♦ మూడేళ్ల వరకు ఆటోమేటిక్ వెహికల్ ట్రాకింగ్, జీపీఎస్/జీపీఆర్ఎస్తో డస్ట్బిన్ల నిర్వహణకు రూ.5.67 కోట్లు ♦ ఇబ్రహీం నాలాపై రూ.14.70 కోట్లతో రిటైనింగ్ వాల్ నిర్మాణం ♦ డిప్యూటీ మేయర్ కార్యాలయం ఇంప్రెస్ట్ వ్యయం రూ.35 వేలకు పెంపు ♦ రూ.40 కోట్లతో చిక్కడపల్లి మోడల్ మార్కెట్ నిర్మాణం -
బయటపడ్డ సొరంగ మార్గం
వైఎస్సార్ జిల్లా,మంగంపేట(ఓబులవారిపల్లె): వైఎస్సార్ జిల్లా మంగంపేట బెరైటీస్ గనుల్లో గురువారం తెల్లవారుజామున సొరంగమార్గం బయటపడింది. గనుల్లో సుమారు 26 బెంచ్‌లు ఉన్నాయి. 19వ బెంచ్‌లో తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో కార్మికులు ఖనిజాన్ని వెలికితీసే పనులు చేస్తున్నారు. ఈ సమయంలో రెండున్నర అంగుళాల వెడల్పు పదిమీటర్లమేర గొయ్యి ఏర్పడింది. వీరంతా గొయ్యివద్దకు చేరుకుని లైట్లువేసి పరిశీలించగా మనిషి వెళ్లడానికి అనువుగా లోపల సుమారు పదిమీటర్ల దూరం రహస్యమార్గం కనిపించింది. ఇంకా లోనికి వెళ్లడానికి ఊపిరి ఆడకపోవడంతో కార్మికులు బయటకు వచ్చేశారు. విషయం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకోగా ఏమీలేదని, సొరంగమార్గాన్ని మూసివేయడం జరిగిందని జనరల్మేనేజర్ కేథార్‌నా«థ్‌రెడ్డి ఎవరినీ అనుమతించలేదు. ఏ ప్రమాదం జరుగకుండా ఉండేందుకు సొరంగాన్ని మూసివేసినట్లు జీఎం తెలిపారు. మండలంలోని వైకోట ప్రాంతాన్ని మట్లిరాజులు పాలించారు. యుద్ధ సమయాల్లో శత్రువులనుంచి తమ సంపదను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అనేక సొరంగమార్గాలు ఏర్పాటు చేసుకున్నట్లు ఇక్కడి చరిత్ర చెబుతోంది. ఇందుకు నిదర్శనంగా మండలకేంద్రం సమీపంలోని నళ్లరాళ్లగుట్ట వద్ద రహస్య మార్గం ఉంది. బండరాళ్లను వేయడంతో ఇది పూడిపోయింది. ఈ మార్గం చిత్తూరుజిల్లా చంద్రగిరి కోట వరకు ఉందని, అప్పట్లో రాజులు ఈ రహస్యమార్గం గుండా ప్రయాణించేవారని ఇప్పటికీ ప్రచారంలో ఉంది. విషయం బయటపెట్టకుండా పురావస్తుశాఖకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏపీఎండీసీ అధికారులు రహస్యమార్గాన్ని మూసివేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దేశంలోనే పొడవైన సారంగ మార్గం ప్రారంభం
-
దేశంలోనే పొడవైన సారంగ మార్గం ప్రారంభం
⇒ కశ్మీర్ అదృష్టాన్ని నిర్ణయించే సొరంగం ⇒ జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ చెనాని–నష్రీ సొరంగంపై మోదీ మాట్లాడుతూ.. ‘కశ్మీర్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం 9 సొరంగ మార్గాల్ని నిర్మించాలని ప్రణాళిక రూపొందించారు. ఈ సొరంగం రాష్ట్ర అదృష్టాన్ని నిర్ణయించే దారి.. కశ్మీర్ లోయలోని పర్యాటకాన్ని ఇది కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. ఇది కేవలం మౌలిక సదుపాయాల అనుసంధాన వ్యవస్థే కాదు.. హృదయాల్ని కలిపే వారధి’ అని ఆకాంక్షించారు. కశ్మీర్–జమ్మూల మధ్య దూరాన్ని తగ్గించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధిలో ఇదో పెద్ద ముందడుగుగా నిలుస్తుందన్నారు. చెనాని–నష్రీ సొరంగం జమ్మూ కశ్మీర్ రైతులకు ఎంతో ఉపయోగపడడమే కాకుండా రాష్ట్రానికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెంచుతుందని ప్రధాని చెప్పారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రకటించిన రూ. 80 వేల కోట్లకు గాను ఇంతవరకూ విడుదలైన సగం పైగా మొత్తాన్ని అతి తక్కువ కాలంలో ఖర్చుపెట్టినందుకు కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబాను, కశ్మీర్ ప్రభుత్వాన్ని ప్రధాని ప్రశంసించారు. చెనాని: దేశంలోనే పొడవైన సొరంగ మార్గ రహదారిని ఆదివారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. కశ్మీర్ లోయను జమ్మూతో కలిపే ఈ మార్గాన్ని జమ్మూకశ్మీర్ గవర్నర్ ఎన్ఎన్ వోహ్రా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీల సమక్షంలో మోదీ జాతికి అంకితం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం మోదీ, మెహబూబా ముఫ్తీ తదితరులు టన్నెల్ మార్గం ద్వారా జీపులో ప్రయాణించారు. జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని చెనాని–నష్రీ ప్రధాన రహదారిలో భాగంగా ఈ సొరంగమార్గ రహదారిని నిర్మించారు. ⇔ తొమ్మిది కిలోమీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం రూ. 3,720 కోట్లు ఖర్చు చేసింది. ⇔ ఈ మార్గం వల్ల రెండు నగరాల మధ్య ప్రయాణ దూరం 31 కిలోమీటర్లు తగ్గడమే కాదు ప్రయాణ సమయం కూడా రెండు గంటలు తగ్గుతుంది. ⇔ ప్రతి రోజూ రూ. 27 లక్షల విలువైన ఇంధనం దీనివల్ల ఆదా అవుతుంది. ⇔ గతంలో ప్రధాన మార్గంలో కొండచరియలు, మంచు, అధిక ట్రాఫిక్ జామ్‌తో ఇబ్బంది పడ్డ ప్రజలకు ఈ సొరంగ మార్గంతో పరిష్కారం లభించింది. ⇔ వాహనాదారుల భద్రత నిమిత్తం మార్గం మొత్తం మీద 124 సీసీటీవీ కెమెరాలను, అత్యాధునిక స్కానర్లను ఏర్పాటు చేశారు. వాహనదారులకు రోడ్డు మార్గం చక్కగా కనపడేలా విద్యుత్ దీపాలను ఏర్పాటుచేశారు. ⇔ వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్‌తో పాటు అగ్నిమాపక నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ⇔ అత్యవసర సమయాల్లో వెంటనే సహాయక చర్యలు చేపట్టడానికి ఏర్పాట్లు చేశారు. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రయాణికులు సురక్షితంగా ఈ మార్గాన్ని వినియోగించుకోవచ్చు. ⇔ ఇది ఆసియాలోనే అతి పొడవైన రెండు మార్గాల సొరంగం.. ⇔ ప్రయాణికులకు తాజా గాలిని అందించే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సొరంగ మార్గాల్లో ప్రపంచంలో ఇది ఆరోది... భారత్‌లో మొదటిది. -
