హెలిప్యాడ్ కోసం స్థల పరిశీలన
గోవిందరావుపేట, న్యూస్‌లైన్ : మేడారం భక్తులకు హెలికాప్టర్ సేవలు అందుబాటులోకి తేవాలని నిర్ణయించడంతో ఆర్డీఓ సభావట్ మోతీలాల్ స్థలాన్ని పరిశీలించారు. తాడ్వాయి తహసీల్దార్ పూల్‌సింగ్ చౌహాన్‌తో కలిసి ఆదివారం పడిగాపూర్ పరిసరాల్లోని కొంగలమడుగు వద్ద గతంలో హెలిప్యాడ్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో స్థలాన్ని పరిశీలించారు. గద్దెల సమీపంలోని పోలీస్ క్యాంపు వద్ద ప్రభుత్వ హెలికాప్టర్ దిగేందుకు వీలుగా హెలిప్యాడ్ ఉంది. దీనిని ప్రత్యేకంగా ప్రభుత్వం వినియోగిస్తోంది.
2010లో టర్బో ఏవియేషన్ సంస్థ హెలికాప్టర్ సౌకర్యాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చిం ది. మళ్లీ ఈ జాతరలో టర్బో ఏవియేషన్ సం స్థ మరోసారి భక్తులకు హెలికాప్టర్ సేవలు అందించే ఏర్పాట్లు చేస్తోంది. గతంలో వరంగల్‌లోని మామునూరు నుంచి మేడారానికి స ర్వీసులు నడిపారు. కానీ ఈసారి సంస్థ మా మునూరుతో పాటు ములుగు నుంచి కూ డా సర్వీసులను నడపనున్నట్లు ప్రకటించింది. అంతేకాక హెలికాప్టర్‌ను అద్దెకు కూడా ఇవ్వనున్నట్లు సంస్థ ప్రకటించింది.
పడిగాపూర్ ప రిధిలోని 44వ సర్వే నంబర్లో ఉన్న రైతులతో ఆర్డీఓ, తహసీల్దార్ మాట్లాడారు. గతంలో హె లిప్యాడ్ తీసుకున్న వారు తమను ఇబ్బందుల కు గురిచేశారని రైతులు అధికారులకు వివరిం చారు. తిన్న అన్నానికి కూడా వారు డబ్బులు ఇవ్వలేదని వాపోయారు. దీంతో ఆర్డీఓ మో తీలాల్ మాట్లాడుతూ ముందుగానే అద్దె డ బ్బులు ఇప్పించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఎక్కడి నుంచో ఇక్కడకు వచ్చి మన జాతరకు వచ్చే భక్తులకు హెలికాప్టర్ సౌకర్యాన్ని అందించే వారికి సహకరించాల్సిన అవసరం ఉంద న్నారు.