umpires call
-
రోహిత్ శర్మ ఎల్బీపై ఫ్యాన్స్ ఫైర్!
లీడ్స్: లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రెండో ఇన్నింగ్స్ 48వ ఓవర్లో ఫాస్ట్ బౌలర్ ఓలీ రాబిన్సన్ బౌలింగ్‌లో బంతిని లెగ్ సైడ్ ఆడేందుకు రోహిత్ శర్మ ప్రయత్నించాడు. కానీ.. బ్యాట్‌కి తగలకుండా బంతి నేరుగా వెళ్లి ఫ్యాడ్‌ని తాకింది. వెంటనే ఇంగ్లండ్ టీమ్ ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఔటిచ్చాడు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రోహిత్ వెంటనే రివ్యూ తీసుకున్నాడు. రిప్లైలో ఆఫ్ స్టంప్ లైన్‌పై పడిన బంతి లెగ్ స్టంప్‌ని కొద్దిగా తాకుతూ వెళ్లేలా కనిపించింది. దాంతో టీవీ అంపైర్ దానిని అంపైర్స్ కాల్‌గా ప్రకటించాడు. ఫీల్డ్ అంపైర్ తన మునుపటి ఔట్ నిర్ణయానికే కట్టుబడ్డాడు. అంపైర్స్ కాల్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, నియమం ప్రకారం కనీసం 50 శాతం బంతి స్టంప్స్‌ని తాకాలి, కానీ అభిమానులు కేవలం 10-20 శాతం మాత్రమే వికెట్‌ను తాకినట్లు భావిస్తున్నారు. అంపైర్ ఔట్ ఇవ్వకపోయి ఉంటే అది అవుట్ అయ్యేది కాదని .. అంపైర్ కాల్ నియమం వింతగా ఉందని అభిమానులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయం పట్ల రోహిత్ అసహనం వ్యక్తం చేస్తూనే మైదానం వీడాడు. తొలి ఇన్నింగ్స్ వైఫల్యాల్ని అధిగమించేందుకు భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లో పట్టుదలతో ఆడుతున్నారు. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా(180 బంతుల్లో 15 ఫోర్లతో 91) తృటిలో శతకం చేజార్చుకున్నాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. ప్రస్తుతం భారత్ ఇంకా 139 పరుగులు వెనుకబడే ఉంది. చదవండి:IND Vs ENG 3rd Test Day 4: అనుకున్నదే జరిగింది.. ఆదిలోనే పుజారా(91) ఔట్ Absolutely ridiculous. Have always believed that DRS has to be decisive, this umpire’s call proves that. Shambolic. #ENGvIND #RohitSharma pic.twitter.com/cmPzrNXPcH — Atharv Warty (@atharvsays) August 27, 2021 -
Umpire’s Call: ‘అంపైర్స్ కాల్’పై ఐసీసీ కీలక నిర్ణయం
దుబాయ్: అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్ఎస్)లో తరచూ చర్చనీయాంశమవుతున్న ‘అంపైర్స్ కాల్’ను మార్చాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) సమావేశంలో తేల్చారు. అలాగే కోవిడ్ నేపథ్యంలో ఐసీసీ ఈవెంట్ల కోసం 23 మంది సభ్యులతో జట్లను అనుమతించాలని ఐసీసీ నిర్ణయించింది. ‘క్రికెట్ కమిటీ ప్రధానంగా అంపైర్స్ కాల్‌పై చర్చించి విశ్లేషించింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ అంపైర్ ప్రాధాన్యతను ఎక్కడా తగ్గించకుండానే తప్పులు జరగకుండా చూడటం డీఆర్ఎస్లో ముఖ్య ఉద్దేశం. మైదానంలో ఫీల్డ్ అంపైర్‌దే తుది నిర్ణయం. అంపైర్ కాల్ ఉండాల్సిన అవసరం అందుకే ఉంది’ అని కమిటీ హెడ్, మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తెలిపారు. ఎల్బీడబ్ల్యూ సమీక్షలో అంపైర్స్ కాల్ తరచూ వివాదాస్పదమవుతోంది. బర్మింగ్‌హామ్‌లో వచ్చే ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడల్లో మహిళల క్రికెట్ మ్యాచ్‌లకు అంతర్జాతీయ హోదా కల్పించిన ఐసీసీ... మహిళల వన్డే మ్యాచ్‌లు ‘టై’గా ముగిస్తే సూపర్ ఓవర్ నిర్వహించాలని కూడా నిర్ణయించింది. -
అంపైర్స్ కాల్ మార్గదర్శకాలను పునఃపరిశీలించాలి: కోహ్లి
పూణే: డెసిషన్ రివ్యూ సిస్టమ్ (డీఆర్ఎస్)లో అంపైర్స్ కాల్ విధానం గందరగోళం సృష్టిస్తోందని, దాని మార్గదర్శకాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. అలాగే బాల్ ట్రాకింగ్‌లో బంతి వికెట్లను తాకినట్లు స్పష్టమైతే, ఎల్బీడబ్ల్యూగా ప్రకటించాలని ఆయన సూచించాడు. త్వరలో ప్రపంచకప్ లాంటి పెద్ద టోర్నీలు జరగబోతున్న నేపథ్యంలో మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. కాగా, అంపైర్స్ కాల్ నిబంధనను పునః పరిశీలించాలని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. ఐసీసీకి సూచించిన విషయం తెలిసిందే. భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య మంగళవారం జరుగనున్న తొలి వన్డే నేపథ్యంలో ఈరోజు జరిగిన వర్చువల్ ప్రెస్ మీట్లో కోహ్లి మాట్లాడుతూ.. అంపైర్స్ కాల్ విధానంపై తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు. డీఆర్ఎస్ లేనప్పుడు కూడా తాను సుదీర్ఘ క్రికెట్ ఆడానని, బ్యాట్స్‌మెన్‌కు ఇష్టమున్నా లేకున్నా అంపైర్ నిర్ణయమే శిరోధార్యమని పేర్కొన్నాడు. అంపైర్స్ కాల్ గంధరగోళం సృష్టిస్తోందని, దాన్ని సవరించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యనించాడు. బ్యాట్స్‌మన్ బౌల్డ్ అయిన సందర్భంలో బంతి 50 శాతానికి పైగా వికెట్లను తాకిందా అని చూడరు కదా అని ప్రశ్నించాడు. బంతి ఎంత మేర వికెట్లను తాకిందన్న నిర్ణయం తికమక పెడుతోందని వెల్లడించాడు. కాగా, అంపైర్స్ కాల్‌ను సవాల్ చేస్తే బాల్ ట్రాకింగ్‌లో బంతి 50 శాతం వికెట్లను తాకితేనే అవుట్ ఇస్తున్న సంగతి తెలిసిందే. -
‘అంపైర్స్ కాల్’ కథ ముగియనుందా?
న్యూఢిల్లీ: అంపైర్స్ కాల్.. 2016లో అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ప్రవేశపెట్టిన ఈ నిబంధన ఆన్- ఫీల్డ్ అంపైర్ల నిర్ణయానికి అధిక ప్రాధాన్యం కల్పించింది. బ్యాట్స్‌మన్ ఔట్/ నాటౌట్ విషయంలో బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద థర్డ్ అంపైర్ తన నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్‌కు వదిలిపెట్టడమే అంపైర్స్ కాల్. ఇక్కడ ఫీల్డ్ అంపైర్ డెసిషన్‌పైనే రివ్యూ ఫలితం ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఫీల్డ్ అంపైర్ తొలుత తీసుకున్న నిర్ణయానికే కట్టుబడతాడు. కొన్నిసార్లు ఇది సరైన నిబంధనే అనిపించినా, చాలా సందర్భాల్లో అంపైర్స్ కాల్ వివాదాలకు దారి తీసింది. ఇటీవల భారత్- ఇంగ్లండ్ మధ్య చెన్నైలో జరిగిన రెండో టెస్టులో భాగంగా ఇంగ్లీష్ జట్టు కెప్టెన్ జో రూట్ అవుట్ విషయంపై కూడా దుమారం చెలరేగింది. టీమిండియా బౌలర్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ తీసుకున్న నిర్ణయంతో భారత్ తీవ్ర నిరాశకు గురైంది. అక్షర్ వేసిన బాల్‌ను రూట్ ఎదుర్కోగా అది నేరుగా కీపర్ రిషభ్ పంత్ చేతుల్లో పడింది. అయితే అది రూట్ బ్యాట్‌ను తాకుతూ వెళ్లిందనుకొని టీమిండియా అంపైర్‌కు క్యాచ్ అప్పీల్ చేసింది. కానీ ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో భారత కెప్టెన్ కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లాడు. రీప్లేలో భాగంగా బంతి జో రూట్ ప్యాడ్‌ను తాకినట్లు కనిపించినా ఎక్కడా ఎడ్జ్ అవ్వలేదని తేలింది. దీంతో ఎల్బీకి ఏమైనా చాన్స్ ఉందేమోనని థర్డ్ ఎంపైర్ మరోసారి పరిశీలించగా, ప్యాడ్లు తాకుతూ ఆఫ్‌స్టంప్ మీదుగా బంతి వెళ్లినట్లు కనిపించింది. దీంతో అవుట్ అని రిప్లేలో స్పష్టమైంది. కానీ బంతి ప్రభావం ఆఫ్ స్టంప్‌పై ఉండటంతో ఆ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్ నిర్ణయానికే థర్డ్ అంపైర్ అప్పచెప్పాడు. దాంతో తొలుత నాటౌట్ నిర్ణయానికే ఫీల్డ్ అంపైర్ కట్టుబట్టాడు. రూట్ బతికిపోయాడు. ఇక్కడ చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! దీంతో కోహ్లి కాసేపు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనత్తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్స్ కాల్ నిబంధన వల్ల కలిగిన నష్టానికి ఇదొక నిదర్శనం వంటిది.ఇలాంటి ఘటనల ఆధారంగా ఈ రూల్‌కు స్వస్తి పలకాలనే డిమాండ్లు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో క్రికెట్ నిబంధనలు రూపొందించే మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) తాజా సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, ఆసీస్ దిగ్గజం రిక్కీ పాంటింగ్, శ్రీలంక లెజెండ్ కుమార సంగక్కర తదితరులతో కూడిన కమిటీ తమ ఎజెండాలో భాగంగా.. ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్ కాల్ నిబంధనను రద్దు చేసేందుకు సముఖుత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘డెసిషన్ రివ్యూ సిస్టం ద్వారా తేలిన ఎల్బీడబ్ల్యూ విషయంలో అంపైర్స్ కాల్ ఎంతమేరకు ఉపయోగకరం అన్న అంశంపై చర్చ జరిగింది. ఈ నిబంధన కారణంగా ఆడియెన్స్ కాస్త గందరగోళానికి గురవ్వాల్సి వస్తుందన్న విషయం ప్రస్తావనకు వచ్చింది. ఒకవేళ రివ్యూలో అవుట్/ నాటౌట్(ఎల్బీడబ్ల్యూ) అని తేలితే అంపైర్స్ కాల్‌తో సంబంధం లేకుండా ఏదొక నిర్ణయానికి థర్డ్ అంపైర్ కట్టుబడి ఉండాలని కమిటీ పేర్కొంది’’ అని ఎంసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. అదే సమయంలో మరికొంత మంది సభ్యులు మాత్రం.. ప్రస్తుత విధానంతో వారు సంతృప్తిగానే ఉన్నారని, బెన్ఫిట్ ఆఫ్ డౌట్ కింద ఎన్నో ఏళ్లుగా అంపైర్ నిర్ణయానికి కట్టుబడి ఎన్నో ఫలితాలు తేలాయని, దీనిని కొనసాగించడం వల్ల నష్టమేమీలేదని పేర్కొన్నట్లు వెల్లడించింది. కమిటీ అభిప్రాయాలను, ప్రతిపాదనలను ఐసీసీకి పంపనున్నట్లు వెల్లడించింది. -
బాక్సింగ్ డే టెస్టు: అంపైర్స్ కాల్‌పై సచిన్ అసహనం
న్యూఢిల్లీ: డీఆర్ఎస్ విధానంలో ‘అంపైర్స్ కాల్’ నిబంధన పట్ల క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అసహనం వ్యక్తం చేశాడు. ‘అంపైర్ నిర్ణయంపై సంతృప్తి లేకనే డీఆర్ఎస్ను ఆశ్రయిస్తారు ఆటగాళ్లు. మరి ఆ నిర్ణయాన్ని సమీక్షించి నిక్కచ్చిగా వ్యవహరించాల్సిన థర్డ్ అంపైర్.. తను ఎటూ తేల్చలేక మళ్లీ అంపైర్ అభిప్రాయానికే వదిలేస్తే.. లాభం ఏముంటుంది’అని సచిన్ ట్విటర్లో పేర్కొన్నాడు. డీఆర్ఎస్ విధానంపై ముఖ్యంగా ‘అంపైర్స్ కాల్’ అంశంపై దృష్టి సారించాలని ట్విటర్ వేదికగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్‌ను కోరాడు. కాగా, బాక్సింగ్ డే టెస్టులో ఎల్బీగా ఔట్ కావాల్సిన లబుషేన్, జో బర్న్స్ ఈ నియమం వల్ల బతికిపోయారు. టీమిండియా ఆటగాళ్ల అప్పీల్‌ను అంపైర్ తోసిపుచ్చడంతో.. కెప్టెన్ రహానే డీఆర్ఎస్కు వెళ్లాడు. అయినా, ఫలితం లేకపోయింది. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: విజయావకాశాలు మనకే!) బంతి వెళ్తున్న దశేమిటో స్పష్టత లేకపోవడంతో థర్డ్ అంపైర్ పాల్ విల్సన్ అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాన్ని వదిలేశాడు. దాంతో వారిద్దరూ సేవ్ అయ్యారు. అయితే, బంతి మాత్రం సరైన దిశలోనే వికెట్లపైకి వెళ్లిందని రీప్లేలో తెలుస్తోంది. మరోవైపు డీఆర్ఎస్ ద్వారా సరైన నిర్ణయం రాకపోవడం.. అంపైర్ అభిప్రాయానికే నిర్ణయాలను వదిలేయడంపై టీమిండియా ఆటగాళ్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక తాజా మ్యాచ్ విషయానికొస్తే తొలి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య జట్టును 195 పరుగులకే ఆలౌట్ చేసిన టీమిండియా, రెండో ఇన్సింగ్స్‌లో 326 పరుగులు చేసి 131 ఆదిక్యంలో నిలిచింది. రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ బ్యాట్స్‌మెన్‌ను మరోమారు భారత బౌలర్లు బెంలేలెత్తించారు. 133 పరుగులకే కీలకమైన ఆరు వికెట్లు పడగొట్టారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 2 పరుగుల ఆదిక్యంలో ఉంది. టెయిలెండర్లు కామెరూన్ గ్రీన్ (17), పాట్ కమిన్స్ (15) క్రీజులో ఉన్నారు. (చదవండి: బాక్సింగ్ డే టెస్టు: 2 పరుగుల ఆదిక్యంలో ఆసీస్) The reason players opt for a review is because they’re unhappy with the decision taken by the on-field umpire. The DRS system needs to be thoroughly looked into by the @ICC, especially for the ‘Umpires Call’.#AUSvIND — Sachin Tendulkar (@sachin_rt) December 28, 2020 -
ఇక టీ20ల్లోనూ డీఆర్ఎస్
లండన్: ఇప్పటిదాకా టెస్టులు, వన్డేల్లో కొనసాగుతున్న అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) ఇక నుంచి ట్వంటీ 20ల్లోనూ కనిపించనుంది. ఈ ఏడాది అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి టీ 20ల్లో డీఆర్ఎస్ను అమలు చేయాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు నెల క్రితం ఐసీసీ క్రికెట్ కమిటీ ప్రతిపాదనకు తాజాగా ఆమోద ముద్రవేసింది. ఒక్క తప్పుడు నిర్ణయం పూర్తి మ్యాచ్‌నే మార్చేసే పరిస్థితి ఈ పొట్టి ఫార్మాట్లో కూడా ఉంటుందనేది క్రికెటర్ల అభిప్రాయం. వన్డేలకు, టెస్టులకు మాత్రమే డీఆర్ఎస్ ను పరిమితం చేయడమే కాకుండా, ఈ విధానాన్ని టీ 20ల్లోనూ అమలు చేయాలనే డిమాండ్ ఎక్కువైంది. దీనిలో భాగంగానే మే నెలలో ఐసీసీ క్రికెట్ కమిటీ.. టీ 20ల్లో డీఆర్ఎస్ ను తెరపైకి తీసుకొచ్చింది. ఇందుకు ఐసీసీ నుంచి అంగీకారం లభించడంతో అన్ని ఫార్మాట్లలో ఫీల్డ్ అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే అవకాశం ఏర్పడనుంది.