Twin blasts case
-
జంట పేలుళ్ల కేసులో నజీర్, షఫాస్ నిర్దోషులు
కొచ్చి: కోజికోడ్ జంట పేలుళ్ల ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కార్యకర్త తడియంతెవిడ నజీర్, షఫాస్‌లను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. కోజికోడ్ కేఎస్ఆర్టీసీ, మొఫుసిల్ బస్టాండ్లలో జరిగిన బాంబు పేలుళ్లకు నజీర్, ఇతర నిందితులు కుట్ర చేశారని, ప్రణాళికతో పాటు అమలు చేసినట్లు వీరిపై అభియోగాలున్నాయి. 2011లో ఎన్ఐఏ కోర్టు వీరిని దోషులుగా తేల్చింది. నజీర్, షఫాస్ ఇద్దరూ చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, 1967(ఉపా)లోని వివిధ సెక్షన్ల కింద నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించి ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు వారికి జీవిత ఖైదు విధించింది. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు విధించిన జీవిత ఖైదును సవాలు చేస్తూ మొదటి నిందితుడు నజీర్, నాలుగో నిందితుడు షఫాస్ దాఖలు చేసిన అప్పీలును కేరళ హైకోర్టు అనుమతించింది. న్యాయమూర్తులు కె.వినోద్ చంద్రన్, జియాద్ రెహమాన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ గురువారం తుదితీర్పు వెల్లడించింది. ఘట న జరిగిన నాలుగు సంవత్సరాల తరువాత ఎన్ఐఏ స్వాధీనం చేసుకున్న ఈ కేసు దర్యాప్తు సంక్లిష్టతను తాము అర్థం చేసుకున్నామని చెప్పిన ధర్మాసనం వారే నేరం చేశారనేందుకు నమ్మదగిన ఆధారాలేవీ లేవని పేర్కొన్నది. ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎన్ఐఏ దాఖలు చేసిన అప్పీలును కూడా ధర్మాసనం తిరస్కరించింది. -
జంట పేలుళ్ల కేసులో అప్పీళ్లు విచారణకు స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని లుంబినీ పార్క్, గోకుల్ చాట్లలో సంభవించిన జంట పేలుళ్ల కేసులో కింది కోర్టు విధించిన ఉరి శిక్ష తీర్పును సవాల్ చేస్తూ దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలు హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. వీరిద్దరికీ ఢిల్లీలో ఆశ్రయం కల్పించిన నేరానికి తారీఖ్ అంజూమ్ ఎహసాన్ అనే వ్యక్తికి కింది కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తారీఖ్ కూడా హైకోర్టులో అప్పీల్ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. వీటిని హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సి.వి.నాగార్జునరెడ్డి, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణకు స్వీకరించింది. ఈ కేసు నుంచి నిర్దోషులుగా బయటపడిన నిందితులు షాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫూద్దీన్ తర్ఖాష్లకు పేలుళ్లతో సంబంధం ఉందని, కింది కోర్టు వీరిని విడిచిపెట్టడం చెల్లదని ప్రత్యేక దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన అప్పీల్ వ్యాజ్యాలను కూడా కలిపి విచారిస్తామని ధర్మాసనం ప్రకటించింది. అప్పీల్ తీర్పు వెలువడే వరకూ తమకు బెయిల్ మంజూరు చేయాలన్న వారి అభ్యర్థనలను ధర్మాసనం తోసిపుచ్చింది. ఉరిశిక్ష ఖరారు విషయంలో నిర్ణయం తీసుకునేందుకు వాటికి గతంలోనే హైకోర్టు నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయిల్ మొదలు పెట్టింది. అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి టి.శ్రీనివాసరావు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. -
