Vaira MLA
-
'పార్టీ కార్యకర్తలు తాలిబన్లు, నక్సలైట్లుగా ఉద్యమించాలి'
-
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
-
వైరా ఎమ్మెల్యేపై వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: టీఆర్ఎస్ లో చేరిన ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోతు మదన్‌లాల్ పై అనర్హత వేటు వేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారిని కలిసి వైఎస్ఆర్ సీసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి టీఆర్ఎస్ లో చేరిన మదన్‌లాల్ పై ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకోవాలని కోరారు. మదన్‌లాల్ టీఆర్ఎస్ లో చేరినట్టుగా స్పీకర్ కు ఆధారాలు సమర్పించారు. అన్ని విషయాలు పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటానని స్పీకర్ తమకు హామీయిచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకులు తెలిపారు. స్పీకర్ ను కలిసిన వారిలో జనక్‌ప్రసాద్, శివకుమార్, కొండా రాఘవరెడ్డి, నల్లా సూర్యప్రకాశ్ ఉన్నారు. -
అసెంబ్లీలో అడుగు.. ఓ మధుర జ్ఞాపకం
వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ వైరా: ‘కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త శాసనసభ..తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఓ మధురానుభూతిని మిగిల్చింది..’ అని వైరా ఎమ్మెల్యే బా ణోత్ మదన్‌లాల్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ విలేకరితో మాట్లాడారు. ‘అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ క్షణం ఓ మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ క్షణాన ఎంతో భావేద్వేగానికి లోనయ్యాను. స్వరాష్ట్రంలో బాధ్యతను గుర్తెరిగి నడుచుకుంటాను. అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. రెండు ప్రాంతాల్లోనూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కష్టపడాలి. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అసెంబ్లీ బయట, లోపల ఎండగడతాం. ప్రజామోద నిర్ణయాలను స్వాగతిస్తాం. ఈ ఐదేళ్లూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ నిర్మాణంలో తనదైన ముద్రవేస్తుంది’. -
ఎప్పటికీ జగన్ నాయకత్వంలోనే ఉంటా...
ఖమ్మం: వైఎస్సార్ సీపీ తరఫున ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తాము ఎప్పటికీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోనే పని చేస్తామని, పార్టీ మారాల్సిన అవసరం తమకు లేదని ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ స్పష్టం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులైన తమపై కావాలనే కుట్రపూరితంగా కొన్ని శక్తులు దుష్ర్పచారం చేస్తున్నాయని అన్నారు. జిల్లా కేంద్రంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధన కోసమే మొదటి నుంచి వైఎస్సార్ సీపీలో అంకితభావంతో పని చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో మూడు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ స్థానం గెలిచి వైఎస్సార్ సీపీ జిల్లాలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందన్నారు. జిల్లా పార్టీని బలోపేతం చేసేందుకు మరింతగా కృషి చేస్తున్నామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని కొన్ని శక్తులు ఇలాంటి ప్రచారం చేయడం తగదని హితవు పలికారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుతం జగన్‌తో కలిసి ఢిల్లీలోనే ఉన్నారని చెప్పారు. పోడు భూములు సాగుచేసుకుంటున్న గిరిజనులకు రాజన్న ముఖ్యమంత్రిగా ఉండగా పట్టాలు ఇచ్చి ఆదుకున్నారని, దీంతో ప్రజలు జిల్లాలో వైఎస్సార్సీపీని ఆదరించారన్నారు. 2019లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గిరిజన ప్రజాప్రతినిధులను అవమానించే విధంగా కథనాలు ప్రచురించే పత్రికలపై చట్టపరమైన చర్యలకు సైతం వెనుకాడేది లేనది హెచ్చరించారు.