tyranny
-
టీడీపీ అడ్డదారులు.. ప్రశాంత పోలింగ్‌లో చిచ్చు..
సాక్షి, తిరుపతి/ఒంగోలు/సాక్షి ప్రతినిధి నెల్లూరు: ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ని అడ్డుకునేందుకు టీడీపీ శ్రేణులు అడ్డదారులు తొక్కారు. ఓటర్లను అడ్డుకుంటూ పోలింగ్‌ను తీవ్ర ఆలస్యం చేసేందుకు యత్నించారు. దొంగ ఓట్లంటూ రచ్చరచ్చ చేశారు. కొందరు టీడీపీ కార్యకర్తలు మద్యం సేవించి వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు తెగబడ్డారు. మహిళలను దుర్భాషలాడుతూ నానా హంగామా చేయడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నెల్లూరులో టీడీపీ నేతలు బీదా రవిచంద్ర, అబ్దుల్ అజీజ్.. ఒంగోలులో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, తిరుపతిలో టీడీపీ మూకలు దౌర్జన్యాలకు తెగబడ్డారు. వివరాలివీ.. తిరుపతి సత్యనారాయణపురంలోని 233, 234 పోలింగ్ కేంద్రాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, డిప్యుటీ మేయర్ భూమన అభినయ్‌రెడ్డి తమ ఓటును వినియోగించుకునేందుకు వెళ్లారు. వీరినెలా అనుమతిస్తారంటూ టీడీపీ నేతలు పోలీసులు, ఎన్నికల నిర్వాహకులపై దౌర్జన్యానికి దిగారు. వారిద్దరు ఓటు వేయడానికి వెళ్లారని ఎంత చెబుతున్నా వినకుండా రచ్చచేయడంతో అరెస్టు చేయక తప్పలేదు. మద్యం సేవించి రాళ్లు రువ్వి.. తిరుపతి బాలాజీ కాలనీ పరిధిలోని పోలింగ్ కేంద్రం వద్ద కూడా టీడీపీ శ్రేణులు రెచి్చపోయారు. మద్యం సేవించి పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. రచ్చచేసేందుకు సిద్ధమయ్యారు. పోలింగ్ ముగియడానికి గంట ముందు టీడీపీకి చెందిన గోవిందాచారి అనే కార్యకర్త మహిళలను దొంగ ఓటర్లంటూ దుర్భాషలాడటం ప్రారంభించారు. రాళ్లు రువ్వారు. టీడీపీకి వామపక్ష పార్టీ శ్రేణులు మద్దతు పలికాయి. దీంతో ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. పోలీసులు వైఎస్సార్సీపీ, టీడీపీ నేతలను అరెస్టుచేశారు. టీటీడీ పరిపాలన భవనం సమీపంలోని గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలోనూ దాదాపు ఇదే పరిస్థితి సృష్టించారు. గొడవకు కారణం అయిన టీడీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తున్న దామచర్ల శ్రీకాళహస్తిలో.. ఇక శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని ఏర్పేడులో పోలింగ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న వైఎస్సార్సీపీ కార్యకర్త దామోదర్‌రెడ్డిపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ బొజ్జల సు«దీర్‌రెడ్డి, అతని అనుచరులు దాడిచేశారు. నియోజకవర్గంలో బీసీలంతా వైఎస్సార్సీపీ బలపరచిన అభ్యర్థులకే ఓట్లు వేస్తున్నారనే ఉద్దేశ్యంతోనే దామోదర్‌పై దాడిచేశారని ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీకాళహస్తి పట్టణంలో 39, 39ఏ, 39బీ పోలింగ్ బూత్‌లలోకి టీడీపీ నేతలు చొరబడ్డారు. దొంగ ఓట్లు వేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడికి తెగబడ్డారు. పోలీసులపై దామచర్ల దౌర్జన్యం ఒంగోలులో పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త కాకర్ల ఈశ్వర్ అనే వ్యక్తిని టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పోలీస్‌స్టేషన్ నుంచి బలవంతంగా తీసుకువెళ్లారు. స్థానిక సెయింట్ థెరిస్సా ఉన్నత పాఠశాల పోలింగ్‌బూత్‌కు సమీపంలో సోమవారం ఈశ్వర్ రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నాడంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. చివరకు ఇరువర్గాలు భౌతికదాడులకు దిగుతుండడంతో