వారికి ఉరిశిక్ష ఖరారు చేయండి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ జంట పేలుళ్ల కేసులో దోషులు అనీక్ షఫీక్ సయీద్, మహ్మద్ అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు తాము విధించిన ఉరిశిక్ష ఖరారు చేయాలంటూ కేసు ఫైళ్లను హైకోర్టుకు కింది కోర్టు నివేదించింది. ఫైళ్లను పరిశీలించిన హైకోర్టు.. ఉరిశిక్ష ఖరారులో నిర్ణయం తీసుకునేందుకు వాటికి నంబర్లు కేటాయించి రెఫర్ ట్రయల్ మొదలు పెట్టింది. అందులో భాగంగా ఉరిశిక్ష పడిన దోషుల వాదనలు వినేందుకు వారికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయ మూర్తులు జస్టిస్ సురేశ్ కుమార్ కెయిత్, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌ల ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వారిద్దరికీ జైలర్ ద్వారా నోటీసులు అందజేయాలని ఉత్తర్వుల్లో కోర్టు పేర్కొంది. జంట పేలుళ్ల కేసులో అనీక్, ఇస్మాయిల్ చౌదరిలకు ఉరిశిక్ష విధిస్తూ రెండో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ నెల 10న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దోషులకు ఆశ్రయం కల్పించిన తారీఖ్ అంజూమ్ ఎహసాన్‌కు జీవిత ఖైదు విధించగా మరో ఇద్దరు నిందితులు సాదిక్ ఇష్రార్ షేక్, ఫరూక్ షర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను నిర్దోషులుగా ప్రకటించింది. నిబంధనల ప్రకారం ఉరిశిక్షను హైకోర్టు ఖరారు చేయాల్సి ఉన్నందున కేసు ఫైళ్లను కింది కోర్టు గతవారం హైకోర్టుకు పంపింది. -
జంట పేలుళ్ల కేసు: దోషులకు ఉరి శిక్ష
-
జంట పేలుళ్ల కేసు: దోషులకు మరణ దండన
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ జంట బాంబు పేలుళ్ల కేసులో దోషులకు ప్రత్యేక న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. ఇద్దరు దోషులకు మరణశిక్ష, ఒకరికి యావజ్జీవకారాగార శిక్ష విధించింది.ఈ మేరకు చర్లపల్లి కారాగార ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు సోమవారం సాయంత్రం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1, ఏ2లుగా ఉన్న అనీఖ్ షఫీఖ్ సయీద్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరిలకు రూ.10వేల జరిమానతో పాటు మరణ దండన విధించింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్‌కు జీవిత ఖైదు విధించింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానం నిందితులకు మరణ శిక్ష విధించింది. ఈ కేసులో 11 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు చెప్పింది. 8 మంది నిందితుల్లో ఇద్దరిని మాత్రమే దోషులుగా తేల్చింది. సూత్రధారులై న రియాజ్‌భత్కల్, ఇక్బాల్ భత్కల్, అమిర్ రజా ఖాన్లు పరారీలో ఉండటంతో వారిపై విచారణ ఇంకా మొదలు కాలేదు ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. -
జంట పేలుళ్ల కేసు.. మరో నిందితుడు దోషే
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కు జంట బాంబుపేలుళ్ల కేసులో మరో నిందితుడిని సైతం కోర్టు దోషిగా తేల్చింది. గత మంగళవారం ఈకేసుపై తీర్పు వెలువరించిన కోర్టు ఇద్దరు నిందితులను దోషులగా.. మరో ఇద్దరిని నిర్ధోషులగా ప్రకటించిన విషయం తెలిసిందే. దోషులకు విధించే శిక్ష, ఐదో నిందితుడిపై తుది తీర్పు నేడు వెల్లడిస్తామని ప్రకటించింది. దీనిలో భాగంగా సోమవారం చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో జరిగిన విచారణలో ఐదో నిందితుడైన మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్‌ను సైతం కోర్టు దోషిగా తేల్చింది. అతను ఢిల్లీలో ఉగ్రవాదులకు ఆశ్రయిమిచ్చాడని విచారణలో రుజువైంది. తారీఖ్ అంజూమ్‌తో పాటు దోషులు ఇస్మాయిల్ చురి, అనీఖ్ షఫీఖ్‌లకు కోర్టు మరికాసేపట్లో శిక్ష ఖరారు చేయనుంది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. వీరిలో సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. 2007 ఆగస్టు 25న నగరంలో జరిగిన ఈ జంట పేలుళ్లలో 44 మంది ప్రాణాలు కోల్పోగా.. 77 మంది గాయపడ్డారు. చదవండి: ఇద్దరు దోషులు.. ఇద్దరు నిర్దోషులు -
లుంబీనీ పేలుళ్ల కేసు,ఏ1గా అక్బర్ ఇస్మాయిల్
-
లుంబీనీ పేలుళ్ల కేసు.. అనూహ్య తీర్పు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని గోకుల్‌చాట్, లుంబినీ పార్కులో 2007లో జరిగిన జంట బాంబు పేలుళ్ల కేసులో కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. ఇద్దరు దోషులుగా తేల్చిన న్యాయస్థానం మరో ఇద్దరని నిర్దోషులుగా ప్రకటించింది. దోషుల్లో అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, అనీఖ్ షఫిక్ సయ్యద్‌లకు శిక్ష ఖరారైంది. దోషులపై సెక్షన్ 302 కింద అభియోగాలు నమోదయ్యాయి. సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖాష్‌లను దోషులుగా తేల్చాడానికి ఆధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా ప్రకటిస్తూ వారిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది. రెండో కేసులో తుది తీర్పును సోమవారం వెలువరించనుంది. ఇక దోషులకు విధించే శిక్ష ఆ రోజే తెలియనుంది. చర్లపల్లి కేంద్ర కారాగారం ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డెజిగ్నేటెడ్ న్యాయస్థానంలో ఈ విచారణ సాగింది. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ ఈ ఘాతుకానికి పాల్పడింది. ఈ కేసులో మొత్తం 8 మంది ఉగ్రవాదులను నిందితులుగా పేర్కొనగా అమీర్ రజాఖాన్, రియాజ్ భత్కల్, ఇక్బాల్ భత్కల్ పరారీలో ఉన్నారు. మిగిలిన ఐదుగురు నిందితుల (అనీఖ్ షఫీఖ్ సయీద్, సాదిక్ ఇష్రార్ షేక్, ఫారూఖ్ సర్ఫుద్దీన్ తర్ఖా ష్, అక్బర్ ఇస్మాయిల్ చౌదరి, మహ్మద్ తారీఖ్ అంజుమ్ ఎహసాన్)పై విచారణ జరిగింది. -
దిల్సుఖ్నగర్ కేసులో నూ అబిదీన్
► ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్లో కీలక పాత్రధారి ► నాటి జంట పేలుళ్లకు పేలుడు పదార్థం సరఫరా ► సౌదీ అరేబియా నుంచి డిపోర్టేషన్‌పై ముంబయికి.. ► పీటీ వారెంట్‌పై తెచ్చేందుకు ఎన్ఐఏ సన్నాహాలు సాక్షి, సిటీబ్యూరో: దిల్‌సుఖ్‌నగర్‌లో 2013, ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ళ కేసులో మరో కీలక నిందితుడు జైనుల్ అబిదీన్ ఎట్టకేలకు చిక్కాడు. నిషిద్ధ ఉగ్రవాద సంస్థ ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్ ఇస్మాయిల్ అఫాఖీకి ఇతడు ప్రధాన అనుచరుడు. గత ఏడాది అఫాఖీ అరెస్టు నేపథ్యంలోనే ఇతడి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీంతో కేంద్ర నిఘా వర్గాలు ఇంటర్‌పోల్ ద్వారా రెడ్‌కార్నర్ నోటీసు జారీ చేయించాయి. దీని ఆధారంగా సౌదీ అరేబియా ఏజెన్సీలు గత అక్టోబర్‌లో అదుపులోకి తీసుకున్నాయి. చట్టపరమైన అంశాలు పూర్తయిన తర్వాత మంగళవారం డిపోర్టేషన్‌పై ముంబైకి పంపించాయి. అఫాఖీ ద్వారా రియాజ్‌తో సంబంధాలు... హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లో కుట్రపన్నిన ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భ త్కల్ కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న భత్కల్ ప్రాంతానికి చెందిన, బెంగళూరులో హోమియోపతి డాక్టర్‌గా చెలామణి అయిన సయ్యద్ ఇస్మాయిల్ అఫాఖీ అలియాస్ డాక్టర్ సాబ్తో సంప్రదింపులు జరిపాడు. రియాజ్ స్వస్థలం కూడా భత్కల్ కావడంతో వీరి పరిచయం పెరిగింది. 2013 ఫిబ్రవరి మొదటి వారంలో చాటింగ్ ద్వారా అసదుల్లా అక్తర్ అలియాస్ హడ్డీని (దిల్‌సుక్‌నగర్ బ్లాస్ట్స్ నిందితుడు) సంప్రదించిన రియాజ్ హైదరాబాద్‌లో విధ్వంసాలకు పాల్పడాలనే విషయం చెప్పి, దీనికి అవసరమైన పే లుడు పదార్థాలు అందించే బాధ్యతల్ని బెంగళూరులో ఉంటున్న సయ్యద్ఇస్మాయిల్ అఫాఖీకి అప్పగించాడు. అమ్మోనియం’ సేకరించిన అఫాఖీ గ్యాంగ్... ఐఎం మాడ్యుల్‌కు సంబంధించి తొలి అరెస్టులు 2008లో జరిగాయి. ఈ పరిణామంతో దేశం దాటేసిన రియాజ్ భత్కల్ పాకిస్థాన్‌లో తలదాచుకున్నాడు. ఇక్కడ ఉన్నన్నాళ్లూ పేలుడు పద్దార్థాలను తానే స్వయంగా సమీకరించి విధ్వంసాలు సృష్టించాడు. పాక్‌కు పారిపోయిన తర్వాత ఆ బాధ్యతల్ని అఫాఖీకి అప్పగించాడు. దీంతో 2009 నుంచి జరిగిన పేలుళ్లకు అవసరమైనా ఎక్స్‌ప్లోజివ్ (అమ్మోనియం నైట్రేట్ స్లర్రీ) అఫాఖీనే తన గ్యాంగ్ ద్వారా సమీకరిం సరఫరా చేడయం ప్రారంభించాడు. అలా ఈ ‘డాక్టర్ సాబ్’ ఐఎం ఎక్స్‌ప్లోజివ్ మాడ్యుల్ చీఫ్‌గా మారాడు. రోటీన్‌కు భిన్నంగా సమీకరణ... ఎక్స్‌ప్లోజివ్స్ సమీకరణలో నిఘా, పోలీసులు అనుమానం రాకుండా అఫాఖీ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడు. కర్ణాటకలోని ఉడిపి, రత్నగిరి తీరప్రాంతాలకు చెందిన మత్స్యకారులు చేపల వేటకు వినియోగించే ‘మీన్ తూటా’ల నుంచే పేలుడు పదార్థం సేకరణ అనువైన మార్గమని ఎంచుకున్నాడు. ఎక్స్‌ప్లోజివ్‌ను జాగ్రత్తలతో సముద్రంలో పడిపేల్చడం ద్వారా చేపలు పట్టే విధానాన్ని అక్కడి మత్స్యకారులు ‘మీన్ తూ టా’ అంటారు. ఉత్తర కన్నడ, మంగుళూరుల్లోని ఎక్స్‌ప్లోజివ్స్ డీలర్లు అక్రమంగా మత్స్యకారులకు ఈ స్లర్రీని అమ్మేస్తుంటారు. ఈ విధానాలు అధ్యయనం చేసిన అఫాఖీ పేలుడు పదార్థం సమీకరణకు ఇదే మార్గాన్ని ఎంచుకున్నాడు. సద్దాం, అబిదీన్ల ద్వారానే ‘స్మగ్లింగ్’... మీన్ తూటా’ల పేరుతో పేలుడు పదార్థం సేకరించే బాధ్యతల్ని అఫాకీ భత్కల్కే చెందిన స్క్రాప్ వ్యాపారి సద్దాం హుస్సేన్‌తో పాటు జైనుల్ అబిదీన్లకు అప్పగించాడు. స్నేహితులతో కలిసి చేపల వేటకు వెళ్ళాలని చెప్తూ ఉడిపి, రత్నగిరిల నుంచి మీన్ తూటాలు తెప్పించేవాడు. వాటిని పేలుళ్ళు జరిపే ప్రాంతాల్లో ఉన్న ఉగ్రవాదులకు పంపడం లేదా వారినే మంగుళూరు, బెంగళూరు రప్పించి అప్పగించడం చేసేవాడు. ఈ అమ్మోనియం నైట్రేట్ స్లర్రీని వినియోగించి తయారు చేసిన బాంబుల్నే ఉగ్రవాదులు హైదరాబాద్ దిల్సుఖ్నగర్ సహా అనేక చోట్ల పేల్చారు. 2013 హైదరాబాద్ పేలుడు తరవాత సౌదీ అరేబియా వెళ్ళిపోయిన అబిదీన్ అక్కడ ఓ దుకాణంలో నెలకు 1200 రియాల్స్ వేతనానికి సేల్స్‌మెన్‌గా ఉద్యోగంలో చేరాడు. ఐఎం ఎక్స్‌ప్లోజివ్స్ మాడ్యుల్ చీఫ్‌గా ఉన్న అఫాఖీతో పాటు సద్దాం తదితరుల్ని బెంగళూరు పోలీసులు గత ఏడాది జనవరిలో అరెస్టు చేశారు. అఫాఖీ విచారణలోనే తమ ముఠాలో అబిదీన్ కూడా ఉన్నాడని బయటపడింది. గతేడాది సౌదీలో అదుపులోకి... అబిదీన్ సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడని అఫాఖీ ద్వారా తెలుసుకున్న నిఘా వర్గాలు అతడి పాస్‌పోర్ట్ నెంబర్ ఆధారంగా ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించాయి. దీంతో అబిదీన్పై రెడ్‌కార్నర్ నోటీసు జారీ అయింది. సౌదీ ఏజెన్సీలు గతేడాది అక్టోబర్‌లో అబిదీన్‌ను అదుపులోకి తీసుకున్నాయి. డిపోర్టేషన్‌కు చట్టపర అంశా లు పూర్తయ్యాక మంగళవారం ముంబై కి పంపాయి. 2011 జూలైలో అక్కడి దాదర్, జవేరీ బజార్, ఓప్రా హౌస్ వద్ద జరిగిన పేలుళ్లలో వాంటెడ్ కావడంతో ఈ కేసులో ఏటీఎస్ అధికారులు అరెస్టు చేశారు. దిల్సుఖ్నగర్ పేలుళ్ల కేసులోనూ వాంటెడ్‌గా ఉన్న అబిదీన్‌ను పీటీ వారెంట్‌పై తీసుకురావడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సన్నాహాలు చేస్తోంది. -
జంట పేలుళ్ల నిందితుడు షర్ఫుద్దీన్కు చుక్కెదురు
* బెయిల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు * బెయిలిస్తే తిరిగి పట్టుకోవడం కష్టం * హైకోర్టుకు నివేదించిన అదనపు పీపీ * ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లోని లుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు ఫరూక్ షర్ఫుద్దీన్ తర్కాష్ అలియాస్ ఫరూక్ తర్కాష్ అలియాస్ అబ్దుల్లా బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో బెయిల్ సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2007, ఆగస్టు 25నలుంబినీ పార్క్, గోకుల్ ఛాట్ వద్ద రెండు బాంబు పేలుళ్లు జరిగాయి. లుంబినీ పార్క్ ఘటనలో 12 మంది మరణించగా, 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. గోకుల్ ఛాట్ వద్ద 32 మంది చనిపోగా, 47 మందికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో దిల్సుఖ్నగర్ ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద పెట్టిన రెండు బాంబులను పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ మూడు ఘటనలపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేశారు. తరువాత దర్యాప్తును అక్టోపస్‌కు బదిలీ చేశారు. పేలుళ్ల అనంతరం ముంబైలో తలదాచుకున్న ఉగ్రవాదులను అక్టోపస్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో తర్కాష్ను 2009లో పీటీ వారెంట్‌పై ముంబై నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం తర్కాష్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసుకున్నాడు. ఈ పిటిషన్లను వ్యతిరేకిస్తూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.రామిరెడ్డి వాదనలు వినిపించారు. నిందితుడిపై అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఈ కేసుపై కింది కోర్టులో విచారణ కూడా ప్రారంభం కాలేదని, ఇప్పుడు అతనికి బెయిల్ ఇస్తే మళ్లీ పట్టుకోవడం కష్టసాధ్యమవుతుందన్నారు. అంతేకాక బెయిల్‌పై విడుదలైన తరువాత సాక్ష్యాలను తారు చేయడం, సాక్షులను బెదిరించడం వంటి చేయడంతో పాటు ఇండియన్ ముజాహిద్దీన్‌తో కలసి ఉగ్ర కార్యకలాపాలకు తిరిగి పాల్పడే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ ఇలంగో బెయిల్ కోసం తర్కాష్ దాఖలు చేసుకున్న పిటిషన్లను కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.