ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు: జవాన్లకు గాయాలు
భద్రాచలం: తెలంగాణ సరిహద్దుల్లో సోమవారం జరిగిన పేలుడు ఘటనలో ఇద్దరు జవాన్లు గాయాలపాలయ్యారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా చింతలనార్ సమీపంలో కూంబింగ్ చేస్తున్న జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు పేలుళ్లు జరిపారు. రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న ప్రాంతంలో జరిగిన పేలుడులో 74వ బెటాలియన్‌కు చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.