భారీగా అరటి, బొప్పాయి తోటలు నేలమట్టం
రైల్వే కోడూరు: వర్దా తుపాను కారణంగా వైఎస్సార్జిల్లాలో రైతులకు భారీగా నష్టం వాటిల్లింది. రైల్వే కోడూరు మండలంలో అరటి, బొప్పాయి తోటలు నేలకురాయి. సుమారు 1200 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలు నేలమట్టమయ్యాయి.
రూ.2 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు. కాగా, దెబ్బతిన్న పంటలను స్థానిక ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మంగళవారం పరిశీలించారు. ఆయన వెంట పలువురు వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు.