utilized
-
ఖాళీగా ఉంచుతామంటే కుదరదు... టీఎస్ఐఐసీ షాకింగ్ నిర్ణయం!
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను టీఎస్ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ముమ్మరం చేసింది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న ప్లాట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని గత ఏడాది ఆగస్టులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కోట్ల రూపాయల విలువ మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటివరకు 65 సంస్థల నుంచి సుమారు 1,960 ఎకరాల భూమిని టీఎస్ఐఐసీ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఎక్కువ శాతం హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోనే ఉన్నాయి. ఆదిభట్ల సెజ్, మడికొండ ఐటీ పార్క్, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్ పార్క్, ఐడీఏ నాచారం, పాశమైలారం, పటాన్చెరు, కరకపట్ల బయోటెక్ పార్క్‌తోపాటు పలు చోట్ల ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కార్యకలాపాలు ప్రారంభించని కొందరు పారిశ్రామికవేత్తలు మరికొంత సమయం కావాలని టీఎస్ఐఐసీని కోరుతుండగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. స్వాధీనం చేసుకున్న భూములను పెట్టుబడులతో వచ్చే వారిలో అర్హులైన వారికి తిరిగి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఐదు దశాబ్దాలుగా వేల ఎకరాలు కేటాయింపు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించానే లక్ష్యంతో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి భూములు కేటాయిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఏర్పడింది మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సుమారు 27వేల ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్ఐఐసీగా రూపాంతరం చెందిన తర్వాత నూతన పారిశ్రామిక చట్టం (టీఎస్ఐపాస్)లో భాగంగా సుమారు ఐదు వేల ఎకరాలకుపైగా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినట్లు అంచనా. రాష్ట్రంలోకి పెట్టుబడులు వేగంగా వస్తుండటంతో 35 వేల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా టీఎస్ఐఐసీ మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టింది. టీఎస్ఐపాస్ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 15,852 పరిశ్రమలు రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా, 15.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటిలో రూ.98 వేల కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించిన 12 వేలకు పైగా యూనిట్లు 7.71 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి. 