Vajrapu Kotturu
-
హమ్మ తొండా.. ఎంత పనిచేశావే!
వజ్రపుకొత్తూరు రూరల్: బుధవారం ఉదయం 8.30 గంటల సమయం.. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని 15 గ్రామాలకు ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఎండ వేడి ఓ వైపు.. ఉక్కపోత మరోవైపు.. వెంటనే పలువురు వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సమాచారమిచ్చారు. తమవైపు నుంచి ఎలాంటి సమస్య లేకపోవడంతో.. ఐదుగురు లైన్మెన్లు, సచివాలయ విద్యుత్ సిబ్బంది రంగంలోకి దిగి లైన్లను తనిఖీ చేయడం ప్రారంభించారు. గంట సమయం గడిచినా సమస్య ఏంటనేది మాత్రం తేలలేదు. కిడిసింగి గ్రామం నుంచి మొదలైన వీరి అన్వేషణ డోకులపాడు వరకు సాగింది. చివరకు రెండున్నర గంటల తర్వాత డోకులపాడులోని చర్చి వద్దనున్న స్తంభంపైన అసలు విషయం బయటపడింది. తీగల మధ్య ఓ తొండ చిక్కుకుపోవడాన్ని గుర్తించిన సిబ్బంది.. దాన్ని తొలగించి సరఫరాను పునరుద్ధరించారు. ఈ విషయం తెలసుకున్న స్థానికులు ‘హమ్మ తొండా.. ఎంత పని చేశావే!’ అంటూ నవ్వుకున్నారు. -
అలా అయితేనే ఆడ తాబేళ్లు పుడతాయి!
క్షీర సాగర మథనం నిర్విఘ్నంగా పూర్తి కావడానికి శ్రీమహావిష్ణువు కూర్మరూపంలో అవతరించగా.. ఆ రూపాన్ని మరెక్కడా లేని తీరులో మూలవిరాట్టుగా ప్రతిష్టించి అర్చిస్తున్న విశిష్టత మన జిల్లాలో గోచరిస్తుంది. ఆధ్యాత్మిక భావానికి పరాకాష్టగా కూర్మనాథుడి ఆరాధనను చెప్పుకుంటే.. ఈ కాలంలో అందుకు ఏమాత్రం తీసిపోని మరో మానవీయ సేవ తీరప్రాంతంలో నిర్విఘ్నంగా సాగిపోతోంది. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతిని పరిరక్షించడానికి.. వాటి గుడ్లను సేకరించి.. ప్రత్యేకించి పొదిగించి.. మళ్లీ సముద్రంలో లక్షలాది చిరుజీవులను విడిచిపెట్టే గొప్ప ప్రయత్నం నిరతం సాగుతోంది. అటవీ శాఖ, ట్రీ ఫౌండేషన్ చేస్తున్న ఈ మంచి ప్రయత్నం సముద్రం చేయూతతో ప్రశంసనీయ రీతిలో నడుస్తోంది. వజ్రపుకొత్తూరు రూరల్: అరుదైన ఉభయచర జీవుల్లో ఆలివ్ రిడ్లే తాబేలు ఒకటి. జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశ సముద్ర జలాల్లో అధికంగా కనిపించే ఈ రకమైన కూర్మాలు కేవలం గుడ్లు పెట్టేందుకు మన సముద్ర తీరానికి చేరుకుంటాయి. రాత్రి సమయంలో తీరంలోని ఇసుక తిన్నెల్లో గుడ్లు పెట్టి సముద్ర జలాల్లోకి జారుకుంటాయి. భద్రంగా కాపాడుతూ.. జిల్లాలోని 193 కి.మీ. విశాల సముద్ర తీర ప్రాంతం ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంతతికి నిలయంగా నిలుస్తోంది. 16 హ్యచరీలు(తాబేళ్ల సంరక్షణ కేంద్రాలు)ను అటవీ శాఖ అధికారులు, ట్రీ ఫౌండేషన్ ప్రతినిధులు సంయుక్తంగా ఏర్పాటు చేసి అరుదైన తాబేళ్లకు జీవం పోస్తున్నారు. ఇవి అంతరించిపోకుండా జిల్లా వ్యాప్తంగా 41 మంది వలంటీర్లను నియమించి వారి ద్వారా గుడ్లను సేకరిస్తున్నారు. తల్లి తాబేళ్లు ఇసుక తిన్నెలలో పెట్టిన గుడ్లు.. పక్షులు, జంతువులు, దొంగల బారిన పడకుండా సురక్షితంగా భద్రపరుస్తున్నారు. రాత్రి సమయం కీలకం.. ఏటా జనవరి నుంచి మార్చి వరకు తల్లి తాబేళ్లు గుడ్లు పెట్టే సమయం. రాత్రి 2 నుంచి వేకువజాము 5.30 గంటలలోపు తీరానికి చేరుకుని ఇసుక తిన్నెలలో బొరియలు చేసి గుడ్లును పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఒక్కో తాబేలు 30–140 వరకు గుడ్లు పెడతాయి. 28–30 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగిన పిల్లలు మగ తాబేళ్లుగా.. 30–32 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద పొదిగినవి ఆడ తాబేళ్లుగా పుడతాయి. ఇక జిల్లా వ్యాప్తంగా 16 హ్యాచరీలు ఉన్నాయి. వజ్రపుకొత్తూరు సెక్షన్: వజ్రపుకొత్తూరు, మెట్టూరు బారువ సెక్షన్: కళింగపట్నం, గడ్డివూరు, బట్టి గల్లూరు, బారువ, ఇసకలపాలెం కవిటి సెక్షన్: డొంకూరు, చేపల కపాసుకుద్ది, బట్టివానిపాలెం శ్రీకాకుళం సెక్షన్: కొచ్చెర్ల, కనుగులవానిపేట టెక్కలి సెక్షన్: గుళ్లవాని పేట, కుందివానిపేట, మేఘవరం, భావనపాడు తీరాలలో సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 25 లక్షల పిల్లలను సంరక్షించాం.. సముద్ర తాబేళ్ల సంతతిని పెంచడానికి కృషి చేస్తున్నాం. అటవీ శాఖతో కలిసి మా ట్రీ ఫౌండేషన్ పని చేస్తూ తాబేళ్లను సంరక్షిస్తున్నాం. గత పదేళ్లగా దాదాపు 25 లక్షల బుల్లి తాబేళ్లలను సురక్షితంగా సముద్రంలో విడిచి పెట్టాం. – కోడ సోమేష్, ట్రీ ఫౌండేషన్ జిల్లా కో ఆర్డినేటర్ సంరక్షణకు ప్రత్యేక చర్యలు ఆలివ్ రిడ్లే తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. హ్యచరీల వద్ద ప్రత్యేకంగా నియమించిన వలంటీర్ల ద్వారా వేలాది సంఖ్యలో తాబేళ్ల గుడ్లను సేకరిస్తున్నాం. వలంటీర్లకు నెలకు రూ.9,200 గౌరవ వేతనం అందిస్తున్నాం. – రజనీకాంతరావు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, కాశీబుగ్గ రేంజ్ -
రెండేళ్ల బాలికపై 14 ఏళ్ల బాలుడి నిర్వాకం
-
రెండేళ్ల బాలికపై లైంగిక దాడి
వజ్రపుకొత్తూరు: ఓ పదమూడేళ్ల బాలుడు రెండేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం పరిది బెండి గ్రామంలో చోటుచేసుకుంది. ఘటనపై బాలిక తాతయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. వజ్రపుకొత్తూరు ఎస్ఐ కేవీ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం..భర్తతో విభేదాల కారణంగా బాలిక తల్లి కొంత కాలంగా బెండిలోని కన్నవారి ఇంటి వద్ద ఉంటోంది.అదే గ్రామంలో పోలాకి మండలానికి చెందిన 13 ఏళ్ల బాలుడు బంధువుల ఇంటి వద్ద ఉంటూ బెండి ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి బాలుడు చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో బుధవారం వజ్రపుకొత్తూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు విచారించి బాలుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాశీబుగ్గ డీఎస్పీ బి. ప్రసాదరావు పూర్తిస్థాయి దర్యాప్తు చేయనున్నారు. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం కావలి అర్బన్: ఐదేళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మంగళవారం సాయంత్రం వైకుంఠపురం సమీపంలోని అటవీ ప్రాంతంలో జరిగింది. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసు స్టేషన్ సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేశారు. సీఐ కథనం మేరకు వైకుంఠపురం సమాధుల దర్గా ప్రాంతానికి చెందిన దంపతులకు కుమార్తె ఉంది. ఆ పక్కనే ఉన్న చేవూరివారి తోటకు చెందిన చిట్యాల మణి అనే యువకుడు పట్టణంలో తోపుడు బండిపై మొక్కజొన్న కంకులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. బాధిత చిన్నారి అమ్మ తమ్ముడితో మణి స్నేహం చేస్తూ తరచూ ఆమె ఇంటికి వెళ్తుండేవాడు. మంగళవారం ఆమె ఇంటికి వెళ్లగా ఇంట్లో ఎవరూ లేరు. అంగట్లో తినే వస్తువులు కొనిస్తానని చిన్నారికి మాయమాటలు చెప్పి తన బైక్పై ఎక్కించుకుని వైకుంఠపురం సమీపాన ఉన్న అటవీ ప్రాంతం జామాయిల్ చెట్లలోకి తీసుకెళ్లాడు. అక్కడ చిన్నారిని కర్రతో కొట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారి కేకలు వేయడంతో అక్కడే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చాడు. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి చిన్నారి ఒంటరిగా ఏడుస్తుండడాన్ని గమనించాడు. తన బైక్పై ఎక్కించుకుని చిన్నారి ఇంటి వద్ద వదిలి వెళ్లిపోయాడు. చిన్నారి నొప్పులతో ఏడుస్తుండగా అడిగిన తల్లికి జరిగిన విషయం వివరించింది. తల్లిదండ్రులు మంగళవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చిన్నారికి ఏరియా వైద్యశాలలో వైద్య పరీక్షలు నిర్వహించారు. బాలికపై అత్యాచారం పాలసముద్రం: ఓ బాలికపై అత్యాచారం జరగడంతో.. ఆ అవమాన భారం భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసుల కథనం మేరకు.. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం ఎస్ఆర్ఆర్ కండ్రిగ పంచాయతీ తొట్టికండ్రిగ దళితవాడకు చెందిన కే.కుమార్ కుమారుడు కే.మునిస్వామి(22)ఈ దారుణానికి పాల్పడ్డాడు. బుధవారం సాయంత్రం అదే గ్రామానికి చెందిన ఓ బాలిక బహిర్భూమికి వెళ్లిన సమయంలో నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేయడంతోపాటు ఆమె పెదవులు కొరికేశాడు. ఆ బాధ భరించలేక ఆమె కేకలు వేసింది. దీంతో గ్రామస్తులు అక్కడికి చేరుకోగా మునిస్వామి పారిపోయాడు. ఆ అవమానం సహించలేక బాలిక ఇంట్లోని కిరోసిన్ ఒంటిపై పోసుకుని నిప్పంటించుకుంది. కుటుంబసభ్యులు గుర్తించి, మంటలు ఆర్పి, వెంటనే తమిళనాడు శోళింగర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు ప్రథమ చికిత్స చేసి తిరుపతి రూయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలిక పరిస్థితి విషమంగా ఉందని రూయా డాక్టర్లు చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రెవెన్యూ సర్వేయర్లను అడ్డుకున్న స్థానికులు
వజ్రపు కొత్తూరు (శ్రీకాకుళం) : భామనపాడు పోర్టు కోసం భూ సర్వేకు వచ్చిన సర్వేయర్లను స్థానికులు అడ్డుకున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలో మంగళవారం మద్యాహ్నం చోటుచేసుకుంది. పోర్టు నిర్మాణానికి సాగు భూములు లాక్కునేందుకు రేపు ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీనిలో భాగంగా మంగళవారం రెవెన్యూ అధికారులు సర్వేకు వచ్చారు. వీరిని స్థానికులు అడ్డుకున్నారు. -
యువతి మౌన పోరాటం
పల్లివూరు (వజ్రపుకొత్తూరు): 8 ఏళ్లు ప్రేమయాణం సాగించి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. తీరా వివాహం చేసుకోవాలని కోరితే మా ఇంటిలో వాళ్లు ఒప్పుకోరు పొమ్మంటున్నాడు అని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది. ప్రియుడితో తనకు పెళ్లి జరిపించాలని ఆమె డిమాండ్ చేసింది. పోలీసులు.. బాధితురాలి తెలిపిన వివరాల ప్రకారం.. వజ్రపుకొత్తూరు మండల పల్లివూరుకు చెందిన దున్న శారద (24) అదే గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (28) ఎనిమిదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెద్దవాళ్లను ఒప్పించి వివాహం చేసుకుందామని నిర్ణయించుకున్నారు. ఈ 8 ఏళ్ల కాలంలో శ్రీనివాసరావు దుబాయ్, మస్కట్ వెళ్లి అక్కడ కొంతకాలం పని చేసి వస్తున్నాడు. ఈ ఏడాది గ్రామానికి వచ్చిన శ్రీనివాసరావుని శారద పెళ్ల్లి చేసుకోవాలని కోరింది. ప్రియుడు నిరాకరించాడు. దీంతో ఆమె ఈ నెల 5న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సకాలంలో ఆమెకు వైద్య సేవలు అందించడంతో కోలుకుంది. ఈ విషయం గ్రామ పెద్దల పంచాయితీ వరకూ వెళ్లింది. పెద్దలు శ్రీనివాసరావును పిలిచి పెళ్లి చేసుకోవాలని, ఆడపిల్లకు అన్యాయం చేయవద్దను నచ్చజెప్పారు. అయినా అతగాడు వినకపోవడంతో సోమవారం శారద ప్రియుడి ఇంటి ముందు బైఠాయించింది. కాగా శ్రీనివాసరావు ముందస్తుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శారద నన్ను వేధిస్తోందంటూ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శారద కూడా పోలీసులకు శ్రీనివాసరావుపై ఫిర్యాదు చేసింది. 8 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నాం తమకు పెళ్లి చేయాలని కోరింది. ఇద్దరి ఫిర్యాదులు స్వీకరించిన వజ్రపుకొత్తూరు ఎస్ఐ కె.రవికిషోర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.