University Grant Commission
-
అలా పీహెచ్‌డీలు చేస్తే చెల్లవు: యూజీసీ హెచ్చరిక
ఢిల్లీ: పీహెచ్డీ కోర్సుల విషయంలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ సంయుక్తంగా శుక్రవారం ఒక జాయింట్ అడ్వైజరీ రిలీజ్ చేశాయి. విదేశీ విద్యాసంస్థల సహకారంతో ఎడ్యుకేషన్ టెక్నాలజీ(ఎడ్టెక్) కంపెనీలు నిర్వహిస్తున్న పీహెచ్డీ ప్రోగ్రామ్స్ చెల్లవని ప్రకటించింది. ఆన్లైన్ పీహెచ్డీ కోర్సులకు ఎలాంటి గుర్తింపు ఉండబోదని పేర్కొంటూ.. ఈ మేరకు ఓ పబ్లిక్ నోటీసును జారీ చేసింది కంట్రోలర్స్ ఆఫ్ హయ్యర్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్. తమ మార్గదర్శకాల ప్రకారం.. ఎడ్టెక్ కంపెనీలు నిర్వహించే ఆన్లైన్ పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌కు గుర్తింపు ఉండబోదని స్పష్టం చేసింది. యూజీసీ రెగ్యులేషన్ 2016 ప్రకారం ప్రామాణికాలు పాటించాల్సిందేనని, అన్ని హయ్యర్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూషన్స్ కూడా యూజీసీ మార్గదర్శకాలను అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. UGC advises Students and public, at large, not to be misled by advertisements for online Ph.D programmes offered by EduTech Companies in collaboration with Foreign Educational Institutes. For more details please see the attached public notice. @PMOIndia pic.twitter.com/RlP33Ziv7B — UGC INDIA (@ugc_india) October 28, 2022 విదేశీ యూనివర్సిటీల సహకారంతో.. ఆన్లైన్ పీహెచ్డీ అంటూ వచ్చే ప్రకటనలపట్ల అప్రమత్తంగా ఉండాలని.. వాటికి ఆకర్షితులు కావొద్దంటూ విద్యార్థులకు సూచించింది ఆ నోట్. పీహెచ్డీ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకునేముందు యూజీసీ రెగ్యులేషన్ 2016లోబడి ఉందో క లేదో క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని సూచించింది. ఈ కోర్సుల్లో విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్న పలు ఉదంతాలు ఇటీవల తెరపైకి రావడంతో నోటిఫికేషన్ జారీ చేసినట్లు యూజీసీ, ఏఐసీటీఈ అధికారులు తెలిపారు. ఇదీ చదవండి: మీ స్మార్ట్ ఫోన్ రిపేర్‌కు ఇస్తున్నారా?.. ఈ జాగ్రత్తలు పాటించండి -
అక్టోబర్ 1నుంచి కొత్త విద్యా సంవత్సరం: యూజీసీ
న్యూఢిల్లీ: దేశంలోని యూనివర్సిటీలు, కాలేజీల్లో నూతన అకడమిక్ సెషన్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని యూజీసీ ప్రకటించింది. కొత్త అకడమిక్ సంవత్సరానికి అడ్మిషన్ ప్రక్రియలు సెప్టెంబర్ 30కి పూర్తవుతాయని తెలిపింది. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్రాల బోర్డులు ఫలితాలు వెల్లడించిన అనంతరమే అండర్గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్ ప్రక్రియ ఆరంభించాలని వర్సిటీలు, కాలేజీలను ఆదేశించింది. ఈ ఫలితాలన్నీ జూలై 31 లోపు వస్తాయని భావిస్తున్నట్లు తెలిపింది. ఫలితాల వెల్లడిలో జాప్యం జరిగితే కొత్త అకడమిక్ సంవత్సరం అక్టోబర్ 18 నుంచి ఆరంభమవుతుందని వివరించింది. అప్పటి పరిస్థితులను బట్టి ఆఫ్‌లైన్, ఆన్లైన్ తరగతులు, పరీక్షల్లాంటివి నిర్వహించాలని సూచించింది. పరిస్థితులు బాగాలేనందున ఒకవేళ ఎవరైనా విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిలైనా, వేరే చోటికి మారినా వారు చెల్లించిన ఫీజులను పూర్తిగా వాపసు చేయాలని కళాశాలలను, యూనివర్సిటీలను ఆదేశించింది. అలాగే ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను ఆగస్టు 31కల్లా పూర్తి చేయాలని కోరింది. కోవిడ్ ప్రొటోకాల్స్‌ను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. -
కోవిడ్ నిబంధనలతో కాలేజీలు ఓపెన్..
