ఆదిలాబాద్ టౌన్ : ప్రస్తుతం పదో తరగతి ఫలితాలు గ్రేడింగ్ రూపం లో విడుదలవుతున్న విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలు చేయాలనే ఉద్దేశంతో యూజీసీ (యూనివర్సి టీ గ్రాంట్ క మిషన్) యూనివర్సిటీ వైస్ చాన్సలర్లకు ఈ నెల 12న ఈ విధానంపై ఆదేశాలు జారీ చేసింది. 2008 సంవత్సరంలో గ్రేడింగ్ విధానాన్ని అమలు చేసేందుకు క్రెడిట్, బేస్డ్, చేయిస్ సిస్టంను యూజీసీ తయారు చేసింది. ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలో ఈ విధానం అమలులో ఉంది. ఈ కొత్త విధానం అమలైతే దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు అంతర్జాతీయంగా చదవుకునే విద్యార్థులకు ఒకే విద్యావిధానం అమలులోకి వస్తుంది.
వచ్చే ఏడాది నుంచి..
2015-16 విద్యాసంవత్సరం నుంచి డిగ్రీ, పీజీ డిప్లొ మా, సర్టిఫికెట్ కోర్సులు చదివే విద్యార్థులకు మార్కుల రూపంలో కాకుండా గ్రేడ్ రూపంలో పాయింట్ల విధానాన్ని అమలు చేయనున్నారు. సబ్జెక్టులతోపాటు విద్యార్థులకు గ్రేడింగ్ ఇస్తారు. కోర్సు గ్రేడింగ్, స్టూడెంట్ గ్రేడింగ్ ఉంటాయి. ప్రస్తుతం సంవత్సరానికి ఒకసారి మాత్రమే వార్షిక పరీక్షలు నిర్వహిస్తుండగా గ్రేడింగ్ విధానంలో సెమిస్టర్ విధానంలో తరగతులు ఉంటాయి. 90 రోజుల కు ఒక సెమిస్టర్ విభజి స్తారు. సంవత్సరానికి రెండు సెమిస్టర్లు ఉంటా యి. 450 తరగతుల విద్యబోధన జరుగుతుంది.
మూడు రకాల కోర్సులు
గ్రేడింగ్ విధానంలో మూడు రకాల కోర్సులు ఉంటాయి. ఇందులో ప్ర ధాన కోర్సు, ఎంపిక కోర్సు, ఫౌండేషన్ కోర్సులు ఉంటాయి. ఫౌండేషన్ కోర్సుల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి తప్ప నిసరి. మరొకటి ఎంపిక కోర్సు. విద్యార్థికి స్టూడెంట్ గ్రేడింగ్, కోర్సు గ్రేడింగ్ కలిపి మొత్తం గ్రేడింగ్ సర్టిఫికెట్ పాయింట్ల రూపంలో ఫలితాలు ప్రకటిస్తారు. ప్రస్తుతం సైన్స్ విద్యార్థి ఆర్ట్స్ సబ్జెక్టులు తీసుకోవడానికి వీలు లేదు. కానీ గ్రేడింగ్ విధానంలో తనకు నచ్చిన ఏ సబ్జెక్టు అయినా ఎంపిక చేసుకొని చదువుకునే అవకాశం ఉంటుంది.
విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు
గ్రేడింగ్ విధానంలో విద్యార్థి పరిజ్ఞానానికి గుర్తింపు లభిస్తుందని డిగ్రీ కళాశాల లెక్చరర్లు పేర్కొంటున్నారు. ప్రతీ సబ్జెక్టుల్లో విద్యార్థికి గ్రేడింగ్ పాయింట్ కేటాయిస్తారు. నచ్చిన సబ్జెక్టును ఎంపిక చేసుకోవచ్చు. ప్రస్తుతం యూనివర్సిటీలు పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ విధానంతో దేశవ్యాప్తంగా ఒకే విద్యావిధానం అమలులో ఉంటుంది. విద్యార్థి దేశవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఈ చదువును కొనసాగించవచ్చు. సర్టిఫికెట్లకు ప్రాధాన్యం లభిస్తుంది.
మార్కుల విధానానికి స్వస్తి!
Published Sun, Nov 23 2014 2:53 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement
Advertisement