UGC orders
-
మోదీ స్పీచ్ బ్యాన్... మమతపై విమర్శలు
సాక్షి, కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భారతీయ జనతా పార్టీ గుర్రుతో ఉంది. ఆదివారం కోల్‌కతాతోపాటు దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపన్యాసం లైవ్ ప్రసారం చేసేందుకు యూజీసీ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు అన్నికళాశాలలకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్న విద్యాలయాల్లో మాత్రం ప్రసారం చేయొద్దంటూ మమతా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కాషాయం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. ‘ఇది దిగ్భ్రాంతి కలిగించే అంశం. ప్రజాస్వామ్య బద్ధంగా ఎంపికైన ఒక ముఖ్యమంత్రి, ప్రధాని మోదీ ప్రసంగం అడ్డుకోవటం దారుణం. ప్రధాని సందేశాలను విద్యార్థులు వినకోవద్దనుకోవటం సరైన పద్ధతి కాదు’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి నళిన్ కోహ్లి పేర్కొన్నారు. ఇక దీదీ(మమతా) మరీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేత సుదేశ్ వర్మ మండిపడ్డారు. స్వామి వివేకానందుడు దేశభక్తుడు. ఆయనపై ఉపన్యాసం విషయంలో విద్యాలయాలకు, ఎవరికీ ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ లాంటి అత్యున్నత విభాగం ఇచ్చిన ఆదేశాలను అడ్డుకోవటం ద్వారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరిస్తున్నారు అని సుదేశ్ చెబుతున్నారు. కాగా, 1893 సెప్టెంబర్ 11, చికాగో వేదికగా ప్రపంచ సర్వమత సమ్మేళన సదస్సులో స్వామి వివేకానందుడు ఉపన్యసించిన విషయం తెలిసిందే. ఆ అపూర్వ ఘట్టానికి 125 ఏళ్లు పూర్తి కావటంతో ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. -
‘విద్యార్థులకు కౌన్సెలింగ్ కేంద్రాలు పెట్టండి’
న్యూఢిల్లీ: విద్యార్థులు ఒత్తిడి, ఆందోళన, ఇంటిపై బెంగ (హోం సిక్నెస్) తదితర మానసిక సమస్యలను అధిగమించేందుకు కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలను యూజీసీ ఆదేశించింది. ఈ మేరకు తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ప్రతీ టీచర్ కనీసం 25 మంది విద్యార్థుల బాగోగులను చూస్తూ, వారికి విద్యాపరంగా, మానసికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని పేర్కొంది. విద్యార్థుల పురోగతి, పరీక్షల ఫలితాలు, హాజరు తదితర విషయాలను వారి తల్లిదండ్రులకు ఎప్పటికప్పుడు తెలపాలని స్పష్టంచేసింది. -
అన్ని సర్టిఫికెట్లలో అమ్మ పేరు తప్పనిసరి
' దరఖాస్తు ఫారాల్లోనే అవకాశం కల్పించాలి ' యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు యూజీసీ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: విద్యా సంబంధిత డిగ్రీలు, ఇతర అన్ని సర్టిఫికెట్లలో తల్లి పేరును తప్పనిసరిగా చేర్చాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు దేశంలోని అన్ని యూనివర్సిటీల వైస్ చాన్స్లర్లకు ఆదేశాలు జారీ చేసింది. సర్టిఫికెట్లలోనే కాకుండా వివిధ కోర్సుల దరఖాస్తు ఫారాల్లోనూ తల్లి పేరు రాసే కాలమ్ ఉంచాలని పేర్కొంది. దరఖాస్తు ఫారాలు, సర్టిఫికెట్లలో విద్యార్థి ఇంటి పేరు, విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు స్పష్టంగా ఉండేలా చర్యలు చేపట్టాలని యూజీసీ ఇన్చార్జి సెక్రటరీ ఉపమన్యు బసు వీసీలకు ఆదేశాలు జారీ చేశారు. కొత్త డిగ్రీలకు యూజీసీ అనుమతి ఉండాల్సిందే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ గుర్తించని డిగ్రీలను ఏ యూనివర్సిటీ కూడా నిర్వహించడానికి వీలులేదని, అలాంటి డిగ్రీలను ఇవ్వరాదని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ విషయంలో వర్సిటీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించరాదని సూచిస్తూ వర్సిటీలకు ఆదేశాలు జారీ చేసింది. కొత్త డిగ్రీని ప్రవేశపెట్టాలనుకుంటే ఆరు నెలల ముందుగా యూజీసీకి దర ఖాస్తు చేసుకుని గుర్తింపు పొందాలని సూచించింది.