uttam padmavathi
-
అధికారులపై ఉత్తమ్ పద్మావతి ఆగ్రం
-
హుజూర్‌నగర్‌లో గెలిచేది పద్మావతినే..
సాక్షి, హైదరాబాద్: హుజూర్నగర్ ఉప ఎన్నికలో.. రాజకీయ పార్టీలు ఏ అభ్యర్థికి టిక్కెట్ ఇచ్చినా.. కాంగ్రెస్‌కు ఎవరు పోటీ కాదని, కచ్చితంగా ఉత్తమ్ పద్మావతి రెడ్డి భారీ మెజారిటీతో గెలుస్తారని ఏఐసీసీ ఇంఛార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్సీ కుంతియా అన్నారు. గురువారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు ప్రచారం కోసం గాంధీజీ కళ్ళద్దాలను, గాంధీ పేరును వాడుకుంటారు కానీ, గాడ్సేకు గుడి కడతారని ఎద్దేవా చేశారు. పార్లమెంటు ఎన్నికలలో టీఆర్ఎస్ ఏడు ఎంపీ సీట్లు ఓడిపోవడంతో.. హుజూర్నగర్ ఉప ఎన్నికలో ఆ పార్టీ భయపడుతుందని కుంతియా వ్యాఖ్యానించారు. అందుకే సీపీఐ మద్దతు కోరుతోందని అన్నారు. ఇంతకు ముందు అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కోదాడలో కుట్ర చేసి ఓడించిందని కుంతియా పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో టీఆర్ఎస్ ఓడిపోతుందనీ, తమ పార్టీ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్ రెడ్డిలు ప్రచారం చేసి పద్మావతి రెడ్డిని గెలిపిస్తారన్నారు. -
హలో సర్పంచ్... చలో హుజూర్ నగర్
సాక్షి, హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఉప ఎన్నికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా హుజూర్ నగర్లో రాజకీయం మరింత వేడెక్కింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పద్మావతి రెడ్డి గురువారం ఒక సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు టీఆర్ఎస్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి ఈ నెల 30న నామినేషన్ వేయనున్నారు. ఈ నేపథ్యంలో 'హలో సర్పంచ్.. చలో హుజుర్నగర్' పేరుతో ప్రధాన పార్టీలకు రాష్ట్ర సర్పంచుల సంఘం ...ప్రధాన పార్టీలకు పోటీగా బరిలోకి దిగబోతోంది. హుజుర్ నగర్ స్థానం నుంచి తాము పోటీ చేయనున్నట్లు రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రకటించింది. ప్రభుత్వ తీరుకు నిరసనగా... ఉప ఎన్నికల బరిలో మొత్తం 251మంది సర్పంచులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక 2018 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 17మంది పోటీ చేశారు. అందరికీ కలిపి 1,92,844 ఓట్లు పడ్డాయి. అయితే అన్ని పార్టీలో ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి తమ సత్తా తేల్చుకునేందుకు సై అంటున్నా...ప్రధాన పార్టీల మధ్యనే గెలుపు ఓటములు ఉండనున్నాయి. కాగా ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పెద్ద ఎత్తున పసుపు రైతులు ఎన్నికల్లో పోటీ చేసిన విషయం తెలిసిందే. పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు పసుపు, ఎర్రజొన్న పంటలకు మద్దతు ధర పెంపు కోసం నిజామాబాద్ లోక్‌సభ స్థానం నుంచి 236మంది రైతులు నామినేషన్లు వేశారు. కాగా ఇలా మూకుమ్మడిగా నామినేషన్లు వేయడంతో తెలంగాణలో ఇదే మొదటిసారి కాదు. 1996 ఎన్నికల్లో తమ ప్రాంతానికి సాగు, తాగు నీటిని కల్పించాలని జలసాధన సమితి నేతృత్వంలో నల్లగొండ పార్లమెంట్ స్థానానికి ఏకంగా 515 మంది నామినేషన్లు వేశారు. -
మోగిన ఉప ఎన్నిక నగారా !
సాక్షి,సూర్యాపేట : జిల్లాలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. హుజూర్నగర్ నియోజకవర్గానికి సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తదుపరి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నల్లగొం డ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. ఆ తర్వా త ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ స్థానానికి ఉప ఎన్ని అనివార్యమైంది. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు శని వారం షెడ్యూల్ విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనుండగా తెలంగాణలో ఏకైక స్థానం హుజూర్‌నగర్‌కు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానం మళ్లీ దక్కించుకోవాలని కాంగ్రెస్, గులాబీ జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పావులు కదుపుతున్నాయి. గతంలో ఈ స్థానం నుంచి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ఎంపీగా పోటీ చేసి ఈ నియోజకవర్గం నుంచి 11 వేల ఓట్లపై చిలుకు మెజార్టీ సాధించారు. ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి పద్మావతిని బరిలోకి దింపారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తమ్‌పై శానంపూడి సైదిరెడ్డి ఈ స్థానంలో పోటీచేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మళ్లీ అయన్నే అభ్యర్థిగా ముఖ్య మంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో వచ్చే నెల 21న నియోజకవర్గ ఓటర్లు ఎవరికి పట్టం కడతారోనని రాష్ట్ర మొత్తం ఈ నియోజకవర్గం వైపే చూస్తోంది. ఈ ఎన్నిక ప్రధాన పార్టీలైన టీఆర్ఎస్, కాంగ్రెస్‌కు బిగ్ ఫైట్‌గా మారింది. షెడ్యూల్ ఇలా.. ఈనెల 23న ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్‌ను స్వీకరించనున్నారు.అక్టోబర్ 1న నామినేషన్ల పరిశీలన, అక్టోబర్ 3 వరకు ఉపసంహరణ జరగనుంది. అక్టోబర్ 21న పోలింగ్ నిర్వహించి.. 24వ తేదీన కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. నోటిఫికేషన్లో నామినేషన్ల ఉపసంహరణ, ఎన్నికల నియామవళికి సంబంధించిన అంశాలన్ని వివరంగా పేర్కొననున్నారు. షెడ్యూల్ రావడంతో జిల్లా వ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల్లో పొలిటికల్ హీట్ పెరిగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ అభ్యర్థులును ప్రకటించడంతో ఈ స్థానంలో పోటీ చేసే ందుకు బీజేపీ, వామపక్షాలు కూడా సై అంటున్నాయి. మూడు, నాలుగు రోజుల్లో తమ అ భ్యర్థులను ఆపార్టీలు ప్రకటించే అవకాశం ఉంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పద్మావతి హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కోదాడ మాజీ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతిని ఆపార్టీ ఇప్పటికే ప్రకటించింది. గతంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కోదాడ నియోజకవర్గం నుంచి 1999, 2004లో, హుజూర్నగర్ నుంచి 2009, 2014, 2018లో మొత్తం ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలు పొందారు. 2018 డిసెంబర్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉత్తమ్ 7 వేల పైచిలుకు ఓట్ల మె జార్టీతో టీఆర్ఎస్పై గెలుపొందారు. అదేవిధంగా ఆయన ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంలో ఈ నియోజకవర్గంలో వచ్చిన ఓట్ల మెజార్టీనే కీలకమైంది. 11 వేల పైగా ఓట్ల మెజార్టీ ఈ నియోజకవర్గంలో ఆయనకు దక్కిం ది. అటు అసెంబ్లీ, ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో నియోజకవర్గ ఓటర్లు తమ వైపే ఉన్నారని ఖ చ్చితంగా ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థే విజయం సాధిస్తుందనే ధీమాతో కాంగ్రెస్ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా శానంపూడి.. గత అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన టీఆర్ఎస్ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే భావనతో గతంలో ఓటమి పొందిన శానంపూడి సైదిరెడ్డికే మరో అవకాశం కల్పించారు. ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదలైన కొద్ది గంటల్లోనే ఆయన్ను పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. షెడ్యూల్ విడుదలైన వెంటనే సీఎం ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల జోరుగా పార్టీలో చేరికలు జరిగాయని, ఈ సారి విజయం తమదేనని టీఆర్ఎస్ ధీమా వ్యక్తంచేస్తోంది. విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి హైదరాబాద్‌లో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించుకొని జిల్లాలో క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమన్నారు. సైదిరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించడం, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో టీఆర్ఎస్ శ్రేణులు బాణా సంచా కాల్చి ఆనందం వ్యక్తం చేశాయి. నేటి నుంచి ఎన్నికల కోడ్ అమలు.. షెడ్యూల్ విడుదల కావడంతో సూర్యాపేట జిల్లావ్యాప్తంగా నేటినుంచి ఎన్నికల కోడ్ అమలులోకి రానున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ ప్రకటించారు. ఈనెల 23న నోటిఫికేషన్ విడుదల కానుండడంతో నేటి నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రానున్నట్లు తెలిపారు. 2019 జనవరి 1 నాటికి ఓటర్లజాబితా ప్రకారం ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉప ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో మంత్రులు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనరాదని, జిల్లా వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు చేపట్టరాదని తెలిపారు. హుజూర్నగర్ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున పటిష్ట బందోబస్తు చర్యలు చేపడతామని, మద్యం, డబ్బు సరఫరాపై నిఘా ఉంచనున్నామని తెలిపారు. సి విజిల్ యాప్ ద్వారా ఎన్నికల నియమావళి ఉల్లంఘనపై ఫిర్యాదు చేయవచ్చన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ ఓటర్లు.. హుజూర్నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా గత ఎన్నికల్లో 302 పోలింగ్ కేంద్రాలు కేటాయించారు. నియోజకవర్గంలో 2లక్షల 35వేల 308 మంది ఓటర్లుండగా లక్ష 15వేల 626 మంది పురుషులు, లక్ష 19వేల 682 మంది స్త్రీలున్నారు -
హుజూర్నగర్ అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
చింతలపాలెం(హుజూర్నగర్): సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నలమాద పద్మావతి పోటీ చేస్తారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. శనివారం సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని నక్కగూడెంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలోని కార్యకర్తల అభిప్రాయం ప్రకారం పద్మావతి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ఫైనల్ చేసిందని చెప్పారు. ఇందులో ఎటువంటి అనుమానాలకు తావులేదని స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా ఉత్తమ్ గెలవడంతో ఆ స్థానంలో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌తో పాటు అధికార టీఆర్ఎస్ కూడా హుజూర్నగర్ స్థానాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. -
ఉత్తమ్ పద్మావతిపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి
మునగాల: నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతిపై సీపీఎం కార్యకర్తలు ఆదివారం చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మునగాల మండలం నర్సింహులగూడెం వెళ్లారు. అక్కడ ఇటీవల హత్యకు గురైన సీపీఎం నాయకుడు సతీమణి విజయలక్ష్మి పద్మావతిని ఆపింది. తమ గ్రామంలో కాంగ్రెస్, సీపీఎం పార్టీల మధ్య ఘర్షణలు ఆపాలని నీ భర్త ఉత్తమ్ ఇరుపార్టీల మధ్య రాజీ కుదిర్చిన తర్వాత కూడా... కాంగ్రెస్ వాళ్లు తన భర్త పులీందర్‌రెడ్డిని ఎందుకు హత్య చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని నిలదీసింది. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఘర్షణను నివారించేందుకు వాహనంపై ఉన్న పద్మావతి కిందకు దిగింది. ఈ దశలో సీపీఎం కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లు, టమాటాలతో దాడికి దిగారు. ఈలోగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పద్మావతిని నర్సింహులగూడెంలో ప్రచారం నిర్వహించకుండా పక్క గ్రామమైన జగన్నాథపురం తరలించారు. -
ఉత్తమ్ పద్మావతిపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి
మునగాల, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతిపై సీపీఎం కార్యకర్తలు ఆదివారం చెప్పులు, కోడిగుడ్లతో దాడిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మునగాల మండలం నర్సింహులగూడెం వెళ్లారు. ఇటీవల హత్యకు గురైన సీపీఎం నాయకుడు సతీమణి విజయలక్ష్మి పద్మావతిని ఆపారు. కాంగ్రెస్ వాళ్లు తన భర్త పులీందర్‌రెడ్డిని ఎందుకు హత్య చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ దశలో సీపీఎం కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.