ujwala yojana scheme
-
పేదలందరికీ ‘ఉజ్వల’ వంట గ్యాస్ కనెక్షన్లు
న్యూఢిల్లీ: ఉజ్వల యోజనలో భాగంగా వంటగ్యాస్ కనెక్షన్లను పేదలందరికీ ఉచితంగా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 2016లో ప్రారంభించిన ఈ పథకాన్ని తొలుత గ్రామీణ ప్రాంతాల్లోని దారిద్య్రరేఖ దిగువన ఉన్న కుటుంబాలకు ఉద్దేశించారు. అనంతరం దీనిని ఎస్సీ, ఎస్టీలకు, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి విస్తరించారు. ఇకపై దేశవ్యాప్తంగా ఉన్న నిరుపేదలందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాలని మంత్రివర్గం నిర్ణయించిందని చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. వంటగ్యాస్ కనెక్షన్ లేని, ప్రభుత్వ పథకాల లబ్దిదారులు కాని వారికి ప్రధానమంత్రి ఉజ్వల యోజన వర్తింపజేయాలని ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సోమవారం నిర్ణయించిందని ఆయన వివరించారు. 50 శాతానికి పైగా(కనీసం 20 వేలు) గిరిజన జనాభా ఉన్న బ్లాకుల్లో ఏకలవ్య రెసిడెన్షియల్ మోడల్ పాఠశాలల్ని ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు రూ.2,242 కోట్లు వెచ్చించాలని నిర్ణయించింది. -
10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చాం
న్యూఢిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. ఉజ్వల యోజన లబ్ధిదారులతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. గత నాలుగేళ్లలో తమ ప్రభుత్వం 10 కోట్ల ఎల్పీజీ కనెక్షన్లను ఇచ్చిందని, వాటిలో నాలుగు కోట్లు పేద మహిళలకే కేటాయించామని ఆయన చెప్పారు. గ్యాస్ కనెక్షన్లలో సింహ భాగం దళితులు, గిరిజనులకే దక్కాయని ఆయన వెల్లడించారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల అనుకూల పథకాల్ని అమలు చేస్తుంటే.. ఆ విషయంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయని తప్పుపట్టారు. తాను యువకుడిగా ఉన్నప్పుడు కేవలం ధనికులు, ప్రభావితం చేసే వ్యక్తులకు మాత్రమే ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చేవారని, ఇప్పుడు పేదలు, దళితులు, గిరిజనులే లక్ష్యంగా పథకం అమలవుతోందని చెప్పారు. ప్రస్తుతం ప్రతీ 100లో 81 కుటుంబాలకు కనెక్షన్లు ఉన్నాయని, ఎన్డీఏ ప్రభుత్వం వల్లే అది సాధ్యమైందన్నారు. స్వాతంత్య్రం వచ్చాక ఆరు దశాబ్దాల్లో 13 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇస్తే.. గత నాలుగేళ్లలో 10 కోట్లు ఇచ్చామని ప్రధాని పేర్కొన్నారు. ఉజ్వల్ యోజనతో లబ్ధి పొందిన మహిళలతో మాట్లాడుతూ.. ‘చిన్నతనంలో నా తల్లి కట్టెల పొయ్యిపై వంట చేసేది. ఆ సమయంలో పొగ వల్ల ఎంతో ఇబ్బంది పడేది. భవిష్యత్‌లో 100 శాతం ఇళ్లకు శుద్ధమైన ఇంధనం అందించడమే మా లక్ష్యం’ అని మోదీ అన్నారు. మా హయాంలోనే దళితులకు ప్రయోజనాలు ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా దళితులు ఎంతో లాభపడ్డారని పేర్కొంటూ.. ఎన్డీఏ, యూపీఏ హయాంలో దళితులు పొందిన లబ్ధిని మోదీ పోల్చారు. ‘2010–14 మధ్యలో దళితులు 445 పెట్రోల్ బంకులు పొందితే.. 2014–18లో 1200 పెట్రోల్ బంకులు కేటాయించాం. యూపీఏ హయాంలో 900 మంది దళితులకు మాత్రమే ఎల్పీజీ డీలర్షిప్ కేటాయిస్తే.. ఎన్డీఏ పాలనలో 1300 మందికి ఇచ్చాం’ అని చెప్పారు. ఉజ్వల యోజన కింద లబ్ధి పొందడం ప్రారంభమైనప్పటి నుంచి పేదలు, దళితులు, గిరిజన వర్గాల జీవితాలు మెరుగయ్యాయని, సామాజిక సాధికారితలో ఈ పథకం ప్రధాన పాత్ర పోషించిందని మోదీ పేర్కొన్నారు. మే, 2016లో ప్రారంభించిన ఉజ్వల పథకంలో 5 కోట్ల నిరుపేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు. అనంతరం ఆ సంఖ్యను 8 కోట్లకు పెంచారు. తమిళనాడు వస్తే దోసె దొరుకుతుందా..? టీ నగర్ (చెన్నై): తమిళనాడుకు వస్తే దోసె దొరుకుతుందా? అని తమిళనాడులోని కృష్ణగిరికి చెందిన మహిళ రుద్రమ్మతో వీడియో కాన్ఫనెన్స్‌లో మోదీ అన్నారు. తప్పకుండా తయారు చేసి ఇస్తానని, తమ ఇంటికి రావాలని ఆమె ఆహ్వానించారు. అనంత్‌నాగ్‌కు చెందిన మహిళా బృందం ‘ఇది రంజాన్ మాసం. ఖురాన్‌ను రోజూ చదువుతాం. రోజూ మీ కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు ప్రధానిగా కొనసాగుతారని మేం ఆశిస్తున్నాం’ అని మోదీతో అన్నారు. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన లబ్ధిదారుతో మోదీ మాట్లాడుతూ.. ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌కు ఇబ్బందులుంటే తనను నేరుగా సంప్రదించాలని సూచించారు. గతంలో కట్టెల పొయ్యి వాడినప్పుడు వంటకు ఎంతో సమయం పట్టేదని.. ఇప్పుడు గ్యాస్ పొయ్యితో సమయం ఆదా అవడం వల్ల పిల్లలతో సమయం గడుపుతున్నానని ఆమె పేర్కొంది. -
జీఎస్టీలోకి పెట్రోల్‌తో సామాన్యులకు ఊరట
పట్నా/న్యూఢిల్లీ: పెట్రోలియం ఉత్పత్తుల్ని వస్తుసేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకొస్తేనే సామాన్య ప్రజలకు ఊరట కలుగుతుందని కేంద్ర పెట్రోలియం, సహజవనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. ఈ విషయమై కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయన్నారు. బిహార్‌లోని బెహరీ నియోజకవర్గంలో రెండో విడత ఉజ్వల యోజనను శుక్రవారం ప్రారంభించాక మీడియాతో మాట్లాడారు. ‘సిరియా అంతర్యుద్ధం, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధిస్తామన్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో పెట్రో ఉత్పత్తుల ధరలు నాలుగేళ్ల గరిష్టానికి చేరుకున్నాయి. జీఎస్టీ వచ్చి ఏడాదైనా కాకముందే తమ ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుందని రాష్ట్రాలు ఆందోళన చెందుతున్నాయి’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు ఢిల్లీలో శుక్రవారం లీటర్ పెట్రోల్ ధర రూ.74.08కి చేరుకుంది. 2013, సెప్టెంబర్ తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. -
మహిళల జీవితాల్లో ఉజ్వల
అష్ట సతుల్లోనూ కృష్ణునికి అత్యంత ఇష్టురాలు సత్య. నారీ శక్తికి, స్త్రీ ఆత్మగౌరవానికి తిరుగులేని ప్రతీక. నరకునితో పోరుతూ వాసుదేవుడు సొమ్మసిల్లిన వేళ విల్లు చేపట్టి అంతటి రాక్షసుణ్నీ అలవోకగా నిలువరిస్తుంది. ఆధునిక భారత మహిళను సత్యభామలా సాధికార పరచడమే లక్ష్యంగా ఈ బడ్జెట్లో పలు కీలక కేటాయింపులు చేశారు అరుణ్ జైట్లీ... న్యూఢిల్లీ: తాజా బడ్జెట్లో మహిళలపై కేంద్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. ఉచిత గ్యాస్ కనెక్షన్లు సహా.. ఉద్యోగాలు చేసే మహిళలు, స్వయం సహాయక బృందాలకు భారీగా నిధులను కేటాయించింది. పేద మహిళలకు ఇవ్వాల్సిన ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల లబ్ధిదారుల సంఖ్యను 8 కోట్లకు పెంచినట్లు జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. పేద మహిళలకు వంటచెరకు పొగనుంచి విముక్తి కల్పించేందుకు ఉజ్వల పథకాన్ని ప్రవేశపెట్టాం. ప్రారంభంలో 5 కోట్ల మంది పేద మహిళలకు ఉచితంగా వంటగ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించి పనిచేస్తున్నాం. ఈ పథకానికి పేద మహిళల్లో ఆదరణ పెరగటంతో ఈ లక్ష్యాన్ని 8 కోట్లకు పెంచాలని నిర్ణయించాం’అని జైట్లీ పేర్కొన్నారు. తొలి మూడేళ్ల వరకు ఈపీఎఫ్ 8 శాతమే! మహిళా ఉద్యోగులను ప్రోత్సహించడంలో భాగంగా ఈసారి బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నూతనంగా ఉద్యోగంలో చేరిన మహిళలు అధిక మొత్తంలో టేక్ హోమ్ శాలరీ (నికర జీతం) తీసుకునే విధంగా వెసులుబాటును ఇచ్చింది. ఉద్యోగ భవిష్యనిధిలో వీరి వాటా చెల్లింపును తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. వారి ఈపీఎఫ్ కంట్రిబ్యూషన్‌ను ప్రస్తుతం ఉన్న 12 శాతం నుంచి 8 శాతానికి తగ్గిస్తున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. ఈ మేరకు ‘ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్–1952’లో మార్పులు చేస్తున్నట్లు జైట్లీ తన బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు. ఇందులో భాగంగా మహిళా ఉద్యోగులు తొలి మూడేళ్ల వరకు 8 శాతం ఈపీఎఫ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. దీంతోపాటుగా సామాజిక భద్రత పథకాల్లో భాగంగా మూడేళ్లపాటు. కొత్తగా ఉద్యోగాల్లో చేరే అందరు ఉద్యోగులకు ఎంప్లాయర్ (యాజమాన్యం) వాటా ఈపీఎఫ్ 12 శాతాన్నీ ప్రభుత్వమే భరించే ప్రతిపాదన చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు ప్రధాన్ మంత్రి రోజ్‌గార్ ప్రోత్సాహన్ యోజన కింద వస్త్ర, తోలు, ఫుట్‌వేర్ పరిశ్రమలకు చెందిన ఉద్యోగులు పొందుతున్న ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ ప్రయోజనాన్ని మిగిలిన రంగాలకు కూడా వర్తింపచేస్తున్నట్లు వెల్లడించారు. గతంలో ఈ పథకం కింద ఇచ్చిన ప్రయోజనాలు ఇప్పుడిప్పుడే సత్ఫలితాలను ఇస్తున్నాయని జైట్లీ పేర్కొన్నారు. స్వయం సహాయక బృందాలకు.. జాతీయ గ్రామీణ జీవన కార్యక్రమంలోని క్లస్టర్లలో స్వయం సహాయక బృందాలు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించింది. 2019 మార్చి వరకు ఈ కార్యక్రమం కోసం ఇచ్చే రుణాలను రూ.75 వేల కోట్లకు పెంచుతున్నట్లు జైట్లీ వెల్లడించారు. స్వయం సహాయక బృందాలకు ఇచ్చే రుణాలను గతేడాదితో పోలిస్తే 37 శాతం పెంచి.. రూ.42,500 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘బేటీ బచావో, బేటీ పఢావో’, సుకన్య సమృద్ధి అకౌంట్ పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని జైట్లీ పేర్కొన్నారు. ‘నవంబర్ 2017 వరకు బాలికల పేర్లతో 1.26 కోట్ల అకౌంట్లు దేశవ్యాప్తంగా తెరిచారని.. ఇందులో రూ.19,183 కోట్లు దాచుకున్నారు’అని ఆయన తెలిపారు. బడ్జెట్ హైలైట్స్ ► రూ.5 లక్షల కోట్ల అదనపు రుణాలు అందించేలా బ్యాంకు లకు మూలధన సాయం. ► ఎంపీల వేతనం, నియోజకవర్గ అలవెన్సు, ఆఫీసు ఖర్చులు, అలవెన్సుల్లో మార్పులకు ప్రతిపాదన. ద్రవ్యోల్బణం ఆధారంగా ఐదేళ్లకోసారి వేతనాల సమీక్షకు చర్యలు. ► 018–19 ఆర్థిక సంవత్సరంలో రక్షణ శాఖకు రూ.2.82 లక్షల కోట్ల కేటాయింపు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది 2.67 లక్షల కోట్లు. ► జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల కోసం రూ.150 కోట్లు కేటాయింపు. ► 2018 జనవరి 15 వరకూ ప్రత్యక్ష పన్నుల వసూలు 18.7 శాతం వృద్ధి. ► 2016–17 ఆర్థిక సంవత్సరంలో రూ.250 కోట్ల టర్నోవర్ కలిగిన సంస్థలపై కార్పొరేట్ పన్ను 25 శాతానికి తగ్గింపు. -
‘ప్రగతిశీల సానుకూల భారత బడ్జెట్’
న్యూఢిల్లీ: 2018–19 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం ‘ప్రగతిశీల, సానుకూల భారత్’బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. గ్రామీణ, పట్టణ భారతాల మధ్య ఉన్న అంతరాన్ని రూపుమాపేందుకు ఈ బడ్జెట్ దోహదం చేస్తుందని తెలిపారు. ‘ప్రగతిశీల, సానుకూల భారతం కోసం దోహదం చేసే బడ్జెట్ ఇది. ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ ప్రాధమ్యాలు మారాయి. ఇది దేశంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరాన్ని తగ్గించడానికి దోహదం చేస్తుంది. సరికొత్త భారతం కోసం చారిత్రక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి జైట్లీకి అభినందనలు. ప్రధాన మంత్రి ఉజ్వల్ యోజన పరిధిలోకి 8 కోట్ల కుటుంబాలను తీసుకురావడం.. సాధారణ ప్రజల జీవితాలను మరింత మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నిరూపిస్తోంది. గత కొన్నేళ్లలో వచ్చిన బడ్జెట్లలో రైతులు, ప్రజలకు అత్యంత అనుకూలంగా ఉన్న బడ్జెట్లలో ఇదొకటి. ప్రతి పేద, బలహీన కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున 10 కోట్ల కుటుంబాలకు ఆరోగ్యభీమా కల్పించడం ఆరోగ్యరంగంలో తీసుకొచ్చిన గొప్ప మార్పు. ప్రభుత్వం తీసుకురానున్న ఆపరేషన్ గ్రీన్ పథకంతో అద్భుతమైన వ్యవసాయాభివృద్ధి సాధ్యమవుతుంది. తద్వారా 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకోగలం’అని రాజ్‌నాథ్ వెల్లడించారు. -
ఉజ్వల యోజన కింద 10 వేల గ్యాస్ కనెక్షన్లు
అనంతపురం అర్బ¯Œన్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాకు 10 వేల ఉచిత గ్యాస్ కనెక్షన్లు మంజూరయ్యాయని జాయింట్ కలెక్టర్ బీ లక్ష్మీకాంతం తెలిపారు. గురువారం కలెక్టరేట్లోని తన చాంబర్లో గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులు, డీఎస్‌ఓతో ఉజ్వల యోజనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్యాస్ కనెక్ష¯ŒS లేని వారిని గుర్తించి వచ్చే వారానికి గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. సబ్సిడీ ద్వారా వీటిని మంజూరు చేస్తారని, ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులను తహశీల్దారులు, సీఎస్డీటీలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్డీఓలను ఆదేశించారు.