UN conferences
-
యుద్ధక్షేత్రం పరిష్కారం కాదు. ఐరాస సదస్సులో మోదీ వ్యాఖ్యలు
-
ఐరాస సదస్సుకు ఏపీ సర్పంచ్
సాక్షి, అమరావతి: అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యాలయంలో మే 3వ తేదీన నిర్వహించే 57వ కమిషన్ ఆన్ పాపులేషన్ అండ్ డెవలప్మెంట్ (సీపీడీ) సదస్సులో పాల్గొనే అవకాశం పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు సర్పంచ్ కునుకు హేమకుమారికి దక్కింది. ‘భారత్‌లో స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో మహిళల పాత్ర, మహిళా సాధికారతకు మార్గాలు’ అనే అంశంపై ప్రసంగించాలంటూ ఐరాస నుంచి ఆహా్వనం అందింది. మే 1వ తేదీన ఆమె న్యూయార్క్‌కు బయలుదేరతారు. హేమకుమారి 2021 ఏప్రిల్‌లో పేకేరు గ్రామ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. 2022లో కాకినాడ జేఎన్టీయూ నుంచి ఎంటెక్ పట్టా పొందారు. తణుకులోని ముళ్లపూడి వెంకటరాయ మెమోరియల్ పాలిటెక్నికల్ కాలేజీలో 2014–19 మధ్య ఐదేళ్లపాటు ఎల్రక్టానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగంలో అసోసియేట్ లెక్చరర్‌గా పనిచేశారు. ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కేవలం మూడు రాష్ట్రాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను మాత్రమే ఐక్యరాజ్యసమితికి సిఫార్సు చేసింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన సర్పంచ్ హేమకుమారితో పాటు తిప్రుర రాష్ట్రానికి చెందిన సెపాహిజాల జెడ్పీ చైర్పర్సన్ సుప్రియ దాస్‌దత్తా, రాజస్థాన్‌లోని ఝుంజున్ జిల్లా లంబిఅహీర్ సర్పంచ్ నీరూ యాదవ్‌కు ఆహా్వనాలు అందాయి. వీరంతా కేంద్ర పంచాయతీరాజ్ కార్యదర్శి వివేక్ భరద్వాజ్, సహాయ కార్యదర్శి అలోక్ ప్రేమ్‌కుమార్‌తో కలిసి భారత్ ప్యానల్ తరఫున మన రాష్ట్రంలోనూ, దేశమంతటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో గ్రామీణ స్థానిక సంస్థల ప్రభుత్వాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రపంచం దృష్టికి తీసుకెళతారు. జగన్ పాలనలో అంతర్జాతీయ వేదికలపై అరుదైన గౌరవాలు ఐదేళ్లుగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఐక్యరాజ్య సమితి వంటి అత్యున్నతస్థాయి అంతర్జాతీయ వేదికలపై మన రాష్ట్రానికి అనేక ఆరుదైన గౌరవాలు దక్కాయి. 6 నెలల క్రితం న్యూయార్క్ నగరంలోని యూఎన్ఓ ప్రధాన కార్యాలయంలో జరిగిన హైలెవల్ పొలిటికల్ ఫోరం (సదస్సు)లో పాల్గొనేందుకు ప్రభుత్వ పాఠశాలలో చదివే లారీ డ్రైవర్ కూతురు, సెక్యూరిటీ గార్డు కూతురు, కౌలు రైతు కొడుకు తదితర 10 మంది పేద విద్యార్థులకు అవకాశం దక్కింది.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అనేక విద్యా సంస్కరణలు చేపట్టి ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసింది. మనబడి నాడు–నేడు కింద పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. బడిలో స్మార్ట్ టీవీలు, ఐఎఫ్‌పీ స్క్రీన్ల ద్వారా బోధన, టోఫెల్ శిక్షణ వంటివి ప్రవేశపెట్టి సర్కారు బడి స్థాయిని కూడా ప్రైవేట్ అంతర్జాతీయ స్కూళ్ల స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్దింది. దీంతో రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులు సైతం ఐక్యరాజ్య సమితి సదస్సులో పాల్గొనే స్థాయికి ఎదిగారు. -
ఐక్యరాజ్య సమితిలో మెరిసిన ఆంధ్రప్రదేశ్
న్యూయార్క్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి 10 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థి బృందం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2 వారాల పాటు (సెప్టెంబర్ 15 - 28) పర్యటిస్తుండటం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఈ విద్యార్థుల బృందాన్ని అమెరికా అధికారులు వరల్డ్ బ్యాంక్, US డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్, కొలంబియా యూనివర్సిటీ, వాషింగ్టన్ DCలోని వైట్ హౌస్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. ఇప్పటి వరకు తమ గ్రామాలకు పరిమితమైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఈ చిన్నారులు న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో జరిగే చారిత్రాత్మక యాక్షన్ ప్యాక్డ్ SDG (సస్టెయినబుల్ డెవలప్మెంట్ గోల్) సమ్మిట్‌లో భాగమయ్యే సువర్ణావకాశాన్ని పొందడం ఇదే మొదటిసారి. ఐక్యరాజ్య సమితిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గురించి మాట్లాడడమే కాకుండా, ఈ విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు, జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందుతున్న విద్యా సంస్కరణలను కూడా ఈ సధస్సులో ప్రదర్శిస్తారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఈ పర్యటనలో భాగంగా సీఎం జగన్ నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యా సంస్కరణల అమల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న ద్విభాషా పాఠ్యపుస్తకాలు, టాబ్లెట్లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ఆంగ్ల విద్య, పాఠ్యాంశ సంస్కరణలను ప్రవేశపెట్టడం ద్వారా విద్యా రంగాన్ని ఎలా మార్చేసిందో పిల్లలు వివరిస్తారు. ఈ మొత్తం ప్రాజెక్టులో అత్యంత అద్భుతమైన భాగం ఏమిటంటే, ఈ పిల్లలు చాలా నిరాడంబరమైన కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. ఈ పిల్లల తల్లిదండ్రులు కొందరు దినసరి కూలీలు కాగా మరికొందరు ఆటో డ్రైవర్లుగా, మెకానిక్‌లుగా, సెక్యూరిటీ గార్డులుగా, లారీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. "పేదరికం ఎవ్వరికీ నాణ్యమైన విద్యను దూరం చేయకూడదని విశ్వసించే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దూరదృష్టి ఉన్న వ్యక్తి వల్లే ఈ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఈ రోజు అమెరికాలో జరుగుతున్న అత్యున్నత సధస్సులో పాల్గొంటున్నారు. చదవండి: మానవాభివృద్ధినీ మనం అంగీకరించలేమా? ఈ అంతర్జాతీయ పర్యటన ప్రధాన లక్ష్యం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతిభావంతులైన పిల్లలకు వారి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, చర్చించడానికి, వ్యక్తీకరించడానికి, కొత్త ఆలోచనలను ప్రపంచంతో పంచుకోవడానికి ప్రపంచ వేదికను అందించడమే. ఈ పర్యటన పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపడంతో పాటు అభివృద్ధికి సంబంధించిన అంశాలపై అంతర్జాతీయ సమావేశాల్లో ఆత్మవిశ్వాసంతో స్పష్టంగా & నమ్మకంతో మాట్లాడే సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. మంగా వెంకన్న, సాక్షి ఇదీ చదవండి: ప్రపంచ చోదక శక్తి యువతే -
అమెరికాకు ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఐదు రోజుల అమెరికా పర్యటనకు బయల్దేరి వెళ్లారు. అమెరికాతో పాటు జపాన్, ఆ్రస్టేలియాలతో వ్యూహాత్మక సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. అమెరికాకు బయల్దేరి వెళ్లడానికి ముందు ప్రధాని ఒక ప్రకటనను విడుదల చేశారు. కోవిడ్ సంక్షోభం, ఉగ్రవాదం నిర్మూలన, వాతావరణం మార్పులు, ఇతర అంశాలపై యూఎన్ సదస్సులో దృష్టి పెడతామని వెల్లడించారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆహా్వనం మేరకే అక్కడికి వెళుతున్నాను. 22–25 వరకు యూఎస్ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో జో బైడెన్‌తో ప్రాంతీయంగా, అంతర్జాతీయంగా ఇరు దేశాల ప్రయోజనాలను కాపాడే అంశాలపై చర్చించి అభిప్రాయాలను పంచుకుంటాం’’అని మోదీ చెప్పారు. ఈ పర్యటనలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ను కూడా కలుసుకొని ఇరు దేశాల మధ్య పరస్పర సహకారానికి గల అన్ని అవకాశాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు. విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, ఇతర అత్యున్నత స్థాయి బృందం ప్రధాని వెంట వెళ్లారు. గగనతలం వినియోగానికి పాక్ ఓకే: అమెరికాకు వెళ్లిన ప్రధాని మోదీ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాకిస్తాన్ అనుమ తించింది. కశీ్మర్లో ఆరి్టకల్ 370 రద్దు తర్వాత ప్రధాని, రాష్ట్రపతి విదేశాలకు వెళితే తమ గగనతలం మీదుగా వెళ్లడానికి పాక్ నిరాకరిస్తూ వచి్చంది. దీంతో పాక్ ధోరణిపై భారత్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ (ఐసీఎఒ)లో తన నిరసన గళాన్ని వినిపించింది. అఫ్గానిస్తాన్ గగనతలం సురక్షితం కాదు కాబట్టి ఈసారి మోదీ విమానానికి పాక్ అనుమతించింది. వరుస సమావేశాలతో ప్రధాని బిజీ ► సెపె్టంబర్ 23న (గురువారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికాలోని వాషింగ్టన్లో మేజర్ కంపెనీల సీఈవోలతో సమావేశమై చర్చించనున్నారు. క్వాల్కామ్, అడోబ్, ఫస్ట్ సోలార్, ఆటమిక్స్, బ్లాక్‌స్టోన్ కంపెనీల సీఈవోలతో చర్చిస్తారు. అదే రోజు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో ముఖాముఖి చర్చలు జరుపుతారు. ► సెపె్టంబర్ 24న (శుక్రవారం) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో వైట్‌హౌస్‌లో చర్చలు జరుపుతారు. అఫ్గానిస్తాన్ పరిణామాలు దాని ప్రభావం, సీమాంతర ఉగ్రవాదం, పెరిగిపోతున్న చైనా ఆధిపత్యం, భారత్, అమెరికా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం వంటి అంశాలపై చర్చిస్తారు. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌తోనూ భేటీ అవుతారు. జపాన్ ప్రధాని యోషిహిడో సుగాతో విడిగా చర్చలు జరుపుతారు. అదే రోజు అమెరికా, భారత్, ఆ్రస్టేలియా, జపాన్ దేశాలతో కూడి న క్వాడ్ సదస్సులో పాల్గొంటారు. ఆ సమావేశం ముగిశాక న్యూయార్క్ బయల్దేరి వెళతారు. ► 25న (శనివారం) ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. అదే రోజు భారత్‌కు తిరుగు ప్రయాణమవుతారు. ► సెప్టెంబర్ 26 (ఆదివారం ) భారత కాలమానం ప్రకారం ఉదయం 11.30 గంటలకు న్యూఢిల్లీకి చేరుకుంటారు. -
న్యూయార్క్‌లో భారీ పేలుడు
- 29 మందికి గాయాలు.. మన్హటన్ శివారులో దుర్ఘటన - మరో బాంబు స్వాధీనం - ఉగ్రవాదంతో సంబంధం లేదన్న మేయర్ - నేటి నుంచి నగరంలో ఐరాస సమావేశాలు న్యూయార్క్: ఇటీవలే ‘9/11’ ఉగ్రదాడుల మృతులకు నివాళి అర్పించిన అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ అలజడి! న్యూయార్క్ మన్హటన్ శివారులోని చెల్సియాలో ఓ చెత్తకుండీలో శక్తిమంతమైన పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 8.30కి జనసమ్మర్ద ప్రాంతంలో జరిగిన ఈ పేలుడు ధాటికి 29 మంది గాయపడ్డారు. చుట్టుపక్కల భవనాల కిటికీలు, వాహనాలు దెబ్బతిన్నాయి. ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారు. మరోపక్క.. ఈ ప్రాంతానికి దగ్గర్లోనే ప్రెజర్ కుక్కర్ బాంబు హడలెత్తించింది. వైర్లతో కూడిన దీన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ఇది 2013లో బోస్టన్ మారథాన్‌లో జరిగిన పేలుడుకు వాడిన కుక్కర్ బాంబును పోలి ఉందని అధికారులు తెలిపారు. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశాల కోసం దేశాధ్యక్షుడు ఒబామా సహా ప్రపంచ నేతలు నగరానికి వస్తున్న నేపథ్యంలో ఈ ఉదంతాలు చోటు చేసుకున్నాయి. న్యూజెర్సీలోనూ శనివారం ఓ పైపు బాంబు పేలింది. కాసేపటి తర్వాత చెల్సియా పేలుడు సంభవించింది. పిడుగుపడినట్లు భారీ శబ్దంతో సంభవించిన పేలుడుకు ఆ ప్రాంతం కంపించిపోయిందని, తాను భోంచేస్తున్న హోటల్లోంచి అందరూ వీధుల్లోకి పరిగెత్తారని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. రెస్టారెంట్లు, సబ్వే స్టేషన్లు, ఆర్ట్ గ్యాలరీలతో కూడిన చెల్సియాలో వారాంతం రద్దీగా ఉంటుంది. నడిబొడ్డున ఉన్న 23వ వీధిలో తాజా పేలుడు సంభవించింది. ఉద్దేశపూర్వక దాడి.. బాధితులకు తీవ్ర గాయాలయ్యాయని, ఒకరి పరిస్థితి విషమంగా ఉందని నగర మేయర్ బిల్ డి బ్లాసియో తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ఈ దాడికి పాల్పడ్డారని, దీనికి ఉగ్రవాదంతో సంబంధమున్నట్లు ప్రస్తుతానికి తేలలేదని పేర్కొన్నారు. న్యూయార్క్‌కు ప్రస్తుతం ఉగ్రవాదుల నుంచి ముప్పు ఉన్నట్లు సమాచారమేదీ లేదన్నారు. చెల్సియా ఘటనకు సంబంధించి ఏ సంస్థా బాధ్యత ప్రకటించుకోలేదు. క్షతగాత్రులందర్నీ డిశ్చార్జి చేసినట్లు న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కువోమో తెలిపారు. తనిఖీల కోసం మరో వెయ్యిమంది పోలీసుల్ని నియమిస్తామన్నారు. న్యూయార్క్‌లో పేలుడు అంటే ఉగ్రవాదమేనని, అయితే అంతర్జాతీయ ఉగ్రవాదంతో దీనికి సంబంధం లేదన్నారు. ఈ ప్రాంతంలో రికార్డయిన నిఘా వీడియోలో.. ఘటనాస్థలి వద్ద ఓ వ్యక్తి కనిపించాడని, అతనికి పేలుడుకు సంబంధముందో కనుగొనేందుకు యత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఈ ప్రాంతంలో సోదాలు చేస్తున్నామన్నారు. . పేలుడుకు కచ్చితమైన కారణం తెలియడం లేదని శనివారమే న్యూయార్క్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యత తీసుకున్నఓనీల్ పేర్కొన్నారు. 2011సెప్టెంబర్ 11(9/11)న ఉగ్రదాడికి గురైన న్యూయార్క్‌లో అదనపు భద్రత కొనసాగుతోంది. చెల్సియా పేలుడు వివరాలను అధికారులు ఒబామాకు, దేశాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న హిల్లరీకి తెలిపారు. మినెసోటాలో 8 మందికి కత్తిపోట్లు న్యూయార్క్ లో బాంబు పేలుడు జరిగిన సమయంలో మినెసోటాలో ఓ ఆగంతకుడు ‘అల్లాహ్’ అని అరుస్తూ ఓ షాపింగ్‌మాల్‌లో చొరబడి 8 మందిని గాయపర్చాడు. వెంటనే తేరుకున్న భద్రతా సిబ్బంది అతన్ని కాల్చి చంపారు. కాగా, దాడికి ముందు దుండగుడు పలువురిని ‘మీరు ముస్లింలా?’ అని ప్రశ్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనను ఉగ్రదాడిగా అనుమానించడంలేదని, అయినప్పటికీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు భద్రతాధికారులు తెలిపారు. తమకు తుపాకీ చప్పుళ్లు వినపడటంతో పరుగులు తీసినట్లు ప్రత్యక్షసాక్షులు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. న్యూజెర్సీలోనూ పేలుడు సీసైడ్ పార్క్(న్యూజెర్సీ): అమెరికాలోని సముద్ర పట్టణమైన న్యూజెర్సీలో పైప్ బాంబు పేలుడు సంభవించింది. ఎవరూ గాయపడలేదు. స్వచ్ఛంద సాయం కోసం చేపట్టిన 5కే రన్ లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నారు. పరుగు ప్రారంభించిన కొద్దిసేపటికే ఈ బాంబు పేలుడు చోటుచేసుకుంది. అయితే ఇది ఉగ్రవాదుల పనా? కాదా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. పూర్తి వివరాలు దర్యాప్తులో తేలతాయని అధికారులు పేర్కొన్నారు.