Uranium Project
-
రైతులకు యూసీఐఎల్ అన్యాయం చేస్తోంది
సాక్షి, కడప సిటీ: ‘యురేనియం ప్రాజెక్టు నిర్వహణ సరిగా లేదు.. ప్రారంభంలో చెప్పిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారు. భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగడం లేదు. బాధితులకు పరిహారం, ఉద్యోగాలు అందలేదు. గ్రామాల్లో అభివృద్ధి పనులను చేయడం లేదు. వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అని వేముల మండలం తుమ్మలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, మబ్బుచింతలపల్లె, కేకే కొట్టాల, కనంపల్లె, వేల్పుల తదితర యురేనియం ప్రభావిత గ్రామాల ప్రజలు జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం వందలాది మంది బాధిత గ్రామాల ప్రజలు కడప కలెక్టర్ కార్యాలయానికి తరలి వచ్చారు. కలెక్టర్‌ను కలిసి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. డిమాండ్ల పరిష్కారం కోసం వేముల తహసీల్దార్ కార్యాలయం ఎదుట గత ఐదు రోజులపాటు ఆందోళనలు చేపట్టినా యూసీఐఎల్ యాజమాన్యం కన్నెత్తి కూడా చూడలేదని వాపోయారు. అభివృద్ధి పనులను విస్మరించారన్నారు. 70 శాతం ఉద్యోగాలు యురేనియం బాధిత ప్రాంత రైతులకే కేటాయించాలన్నారు. సరిహద్దులు నిర్ణయించిన మేరకు భూములన్నీ తీసుకోవాలన్నారు. టైలింగ్‌పాండ్ వ్యర్థాలతో తీవ్ర నష్టం జరుగుతోందని, కలుషిత నీటితో పంటలు దెబ్బతినడంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు పర్యవేక్షణ బావులు నిర్మించాలన్నారు. కాలుష్య నియంత్రణకు మొక్కలు నాటాలన్నారు. భూగర్భ జలాలు శుద్ధి చేస్తేగానీ పంటలు పండవన్నారు. అంతవరకు రైతులకు నష్టపోయిన పంట నష్టాన్ని నిరంతరాయంగా చెల్లిస్తూనే ఉండాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు ద్వారా వ్యవసాయం కోల్పోయిన రైతులందరికీ తగు రీతిలో ఉపాధి కల్పించాలన్నారు. భూములు కోల్పోయిన రైతు కుటుంబాలకు వెంటనే నష్టపరిహారంతోపాటు వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ వద్దని, బాధిత గ్రామాల్లోని రైతులతో కమిటీ వేసి సమస్యలను పరిష్కరించాలన్నారు. మొత్తం 15 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్ హరికిరణ్‌కు అందజేశారు. దీనిపై కలెక్టర్ హరికిరణ్ స్పందించారు. త్వరలోనే సమస్యలన్నింటికీ పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. యురేనియం బాధిత గ్రామాల నాయకులు, వైఎస్సార్సీపీ వేముల మండల కన్వీనర్ నాగేళ్ల సాంబశివారెడ్డి, మాజీ జెడ్పీటీసీ మరకా శివకృష్ణారెడ్డి, జెడ్పీటీసీ కేవీ బయపురెడ్డి, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు శివశంకర్‌రెడ్డి, ప్రజలు పాల్గొన్నారు. డిమాండ్లన్నీ పరిష్కరిస్తేనే... డిమాండ్లు పరిష్కరించమంటే యురేనియం ప్రాజెక్టు యాజమా న్యం కాలయాపన చేస్తోంది. అన్ని డిమాండ్లు పరిష్కరిస్తేనే యురేనియం బాధిత గ్రా మ ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చే స్తాం. ప్రజాభిప్రాయసేకరణ అసలు ఒప్పుకోం. కమిటీ వేసి సమస్యలన్ని పరిష్కరించాలని కోరుతున్నాం. – మరకా శివకృష్ణారెడ్డి, మాజీ జెడ్పీటీసీ, రాచగుంటపల్లె, వేముల మండలం ప్రజాభిప్రాయ సేకరణ వద్దు యురేనియం ప్రాజెక్టు యాజమాన్యం జనవరి 6వ తేదీన ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతున్నామన్నారు. దీనికి ఒప్పుకునే పరిస్థితి లేదు. అలా కాకుండా ముందుకు వెళితే ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తాం. యురేనియం బాధిత గ్రామాల ప్రజలతో కమిటీ ఏర్పాటు చేసి డిమాండ్లను పరిష్కరిస్తేనే అంగీకరిస్తాం. – నాగేళ్ల సాంబశివారెడ్డి, మండల కన్వీనర్, వేముల -
యురేనియం సమస్యలపై కమిటీ ఆరా
సాక్షి, వేముల: వైఎస్సార్ జిల్లాలోని వేముల మండలంలో యురేనియం కాలుష్య సమస్యపై నిపుణుల అధ్యయన కమిటీ సోమవారం పర్యటించింది. టైలింగ్ పాండ్ పరిధిలోని బాధిత రైతు సమస్యలపై యురేనియం సంస్థ అధికారులతో ఆరా తీసింది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి పదార్థాన్ని శుద్ధి చేసి టైలింగ్ పాండ్‌లో నింపుతున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జలాలు కలుషితమై పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. ఈ సమస్యపై ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో సమీక్ష నిర్వహించారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, విశ్రాంత సీనియర్ శాస్త్రవేత్త బాబూరావు, రైతులు కలసి యురేనియం కాలుష్యం, కలుషిత జలాలపై కాలుష్య నియంత్రణ మండలిలో ఫిర్యాదు చేశారు. స్పందించిన కాలుష్య నియంత్రణ మండలి 11 మందితో నిపుణుల అధ్యయన కమిటీని నియమించింది. కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాల మేరకు సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త బాబూరావు ఆధ్వర్యంలో కమిటీ కర్మాగారాన్ని, టైలింగ్ పాండ్‌ను సందర్శించింది. ముందుగా తుమ్మలపల్లెలో యురేనియం అధికారులతో కమిటీ భేటీ అయింది. అధికారులిచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌పై కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి నీరు కలుషితం కాలేదనే∙దానిపై ఆధారాలు చూపాలని ప్రశ్నించినట్లు సమాచారం. తర్వాత యురేనియం శుద్ధి కర్మాగారాన్ని కమిటీ సందర్శించింది. టైలింగ్ పాండ్ నిర్మాణంలో లోపాలు ఉన్నాయని కమిటీ బృందం గుర్తించినట్లు తెలుస్తోంది. యూసీఐఎల్ అధికారులు ప్రాణేష్, రావు, వీకే సింగ్ తదితరులు ఉన్నారు. (ఇది చదవండి: యురేనియం కాలుష్యానికి ముకుతాడు) -
యురేనియం కాలుష్యానికి ముకుతాడు
సాక్షి, వేముల(కడప) : పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుతో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి కాలుష్య నివారణ చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇందులో భాగంగా యురేనియం గ్రామాల్లో అధ్యయనానికి 11మందితో కూడిన నిపుణుల కమిటీని నియమించింది. ఈ బృందానికి ముంబాయి అణుశక్తి నియంత్రణ మండలికి చెందిన అణు ప్రాజెక్టుల భద్రతా విభాగాధిపతి అధ్యక్షత వహించనున్నట్లు సమాచారం. ఈయన ఆధ్వర్యంలో ఈ బృందం సోమ, మంగళవారాలలో యురేనియం గ్రామాల్లో పర్యటించనుంది. ఇక్కడి కాలుష్యం, కలుషిత జలాలపై అధ్యయనం చేసి కాలుష్య నియంత్రణ మండలి ఈనెల 11న నివేదిక అందజేయనుంది. తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేసి వ్యర్థ పదార్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి భూగర్భజలాలు కలుషితమయ్యాయి. కలుషిత నీటితో సాగులో ఉన్న అరటి, మిరప, వేరుశనగ పంటలు ఎదుగుదలేక గిటకబారిపోయాయి. అరటి తోటలకు సాగునీటిని అందిస్తే భూమిపై తెల్లని రసాయన పదార్థం పేరుకపోతోంది. దీంతో సాగులో ఉన్న పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారు. వ్యవసాయ బోర్లలో నీరు కలుషితం కావడంతో రైతులు పంటలు సాగు చేయడంలేదు. పంటలు సాగు చేసిన కలుషిత నీటితో పంట దెబ్బతిని పెట్టుబడులురాక గిట్టుబాటు కావని రైతులు పొలాలను బీళ్లుగా ఉంచుకున్నారు. టైలింగ్ పాండ్ పరిధిలోని కె.కె.కొట్టాల, కనంపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాల్లో వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి. యురేనియం కాలుష్యం ఈ గ్రామాల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది. కలుషిత నీటిని పంటకు ఇవ్వడంవలన భూమిపై ఏర్పడిన తెల్లని పదార్థం అధ్యయన కమిటీ.. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి నియమించిన నిపుణుల బృందం యురేనియం బాధిత తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె, రాచకుంటపల్లె, భూమయ్యగారిపల్లె, కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించనుంది. కలుషిత జలాలతో పంటలు దెబ్బతిని నష్టపోయామని.. పంట సాగు చేసుకోలేక పొలాలను బీళ్లుగా ఉంచుకున్నామని.. జీవనాధారం కోల్పోతున్నామని.. వ్యాధులు ప్రబలుతున్నాయని కాలుష్య నియంత్రణ మండలికి రైతులు, ప్రజా సంఘాలు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కాలుష్య నియంత్రణ మండలి యురేనియం కాలుష్యంపై అధ్యయనానికి నిపుణులతో కూడిన కమిటీని నియమించింది. అధ్యయన కమిటీ 9, 10వ తేదీలలో పర్యటించనుంది. గ్రామాలలో రెండు రోజులపాటు కమిటీ బృందం పర్యటించి యురేనియం కాలుష్యంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేయనుంది. యురేనియం గ్రామాల్లో ఎంతమేర కాలు ష్యం, భూగర్భజలాల కలుషితమయ్యాయనే తదితర అంశాలపై నిపుణుల కమిటీ అంచనాకు రానుంది. ఇక్కడి గ్రామాల్లో అధ్యయనం చేశాక నివేదిక తయారు చేసి ఈనెల 11న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అందజేయనుంది. ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఇటీవల పులివెందులలో ఇక్కడి కాలుష్య సమస్యపై సమావేశమైన నేపథ్యంలో కమిటీ ఏర్పాటు కావడం పట్ల బాధిత గ్రామ రైతాంగం ఆనందం వ్యక్తంచేస్తోంది. ప్రతినెల కాలుష్య సమస్యపై వివరాలు తెలుసుకుంటానని ఆయన స్వయంగా అధికారులకు చెప్పారు. సంస్థ ప్రతినిధులతో కూడా సీఎం జగన్మోహన్రెడ్డి మాట్లాడారు. నిపుణుల కమిటీకి సమస్యలు వివరించండి ఈ నెల 9,10 తేదీలల్లో జిల్లాకు రానున్న తుమ్మలపల్లె యురేనియం కాలుష్యంపై జిల్లాకు రానున్న నిపుణుల కమిటీకి తమ సమస్యలను వివరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుమ్మలపల్లె ప్రజలు తమ భవిష్యత్తు బాగుపడుతుందని యురేనియం ప్రాజెక్టుకు భూములు ఇస్తే కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వీటన్నింటికి కారణం పరివ్రమకు సంబంధించిన టెయిల్ ఫాండ్ నిర్మాణంలో నిర్లక్ష్యం చేయడమేనన్నారు. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలువ్యాధులతో అల్లాడిపోతున్నారన్నారు. జిల్లాకు వస్తున్న నిపుణుల కమిటీలో శ్రాస్తవేత్తలు, ఇంజనీర్లు, సివిల్ అండ్ ఎన్విరాన్మెంట్, జియాలజీ, భూగర్బగనుల శాఖ, ఉద్యానశాఖ అధికారులతోకూడిన నిపుణలు కమిటీ రెండు రోజుల పాటు పర్యటిస్తున్నట్లు తెలిపారు. కమిటీ ముందు యురేనియం ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలు స్వచ్చందంగా తమ సమస్యలను వివరించాలన్నారు. సీపీఐ నాయకులు పులి కృష్ణమూర్తి, ఎల్. నాగసుబ్బారెడ్డి, చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఇది చదవండి : యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం -
యురేనియం చెత్త ‘శుద్ధి’పై రైతుల ఆగ్రహం
యురేనియం వ్యర్థ జలాలు భూమిలోకి ఇంకిపోయి సాగు, తాగునీరు కలుషితమైంది. వ్యర్థ జలాలు భూగర్భజలాలతో కలిసిపోవడంతో వ్యవసాయం కుదేలైంది. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి సాగు చేసిన అరటి పంట దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వేముల మండలంలోని కె.కె.కొట్టాల, మబ్బుచింతలపల్లె, కనంపల్లె గ్రామాల్లో రైతులు ఆగ్రహించారు. టైలింగ్ పాండ్ పనులను అడ్డుకున్నారు. ఏడాదిన్నరగా పనులు నిలిచిపోవడంతో వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్‌పాండ్ నిండుదశకు చేరింది. భారీ వర్షాలు వస్తే పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. దీంతో యూసీఐఎల్ అధికారులు అప్రమత్తమయ్యారు. పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లె యురేనియం కర్మాగారంలో నాలుగు రోజులుగా యురేనియం ఉత్పత్తిని యూసీఐఎల్ నిలిపివేసింది. టైలింగ్ పాండ్ పనులు కొనసాగేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.పనులకు బాధిత రైతులు ససేమిరా అనడంతో యూసీఐఎల్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. సాక్షి, వేముల(కడప) : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టులో ముడి యురేనియం శుద్ధి చేయగా వచ్చే వ్యర్థ పదార్థాలను టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. ఇందులోని వ్యర్థ జలాలు భూగర్భజలాల్లో ఇంకిపోయి వ్యవసాయ బోర్లు కలుషితమయ్యాయి.బోరు నీటిని అరటికి అందిస్తే పొలంపై తెల్లటి రసాయన పదార్థం మేట వేసి పంట ఎదుగుదల లేకుండా పోయింది. అరటి సాగు చేసిన ఆరు నెలలకు గెలలు వేయాలి. అయితే 10 నెలలైనా గెలలు వేయకపోవడంతో రైతులు నష్టపోయారు. టైలింగ్ వ్యర్థ జలాలు వ్యవసాయ బోర్లలో కలుషితం కావడంతో రైతులు ఆందోళన చేపట్టారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ఇక్కడి పరిస్థితులను యూసీఐఎల్ సీఎండీ హస్నాని దృష్టికి తీసుకెళ్లారు. దీంతో సీఎండీ గత ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇక్కడి పరిస్థితులను వివరించారు. వ్యర్థ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదే ఏడాది మార్చి 9న మళ్లీ వస్తానని చెప్పి ఇటువైపు తొంగి చూడలేదు. ఏడాదిన్నర్రగా నిలిచిపోయిన పనులు : టైలింగ్ వ్యర్థ జలాలు సాగునీటిలో కలిసిపోయి పంటలు దెబ్బతింటున్నా యూసీఐఎల్ పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహించిన కె.కె.కొట్టాల రైతులు టైలింగ్ పాండ్ పనులను అడ్డుకున్నారు. టైలింగ్ పాండ్‌ను 5మీటర్ల మేర ఎత్తు పెంచే పనులను రూ.42కోట్లతో చేపట్టారు. అయితే సాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటామని యూసీఐఎల్ నుంచి స్పష్టమైన హామీ రాలేదు. దీంతో బాధిత రైతులు పనులను అడ్డుకున్నారు. నిండుదశకు చేరిన వ్యర్థాల టైలింగ్ పాండ్.. : యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్ పాండ్ నిండు దశకు చేరింది. ఏడాదిన్నర్రగా యురేనియం కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. అక్కడ నుంచి వ్యర్థాలను పైపులైన్ ద్వారా టైలింగ్ పాండ్‌కు తరలిస్తున్నారు. వర్షాలు కురిస్తే టైలింగ్ పాండ్ పొంగి ప్రవహించే ప్రమాదం ఉంది. పశువులు, జంతువులు తాగితే చనిపోయే ప్రమాదం నెలకొంది. ఇప్పటివరకు వర్షాలు రాకపోవడంతో యూసీఐఎల్ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వర్షాకాలంలో వానాలు కురిసి టైలింగ్ పాండ్‌లోని వ్యర్థ పదార్థం వాగు వెంబడి వెళితే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యురేనియం వ్యర్థాలను నింపే టైలింగ్ పాండ్ పనులకు బాధిత రైతులు ససేమిరా అంటున్నారు. యూసీఐఎల్ అధికారులు వీరితో మాట్లాడి పనులు కొనసాగించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ నేపథ్యంలో సమస్యను యూసీఐఎల్ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ప్రాజెక్టులో నిలిచిపోయిన యురేనియం ఉత్పత్తి.. : యురేనియం వ్యర్థ పదార్థాలను తరలించే టైలింగ్ పాండ్ నిండు దశలో చేరడంలో యూసీఐఎల్ అధికారులు ప్రాజెక్టులో యురేనియం ఉత్పత్తిని నిలిపివేశారు. నాలుగు రోజులుగా పనులు జరగలేదు. టెలింగ్ పాండ్ పనులు ప్రారంభమయ్యే వరకు కర్మాగారంలో ముడి పదార్థాన్ని శుద్ధిచేసే పరిస్థితి కనిపించలేదు. శాశ్వత పరిష్కారం చూపాలి టైలింగ్ వ్యర్థ జలాలు భూగర్భజలాల్లోకి ఇంకిపోయాయి. సాగు, తాగునీరు కూడా కలుషితమైంది. రేడియేషన్ ప్రభావం ఉంటోంది. దీంతో శరీరంపై దద్దులు వస్తున్నాయి.టైలింగ్‌పాండ్ వల్ల నెలకొన్న సమస్యలు పరిష్కారమయ్యే వరకు పనులు జరగనివ్వం. మాకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందే. – శ్రీనివాసులు(మాజీ సర్పంచ్), కె.కె.కొట్టాల ఆర్ఆర్ ప్యాకేజీ కింద ఇళ్లు, భూములు తీసుకోవాలి టైలింగ్ వ్యర్థాలతో నష్టపోతున్నాం. పంటలను సాగు చేసుకునే పరిస్థితి లేదు. ఆర్ఆర్ ప్యాకేజీ కింద భూములు, ఇళ్లులు తీసుకోవాలి. మా బాధలను యూసీఐఎల్ పట్టించుకోలేదు. – చంద్రమోహన్(బాధిత రైతు), కె.కె.కొట్టాల -
నిరసిస్తే.. పోలీసుల పచ్చపాతం
సాక్షి, పులివెందుల: పోలీసులు తమ పక్షపాత ధోరణిని మరోసారి బయటపెట్టుకున్నారు. యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని సమస్యను పరిష్కరించాలని ధర్నా చేసిన ఎంపీపీ లింగాల ఉషారాణి, ఎంపీటీసీ శ్రీరామిరెడ్డి మరో 30 మందిపై కేసు నమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి... యురేనియం టెయిలింగ్ పాండ్ సమస్యను తీర్చాలని కొన్ని నెలలుగా యురేనియం అధికారులను ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వేముల ఎంపీపీ లింగాల ఉషారాణి, ఇతర ప్రజాప్రతినిధులు, రైతులు కోరుతున్నప్పటికీ యురేనియం అధికారులు ఆ సమస్యను తీర్చకుండా రైతులకు మభ్యపెట్టే మాటలు చెబుతూ కాలయాపన చేస్తూ వస్తున్నారు. రెండు నెలలక్రితం ఎంపీ ఢిల్లీలో సీఎండీ అస్నాని కలిసి టెయిలింగ్ పాండ్ వల్ల ఇక్కడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తేగా, ఆయన ఇటీవల ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అప్పుడు నెలరోజుల్లోపు పరిష్కారం చూపుతానని, మళ్లీ ఇక్కడ పర్యటిస్తానని బాధిత రైతులకు హామీ ఇచ్చి ఇప్పటివరకూ ఆ సమస్యను పరిష్కరించలేదు. ఈ నేపథ్యంలో సోమవారం ఎంపీపీ ఉషారాణి రైతులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. దీంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. కానీ నాలుగు రోజుల క్రితం మండలానికే చెందిన టీడీపీ నాయకుడు యురేనియం ప్రాజెక్టు వద్ద యురేనియం అధికారులు, ఉద్యోగులను ప్రాజెక్టు లోపలికి వెళ్లకుండా అడ్డుకొని దాదాపు వందమందితో ధర్నా చేశారు. అంతచేసినా పోలీసులు టీడీపీ నాయకులు, కార్యకర్తలపైనా ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కేవలం అధికారపార్టీలో ఉన్నారు కాబట్టే వారిపై కేసులు నమోదు చేయకుండా వదిలేశారని, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం వల్లే తమపై కేసులు నమోదు చేసి పక్షపాతం చూపుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమని యురేనియం బా«ధిత రైతులు పేర్కొంటున్నారు. టెయిలింగ్ పాండ్ వల్ల ఇప్పటికే తమ పంటలు పండక తాగునీరు, సాగునీరు కలుషితమై మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు సమస్యలు ఎదుర్కొంటుంటే ఒక ప్రజాప్రతినిధిగా ఎంపీపీ ప్రజల కోసం ధర్నా చేశామని, ఇంతమాత్రానికే కేసులు నమోదు చేయడం విడ్డూరంగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కును కూడా ఈ ప్రభుత్వం హరించేస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. -
శాశ్వత పరిష్కారం చూపుతాం
వేముల : టెయిలింగ్ పాండ్ వ్యర్థ పదార్థాలు సాగు, తాగునీటిలో కలుషితం కాకుండా శాశ్వత పరిష్కారం చూపుతామని.. ఈ విషయంపై సీఎండీ హస్నానితో చర్చిం చానని.. అప్పటి వరకు కె.కె.కొట్టాల, కనంపల్లెకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి గ్రామస్తులకు భరో సా ఇచ్చారు. కె.కె.కొట్టాల, కనంపల్లెలో యురేనియం ప్రాజెక్టు ఈడీ ఏఆర్ ఘడే, అధికారులతో కలిసి కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి శనివారం పర్యటించారు. ఎంపీ మాట్లాడుతూ టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో సాగు, తాగునీరు కలుషి తమై పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని కలెక్టర్‌కు వివరించామన్నా రు. స్పందించిన ఆయన జమ్మలమడుగు ఆర్డీఓ నాగన్న అధ్యక్షతన అధికారులతో కమిటీ వేశారని.. వారు నివేదిక ఇచ్చిన వెం టనే కలెక్టర్ దెబ్బతిన్న పంటలను పరిశీ లిస్తారన్నారు. శాశ్వత పరిష్కారం వచ్చేవరకు పోరాడుతామని.. ఎవరూ ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు భరోసా ఇచ్చారు. కలుషిత నీరు తాగి చిన్నారులలో దద్దర్లు, దురద వచ్చాయని గ్రామస్తులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయన స్పందిస్తూ ట్యాంకర్ల ద్వారా శుద్ధి చేసిన తాగునీటిని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. టెయిలింగ్ పాండ్‌వల్ల తీవ్ర ప్రభావం.. : యురేనియం వ్యర్థాలను వేస్తున్న టెయిలింగ్ పాండ్‌వల్ల ప్రభావం తీవ్రంగా ఉంటుం దని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి యురేనియం అధికారులకు సూచించారు. భూమయ్యగారి పల్లె, రాచకుంటపల్లె, తుమ్మలపల్లె, మబ్బుచింతలపల్లె గ్రామాలలో కూడా దీని ప్రభావం ఉందన్నారు. దీనికి శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. యూసీఐఎల్ సీఎండీ రాక .. ఈనెల 15, 16వ తేదీలలో యూసీఐఎల్ సీఎండీ హస్నాని కె.కె.కొట్టాల, కనంపల్లె గ్రామాలలో పర్యటిస్తారని వైఎస్ అవినాష్ రెడ్డి గ్రామస్తులకు చెప్పారు. ఇప్పటికే ఈ గ్రామాల్లో కలుషిత సాగునీటితో పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయిన విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లానన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు మరకా శివకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ మండల పరిశీలకులు లింగాల రామలింగారెడ్డి, ప్రాజెక్టు జీఎంలు ప్రాణేష్. ఎంఎస్ రావు, ఆర్‌డబ్లు్యఎస్ డీఈ పురుషోత్తం, ఎంపీడీఓ శివరామప్రసాద్‌రెడ్డి, ఆర్‌డబ్లు్యఎస్ ఏఈ శివారెడ్డి, కె.కె.కొట్టాల గ్రామ సర్పంచ్ శ్రీనివాసులు, కనంపల్లె సర్పంచ్ దేవదాసు పాల్గొన్నారు. -
యురేనియం ప్రాజెక్టుకు బ్రేక్
అలాంటి చర్యలేమీ లేవు... వన్యప్రాణి బోర్డు ప్రకటన సాక్షి, హైదరాబాద్: మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌లో యురేనియం నిల్వల వెలికితీతకు బ్రేక్ పడింది. అక్కడ మైనింగ్ ద్వారా యురేనియం వెలికితీతకు చర్యలేమీ చేపట్టడం లేదంటూ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సోమవారం జరిగిన సమావేశంలో స్పష్టం చేసింది. అయితే నిజానికి ఇక్కడ లభించే యురేనియం అంత నాణ్యమైనది కాదు గనక పెద్దగా ఉపయోగముండదన్న కేంద్ర యురేనియం కార్పొరేషన్ నివేదికల వల్లే ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. మైనింగ్ ద్వారా యురేనియాన్ని వెలికితీయాలని కాకుండా అధ్యయనం, పరిశీలన చేయాలని మాత్రమే ప్రతిపాదిస్తున్నట్లు తాజా సమావేశంలో బోర్డు వివరణ ఇచ్చింది. యురేనియం నిల్వల కోసం అన్వేషణకు ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలోని పులుల రిజర్వ్‌లో అనుమతి, కవ్వాల్ అభయారణ్యంలో పగటి పూట భారీ వాహనాలకు అనుమతి తదితరాల నుంచి కూడా బోర్డు వెనక్కు తగ్గింది. మరోవైపు బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టుకు సంబంధించి తమ్మిడిహెట్టి గ్రామం వద్ద బ్యారేజీ నిర్మాణానికి వన్యప్రాణి సంరక్షణ బోర్డు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణల్లోని పులుల అభయారణ్యాల మీదుగా 1,081 హెక్టార్లలో రాష్ట్ర పరిధిలోని 622 హెక్టార్ల మేర అటవీ భూమిని ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు అంగీకారం తెలిపింది. ఇక, బెజ్జూరు అడవుల్లో రాబందుల అభయారణ్యం ఏర్పాటు కానుంది. కర్ణాటక తర్వాత ఇది దక్షిణాదిలోనే రెండోది! కవ్వాల్’ రాకపోకలపై అధ్యయన కమిటీ: కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి భారీ వాహనాల రాకపోకలపై అధ్యయనానికి నలుగురు సభ్యుల కమిటీని నియమిస్తూ రాష్ట్ర వన్యప్రాణుల సంరక్షణ మండలి నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ నుంచి మంచిర్యాల మధ్య మార్గంలోని టైగర్ రిజర్వ్ నుంచి వాహనాల రాకపోకలపై కమిటీ అధ్యయనం చేయనుంది. సోమవారం సచివాలయంలో మంత్రి జోగు రామన్న అధ్యక్షతన జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. -
రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందే: అవినాష్‌రెడ్డి
వేముల(వైఎస్సార్ జిల్లా): రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాల్సిందేనని కడప ఎంపీ అవినాష్‌రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన వైఎస్సార్‌జిల్లా వేముల మండలంలోని యురేనియం ప్రాజెక్టు వద్ద జరిగిన బంద్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 5గంటలకే కార్యకర్తలతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు ఆయన చేరుకున్నారు. ప్రాజెక్టులో పని చేసే ఉద్యోగులను, కార్మికులను విధుల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారు. దీంతో యురేనియం ప్రాజెక్టులో శనివారం పనులు నిలిచిపోయాయి. ఈ మేరకు యురేనియం ప్రాజెక్టు ఉద్యోగులు, కార్యకర్తలు బంద్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని నిరసన తెలిపారు. -
యూసీఐఎల్ కాలయాపన
వేముల : తుమ్మలపల్లె యురేనియం ప్రాజెక్టుకు నాల్గవ రీచ్‌లో భూములను తీసుకుని ఉద్యోగం, పరిహారం ఇవ్వాలని రాచకుంటపల్లె బాధిత రైతులు కోరారు. 8ఏళ్లుగా 300ఎకరాలు బీళ్లుగా మారాయని.. పంటలు సాగు చేయక తీవ్రంగా నష్టపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తుమ్మలపల్లె గ్రామ సమీపంలో భారత యురేనియం సంస్థ(యూసీఐఎల్) సుమారు రూ.1109.27కోట్లతో యురేనియం మైనింగ్‌తోపాటు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ప్రాజెక్టుకు 2240ఎకరాలు భూమి అవసరమవు తుందని.. ఇందులో 1118 ఎకరాలు ప్రభుత్వ భూమి.. 1122 ఎకరాలు ప్రయివేట్ భూమి ఉంది. ఇందుకు 2005 నవంబరు 4న నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం మొదటి, రెండవ, మూడవ రీచ్‌లలో ప్రాజెక్టుకు సుమారు 800ఎకరాల భూమిని యూసీఐఎల్ తీసుకుని బాధిత రైతులకు పరిహారం, ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా నాల్గవ రీచ్‌లో కూడా రాచకుంటపల్లె గ్రామ పరిధిలో సుమారు 60మంది రైతులకు చెందిన 300ఎకరాల భూమిని యూసీఐఎల్ తీసుకోవాల్సి ఉంది. అయితే ఈ భూమిని ప్రాజెక్టుకు తీసుకొనేందుకు యూసీఐఎల్ ముందుకు రావడంలేదు. పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ : నాల్గవ రీచ్‌లో భూములను తీసుకుని పరిహారం, ఉద్యోగాలు ఇవ్వాలని బాధిత రైతులు డిమాండు చేస్తున్నారు. నాల్గవ రీచ్ భూములను తీసుకుంటామని గత 8ఏళ్ల నుంచి యూసీఐఎల్ కాలయాపన చేస్తోందని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించి భూములను సర్వే కూడా చేశారు. భూములు తీసుకుని న్యాయం చేయాలని యూసీఐఎల్ యజమాన్యానికి పలు సార్లు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. 8 ఏళ్ల నుంచి బీళ్లుగా పొలాలు : నాల్గవ రీచ్‌లో ప్రాజెక్టుకు కోల్పోతున్న భూము లు 8 ఏళ్లుగా బీళ్లుగా ఉన్నాయి. ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే నాల్గవ రీచ్‌లో సుమారు 300ఎకరాలు బీళ్లుగా ఉండటంతో కంపచెట్లు, పిచ్చి మొక్కలతో నిండిపోయాయి. ఈ భూములకు మధ్యలో కొంత భూమిని మూడవ రీచ్‌లో యూసీఐఎల్ తీసుకుంది. దీంతో బాధిత రైతు లు పంటలు సా గు చేయలేకపోతున్నారు. భూములలో పంటలు సాగు చేస్తే వాటికి రక్షణ లేకుండా పోతోంది. అక్కడక్కడ పంటలు సాగు చేస్తే.. మధ్యలో యూ సీఐఎల్ తీసుకున్న పొలాలు బీళ్లుగా ఉండటంతో పంట దిగుబడులు రైతులకు దక్కడంలేదు.