సొరంగ మార్గం రెడీ
► పెరిగిన ట్రయల్ రన్ వేగం ► సంక్రాంతి నాటికి సేవలు సాక్షి, చెన్నై: ఎగ్మూర్- కోయంబేడు మధ్య సొరంగ మార్గంలో మెట్రో సేవలు సంక్రాంతి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ మార్గంలో పనులు ముగిశాయి. ఇక, ట్రయిల్ రన్ వేగ వంతం చేసి, భద్రతా కమిషన్ పరిశోధనకు తగ్గ చర్యల్లో ఆ ప్రాజెక్టు వర్గాలు నిమగ్నమయ్యాయి. చెన్నైలో మెట్రో రైలు సేవలకు తగ్గ పనులు వేగంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విమానాశ్రయం- ఆలందూరు- చిన్నమలై, కోయంబేడు- ఆలందూరు- సెయింట్ థామస్ మౌంట్ మార్గాల్లో పనులు ముగిసి రైలు సేవలకు శ్రీకారం చుట్టి ఉన్నారు. ఇక, చిన్న మలై నుంచి కూత వేటు దూరం వంతెన మీద తదుపరి పూర్తి స్థాయిలో సెంట్రల్ వరకు సొరంగ మార్గంలో రైలు పయనించేందుకు తగ్గ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వాషర్ మెన్ పేట నుంచి సెంట్రల్, ఎగ్మూర్‌ల మీదుగా కోయంబేడుకు సొరంగం మార్గం పనులు రెట్టింపు వేగంతో జరుగుతున్నాయి. ఎగ్మూర్ నుంచి నెహ్రూపార్క్, సొరంగ మార్గం రెడీ కీల్పాకం, పచ్చయప్ప కళాశాల, షెనాయ్ నగర్, అన్నానగర్, తిరుమంగళం మీదుగా కోయంబేడు వరకు ప్రస్తుతం సొరంగం మార్గం పనులు పూర్తి అయ్యాయి. ఎగ్మూర్ నుంచి సెంట్రల్-వాషర్మన్ పేట వైపుగా ట్రాక్ ఏర్పాటు పనులు సాగాల్సి ఉంది. ఎగ్మూర్ నుంచి కోయంబేడు వరకు పనులు ముగియడంతో ఇక, సొరంగ మార్గం రైల్వేస్టేషన్లకు సొబగులు దిద్దేందుకు తగ్గ కార్యచరణతో మెట్రో ప్రాజెక్టు వర్గాలు ముందుకు సాగే పనిలో పడ్డాయి.ట్రాక్, విద్యుద్దీకరణ పనులు ముగియడంతో ఇక, ట్రయిల్ రన్ వేగవంతం చేయడానికి చర్యలు చేపట్టారు. ఈ రన్ పూర్తి స్థాయిలో విజయవంతం కాగానే, రైల్వే భద్రతా కమిషన్ వర్గాలు పరిశీలన, పరిశోధనానంతరం ప్రయాణికుల సేవకు శ్రీకారం చుట్టనున్నారు. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను ముగించి కోయంబేడు - ఎగ్మూర్ మీదుగా సొరంగంలో ప్రయాణికులతో మెట్రో రైలు పరుగులు పెట్టేందుకు తగ్గ కార్యచరణతో ముందుకు సాగనున్నారు. ఈ పనులు ముగిసిన పక్షంలో సెయింట్థామస్ మౌంట్, విమానాశ్రయంల నుంచి ఆలందూరు మీదుగా కోయంబేడు వైపుగా ఎగ్మూర్ వరకు ఇక పయనం సాగించేందుకు వీలుంది. నగరంలో నలభై కి.మీ దూరం మేరకు చేపట్టిన మెట్రో రైలు పనుల్లో ఇప్పటి వరకు 90 శాతం ముగిసినట్టుగా ఆ ప్రాజెక్టు వర్గాలు పేర్కొంటుండడం గమనార్హం. ఇక, వాషర్ మెన్ పేట నుంచి తిరువొత్తియూరు వరకు పనుల్ని పొడిగించిన దృష్ట్యా, పూర్తి స్థాయిలో సేవలకు మరో ఏడాది పట్టే అవకాశాలు ఉన్నాయి.