Unemployment in India
-
నిరుద్యోగం పైపైకి.. ఉద్యోగాలు లేక యువత విలవిల
న్యూఢిల్లీ: దేశ ఆర్థికాభివృద్ధిలో బ్రిటన్ను దాటేశామని మీసాలు మెలేస్తున్నాం. కానీ ఉద్యోగాల కల్పనలో మాత్రం పరిస్థితి నానాటికి దిగజారుతోంది. గత ఏడాది కాలంలో నిరుద్యోగ రేటు పెరిగిపోతూ వస్తోంది. ఆగస్టులో నిరుద్యోగం రేటు ఏకంగా 8% శాతానికి చేరుకుంది. అయిదేళ్ల క్రితం 5% ఉన్న నిరుద్యోగ రేటు అలా అలా పెరుగుతూనే ఉంది. 2021 ఆగస్టులో నిరుద్యోగం రేటు రికార్డు స్థాయిలో 8.35%కి చేరుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి 6.56 శాతానికి తగ్గినప్పటికీ మళ్లీ బాగా పెరిగిపోయిందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇక గ్రామీణ భారతంలో ఉద్యోగాలు లేక యువత విలవిలలాడిపోతున్నారు. గ్రామీణ భారత్‌లో నిరుద్యోగం రేటు 9.6% ఉంటే, పట్టణాల్లో 7.7%గా ఉంది. రాష్ట్రాల మధ్య భారీ వ్యత్యాసం రాష్ట్రాల వారీగా నిరుద్యోగ రేటులో భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. 30% కంటే ఎక్కువగా నిరుద్యోగం రేటు ఉన్న రాష్ట్రాలు మూడు ఉంటే, 3%కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు నాలుగున్నాయి. హరియాణాలో అత్యధికంగా 37.3 శాతంతో నిరుద్యోగంలో మొదటి స్థానంలో ఉంటే జమ్ము కశ్మీర్లో 32.8%, రాజస్థాన్‌లో 31.4% ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 6.9% నిరుద్యోగం రేటు ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 6%గా ఉన్నట్టు సీఎంఐఈ వెల్లడించింది. ఛత్తీస్‌గఢ్‌లో నిరుద్యోగం రేటు అత్యల్పంగా 0.4% ఉంటే, 3శాతం కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా; మేఘాలయా ఉన్నాయి. 40% మంది యువతకి ఉద్యోగాల్లేవ్ కొత్త ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. 2016–17 నుంచి 2021–22 గణాంకాలను పరిశీలించి చూస్తే ఉపాధి లేక మహిళలు, యువత ఎక్కువగా నష్టపోతున్నారు. గత ఏడేళ్ల కాలంలో యువతలో సగటు నిరుద్యోగం రేటు 42.6%గా ఉంది. ప్రస్తుతం యువతలో నిరుద్యోగం రేటు 34%గా ఉంది. ఇక పనిచేసే రంగంలో ఉండే మహిళలు పదేళ్ల క్రితం 26% ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 19శాతానికి పడిపోవడం ఆందోళన కలిగించే అంశం. కరోనా మహమ్మారితో విలవిల్లాడుతూ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న భారత్‌లో నిరుద్యోగం పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది విద్యలో నాణ్యత ప్రమాణాలు తగ్గడం, యువతలో నైపుణ్యాలు కరువు, పనిచేసే ప్రాంతాల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అత్యధికంగా వినియోగించడం వంటివన్నీ నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తున్నాయి. మరికొంత మంది యువత చిన్నా చితక ఉద్యోగాలు చేయలేక వదులుకొని వెళ్లిపోవడం కూడా నిరుద్యోగం పెరిగిపోవడానికి కారణంగా మారింది. ప్రభుత్వం ఏం చేస్తోంది ? నిరుద్యోగం కట్టడికి కేంద్ర ప్రభుత్వం 2023 చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. రక్షణ రంగంలో నాలుగేళ్ల పాటు కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేయడానికి ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం నిరుద్యోగాన్ని కట్టడి చేయడానికేనని ప్రభుత్వం చెబుతోంది. నాలుగేళ్ల తర్వాత ప్రైవేటు రంగంలో పని చేయడానికి నిపుణులైన కార్మికులు లభిస్తారన్నది కేంద్రం వాదనగా ఉంది. రవాణా రంగంలో ఊబర్, ఓలా, ఆతిథ్య రంగంలో ఇంటికి ఫుడ్ డెలివరీ చేసే స్విగ్గి, జోమాటో సర్వీసులతో లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పటికీ తయారీ రంగం, మౌలికసదుపాయాల కల్పన ద్వారా ఉపాధి అవకాశాల్ని పెంచాల్సిన అవసరం ఉందని నిఫుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదీ చదవండి: ర్యాంటాక్, జింటాక్ టాబ్లెట్స్‌తో క్యాన్సర్?.. 26 ఔషధాలను నిషేధించిన కేంద్రం -
గ్రామీణ ప్రాంతాల్లో లేని వ్యవసాయ పనులు, దేశంలో పెరిగిన నిరుద్యోగం!
ముంబై: ఉపాధికి జూన్ కలసి రాలేదు. ప్రధానంగా సాగు రంగంలో ఉపాధి నష్టంతో జూన్ మాసంలో నిరుద్యోగ రేటు 7.80 శాతానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ గణాంకాలతో ఒక నివేదిక విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేమి మే నెలలో 6.62 శాతంగా ఉంటే, జూన్ నెలలో 8.03 శాతానికి పెరిగిపోయినట్టు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు మే నెలలో 7.12 శాతంగా ఉంటే జూన్ నెలలో 7.30 శాతానికి చేరినట్టు తెలిపింది. ‘‘లాక్డౌన్లు లేని ఒక నెలలో ఉపాధి రేటు ఎక్కువగా పడిపోవడం అన్నది ఇదే. ఇది గ్రామీణ ప్రాంతంలోని రుతువుల వారీగా ఉండే ప్రభావం వల్లే. గ్రామీణ ప్రాంతాల్లో సాగు పనులు లేకపోవం వల్లే ఇలా జరిగింది. విత్తన సాగు మొదలవుతుంది కనుక జూలై నుంచి ఈ పరిస్థితి మారిపోతుంది’’అని సీఎంఐఈ ఎండీ మహేశ్ వ్యాస్ తెలిపారు. 30 లక్షల మందికి ఉపాధిలేవి... 1.3 కోట్ల మందికి గత నెలలో ఉపాధి నష్టం జరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. అయినప్పటికీ నికరంగా పెరిగిన నిరుద్యోగులు 30 లక్షల మందేనని వివరించింది. అసంఘటిత రంగంలో ఉపాధి నష్టం ఎక్కువగా జరిగినట్టు వ్యాస్ తెలిపారు. కార్మికుల వలసే ఇందుకు కారణమన్నారు. జూన్‌లో వేతన జీవుల్లో (సంఘటిత రంగం) 25 లక్షల మంది ఉపాధిని కోల్పోవడం ఆందోళనకరమని ఆయన వ్యాఖ్యానించారు. అత్యధికంగా హర్యానా రాష్ట్రంలో 30.6% రాజస్థాన్‌లో 29.8%, అసోంలో 17.2%, జమ్మూ కశ్మీర్లో 17.2%, బిహార్‌లో 14% చొప్పున నిరుద్యోగం నమోదైంది. -
జాతీయ సంక్షోభంగా నిరుద్యోగం
కోవిడ్ ప్రభావం వల్ల ఆర్థిక గమనం మందగించి, పేదరికం నుంచి మరింత దిగువకు పట్టు తప్పిన వారికీ, ఉద్యోగాలు కోల్పోయిన వారికీ నేరుగా డబ్బు అందివ్వడం ద్వారా వారి జీవన భద్రతను పరిరక్షించవచ్చనే వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అటువంటి చేయూత ఆదాయ కల్పన విస్తృతమైన పేదరికాన్ని స్థూలంగానైనా అరికడుతుంది. బీజేపీ ప్రభుత్వానికి సైద్ధాంతిక గురువుగా పేర్గాంచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాజాగా నిరుద్యోగ సంక్షోభంపై ప్రతిపక్ష దృక్పథంతో తన గళాన్ని వినిపించింది! సంఘ్ అత్యున్నతస్థాయి విధాన నిర్ణయ మండలి అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ మహమ్మారి సృష్టించిన ఈ నిరుద్యోగ భూతాన్ని చూసీ చూడనట్లు వదిలేయకుండా, తక్షణం పరిహరించాలని తీర్మానించింది. ఆర్థిక సమతుల్యతను కొనసాగించడం, తద్వారా ద్రవ్యోల్బణంపై గట్టి పట్టును కలిగి ఉండటం, మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు సాధించడం.. ప్రభుత్వ ఆర్థిక విధాన ప్రధాన లక్ష్యాలు. ఆర్థిక వ్యవస్థను స్థిరమైన మార్గంలో పట్టి ఉంచినట్లయితే భవిష్యత్తులో మౌలిక సదుపాయాల కల్పనకు ఆ మార్గం దృఢమైన హామీ అవుతుంది. కోవిyŠ ప్రభావం వల్ల ఆర్థిక గమనం మందగించి, పేదరికం నుంచి మరింత దిగువకు పట్టు తప్పిన వారికీ, ఉద్యోగాలు కోల్పోయిన వారికీ నేరుగా డబ్బు అందివ్వడం ద్వారా వారి జీవన భద్రతను పరిరక్షించవచ్చనే వాదనపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, అటువంటి చేయూత ఆదాయ కల్పన విస్తృతమైన పేదరికాన్ని స్థూలంగానైనా అరికడుతుంది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల బ్యాంకు ఖాతాలకే ప్రత్యక్ష ప్రయోజనాన్ని బదిలీ చేయడం వల్ల ఆ పరిశ్రమల జీవన ఛత్రం కింద రోజువారీ మనుగడ సాగిస్తున్న కార్మికుల ఉపాధిని నిరాటంకం చేయవచ్చు. అవసరమైతే ఇందుకోసం డబ్బును ముద్రించడం కూడా ఒక పరిష్కార మార్గమే. పైగా ఈ విధానం ద్రవ్యోల్బణానికి దారి తీయనిదిగా ఉంటుంది. ఎలాగంటే, వ్యాపారాలకు అందిన అర్థిక వనరులు చలామణిలో ఉంటూ, ఉత్పత్తికి చోదకం అయిన ‘సరఫరా గొలుసు’ను అవి నిరంతరాయం చేస్తాయి. ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ సమకూర్చిన డబ్బులో కొంత భాగం ప్రభుత్వం దగ్గర ఉన్న ఆహార కొనుగోళ్లకు వెళ్లడంతో సరఫరాలకు డిమాండు పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్.ఎం.సి.జి. (ఫాస్ట్ మూవింగ్ కన్సూమర్ గూడ్స్– సత్వర వినియోగ వస్తువులు) కంపెనీలకు గిరాకీ లభిస్తుంది. ‘ప్రతిపక్ష వాణి’ వినిపించిన ఆర్ఎస్ఎస్ మోదీ ప్రభుత్వానికి సైద్ధాంతిక గురువుగా పేర్గాంచిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్.ఎస్.ఎస్.) తాజాగా నిరుద్యోగ సంక్షో భంపై ప్రతిపక్ష దృక్పథంతో తన గళాన్ని వినిపించింది! సంఘ్ అత్యున్నతస్థాయి విధాన నిర్ణయ మండలి అయిన ‘అఖిల భారతీయ ప్రతినిధి సభ’ ఇటీవలి సమావేశంలో ఈ సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేస్తూ... ‘మహమ్మారి సృష్టించిన ఈ నిరుద్యోగ భూతాన్ని చూసీ చూడనట్లు వదిలేయకుండా, తక్షణం పరిహరించాలి’ అని తీర్మా నించింది. ‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సృష్టించే ఉద్యోగాల కోసం నిరీక్షిస్తూ కూర్చునే సమయం కాదిది. మనమే ఉద్యోగాలను సృష్టిం చాలి. మనమే పెట్టుబడులు పెట్టి కొత్తగా ఉత్పత్తి రంగాలకు ఊపిరి పోయాలి. మోదీ ప్రభుత్వపు ‘మేక్ ఇన్ ఇండియా’ ఆలోచన ఇందుకు తోడ్పడేదే అయినా, అది మరింత పదునెక్కవలసిన అవసరం ఉంది’ అని అఖిల భారతీయ ప్రతినిధి సభ స్పష్టం చేసింది. ‘భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు ఉద్యోగావకాశాలను ప్రోత్సహించవల సిన అవసరం’ అనే శీర్షికతో ఈ తీర్మానాన్ని రూపొందించారు. ఉద్యో గాలను సృష్టించేందుకు స్థానికంగా వ్యవసాయ ఆధారిత కార్యక్రమా లను చేపట్టవలసిన అవసరం ఉందని ఆర్.ఎస్.ఎస్. కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు రాంమాధవ్ అన్నారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ స్వదేశీ జాగరణ్ మంచ్ చాలా కాలంగా దీన్నే చేస్తోందనీ, అయితే తమకు మరింతమంది ఔత్సాహిక వ్యక్తులు అవసరమనీ ఆయన చెప్పారు. విదేశీ పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టించవు స్వదేశీ జాగరణ్ మంచ్ ఒక సాంస్కృతిక సంస్థ. దేశ ఆర్థిక సమస్యలకు జాతీయ భావాలతో కూడిన పరిష్కారాలను వెదకుతుంటుంది. అయితే ఒక సంస్థగా తప్ప ఆర్.ఎస్.ఎస్. అనుబంధ సంస్థగా మంచ్‌కు స్వల్ప ప్రాముఖ్యం మాత్రమే నేడు ఉంది. మంచ్ స్వరం కూడా మంచ్కే ఒక అనుబంధ స్వరంలా మిగిలిపోయింది. ప్రభుత్వంలో ఆర్థిక ఆలోచనాపరుల కూటములుగా ఉన్న ‘నీతి ఆయోగ్’, ప్రధాని ఆర్థిక సలహా మండలి... మంచ్ నుంచి సలహాలు తీసుకుంటున్నదీ ఏమీ లేదు. మంచ్ ఆర్థిక జాతీయభావ ఆలోచనలు బీజేపీ విస్మరణకు కూడా గురవుతూనే ఉన్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయానికొస్తే, అవి పెద్దఎత్తున ఉద్యోగాలను సృష్టించగలవని ఎవరూ అనుకోరు. అవి కేవలం ఆర్థిక వనరులంతే. ఆ వనరులతో పాటు వచ్చే సాంకేతికత. అంతవరకే. అయితే విదేశీ మారక నిల్వల్ని నిర్మించుకోడానికి అవి సహాయపడతాయి. ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాధికారానికి స్వేచ్ఛను ఇస్తాయి. ప్రయోజనకరమైన ఆర్థిక కార్యకాలపాలతో దేశాన్ని అనుసంధానం చేస్తాయి. ప్రత్యక్ష పెట్టుబడు లకు ప్రతికూలంగా మంచ్ ఏకాంశ దేశీయ ప్రణాళికతో ఏకీభవించే వారు చాలా తక్కువ మంది ఉంటారు. ఇక ఉద్యోగాల సమస్య అన్నది మరొక విషయం. పాలక, ప్రతిపక్షాల దృక్పథాల మధ్య వ్యత్యాసానికి మనం ఇప్పుడు వద్దాం. ప్రభుత్వం ఎప్పుడూ కూడా ఉద్యోగాల నష్టాన్నీ, పర్యవసాన లేమినీ తన ప్రాధాన్యతల క్రమంలోని పైభాగంలో ఉంచదు. పేదలకు నేరుగా డబ్బిచ్చే ‘ప్రత్యక్ష ప్రయోజన బదలీ’ పథకం ఉంది. చిన్న వ్యాపారులకు రుణాలిచ్చే పథకాలు ఉన్నాయి. అయితే అవి ఆర్థిక స్థిరత్వంపై ప్రతికూల ప్రభావం చూపిం చనంత మేరకు మాత్రమే ప్రభుత్వం ముందుకు వెళుతుంది. ధరల పెరుగుదలను ప్రేరేపించనంత వరకే వాటిని ప్రయోగిస్తుంది. రూపాయే ఉంటే ఎవరికిస్తావు? ఆర్థిక ప్రాధాన్యాలు, ఆర్థిక విధానాలు ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పని స్థితిలోకి వ్యవస్థను నెట్టేస్తే అప్పుడు స్పష్టమై, కచ్చితమైన ఎంపికలను నిర్ధారించుకోవాలి. ప్రఖ్యాత ఆర్థికవేత్త లియోనెల్ రాబిన్స్ దాదాపు ఒక శతాబ్దం క్రితం ఆర్థికశాస్త్ర నిర్వచనాన్ని ఒక్కమాటకు కుదించేశారు. ‘‘ఆశలకు, కొరతలకు మధ్య ప్రత్యామ్నాయ ప్రయోజ నాలున్న ఒక సంబంధంగా మానవ ప్రవర్తనల్ని అధ్యయనం చేసేదే ఆర్థిక శాస్త్రం’’ అని అన్నారు! ఇవాళ భారత ప్రభుత్వం