క్వార్టర్స్‌లో యువ భారత్
స్కాట్లాండ్పై గెలుపు
కుల్దీప్ హ్యాట్రిక్
అండర్-19 ప్రపంచకప్
దుబాయ్: ప్రపంచకప్ నిలబెట్టుకునే క్రమంలో భారత యువ క్రికెట్ జట్టు నిలకడైన ఆటతీరుతో దూసుకెళుతోంది. లెఫ్టార్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (4/28) అండర్-19 ప్రపంచకప్ టోర్నీలో భారత్ తరఫున తొలిసారిగా హ్యాట్రిక్ సాధించగా.. బ్యాటింగ్‌లో యువ సంచలనం సర్ఫరాజ్ ఖాన్ (51 బంతుల్లో 45 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) సమయోచితంగా రాణించడంతో టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. తద్వారా జట్టు క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్ గ్రూప్ ‘ఎ’లో టాప్‌లో కొనసాగుతోంది. 19న పపువా న్యుగినియాతో తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది.
సోమవారం జరిగిన ఈ లో స్కోరింగ్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 29.4 ఓవర్లలో 88 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఓపెనర్ ఉమీద్ (77 బంతుల్లో 44; 4 ఫోర్లు), మెయిన్ (22 బంతుల్లో 16; 2 ఫోర్లు) మాత్రమే రెండకెల స్కోర్లు చేశారు. 19వ ఓవర్లో చివరి రెండు బంతులకు రెండు వికెట్లు తీసిన కుల్దీప్ తన మరుసటి ఓవర్ తొలి బంతికే హ్యాట్రిక్ వికెట్ తీసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. ఆమీర్ గనికి నాలుగు వికెట్లు దక్కాయి.
తడబడిన కుర్రాళ్లు
ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 22.3 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసి గెలిచింది. అయితే తక్కువ స్కోరే కదా అనుకున్న జోల్ సేనను స్కాట్లాండ్ వణికించింది. ఒక్క పరుగుకే వికెట్ పడగా... 22 పరుగులకు సగం జట్టు పెవిలియన్‌లో కూర్చుంది. వీరిలో ఏ ఒక్కరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు. సంచలనం ఖాయమేమో అనుకున్న దశలో సర్ఫరాజ్, దీపక్ హుడా (40 బంతుల్లో 24; 2 ఫోర్లు) జట్టును గట్టెక్కించారు. చయాంక్ గోసెన్కు మూడు, మెయిన్‌కు రెండు వికెట్లు దక్కాయి.
అఫ్ఘానిస్థాన్ సంచలనం
అండర్-19 ప్రపంచకప్‌లో పెను సంచలనం నమోదైంది. మూడుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాపై పసికూన అఫ్ఘానిస్థాన్ 36 పరుగులతో నెగ్గింది. తొలుత అఫ్ఘాన్ 49.2 ఓవర్లలో 253 పరుగులు చేయగా... ఆస్ట్రేలియా 217 పరుగులకే ఆలౌటైంది.