ఉపాసన ఒక్కరేకాదు.. | Not just Upasana Singh, these actors too faced trouble at work | Sakshi
Sakshi News home page

ఉపాసన ఒక్కరేకాదు..

Published Wed, Jun 15 2016 12:20 PM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM

ఉపాసన ఒక్కరేకాదు..

ఉపాసన ఒక్కరేకాదు..

నిర్మాతల తీరు, రెమ్యూనరేషన్ చెల్లింపుల్లో జాప్యంపై నిర్భయంగా గళం విప్పిన సీనియర్ టీవీ నటి ఉపాసన సింగ్ కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. ఆమె బాటలో మరికొందరు నటీనటులు తాము ఎదుర్కొటున్న తీవ్ర సమస్యలను వెల్లడించే ప్రయత్నం చేశారు. సెట్ లో లైంగిక వేధింపులు, దారికి రానివారిని నలిపేసే ప్రయత్నాలు, వ్యక్తిగత స్వాతంత్ర్యం కోల్పోవాల్సిరావడం.. తదితర విషయాలను దాచుకోకుండా వెళ్లగక్కుతున్నారు టీవీ స్టార్లు. వీరిలో పరిధి శర్మది కాస్త సీరియస్ సమస్య..

బహుళ ఆదరణ పొందిన 'జోథాఅక్బర్' సీరియల్ లో జోథాబాయిగా నటిస్తోన్న పరిధి శర్మను ఆ సీరియల్ డైరెక్టర్ శాంత్ రామ్ వర్మ లైంగికంగా వేధించారనే వార్తాలు సంచలనం రేపుతున్నాయి. దర్శకుడి తీరుతో విసుగు చెందిన పరిధి.. నిర్మాతలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తెలిసింది. సదరు సీరియల్ నిర్మాత బాలాజీ ప్రొడక్షన్స్  కావడంతో ఆ సంస్థ అధినేత్రి ఏక్తా కపూర్ ను ఇదే విషయం మీడియా ప్రశ్నించింది. దానికి ఏక్తా.. 'శాంత్ రామ్, పరిధిల మధ్య వివాదం నడుస్తోందని తెలుసుకానీ అది లైంగిక వేధింపులు అయిఉండదు' అని వివరణ ఇచ్చారు.

మరో టీవీ నటి శిల్పా షిండేది కూడా ఇదే తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. 'బాభీజీ ఘర్ పే హై' సీరియల్ లో ముఖ్యపాత్ర పోశించిన శిల్పని నిర్మాత బినాయిఫెర్ కోహ్లీ మానసికంగా వేధించాడట. వేధింపులకు తాళలేకే సదరు సీరియల్ నుంచి తప్పుకున్నానని శిల్పా ప్రకటించింది. దీంతో ఆమెకు లీగల్ నోటీసులు పంపేందుకు సిద్ధమవుతున్నారు నిర్మాతలు.

మికాకు నైట్ చిక్కులు
ప్రముఖ గాయకుడు మికా సింగ్ కలర్స్ చానెల్ లో ప్రసారం అవుతోన్న 'కామెడీ నైట్స్ లైవ్'లో శాశ్వత అతిథిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. గతంలో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోలో క్రికెటర్ నవజ్యోత్ సిద్ధు అతిథిగా కనిపించేవారు. ఆ ఇద్దరూ ఇప్పుడు సోనీ టీవీలో 'కపిల్ శర్మ షో'లో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. కపిల్ ఆహ్వానం మేరకు మికా సోని టీవీ షోకు వెళ్లారు. ఇది రుచించని కలర్స్ నిర్మాతలు మికాను ఉన్నపళంగా కామెడీ నైట్స్ లైవ్ గెస్ట్ గా తొలిగించారట.

'ప్యార్ తూనే క్యా కియా' సీరియల్ తో పాపులర్ అయిన పథ్ సంథాన్ కూడా నిర్మాతలు తనను తొక్కేయడానికి ప్రయత్నిచారంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నాడు. 'ప్యార్ తూనే..'కు సంబంధించిన రూ.5.5 లక్షల రెమ్యూనరేషన్ ఇంకా తనకు అందలేదని, డబ్బులివ్వండని నిలదీసినందుకు ఆ సీరియల్ నిర్మాత నా కెరీర్ చెడగొట్టాలని చూశారని పథ్ అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement