ఉజ్వల యోజన కింద 10 వేల గ్యాస్‌ కనెక్షన్లు | 10000 gas connections under ujwala yojana scheme | Sakshi
Sakshi News home page

ఉజ్వల యోజన కింద 10 వేల గ్యాస్‌ కనెక్షన్లు

Published Fri, Nov 11 2016 1:33 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

10000 gas connections under ujwala yojana scheme

అనంతపురం అర్బ¯Œన్ : ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద జిల్లాకు 10 వేల ఉచిత గ్యాస్‌ కనెక్షన్లు మంజూరయ్యాయని జాయింట్‌ కలెక్టర్‌ బీ లక్ష్మీకాంతం తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో గ్యాస్‌ ఏజెన్సీల ప్రతినిధులు, డీఎస్‌ఓతో ఉజ్వల యోజనపై సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్‌ కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు గ్యాస్‌ కనెక్ష¯ŒS లేని వారిని గుర్తించి వచ్చే వారానికి గ్యాస్‌ కనెక్షన్లు ఇవ్వాలని ఆదేశించారు. సబ్సిడీ ద్వారా వీటిని మంజూరు చేస్తారని, ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 14 నియోజకవర్గాల పరిధిలో లబ్ధిదారులను తహశీల్దారులు, సీఎస్‌డీటీలు గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆర్‌డీఓలను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement