varadayya palem
-
అందుబాటులో లేని కల్కి భగవాన్..
సాక్షి, తిరుపతి : కల్కి భగవాన్ ఆశ్రమాలు, ప్రధాన కార్యాలయాల్లో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాల్లో ఏకకాలంలో విస్తృతంగా తనిఖీలు జరుగుతున్నాయి. కల్కి భగవాన్ ప్రధాన ఆశ్రమం తమిళనాడు పోలీసుల పహారాలో ఉంది. కాగా దాడులు సమయంలో కల్కి భగవాన్, ఆయన సతీమణి పద్మావతి కానీ అందుబాటులో లేరు. చెన్నై నుంగంబాకం ప్రధాన కార్యాలయంలో కల్కి భగవాన్ కుమారుడు కృష్ణ, కోడలు ప్రీతిని ఐటీ అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు చిత్తూరు జిల్లాలోని వరదయ్యపాలెం, బీ ఎన్. కండ్రిగ మండలాల్లో ఉన్న ఆశ్రమాల ట్రస్ట్ నిర్వహాకుడు లోకేష్ దాసాజీతో పాటు మరికొంతమంది సిబ్బందిని రహస్యంగా విచారిస్తున్నారు. ఈ సోదాల్లో వందల కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. అలాగే బినామీల పేరుతో వేల ఎకరాల భూముల క్రయ విక్రయాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. ఇక కల్కి ఆశ్రమాల్లోకి మీడియా ప్రతినిధులకు అనుమతి నిరాకరించారు. కాగా గతంలో కూడా కల్కి భగవాన్ ఆశ్రమంలో జరుగుతున్న వ్యవహారాలపై అనేక ఆరోపణలు వచ్చాయి. ఆశ్రమంలో భక్తులకు మత్తు పదార్థాలు ఇచ్చి వారిని మత్తులో ఉండేలా చేయడంతో పాటు, లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. విజయ్ కుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ తొలినాళ్లలో ఎల్ఐసీలో క్లర్క్‌గా జీవితాన్ని ప్రారంభించి ఆ తర్వాత ఉద్యోగాన్ని వదిలేసి ఓ విద్యాసంస్థను నెలకొల్పారు. అది కాస్తా దివాళా తీయడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. విష్ణుమూర్తి పదో అవతారం కల్కి భగవాన్‌గా చెప్పుకుంటూ విజయ్ కుమార్ 1989లో చిత్తూరు జిల్లాలో ప్రత్యక్షమయ్యారు. స్పెషల్ దర్శనానికి రూ.25వేలు ఆ తర్వాత తన ఆశ్రమ కార్యాకలాపాలను ఏపీతో పాటు తమిళనాడుకు విస్తరించారు. కల్కి భగవాన్ తనతో పాటు భార్య పద్మావతిని దైవాంశ స్వరూపులుగా చెప్పుకునేవారు. వీరి ఆశ్రమానికి దేశంలోని ధనవంతులే కాకుండా విదేశీయులు, ఎన్నారైలు క్యూ కట్టేవారు. కల్కి భగవాన్ సాధారణ దర్శనానికి రూ.5వేలు, ఇక ప్రత్యేక దర్శనం కావాలంటే రూ.25 వేలు చెల్లించుకోవాల్సిందే. ఇక కల్కి భగవాన్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఆయనతో పాటు కల్కి కుమారుడు కృష్ణాజీ కూడా పెద్ద ఎత్తున భూములు ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నట్లు ఫిర్యాదుతో 2010లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. అలాగే 2008లో చిత్తూరు జిల్లాలోని కల్కి ఆశ్రమంలో జరిగిన తొక్కిసలాటలో అయిదుగురు మృతి చెందగా, అనేకమంది గాయపడ్డారు. దీంతో కొద్దిరోజులు ఆశ్రమం మూతపడింది. చదవండి: ‘కల్కి భగవాన్’ పై ఐటీ దాడులు -
సుడిగాలి వీచి చిన్నారి మృతి
సాక్షి, వరదయ్యపాళెం(చిత్తూరు) : బతుకు తెరువు కోసం రాష్ట్రం కానీ రాష్ట్రానికి వచ్చిన వలస కూలీ ఇంట సుడిగాలి విషాదాన్ని నింపింది. శనివారం సుడిగాలి బీభత్సానికి సత్యవేడు మండలం పాలగుంట సమీపంలోని కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమ వద్ద వలస కూలీలు నివాసమున్న రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న 7 ఏళ్ల చిన్నారి అక్కడి కక్కడే మృతి చెందగా మరో 9 మంది పిల్లలు గాయాలపాలయ్యారు. పోలీసుల కథనం మేరకు.