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఎనిమిది నెలలుగా మూతబడిన యూనివర్సిటీలు, కాలేజీలు తెరిచేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. సెంట్రల్ యూనివర్సిటీలు, కేంద్ర నిధులతో పనిచేస్తున్న విద్యా సంస్థలను తెరిచే విషయమై నిర్ణయాధికారాన్ని వాటి వైస్ చాన్సలర్లు, హెడ్లకు ఇచ్చింది. రాష్ట్ర పరిధిలో ఉన్న యూనివర్సిటీలు, కాలేజీలకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు, సూచనలకు అనుగుణంగా తెరచుకోవచ్చని సూచించింది. భౌతిక దూరం, మాస్కులు, శానిటైజర్లు వంటి కోవిడ్ నిబంధనలను పాటించాలని చెప్పింది. కంటైన్మెంట్ జోన్లలో విద్యా సంస్థలను తెరవరాదని యూజీసీ స్పష్టం చేసింది. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న విద్యార్థులు, అధ్యాపకులను రానివ్వరాదని పేర్కొంది. ఆరోగ్యసేతు యాప్ వినియోగించేలా విద్యార్థులను, అధ్యాపకులను ప్రోత్సహించాల్సిందిగా చెప్పింది. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ప్రత్యేక వెసులుబాట్లు చేసుకోవాలని తాజాగా జారీచేసిన మార్గదర్శకాల్లో తెలిపింది. తగిన జాగ్రత్తలతో హాస్టళ్లు తెరచుకోవచ్చని సూచించింది. -
యూజీసీ రద్దుకు కేంద్రం నిర్ణయం
న్యూఢిల్లీ: దేశంలోని ఉన్నత విద్యాసంస్థలకు నిధుల్ని అందజేస్తున్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ)ను రద్దుచేయాలని నిర్ణయించినట్లు కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి జవదేకర్ చెప్పారు. దీనిస్థానంలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(హెచ్ఈసీఐ)ను ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యూజీసీ చట్టం–1951ను రద్దు చేస్తామన్నారు. కొత్తగా ఏర్పాటు చేయనున్న హెచ్ఈసీఐ కోసం ముసాయిదా బిల్లును రూపొందించామన్నారు. జూలై 18 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా బిల్లు–2018ను ప్రవేశపెడతామన్నారు. తాజా బిల్లు ప్రకారం హెచ్ఈసీఐ కేవలం విద్యా సంబంధమైన విషయాలపై దృష్టి సారిస్తుందనీ, విద్యాసంస్థలకు గ్రాంట్లు జారీచేసే అధికారం మానవవనరుల శాఖకు దక్కుతుందని వెల్లడించారు. అలాగే, విద్యా సంస్థల స్థాపనకు అనుమతులు, నిబంధనలు పాటించని వర్సిటీలు, కళాశాలల గుర్తింపును రద్దుచేసే అధికారం హెచ్ఈసీఐకి ఉంటుందన్నారు. విద్యా ప్రమాణాల్ని మెరుగుపర్చడంలో భాగంగా హెచ్ఈసీఐ సూచనలు ఇచ్చేందుకు సలహా మండలిని ఏర్పాటు చేస్తారు. సలహా మండలిలో అన్ని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్ల చైర్మన్లు, వైస్ చైర్మన్లు సభ్యులుగా ఉంటారని తెలిపారు. నియంత్రణ యంత్రాంగాన్ని సంస్కరించేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. -
వర్సిటీల రిజిస్ట్రార్లుగా ఐఏఎస్‌లు!
విశ్వవిద్యాలయాలను గాడిన పెట్టేందుకు తెలంగాణ సర్కారు కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులను రిజిస్ట్రార్లుగా నియమించడం ద్వారా విశ్వవిద్యాలయాల పాలనను గాడిలో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. రాజకీయ జోక్యం కలిగిన ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు కూడా వర్సిటీలను గాడిలో పెట్టలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నందున వీలైతే వైస్ చాన్స్లర్లుగా (వీసీ) కూడా ఐఏఎస్‌లనే నియమించాలని యోచిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో రెండు మూడు వర్సిటీలకు మినహా మిగతా వాటికి ఇన్చార్జి వీసీలే ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్లు కూడా సరిగ్గా లేవు. ఈ నేపథ్యంలో వీసీలుగా ఐఏఎస్ అధికారులను నియమిస్తే ఎలా ఉంటుందన్న అంశంపై విద్యావేత్తలతో చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నిబంధనలు దీనికి అడ్డుకానున్నాయి. యూజీసీ నిబంధనల ప్రకారం.. కనీసం పదేళ్లు ప్రొఫెసర్‌గా అనుభవం ఉన్న వారే వీసీ పదవికి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులన్న నిబంధన ఉంది. ఆ నిబంధనను మార్చడం రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదన్న భావన నెలకొంది. ఇదీ వర్సిటీల పరిస్థితి.. ప్రస్తుతం రాష్ట్రంలోని తెలుగు విశ్వవిద్యాలయం, పాలమూరు, శాతవాహన వర్సిటీలకు మినహా ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, మహాత్మాగాంధీ, హైదరాబాద్ జేఎన్టీయూ, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలకు ఇన్‌చార్జిలే వీసీలుగా ఉన్నారు. జేఎన్టీయూకు ఇంటర్ బోర్డు కార్యదర్శి శైలజారామయ్యార్, ఉస్మానియా, అంబేద్కర్ ఓపెన్ వర్సిటీకి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య ఇన్చార్జి వీసీలుగా కొనసాగుతున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి పౌరసరఫరాలశాఖ కమిషనర్ పార్థసారథి ఇన్చార్జి వీసీగా కొనసాగుతుం డగా, కాకతీయ విశ్వవిద్యాలయానికి ఇన్చార్జి వీసీగా కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ వీరారెడ్డి కొనసాగుతున్నారు. నల్లగొండలోని మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయానికి ఇన్చార్జి వీసీగా మహబూబ్‌నగర్‌లోని పాలమూరు విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ భాగ్యనారాయణ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఆరు యూనివర్సిటీల్లో పూర్తిస్థాయి వైస్ చాన్స్లర్ల నియామకాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. -
మార్కుల విధానానికి స్వస్తి!
ఆదిలాబాద్ టౌన్ : ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు గ్రేడింగ్ రూపం లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు చేయాలనే ఉద్దేశంతో యూజీసీ (యూనివర్సి టీ గ్రాంట్ క మిషన్) యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు ఈ నెల 12న ఈ విధానంపై ఆదేశాలు జారీ చేసింది. 2008 సంవత్సరంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు క్రెడిట్, బేస్డ్, చేయిస్ సిస్టంను యూజీసీ తయారు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలో ఈ విధానం అమలులో ఉంది. ఈ కొత్త విధానం అమలైతే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా చదవుకునే విద్యార్థులకు ఒకే విద్యావిధానం అమలులోకి వస్తుంది. వచ్చే ఏడాది నుంచి.. 2015-16 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ డిప్లొ మా, సర్టిఫికెట్ కోర్సులు చదివే విద్యార్థులకు మార్కుల రూపంలో కాకుండా గ్రేడ్ రూపంలో పాయింట్ల విధానాన్ని అమలు చేయనున్నారు. సబ్జెక్టులతోపాటు విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తారు. కోర్సు గ్రేడింగ్, స్టూడెంట్ గ్రేడింగ్ ఉంటాయి. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేడింగ్ విధానంలో సెమిస్టర్ విధానంలో తరగతులు ఉంటాయి. 90 రోజుల కు ఒక సెమిస్టర్ విభజి స్తారు. సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటా యి. 450 తరగతుల విద్యబోధన జరుగుతుంది. మూడు రకాల కోర్సులు గ్రేడింగ్ విధానంలో మూడు రకాల కోర్సులు ఉంటాయి. ఇందులో ప్ర ధాన కోర్సు, ఎంపిక కోర్సు, ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి. ఫౌండేషన్ కోర్సుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తప్ప నిసరి. మరొకటి ఎంపిక కోర్సు. విద్యార్థికి స్టూడెంట్ గ్రేడింగ్, కోర్సు గ్రేడింగ్ కలిపి మొత్తం గ్రేడింగ్ సర్టిఫికెట్ పాయింట్ల రూపంలో ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గ్రేడింగ్ విధానంలో తనకు నచ్చిన ఏ సబ్జెక్టు అయినా ఎంపిక చేసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది. విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు గ్రేడింగ్ విధానంలో విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు లభిస్తుందని డిగ్రీ కళాశాల లెక్చరర్లు పేర్కొంటున్నారు. ప్రతీ సబ్జెక్టుల్లో విద్యార్థికి గ్రేడింగ్ పాయింట్ కేటాయిస్తారు. నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలులో ఉంటుంది. విద్యార్థి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ చదువును కొనసాగించవచ్చు. సర్టిఫికెట్లకు ప్రాధాన్యం లభిస్తుంది. -
వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక...
వృత్తికి న్యాయం చేయాలన్న కోరిక అతడిని విద్యార్థులకు దగ్గరచేస్తే.. ఆంగ్లభాషపై ఉన్న మక్కువ జాతీయ, అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. ఇంగ్లిష్ అంటేనే ఉలిక్కిపడుతున్న విద్యార్థుల భయాన్ని పోగొట్టేందుకు చేసిన ప్రయోగం అతడికి మరింత ఖ్యాతినార్జించి పెట్టింది. అంతేనా.. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పరిశోధకుడిగానూ రాణిస్తున్న ఆ మాస్టారి పేరు శంకరభక్తుల సత్యం. ప్రయోగాత్మక విద్యతో పలువురి మన్ననలు అందుకున్న ఆయన పలు జాతీయ,అంతర్జాతీయ మాసపత్రికలకు సైతం వ్యాసాలు రాశారు. ఆయన ప్రతిభకు గుర్తుగా ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. - కేసముద్రం ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి మారుమూల విద్యార్థులకు ఆంగ్లాన్ని సులభంగా బోధించేందుకు అక్కడి ఉపాధ్యాయులు వ్యాకరణాంశాలతో కూడుకున్న ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇంగ్లిష్‌పై విద్యార్థులకు మక్కువ ఉన్నప్పటికీ వారికి తగురీతిలో బోధించేవారు అందుబాటులో ఉండడం లేదు. కాబట్టి వ్యాకరణాంశాలతో మిళితమైన ప్రత్యేక మెటీరియల్‌ను తయారుచేసేందుకు ప్రభుత్వం పూనుకోవాలి. ఉత్సాహవంతులైన ఆంగ్ల ఉపాధ్యాయులకు పరిశోధన అవకాశాలు కల్పించాలి. - శంకరభక్తుల సత్యం నెక్కొండ మండలం చంద్రుగొండకు చెం దిన సత్యం 1996లో ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించారు. తర్వాత కురవి మండలంలోని లక్ష్మీతం డా ప్రాథమిక పాఠశాలలో నాలుగేళ్లు పనిచేసి ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ఉద్యోగోన్నతి పొందారు. ఆ తర్వాత మరిపెడ మండలం చిన్నగూడూరులో మూడేళ్లపాటు విధులు నిర్వర్తించా రు. 2005లో కేసముద్రం మండలం పెనుగొండ జెడ్పీస్ఎస్కు బదిలీపై వచ్చిన సత్యం మాస్టారు అప్పటి నుంచి ఇక్కడే విద్యాబోధన చేస్తున్నారు. 2006లో మధురై కామరాజ్ యూనివర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తిచేసిన ఆయన ద్రవిడ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ప్రయోగాత్మక విద్యకు శ్రీకారం ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సత్యం మాస్టారు.. ఆంగ్లభాషపై విద్యార్థుల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా ప్రయోగాత్మకంగా బోధించాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా తరగతి గదినే ల్యాబ్‌గా మార్చేశారు. సహచర ఉపాధ్యాయుల సహకారంతో ఆంగ్ల వ్యారణాంశాలను తరగతి గది గోడలపై రాయించారు. భాషా నైపుణ్యాలు, పదకోశం, వ్యాకరణ నిర్మాణాలు, క్రియా రూపాలు, భాషాభాగాలు, ఉచ్చరణ, సర్వనామాలు, విభక్తులు, వ్యతిరేక పదాలు, కర్త, కర్మ వాక్యాలతోపాటు మరికొన్ని వ్యాకరణాంశాలను గదిగోడలపై అందంగా రాయించారు. వీటి సాయంతో 150 క్రియా రూపాలను, 12 రకాల వ్యాక్య నిర్మాణాలను, సూత్రాలను విద్యార్థులు ఎంతో సులభంగా చెప్పగలుగుతున్నారు. ఫలితంగా విద్యార్థులకు ఇంగ్లిష్‌పై ఇష్టం ఏర్పడింది. ఈ ప్రయోగం సత్ఫలితాలు ఇస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉన్నతాధికారులు సత్యం మాస్టారిని అభినందనల్లో ముంచెత్తారు. సమర్పించిన వ్యాసాలు 2014 ఏప్రిల్‌లో తిరుపతి చాప్టర్ వారు నిర్వహించిన జాతీయ సదస్సులో ‘లాంగ్వేజ్ ల్యాబ్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫంక్షనింగ్’ అనే వ్యాసాన్ని సమర్పించారు. 2013 జూలైలో యూనివర్సిటీ ఆఫ్ ఆల్, యూకే ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ద ఇంపాక్ట్ ఆఫ్ కోఆపరేటివ్ లెర్నింగ్ ఆఫ్ ఇన్స్కూల్ ఎడ్యుకేషన్’ అనే పరిశోధనా వ్యాసం సమర్పణ. 2013 జనవరిలో ఏడీ పటేల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గుజరాత్ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయసదస్సులో ‘లాంగ్వేజ్ లెర్నింగ్ త్రూ ల్యాబ్స్’ అంశంపై వ్యాసం సమర్పణ. 2013 ఫిబ్రవరిలో యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, భోపాల్ ఆధ్వర్యంలో ఆంగ్ల సాహిత్యంపై రెండురోజులపాటు నిర్వహించిన సదస్సులో ‘డ్రామా అండ్ లాంగ్వేజ్ యాజ్ ఆక్టివ్ ఫామ్స్ ఆఫ్ లిటరేచర్’ వ్యాసాన్ని సమర్పించారు. 2012 అక్టోబర్‌లో జైన్ విశ్వభారతి ఇన్స్టిట్యూట్ వారు నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లిష్ ఇన్ గ్లోబలైజ్డ్ వరల్డ్’ వ్యాసాన్ని సమర్పించారు. సత్యం మాస్టారు సమర్పించిన వ్యాసాల్లో ఇవి కొన్ని మాత్రమే. అవార్డులు.. ప్రశంసలు విద్యారంగానికి చేస్తున్న సేవకుగాను 2013 అక్టోబరులో హైదరాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో అప్పటి మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా రాజీవ్త్న్ర అవార్డు అందుకున్నారు. గురుపూజోత్సవం సందర్భంగా 2011 సెప్టెంబర్ 5న జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు కైవసం చేసుకున్నారు. జాతీయస్థాయిలో సత్యం రాసిన ఈఎల్టీఇన్ ఇండియా అనే పరిశోధనా వ్యాసం ప్రథమస్థానంలో నిలవడంతో డాక్టర్ జేకే రీసెర్చ్ ఫౌండేషన్, చెన్నయ్ వారు రూ.25వేల నగదును, ప్రశంసాపత్రాన్ని అందించారు. వ్యాసాలతో కీర్తి.. ఓ వైపు ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు పలు జాతీయ, అంతర్జాతీయ మాస పత్రికలకు వ్యాసాలు రాస్తున్నారు సత్యం మాస్టారు. మహారాష్ట్రకు చెందిన న్యూమాన్ పబ్లికేషన్స్, చెన్నైకు చెందిన ద ఇంగ్లిష్ రీసెర్స్ ఎక్స్‌ప్రెస్, ద ఇంగ్లిష్ ఇండియా మాస పత్రికల్లో పలు వ్యాసాలు రాశారు. సంపాదకుడిగానూ పనిచేశారు. న్యూ ఢిల్లీలోని యూనివర్సిటీ మాసపత్రికలో, ఎడ్యుట్రాక్స్ పత్రికలో, చెన్నైలోని ఎల్టాయ్ మాస పత్రికలో, ఎక్స్పర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ మాసపత్రిక తదితర వాటిలో సభ్యత్వాన్ని పొందారు. అంతేకాక 2002 నుంచి 2006 వరకు పదో తరగతి మోడల్ పేపర్ల తయారీలోనూ సేవలందించారు. జిల్లా విద్యాశాఖ ఇటీవల మూడు మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన వంద రోజుల ఆంగ్లం కార్యక్రమంలో దుగ్గొండి మండలానికి రిసోర్స్ పర్సన్‌గా సేవలందించారు.