పోలీసులు చెల్లాచెదురు చేశారు. ముందస్తు చర్యగా పోలీసులు ఈశ్వర్‌ను టూటౌన్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఇది తెలుసుకున్న జనార్దన్ తన అనుచరులతో అక్కడకు వెళ్లి పోలీసులు ఎంతగా వారిస్తున్నా లెక్కచేయకుండా దౌర్జన్యంగా ఈశ్వర్‌ను బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు మండిపడడంతో దామచర్లతోపాటు మరికొందరిపై కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. నెల్లూరులో సీఐపై టీడీపీ నేతల రుబాబు తూర్పు రాయలసీమ పట్టభద్రులు, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా సోమవారం నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని రామ్మూర్తినగర్ ప్రైమరీ స్కూల్లోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ కలిసి వచ్చారు. పోలింగ్ కేంద్రంలో ఓటేసిన రవిచంద్ర అక్కడే నిలబడి ఉన్నారు. ఇంతలో బాలాజీనగర్ సీఐ రాములు నాయక్ అక్కడకు చేరుకుని ఓటేశారు కదా వెళ్లిపోవాలని బీదాకు సూచించారు. దీంతో ఆయన కొద్దిసేపు ఉండి వెళ్తామని చెప్పారు. పోలింగ్ కేంద్రం వద్ద ఉండకూడదని సీఐ మరోసారి చెప్పడంతో బీదా ఆయనతో వాగ్వాదానికి దిగారు. అక్కడే ఉన్న అబ్దుల్ అజీజ్ మరింతగా రెచ్చిపోయి.. ‘సార్ ఏమనుకుంటున్నావ్.. టచ్‌చేసి చూడు’.. అంటూ సీఐను తోశారు. అంతేకాక.. పోలింగ్ కేంద్రంలోనే సీఐపై చిందులు తొక్కుతూ నానా యాగీ చేశారు. మరోవైపు.. పోలింగ్ కేంద్రం వద్ద మొబైల్ కౌంటర్ ఏర్పాటుచేయలేదంటూ వారిరువురూ సీఐపై మండిపడ్డారు. నిజానికి.. గత పదిరోజులుగా కలెక్టర్ ఈ విషయంలో విస్తత ప్రచారం కల్పించారు. కానీ, టీడీపీ నేతలు మాత్రం అవేవీ పట్టించుకోకుండా పోలీస్ అధికారిపై దురుసుగా ప్రవర్తించారు. -
ఎస్పీ చెంతకు ఎలుక పంచాయితీ..ప్రశ్నించిన పాపానికి దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: కర్రీ పాయింట్లో కొనుగోలు చేసిన పప్పులో ఎలుక వచ్చిందని ప్రశ్నించిన పాపానికి తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప దృష్టికి బాధితులు తీసుకువచ్చారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఫక్కీరప్పను బాధితులు కలసి ఫిర్యాదు చేశారు. వివరాలు... అనంతపురం నగరంలోని కమలానగర్లో ముత్యాలరెడ్డి డెయిరీ పక్కనే ఊటకూరి దుర్గాంజలి దంపతులు నివాసముంటున్నారు. ఈ నెల 2న మధ్యాహ్నం 2.56 గంటలకు దుర్గాంజలి... ముత్యాలరెడ్డి కర్రీ పాయింట్లో రూ.30 చెల్లించి పప్పు, రూ.20 చెల్లించి చెట్నీ పార్శిల్ తీసుకెళ్లారు. ఇంట్లోకి వెళ్లి అన్నంలోకి పప్పు వేసుకోగా అందులో చచ్చిన ఎలుక వచ్చింది. వెంటనే ఆ ప్లేటును తీసుకెళ్లి కర్రీపాయింట్ నిర్వహిస్తున్న యజమాని దృష్టికి తీసుకెళ్లారు. అది చూసిన వారు హోటల్లోని ఆహార పదార్థాల్లో ఎలుకలు, బల్లులు, బొద్దింకలు పడడం సర్వ సాధారణమంటూ సమాధానం ఇచ్చి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. దీంతో విషయాన్ని ఫుడ్ ఇన్స్పెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు. దీంతో కక్షకట్టిన ముత్యాలరెడ్డి కుటుంబసభ్యులు గుర్తు తెలియని వ్యక్తులతో తమ ఇంటిపైకొచ్చి దౌర్జన్యం చేస్తూ భయాందోళనకు గురి చేశారని ఫిర్యాదు చేశారు. (చదవండి: ఆర్టీసీ బస్టాండ్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కొత్త పెళ్లికూతురు) -
జన్మభూమి సభలో తెలుగు తమ్ముళ్ల దౌర్జన్యం
-
అనంత టీడీపీ నేతల దౌర్జన్యం