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బడేయం జిల్లా, సానఫర్ గ్రామానికి చెందిన 300 మంది వలస కూలీలు కాప్రికార్న్ పరిశ్రమలో రోజువారీ కూలీలుగా పనిచేస్తున్నారు. వీరికి పరిశ్రమ సమీపంలో నివాసం ఉండడానికి తాత్కాలిక రేకుల షెడ్డులను ఏర్పాటు చేశారు. అయితే కూలీలు మాత్రం రోజు లాగానే పరిశ్రమలోనికి పనులకు వెళ్లగా వారి పిల్లలు తాత్కాలిక రేకుల షెడ్డుల వద్ద ఉండగా, ఒక్కసారిగా వచ్చిన సుడిగాలికి రేకుల షెడ్డు కుప్పకూలింది. అందులో ఉన్న ఇరిఫన్ కుమార్తె నిషా (7) తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. అభిషేక్ ఖాన్ (5), సోల్ ఖాన్ (3), ఆకాష్ (16), అస్లాం (11), యాష్మీ (10), దీపక్ చౌదరి (36), సహానా (11), సతీష్ (27), జుపేదా (8) గాయపడ్డారు. క్షతగాత్రులను సత్యవేడు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించి, వైద్యసేవలు అందించారు. గాయపడిన వారందరూ క్షేమంగానే ఉన్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ మల్లికార్జున సంఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం..బాధాకరం: ఎమ్మెల్యే ఆదిమూలం కాప్రికార్న్ జ్యూస్ పరిశ్రమలో జరిగిన ప్రమాదం బాధాకరమని స్థానిక ఎమ్మెల్యే ఆదిమూలం విచారం వ్యక్తం చేశారు. వలస కూలీలల కుటుంబ సభ్యులు 9 మంది గాయపడడం, మరో చిన్నారి మృతి చెందడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పరిశ్రమ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని సత్యవేడు ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించారు. -
‘నోట్ల’ దొంగలు దొరికారు
వరదయ్యుపాళెం, న్యూస్‌లైన్: జిల్లాలో సంచలనం సృష్టించిన దొంగనోట్ల కేసును పోలీసులు ఛేదించారు. పుత్తూరు డీఎస్పీ అరీఫుల్లా నేతృత్వంలో సత్యవేడు సీఐ రవివునోహరాచారి, వరదయ్యుపాళెం ఎస్ఐ వంశీధర్ తవు సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి పలు చోట్ల గాలింపు, విచారణ జరిపి 9వుంది నిందితులను అరెస్ట్ చేసి, రూ.17,500 నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. కంప్యూటర్, ప్రింటర్‌ను సీజ్ చేశారు. పోలీసుల కథనం మేరకు.. పుత్తూరు పట్టణానికి చెందిన సురేష్ పాత నేరస్తుడు. తమిళనాడులోని తిరువళ్లూరులో నేరస్తుడు గుణతో కలిసి సురేష్ దొంగనోట్లు చెలావుణి చేసేవాడు. తమిళనాడు పోలీసులు గుణను అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సురేష్ తన మకాం పుత్తూరుకు వూర్చాడు. 8 నెలల క్రితం సురేష్ హైదరాబాదుకు చెందిన హరితో కలసి కంప్యూటర్ సహాయుంతో స్వంతంగా దొంగనోట్ల వుుద్రణ చేపట్టాడు. సత్యవేడుకు చెందిన బాలక్రిష్ణ, సుకువూర్, వెంకటేశ్వర్లు, వరదయ్యుపాళెంకు చెందిన బాబు, అరవణ, ఆలీబాయ్తో కలసి స్థానికంగా దొంగనోట్లు చెలావుణి చేసేవారు. పక్కా సవూచారంతో ఈనెల 18వతేదీ తెల్లవారుజామున 3గంటల సవుయుంలో దొంగనోట్ల వుుఠాపై దాడి చేసి సత్యవేడు, వరదయ్యుపాళెం పోలీసులు అనువూనితులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టి మొత్తం 9వుందిని అరెస్ట్ చేసి వుంగళవారం సత్యవేడు సబ్‌జైలుకు తరలించారు. జల్సాలకు అలవాటు పడి.. దొంగనోట్ల చెలావుణి కేసులో పట్టుబడిన వారంతా 25సంవత్సరాల వయుస్సు కలిగిన యుువకులే. జల్సాలకు, విలాసాలకు అలవాటు పడ్డ 9వుంది యుువకులు చెడు సావాసాలకు గురై కొంతకాలంగా పథకం ప్రకారం రూ.100 నకిలీ నోట్లను చెలావుణి చేసేవారు. అక్రవుంగా సంపాదించిన సొమ్ముతో విలాసంగా గడిపేవారు.