Upasana Singh
-
పెద్ద హీరోతో సినిమాకు సైన్ చేశా.. ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్‌కు రమ్మన్నాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు. -
హాలీడే మూడ్‌లో చిరంజీవి.. శ్రీజ, ఉపాసన స్వీటెస్ట్ కామెంట్
వరుస సినిమాల షూటింగ్‌తో బిజీగా ఉన్న చిరంజీవి.. ‘ఆచార్య’ విడుదల తర్వాత కాస్త బ్రేక్ ఇచ్చాడు. భార్య సురేఖతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘కరోనా పాండమిక్ తర్వాత ఇదే తొలి ఇంటర్నేషనల్ జర్నీ. చాలా రోజుల తర్వాత చిన్న హాలీడే తీసుకొని సురేఖతో కలిసి అమెరికా, యూరప్ పర్యటనకు వెళ్తున్నాం. త్వరలోనే అందరిని కలుస్తా’ అంటూ సురేఖతో ఫ్లైట్‌లో దిగిన ఫోటోని ఇన్‌స్టాలో షేర్ చేశాడు. చిరంజీవి పోస్ట్‌పై ఆయన కూతురు శ్రీజతో పాటు కోడలు ఊపాసన కూడా స్పందించారు. ‘ఎంజాయ్ అమ్మ అండ్ డాడీ, ఐలవ్ యూ సో మచ్’అని శ్రీజ, ‘హ్యాపీ టైమ్ అత్తయ్య, మామయ్య’ అని ఉపాసన కామెంట్ చేశారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela) ఇక చిరంజీవి సినిమాల విషయానికొస్తే.. కొరటాల శివ దర్శకత్వంలో ఆయన హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రం ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం చిరంజీవి మెహర్ రమేష్ మేకింగ్ లో భోళాశంకర్, మోహన్ రాజా తెరకెక్కిస్తున్న గాడ్ ఫాదర్ , బాబి దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటిస్తున్నాడు. వీటిల్లో గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆగస్ట్ లో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_881252745.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఉపాసన ఒక్కరేకాదు..
నిర్మాతల తీరు, రెమ్యూనరేషన్ చెల్లింపుల్లో జాప్యంపై నిర్భయంగా గళం విప్పిన సీనియర్ టీవీ నటి ఉపాసన సింగ్ కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. ఆమె బాటలో మరికొందరు నటీనటులు తాము ఎదుర్కొటున్న తీవ్ర సమస్యలను వెల్లడించే ప్రయత్నం చేశారు. సెట్ లో లైంగిక వేధింపులు, దారికి రానివారిని నలిపేసే ప్రయత్నాలు, వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోవాల్సిరావడం.. తదితర విషయాలను దాచుకోకుండా వెళ్లగక్కుతున్నారు టీవీ స్టార్లు. వీరిలో పరిధి శర్మది కాస్త సీరియస్ సమస్య.. బహుళ ఆదరణ పొందిన 'జోథాఅక్బర్' సీరియల్ లో జోథాబాయిగా నటిస్తోన్న పరిధి శర్మను ఆ సీరియల్ డైరెక్టర్ శాంత్ రామ్ వర్మ లైంగికంగా వేధించారనే వార్తాలు సంచలనం రేపుతున్నాయి. దర్శకుడి తీరుతో విసుగు చెందిన పరిధి.. నిర్మాతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. సదరు సీరియల్ నిర్మాత బాలాజీ ప్రొడక్షన్స్ కావడంతో ఆ సంస్థ అధినేత్రి ఏక్తా కపూర్ ను ఇదే విషయం మీడియా ప్రశ్నించింది. దానికి ఏక్తా.. 'శాంత్ రామ్, పరిధిల మధ్య వివాదం నడుస్తోందని తెలుసుకానీ అది లైంగిక వేధింపులు అయిఉండదు' అని వివరణ ఇచ్చారు. మరో టీవీ నటి శిల్పా షిండేది కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. 'బాభీజీ ఘర్ పే హై' సీరియల్ లో ముఖ్యపాత్ర పోశించిన శిల్పని నిర్మాత బినాయిఫెర్ కోహ్లీ మానసికంగా వేధించాడట. వేధింపులకు తాళలేకే సదరు సీరియల్ నుంచి తప్పుకున్నానని శిల్పా ప్రకటించింది. దీంతో ఆమెకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు. మికాకు నైట్ చిక్కులు ప్రముఖ గాయకుడు మికా సింగ్ కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతోన్న 'కామెడీ నైట్స్ లైవ్'లో శాశ్వత అతిథిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో క్రికెటర్ నవజ్యోత్ సిద్ధు అతిథిగా కనిపించేవారు. ఆ ఇద్దరూ ఇప్పుడు సోనీ టీవీలో 'కపిల్ శర్మ షో'లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కపిల్ ఆహ్వానం మేరకు మికా సోని టీవీ షోకు వెళ్లారు. ఇది రుచించని కలర్స్ నిర్మాతలు మికాను ఉన్నపళంగా కామెడీ నైట్స్ లైవ్ గెస్ట్ గా తొలిగించారట. 'ప్యార్ తూనే క్యా కియా' సీరియల్ తో పాపులర్ అయిన పథ్ సంథాన్ కూడా నిర్మాతలు తనను తొక్కేయడానికి ప్రయత్నిచారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. 'ప్యార్ తూనే..'కు సంబంధించిన రూ.5.5 లక్షల రెమ్యూనరేషన్ ఇంకా తనకు అందలేదని, డబ్బులివ్వండని నిలదీసినందుకు ఆ సీరియల్ నిర్మాత నా కెరీర్ చెడగొట్టాలని చూశారని పథ్ అంటున్నారు.