పీబీసీకి గండి కొట్టి చిత్రావతికి నీరు ప్రతి ఏటా పీబీసీ (పులివెందుల బ్రాంచ్ కెనాల్)కి కోటా మేరకు నీరు రాక ఈ ప్రాంత వాసులు అల్లాడుతుంటే పొరుగు జిల్లాలోని అధికార పార్టీ నేతలు బాధ్యతారాహిత్యంగా దౌర్జన్యానికి తెరతీశారు. సోమవారం దౌర్జన్యంగా పీబీసీకి గండికొట్టి నీటిని చిత్రావతి నదికి మళ్లించడం ద్వారా జల జగడానికి కాలు దువ్వారు. లింగాల : అనంతపురం టీడీపీ నాయకులు పట్టపగలే దౌర్జన్యానికి ఒడిగట్టారు. అనంతపురం జిల్లా యల్లనూరు మండలం కల్లూరు గ్రామం వద్ద సోమవారం పీబీసీ కాలువను ధ్వంసం చేసి పులివెందుల పట్టణ ప్రజలకు విడుదలవుతున్న తాగు నీటిని చిత్రావతి నదిలోకి మళ్లించారు. వివరాలలోకి వెళితే.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, సింగనమల ఎమ్మెల్యే యామిని బాలలు వారి అనుచరులతో పీబీసీ కల్లూరు డిస్ట్రిబ్యూటరీ వద్దకు జేసీబీతో వచ్చారు. పీబీసీ కాలువను ధ్వంసం చేసి నీటిని చిత్రావతి నదిలోకి మళ్లించారు. పోలీసుల సమక్షంలో టీడీపీ నాయకులు ఈ దౌర్జన్యానికి పాల్పడ్డారు. వారం క్రితం టీడీపీ నేతలు పులివెందులలో ర్యాలీ నిర్వహించి.. తాము నీటి కోసం ఎంతో చేస్తున్నామని గొప్పలు చెప్పుకున్నారు. ఇపుడు ఆ పార్టీ వారే ఇలా దౌర్జన్యానికి దిగితే ఈ నేతలు ఏం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ ప్రజలకు కనీసం తాగునీరు అందించే స్థితిలో కూడా లేదనడానికి ఇదే నిలువెత్తు సాక్ష్యం. సీబీఆర్ నుంచి నీటిని నిలిపి వేశాం చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటి విడుదల నిలిపి వేశామని పీబీసీ డీఈ జయకుమార్ బాబు తెలిపారు. అధికార పార్టీ వారే ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలన్నారు. ప్రస్తుతం సీబీఆర్‌లో ఒక టీఎంసీ నీరు మాత్రమే ఉందన్నారు. జీడిపల్లె రిజర్వాయర్ నుంచి విడుదల అవుతున్న నీరు ఆగిపోయిందని, దీంతో తుంపెర నుంచి సీబీఆర్‌కు నీరు రాలేదన్నారు. అధికార పార్టీ నాయకులు ధ్వంసం చేసిన పీబీసీ కాలువను యుద్ధ ప్రాతిపదికన పునరుద్ధరించి నక్కలపల్లె ఎస్ఎస్ ట్యాంకుకు నీరు విడుదల చేయిస్తామన్నారు. సీబీఆర్ నుంచి 0.1టీఎంసీ నీటిని మాత్రమే విడుదల చేయగలిగామన్నారు. ఈ నీరు ఎస్ఎస్ ట్యాంకుకు ఏమాత్రం చేరుతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులను అడ్డుకున్న పోలీసులు సింహాద్రిపురం: అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జేసీ ప్రభాకర్‌రెడ్డి, యామినిబాల, వారి అనుచరులు యల్లనూరు మండలం కల్లూరు వద్ద పీబీసీ కాలువలకు సోమవారం గండి కొట్టారని తెలిసి సింహాద్రిపురం మండలం వైఎస్ఆర్ సీపీ నాయకులు అక్కడికి పయనమయ్యారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగపు నేత అరవిందనాథరెడ్డి, బలపనూరు సర్పంచ్ భర్త కృష్ణారెడ్డి, కేశవరెడ్డి, లక్ష్మిరెడ్డి, రాఘవరెడ్డి, శేఖరరెడ్డి తదితరులు పార్నపల్లె వైపు వెళ్లకుండా స్థానిక పోలీసులు ఎంపీడీవో కార్యాలయం వద్ద వారి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దౌర్జన్యం నశిం చాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి విడిచి పెట్టారు. -
టీడీపీ వర్గీయుల దౌర్జన్యాల పర్వం
ప్రకాశం: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ వర్గీయుల దౌర్జన్యాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రకాశం జిల్లా మర్రిపాడి మండలం చెంచిరెడ్డి పల్లె గ్రామంలో టీడీపీ వర్గీయులు సోమవారం ఉదయం దౌర్జన్యానికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఓటేశారనే నెపంతో వారి వరిచేనుకు నీరు రాకుండా విద్యుత్ వైర్లు కత్తిరించారు. ఘటనపై బాధితులు పిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు.