'కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలి'
హైదరాబాద్: కాలేజీలు నాణ్యతా ప్రమాణాలను తప్పక పాటించాలంటూ ఉన్నత విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ పేర్కొన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 220 కాలేజీలకు అనుమతులిచ్చామనీ, 25 కాలేజీలకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు.
245 కాలేజీల నుంచి అఫిలియేషన్ కోసం దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. యూనివర్సిటీలో క్వాలిటీ సెల్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ప్రమాణాలు పాటించని కాలేజీల్లో 40 శాతం సీట్లు తగ్గించామని శైలజారామయ్యర్ స్పష్టం చేశారు.