దగ్గర ఖర్చు చేయడానికి ఒకే ఒక రూపాయి ఉందనుకుంటే కనుక అది ఎవరికి వెళుతుంది? విద్యుదుత్పత్తి కర్మాగారానికా? లేక రైలు మార్గ నిర్మాణా నికా? ఇవేవీ కాకుంటే, చిన్న తరహా పరిశ్రమకు కేటాయించి, అందు లోని కొద్ది మంది ఉద్యోగుల జీవనోపాధికి బాసటగా ఉంటుందా? నిజానికైతే... ధరలపై నియంత్రణ కోల్పోయి ఆందోళనలో ఉన్న ప్రభుత్వం రైల్వే లైనుకు, లేదంటే పవర్ ప్లాంటుకు ఆ రూపాయిని ఖర్చు చేస్తుంది. ఆ పెట్టుబడి ఒక స్పష్టమైన రాబడి ఆస్తిని సృష్టిస్తుంది. దశాబ్దాల పాటు గానీ, అంతకంటే ఎక్కువ కాలం గానీ ఒక ప్రవా హంగా ఆదాయాన్ని కల్పిస్తుంది. మరి చిన్న వ్యాపారం సంగతేంటి? అది దివాళా తీయవచ్చు. లేదంటే మూసివేత. సరఫరా గొలుసులో తన పాత్రను పోషించడంలో, గుప్పెడు మంది ఉద్యోగుల జీవనో పాధిని కాపాడటంలో ఆ వ్యాపారం విఫలం అవుతుంది. అయితే ఉద్యోగాలు కనుమరుగవకుండా చూసుకోవడం ద్వారా పేదరికంపై పోరాటం చేయడం అన్నది ప్రభుత్వ ప్రాధాన్యం కావాలి. ఎందు కంటే నిధులు సమకూర్చడం వల్ల ఒనగూడే ప్రయోజనాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు ఇచ్చి ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తాయి. ద్రవ్యోల్బణమూ ఉండదు. ఈ చర్చలో ఆర్.ఎస్.ఎస్. నిరుపేద కార్మికుడి పక్షాన నిలుస్తోంది. నిరుపేదలకు ఉపాధిని కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యాంశం కావా లని సూచిస్తోంది. ‘‘మనం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలపై దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఆర్.ఎస్.ఎస్. పెట్టిన ఈ తీర్మానం ప్రభుత్వ విధానాలకు సంబంధించినది కాదు. కోవిడ్ మహ మ్మారి ఒక సవాల్‌లా విసిరిన నిరుద్యోగ సమస్యను అధిగమించ డానికి దేశమంతటా జరగవలసిన ప్రయత్నాల గురించి’’ అని రాం మాధవ్ అన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు క్షేత్రస్థాయిలో జరిగిన సర్వేల నుంచి ఈ విధమైన ఆర్.ఎస్.ఎస్. అభిప్రాయాలు వెలువడ టాన్ని గమనించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ గ్రామాలకు (సెమీ–అర్బన్) జరిగిన వార్షిక వలసలపై ఆ సర్వే జరి గింది. సర్వే ఫలితాలను అనుసరించి నిరుద్యోగాన్ని ఒక సంక్షోభంలా ఆర్.ఎస్.ఎస్. పరిగణించింది. సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నం జరగాలని గుర్తించింది. సుబీర్ రాయ్ వ్యాసకర్త ఆర్థిక రంగ నిపుణులు (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
నిరుద్యోగులకు వరం
నిరుద్యోగ భారతం ఎదుర్కొనే ఇక్కట్లు అన్నీ ఇన్నీ కాదు. ఫీజుల రూపంలో బోలెడు చెల్లించి కష్టపడి చదివి పట్టా తెచ్చుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు అతి స్వల్పం. కన్నవాళ్లకు భారంగా మారా మని బాధపడి ఏదో ఒక ప్రైవేటు సంస్థలో కుదురుకున్నా అత్తెసరు జీవితం. దేశంలో రెండున్నర కోట్ల నుంచి 3 కోట్లమంది వరకూ ఉద్యోగార్థులు వివిధ ప్రభుత్వ విభాగాల్లో నియామకాల కోసం ఏటా పరీక్షలు రాస్తారని అంచనా. వీరంతా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వేర్వేరు ఉద్యోగాలకు విడిగా దరఖాస్తు చేసుకోవడం, శిక్షణ తీసుకోవడం, దూరప్రాంతాలకు పరీక్ష రాసేందుకు పోవడం తప్పడం లేదు. ప్రతి ఉద్యోగానికీ రుసుము చెల్లించడం మరో సమస్య. దరఖాస్తుకే ఇలా వందలాది రూపాయలు ఖర్చుపెట్టవలసిరావడం నిరుద్యోగులకు ఎంతో ఇబ్బందికరం. దశాబ్దాలుగా కోట్లాది మంది నిరుద్యోగులు నిరంతరం ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎన్డీఏ ప్రభుత్వం తొలిసారి పరిష్కారం చూపించింది. నాన్–గెజిటెడ్ పోస్టులు గ్రూప్–బీ, సీ(నాన్ టెక్నికల్) ఉద్యోగాలతోసహా అన్నిటికీ ఉమ్మడి అర్హత పరీక్ష(సెట్) నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్ష నిర్వహణ కోసం జాతీయ రిక్రూట్మెంట్ ఏజెన్సీ(ఎన్ఆర్ఏ) సంస్థ ఏర్పాటవుతుంది. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్(ఎస్సెస్సీ), రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ), ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్(ఐబీపీఎస్) తదితరాల ప్రతినిధులు ఇందులో వుంటారు. తొలి దశలో ఈ ఏజెన్సీ పరిధిలోకి మూడు నియామక బోర్డులు వస్తాయి. మున్ముందు 20 నియామక సంస్థల వరకూ ఇందులో చేరతాయి. దేశంలో దాదాపు ప్రతి జిల్లాలోనూ ఎన్ఆర్ఏ పరీక్షా కేంద్రాలుంటాయి. అలాగే ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షలు జరుగుతాయి. ఇందులో వచ్చే స్కోరు మూడేళ్లపాటు చెల్లుబాటు కావడం కూడా నిరుద్యోగులపాలిట వరం. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి తమ తమ అవసరాలనుబట్టి కొన్ని సంస్థలు రెండో దఫా పరీక్ష నిర్వహిస్తాయంటున్నారు. సాధ్యమైనంత వరకూ ఈ అవసరం లేకుండా చేయడమే ఉత్తమం. ఎటూ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు వుంటాయి గనుక, ఎన్ఆర్ఏ ఏర్పాటు ఉద్దేశమే బహుళ పరీక్షల అవసరం లేకుండా చేయడం గనుక మళ్లీ రెండోసారి రాయాలనడం సరికాదు. జిల్లాకొక పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయడం మంచి ఆలో చన. ఎక్కడో దూరంగా వుండే ప్రాంతాలకు వెళ్లి పరీక్షలు రాయడం ఆడపిల్లలకైతే మరింత సమస్య. వారితోపాటు కుటుంబసభ్యులెవరైనా వెళ్లకతప్పదు. అత్యధిక కుటుంబాలకు అంత మొత్తం ఖర్చు చేసే స్థోమత వుండదు. ప్రతి జిల్లాలోనూ పరీక్షా కేంద్రాలుంటే ఆ కుటుంబాలకు కాస్త ఉపశమనం. అయితే అవసరాన్నిబట్టి విస్తృతినిబట్టి కొన్ని జిల్లాలకు కనీసం రెండు కేంద్రాలైనా ఉండేలాచూడటం అవసరం. ఒకప్పుడు ఉపాధి కల్పనా కేంద్రాలకు ప్రాధాన్యం అధికం. పదో తరగతి అయ్యాక అక్కడ పేరు నమోదు చేసుకోవడం, విద్యార్హతలు పెరుగుతున్నకొద్దీ వాటిని అదనంగా చేరుస్తుండటం రివాజు. ఆ తర్వాత కాల్ లెటర్ కోసం ఎదురుచూడటం, తరచుగాపోయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయడం నిరుద్యోగులకు పెద్ద పని. ఆ ప్రక్రియలో చేతివాటం కూడా ఎక్కువే. డబ్బు ముట్టజెప్పిన వారికి కాల్ లెటర్లు రావడం, చేయనివారికి జీవితంలో ఒక్కసారి కూడా పిలుపు రాకపోవడం చాలామందికి అనుభవమే. అయితే ఉపాధి కల్పన శాఖ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాకే ప్రభుత్వోద్యో గాలను భర్తీ చేయాలన్న నిబంధనను రెండు దశాబ్దాలక్రితం సుప్రీంకోర్టు కొట్టేయడంతో ఇదంతా మారింది. ఉపాధి కల్పనా కేంద్రాలతో నిరుద్యోగులకు పని లేకుండా పోయింది. చదువు పూర్తిచేసు కున్న వెంటనే అందులో తమ పేర్లు నమోదు చేసుకుంటున్న అమాయకులు ఇప్పటికీ లేకపోలేదు. కానీ అందులో నమోదయ్యేవారితో పోలిస్తే దాని జోలికిపోని నిరుద్యోగుల సంఖ్య వందలరెట్లు ఎక్కువ. చదువుకున్నవారిలో నిరుద్యోగిత 2011–12లో 6.1 శాతం వుంటే 2017–18నాటికి అది 17.8 శాతానికి చేరుకుందని నిరుడు నవంబర్‌లో చేసిన అధ్యయనంలో తేలింది. చదువు పెరిగేకొద్దీ నిరుద్యోగిత కూడా ఎక్కువవుతున్నదని ఆ అధ్యయనం తెలిపింది. అయితే ప్రభుత్వ విభాగాల్లో నియామకాలు నానాటికీ తగ్గిపోతున్నాయని మరిచిపోకూడదు. రిటైరవుతున్నవారు నిష్క్రమిస్తుండగా, ఆ స్థానాలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయి. కాంట్రాక్టు నియామకాలు, ఔట్సోర్సింగ్ నియామకాలు పెరుగుతున్నాయి. చెప్పుకోవడానికి ఘనంగా ఒక ఉద్యోగం ఉంటుంది. కానీ ఇంట్లో ఈగల మోత అన్నట్టు పనిభారం అధికం. ఎప్పుడూ అరకొర జీతం. జీవితంలో స్థిరపడతామన్న ఆశకు తావే వుండదు. మన దేశంలో మరో చిత్రమైన పరిస్థితి. ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణలుంటాయి. నిర్దిష్ట కాలానికి పెరుగుతున్న ధరవరలకనుగుణంగా వేతనాల పెంపుదల వుంటుంది. జాప్యం జరిగితే ప్రశ్నించ డానికి ఉద్యోగ సంఘాలుంటాయి. రిటైరయ్యాక పెన్షన్ సదుపాయం వుంటుంది. ప్రైవేటు ఉద్యో గాల్లో ఇవన్నీ కనబడవు. చట్టాలున్నా ఆచరణలో అమలు కావు. సమాజంలో వేర్వేరు రంగాల్లో పనిచేసేవారి వేతనాల మధ్య ఇలా తీవ్ర వ్యత్యాసం వుండటంతో వారి జీవన స్థితిగతుల్లో కూడా అంతరాలు అధికంగా వుంటున్నాయి. ప్రైవేటు రంగంలో కొనసాగేవారిపై ఆధారపడే కుటుంబాలు అధ్వాన్నస్థితిలో బతుకీడ్చవలసి వస్తోంది. కనుకనే ప్రభుత్వోద్యోగాలవైపు మొగ్గు చూపే ధోరణి పెరుగుతోంది. అక్కడేమో నియామకాలు నానాటికీ కొడిగడుతున్నాయి. ఎన్ఆర్ఏ ఏర్పాటు చేయ డంతో సరిపెట్టక ప్రభుత్వ విభాగాల్లో నియామకాలను కూడా బాగా పెంచితేనే ప్రస్తుతం చేసిన మార్పులకు సార్థకత వుంటుంది. దేశ జనాభాలో యువతరం దాదాపు 35 శాతం అని ఒక అంచనా. ఈ యువతరాన్ని ఆకట్టుకోవాలంటే వారు మెరుగైన జీవనం సాగించడానికి అనువైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎన్ఆర్ఏ ఆ దిశగా వేసిన తొలి అడుగు కావాలి. -
కూలుతున్న కొలువులు..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మందగమనం పలు రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. అక్టోబర్‌లో భారత్‌లో నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ట స్ధాయిలో 8.5 శాతానికి ఎగబాకిందని తాజా సర్వే బాంబు పేల్చింది. అక్టోబర్‌లో నమోదైన నిరుద్యోగ రేటు ఆగస్ట్ 2016 నుంచి ఇదే అత్యధికమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) వెల్లడించిన నివేదిక పేర్కొంది. డిమాండ్‌ను పెంచేందుకు ప్రభుత్వం పలు చర్యలు ప్రకటిస్తున్నా ఉద్యోగాలు తగ్గిపోవడం దేశ ఆర్థిక వృద్ధిపై స్లోడౌన్ ప్రభావమేనని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు సెప్టెంబర్‌లో దేశ మౌలిక ఉత్పాదన గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే 5.2 శాతం మేర పతనమవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఎనిమిది కోర్ ఇండస్ర్టీస్‌లో ఏడింటిలో ఉత్పత్తి తగ్గడం మందగమన ప్రభావంపై గుబులు రేపుతోంది. మరోవైపు 2011-12 నుంచి 2017-18 మధ్య భారత ఉపాథి రంగంలో గణనీయమైన తగ్గుదల చోటుచేసుకుందని సెంటర్ ఆప్ సస్టెయినబుల్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన పరిశోధనా పత్రం పేర్కొంది. పైన ఉదహరించిన కాలంలో దేశంలో మొత్తం ఉపాధి 90 లక్షల మేర పడిపోయిందని, దేశ చరిత్రలో ఈస్ధాయిలో ఉద్యోగాలు తగ్గుముఖ పట్టం ఇదే తొలిసారని పరిశోధనా పత్రాన్ని రూపొందించిన సంతోష్ మల్హోత్రా, జయతి కె పరిద ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలోనే ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయని, దినసరి కార్మికులు, కాంట్రాక్టు ఉద్యోగుల సంఖ్య పడిపోయిందని వివరించారు. -
చదువు ఎక్కువ.. పని తక్కువ
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగం చేస్తున్న వారికి తాము చేసే పనికన్నా చదువు ఎక్కువగా ఉం టోందని, దీనివల్ల వారి నైపుణ్యం పూర్తి స్థాయి లో వినియోగం కావట్లేదని కార్మిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని లేబర్ బ్యూరో పేర్కొంది. అలా చదువు ఎక్కువగా ఉన్న వారితో తక్కువ పని చేయించడం వల్ల నిర్దేశించుకున్న ఉత్పత్తిని చేరుకోలేకపోతున్నామంది. చండీగఢ్‌లో ఉన్న ఈ సంస్థ ‘యువతలో ఉద్యోగితా-నిరుద్యోగితా దృశ్యం’ పేరిటఅన్ని రాష్ట్రాల్లో ఉద్యోగ పరిస్థితులపై సర్వే నిర్వహించి ఫలితాలను ప్రభుత్వానికి నివేదించింది.