ఉత్తమ్ పద్మావతిపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి | sandals, egg attack on uttam padmavati | Sakshi
Sakshi News home page

ఉత్తమ్ పద్మావతిపై చెప్పులు, కోడిగుడ్లతో దాడి

Published Mon, Apr 21 2014 2:57 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

sandals, egg attack on uttam padmavati

మునగాల, న్యూస్‌లైన్: నల్లగొండ జిల్లా కోదాడ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఉత్తమ్ పద్మావతిపై సీపీఎం కార్యకర్తలు ఆదివారం చెప్పులు, కోడిగుడ్లతో దాడిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మునగాల మండలం నర్సింహులగూడెం వెళ్లారు. ఇటీవల హత్యకు గురైన సీపీఎం నాయకుడు సతీమణి విజయలక్ష్మి పద్మావతిని ఆపారు. కాంగ్రెస్ వాళ్లు తన భర్త పులీందర్‌రెడ్డిని ఎందుకు హత్య చేశారని, దీనిపై వివరణ ఇవ్వాలని నిలదీశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ దశలో సీపీఎం కార్యకర్తలు చెప్పులు, కోడిగుడ్లతో దాడికి దిగారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement