
అసెంబ్లీలో అడుగు.. ఓ మధుర జ్ఞాపకం
వైరా ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్
వైరా: ‘కొత్త రాష్ట్రం, కొత్త ప్రభుత్వం, కొత్త శాసనసభ..తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టడం ఓ మధురానుభూతిని మిగిల్చింది..’ అని వైరా ఎమ్మెల్యే బా ణోత్ మదన్‌లాల్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఆయన ‘సాక్షి’ విలేకరితో మాట్లాడారు. ‘అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆ క్షణం ఓ మధురజ్ఞాపకంగా మిగిలిపోతుంది. ఆ క్షణాన ఎంతో భావేద్వేగానికి లోనయ్యాను.
స్వరాష్ట్రంలో బాధ్యతను గుర్తెరిగి నడుచుకుంటాను. అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తాను. రెండు ప్రాంతాల్లోనూ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వాలు కష్టపడాలి. ప్రభుత్వం తీసుకునే ప్రజావ్యతిరేక నిర్ణయాలను అసెంబ్లీ బయట, లోపల ఎండగడతాం. ప్రజామోద నిర్ణయాలను స్వాగతిస్తాం. ఈ ఐదేళ్లూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రీయాశీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ నిర్మాణంలో తనదైన ముద్రవేస్తుంది’.