1,343 ఎకరాల మేర ఖాళీ ఓ వైపు పారిశ్రామిక వాడల్లో భూములు పొందినా కార్యకలాపాలు ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారగా, మరోవైపు వివిధ పారిశ్రామిక జోన్లలో 1,343 ఎకరాల విస్తీర్ణం మేర 1,205 ప్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. పెరుగుతున్న మార్కెట్ ధరలకు అనుగుణంగా ఈ ఖాళీ ప్లాట్ల ధరలను కూడా ప్రభుత్వం సవరిస్తూ పెట్టుబడులతో వచ్చే వారికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తోంది. కేటాయింపులు జరగని ప్లాట్లతోపాటు తిరిగి స్వాధీనం చేసుకునే ప్లాట్లను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు టీఎస్ఐఐసీ సన్నాహాలు చేస్తోంది. పారిశ్రామిక జోన్ల వారీగా ఖాళీగా ఉన్న ప్లాట్లు పారిశ్రామిక జోన్ ఖాళీ ప్లాట్లు సైబరాబాద్ 128 కరీంనగర్ 7 ఖమ్మం 31 మేడ్చల్–సిద్దిపేట 133 నిజామాబాద్ 3 పటాన్చెరు 130 శంషాబాద్ 347 వరంగల్ 418 యాదాద్రి 8 ............................................... మొత్తం 1,205 చదవండి : రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ -
ఇకపై 45 కేజీల యూరియా బస్తాలు
న్యూఢిల్లీ: యూరియా వినియోగం తగ్గించేందుకు, ఎరువుల వినియోగంలో సమతూకం పాటించే లక్ష్యంతో ఇకపై యూరియా బస్తాల్ని 50 కేజీలు కాకుండా 45 కేజీల్లో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 45 కేజీల బస్తాల అమ్మకం మార్చి 1, 2018 నుంచే అమల్లోకి వచ్చిందని, అయితే ఇప్పటికే అందుబాటులో ఉన్న 50 కేజీల బస్తాల్ని వచ్చే రెండు నెలలు అమ్ముకునేందుకు అనుమతిస్తామని ఎరువుల శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. హెక్టారు పొలానికి బస్తాల లెక్కన యూరియాను రైతులు వాడుతున్నారని, వినియోగం తగ్గించమని చెప్పినా వినడం లేదని.. అందువల్లే 45 కేజీల బస్తాల్ని విక్రయిస్తున్నామని ఆయన చెప్పారు. పన్నులు జతచేయకుండా 45 కేజీల యూరియా బస్తాను రూ. 242కు విక్రయిస్తారని నోటిఫికేషన్లో ప్రభుత్వం వెల్లడించింది. టన్ను యూరియాకు ప్రభుత్వం నిర్ణయించి న రూ. 5360 ధరకు అనుగుణంగా బస్తా రేటును నిర్ణయిస్తున్నారు. కాగా 25 కేజీలకు మించకుండా బస్తాల్ని విక్రయించేందుకు డీలర్లకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే ప్యాకింగ్ కోసం 2 కేజీల యూరియాకు రూ. 1.50, 5 కేజీలకు రూ.2.25, 10 కేజీలకు రూ. 3.50, 25 కేజీలకు రూ. 5లు డీలర్లు వసూలు చేసుకోవచ్చు. -
శిక్షణ.. కాకూడదు శిక్ష
న్యూస్‌లైన్ , మంచిర్యాల సిటీ, వేసవి సెలవులు సద్వినియోగం చేసుకుంటే ఇటు విద్యార్థులు.. అటు యువత వివిధ శిక్షణలు తీసుకోవాలనుకుంటారు. ఇది శారీరక, మానసిక ఉల్లాసానికి, దృఢత్వానికి మంచిదే. అయితే జిల్లాలో ప్రస్తుతం 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఇంత వేడిని తట్టుకుంటూ క్రీడా శిక్షణ పొందడం అంత సులువు కాదు. వేడిమితో శరీరంలోని నీటి శాతం తగ్గడంతో వడదెబ్బ తగలి అనారోగ్యానికి గురయ్యే అవకాశముంది. అందుకే ఆర్యోగాన్ని కాపాడుకునేందుకు పిల్లలు, విద్యార్థులు, యువత.. వారి తల్లిదండ్రులు, శిక్షకులు అందరూ తగు జాగ్రత్తలు పాటించాలి. అప్పుడు శిక్షణ శిక్షగా మారకుండా సాఫీగా సాగుతుంది. - వేసవిలో క్రీడా శిక్షణ.. ఆరోగ్యంపై ప్రభావం - జాగ్రత్తలు పాటిస్తే సరి.. లేకుంటే ఇబ్బందికరం దుస్తులు శిక్షణ పొందే క్రీడాకారులు మందం దుస్తులు ఉపయోగించరాదు. అప్పర్, లోయర్ దుస్తులు, కాటన్ దుస్తులు ఉపయోగించడం శరీరానికి మంచిది. ఒకరోజు వాడిన దుస్తులను మరుసటి రోజు వేసుకోరాదు. ప్రస్తుత ఉష్ణోగ్రతలకు ఏ రోజుకారోజు దుస్తులు ఉతికినవే ధరించాలి. వాతావరణం మారుమూల ప్రాంతాలు, అటవీ ప్రాంతాల్లో వాతావరణం కాస్త చల్లగా ఉన్నా మిగితా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత సుమారు 45 డిగ్రీలు దాటి ఉంటోంది. రాత్రి సుమారు తొమ్మిది గంటల వరకు కూడా వాతావరణం వేడిగానే ఉంటోంది. ఇంతటి అత్యధిక వేడిలో ఆటలు ఆడటం, ఈత కొట్టడం, నృత్యం నేర్చుకోవాలంటే జాగ్రత్తలు కూడా అవసరమే. ఉదయం పదకొండు గంటల లోపు, సాయంత్రం ఐదు గంటల తరువాత క్రీడల్లో శిక్షణ తీసుకోవడం ఆరోగ్యానికి మేలు. ఉదయం శిక్షణ పొందిన వారు మధ్యాహ్నం కొద్దిసేపు నిద్రిస్తే శరీరానికి హాయి కలుగుతుంది. గ్లూకోజ్ గ్లూకోజ్ పొడిని నీటిలో కలుపుకొని తాగితే శరీరానికి అదనపు శక్తి సమకూరుతుంది. కొందరు తింటారు. ఇలా చేస్తే శరీరంలోని నీటి శాతం తగ్గిపోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. గ్లాసెడు నీటిలో ఒక చెంచా పొడి కలిపి ఉదయం, సాయంత్రం తాగితే సరిపోతుంది. ఆహారం ఆకు కూరలు, కూరగాయలు, మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం మేలు. వీటితో పాటు నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు, పండ్ల రసాలు తీసుకోవడం మరువరాదు. తాగునీరు ఉదయం పూట శిక్షణకు వెళ్లే క్రీడాకారులు తగినంత నీరు తాగాలి. వెంట తప్పనిసరిగా నీరు ఉండాలి. ఉదయం పూట అరటి పండు తింటే శరీరంలో విటమిన్ లోపం తలెత్తదు. శిక్షణ ముగిసే వరకు ప్రతి రోజు పుచ్చకాయ తినడం శరీరానికి చాలా మంచిది. దీనిలో 90 శాతం నీరు ఉంటుంది. సామర్థ్యాన్ని మించరాదు శరీరం శక్తి సామర్థాలకు మించి శిక్షణ పొందరాదు. సామర్థ్యానికి మించి సాధన చేయకుండ ఆటలో నైపుణ్యం పెంచుకోవాలి. పోటీ పడి అధిక బరువులు ఎత్తడం, ఎక్కువ దూరం పరుగెత్తడం, వ్యాయామం చేయడం వలన శరీరంలోని నీటి శాతం తగ్గి కోలుకోలేని స్థితికి చేరుకుంటాం. అతి వేగంగా ఆటలు ఆడి వెంటనే నీరు తాగడం శ్రేయస్కరం కాదు. నాట్యంలో శిక్షణ పొందే వారికి శ్రమ అధికంగా ఉంటుంది కాబట్టి నీటిని అధికంగా తీసుకోవడంతో పాటు, మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరులో ఏదో ఒకటి తప్పనిసరిగా ప్రతి రోజూ ఉండాలి. చల్లని నీటితో స్నానం శిక్షణ పొందిన క్రీడాకారులు ఉదయం, సాయంత్రం చల్లని నీటితో స్నానం చేస్తే ఆరోగ్యానికి మంచిది. ఎండలో చల్లని నీటితో స్నానం చేయరాదు. నీడ వసతి ఉన్న చోటనే చల్లని నీటితో ఎక్కువ సేపు స్నానం చేయాలి. చెరువుల్లో ఎండ పూట ఈత కొట్టరాదు. ఉదయం పదకొండు, సాయంత్రం ఐదు గంటల తరువాత ఈత కొలనులో శిక్షణ పొందాలి. నిపుణుల సలహాలు పాటించాలి వేసవిలో వివిధ క్రీడల్లో శిక్షణ పొందడం మంచి అవకాశం. ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ క్రీడల్లో నైపుణ్యం పెంచుకోవాలి. సాధన ఒకేసారి కాకుండా నెమ్మదిగా పెంచాలి. అధిక ఉష్ణోగ్రతలో సాధనను ఒకేసారి వేగవంతం చేయరాదు. శరీర సామర్థ్యం ఆసరాతోనే క్రీడల్లో శిక్షణ పొందాలి. బలహీన క్రీడాకారులు వేసవిలో శిక్షణకు దూరంగా ఉండటమే మేలు. ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు శిక్షణలో నిపుణుల సలహాలు తప్పక పాటించాలి. - కనపర్తి రమేశ్, క్రీడా శిక్షకుడు