TVS Motor Co
-
టీవీఎస్ ప్లాంటులో లక్ష బీఎండబ్ల్యూ బైక్స్
న్యూఢిల్లీ: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న టీవీఎస్ మోటార్.. తమిళనాడులోని హొసూర్ ప్లాంటులో ఒక లక్ష బీఎండబ్ల్యూ మోటరాడ్ 310 సీసీ బైక్స్‌ను ఉత్పత్తి చేసింది. అయిదేళ్లలోనే ఈ మైలురాయిని అధిగమించినట్టు కంపెనీ ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ మోటరాడ్స్ బైక్స్ ఉత్పత్తిలో హొసూర్ ప్లాంటు వాటా 10 శాతం ఉంది. 2013లో ఇరు సంస్థల మధ్య సహకార ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా అంతర్జాతీయ మార్కెట్ కోసం 500 సీసీ లోపు సామర్థ్యంగల బైక్స్ అభివృద్ధి, తయారీని టీవీఎస్ చేపట్టింది. ఈ క్రమంలో బీఎండబ్ల్యూ జి310 ఆర్, 310 జీఎస్, టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్స్‌ను ఇరు సంస్థలు పరిచయం చేశాయి. ఈ మూడు బైక్స్ కూడా హొసూర్‌లో తయారవుతున్నాయి. బీఎండబ్లు్య జి310 ఆర్, 310 జీఎస్ మోడళ్లు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 120 దేశాల్లో లభ్యమవుతున్నాయి. -
టీవీఎస్ మోటార్ సేల్స్ హై జంప్
సాక్షి, ముంబయి: దేశీయ టూవీలర్, త్రీవీలర్ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ కంపెనీ అమ్మకాలలో భారీ వృద్ధిని సాధించింది. డిసెంబర్ 39 శాతం వృద్ధితో 2,56,909 యూనిట్లు విక్రయించింది. మొత్తం ద్విచక్ర వాహనాల విక్రయాలు 37.9 శాతం పెరిగి 2,47,630 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ గణాంకాలను సోమవారం కంపెనీ ప్రకటించింది దేశీయ అమ్మకాలు మాత్రం 35.4 శాతం పెరిగి 2,07,778 యూనిట్లకు చేరుకున్నాయని హోసూర్‌కు చెందిన కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. డిసెంబర్ 2016 లో 55,557 యూనిట్లుండగా, స్కూటర్ విక్రయాలు 50.5 శాతం పెరిగాయి. మోటార్ సైకిల్ అమ్మకాలు పెరిగి 63.7 శాతం పెరిగి 95,281 యూనిట్లకు చేరుకున్నాయి. అలాగే ఈ నెల ఎగుమతులు 55.8 శాతం పెరిగి 47,818 యూనిట్లకు చేరుకున్నాయి. వీటిలో ద్విచక్ర వాహన ఎగుమతులు 52.7 శాతం పెరిగి39,852 యూనిట్లకు చేరుకున్నాయి. డిసెంబర్ 2017 నాటికి 5,393 యూనిట్లు విక్రయించగా .. అంతకు ముందు డిసెంబర్ 2017 నాటికి 9,279 యూనిట్లు విక్రయించింది. -
టూ-వీలర్స్‌కు డిసెంబర్‌లోనూ బ్రేకులు
పెద్ద నోట్ల రద్దయి దాదాపు రెండు నెలలు గడిచినా టూ-వీలర్ విక్రయాలు మాత్రం కోలుకోవడం లేదు. నగదుతో ముడిపడి ఉన్న గ్రామీణ ప్రాంత మార్కెట్ నుంచి వీటికి డిమాండ్ భారీగా పడిపోయింది. దీంతో మోటార్ సైకిల్స్ దిగ్గజాలు హీరో మోటోకార్పొ, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటారో కో కంపెనీలకు డిసెంబర్ నెలలో కూడా విక్రయాలు మందగించాయి. దేశీయ దిగ్గజ టూ-వీలర్ తయారీదారి హీరో మోటోకార్పొ లిమిటెడ్ 2016 డిసెంబర్ నెల విక్రయాలు 33.91 శాతం పడిపోయి, 3,30,202 యూనిట్లగా నమోదైనట్టు తెలిసింది. గతేడాది ఈ కంపెనీ విక్రయాలు 4,99,665 యూనిట్లగా ఉన్నాయి. హీరో మోటోకార్పొ ప్రత్యర్థి బజాజ్ ఆటోకు సైతం దేశీయ బైక్ అమ్మకాలు 11 శాతం క్షీణించి, 1,06,665 యూనిట్లగా నమోదయ్యాయి. వీటితో పాటు చెన్నైకు చెందిన టీవీఎస్ మోటార్ టూ-వీలర్ విక్రయాలు కూడా దేశీయంగా 8.76 శాతం పడిపోయినట్టు ఆ కంపెనీ పేర్కొంది. డిసెంబర్ నెల సమీక్షలో తమ విక్రయాలు 1,53,413 యూనిట్లగా రికార్డు అయినట్టు టీవీఎస్ మోటార్ కంపెనీ చెప్పింది. ప్రధానంగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతోనే ఆటోమొబైల్ విక్రయాలు పతనమయ్యాయని, ఈ సమయంలో వాహన కొనుగోళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటిమెంట్ దెబ్బతిన్నిందని ఆటో పరిశ్రమ నిపుణుడు అబ్దుల్ మజీద్ తెలిపారు. గ్రామీణ మార్కెట్ నుంచి 50 శాతం మోటార్ సైకిల్ విక్రయాలు నమోదైతాయని పరిశ్రమ అంచనావేస్తోంది. ఆటోమొబైల్ తయారీదారుల సంఘం సియామ్ సైతం నవంబర్‌లో టూవీలర్ అమ్మకాలు గతేడాది కంటే పడిపోయినట్టు చెప్పింది. గతేడాది డిసెంబర్ నెలలో 13,20,552 యూనిట్లగా ఉన్న టూ-వీలర్ విక్రయాలు ఈ ఏడాది డిసెంబర్లో 12,43,251 యూనిట్లగా ఉన్నట్టు పేర్కొంది. నోట్ల రద్దుపై ప్రకటన వచ్చిన అనంతరం నవంబర్ నెలలో విక్రయాలు పడిపోయిన సంగతి తెలిసిందే. నోట్ల రద్దు ప్రభావం ఆటో పరిశ్రమపై భారీగానే ఎఫెక్ట్ చూపింది. ఈ దెబ్బనుంచి కోలుకోవడానికి ఇంకా రెండు లేదా మూడు నెలలు పట్టే అవకాశముందని టూ-వీలర్ పరిశ్రమ భావిస్తోంది.