Varsova - Andheri - ghatkopar
-
నగర ‘మెట్రో’ భద్రతకు నీళ్లు
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భారీ వర్షం కారణంగా మెట్రో బోగీలలోని ఏసీ గ్రిల్ నుంచి వర్షపు నీరు లోపలికి రావడంతో ప్రయాణికులు తడిసి ముద్దవుతున్నారు.. ఇదే సమస్య ఈ నెల ఐదో తేదీన కూడా ఎదురైంది. బోగీల లోపల వర్షపు నిలిచిపోయింది. మరోపక్క కొన్ని మెట్రో స్టేషన్లో బ్యాగులు స్కానింగ్ చేసే యంత్రాలు, లిఫ్టులు, ఎస్కలేటర్లు సరిగా పనిచేయడం లేదు. ముఖ్యంగా ప్రయాణికుల బ్యాగులు కచ్చితంగా స్కానింగ్ చేయాలి. కానీ అప్పుడప్పుడూ సాంకేతిక లోపంతో ఈ యంత్రాలు పనిచేయడం లేదు. మెట్రో భద్రత గాలిల్లో కలిసిపోయింది. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్ మధ్య తరచూ.. వర్సోవా-అంధేరీ-ఘాట్కోపర్‌ల మధ్య ప్రవేశపెట్టిన మెట్రో రైళ్లలో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఇదివరకే సీరియస్‌గా స్పందించిన విషయం తెలిసిందే. తాజాగా మళ్లీ అదే సమస్య పునరావృతమైంది. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. వారంలో ఏదో ఒక రోజు, ఏదో ఒక స్టేషన్లో, ఏదో ఒక రైలు బోగీలో సాంకేతిక సమస్యలు తలెత్తుతూనే ఉన్నాయి. ప్రారంభించిన రోజే ఓ స్టేషన్లో రైలు ఆగిపోయింది. ఆ తరువాత వారం, పది రోజుల్లోనే ఓ పక్షి ఓవర్ హెడ్ వైరులో చిక్కుకోవడం, మరో వారంలో ఓ బోగీ డోరు తెర్చుకోలేదు. ఈ ఘటన తరువాత రెండు రోజులకు ఓ వ్యక్తి మెట్రో రైలు పట్టాలపై నడుచుకుంటూ వెళుతుండగా పైలట్ గమనించి కంట్రోల్ రూంకు సమాచారం అందించాడు. తరువాత భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సఘటనతో 20 నిమిషాలపాటు రైలు నిలిపివేయాల్సి వచ్చింది. గత వారంలో మరోల్ స్టేషన్లో రైలు ఆగింది. కానీ రెండు బోగీల డోర్లు తెర్చుకోలేదు. తాజాగా మంగళవారం మళ్లీ ఏసీ గ్రిల్ నుంచి వర్షాపు నీరు లోపలికి రావడం ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. రోజు దాదాపు 16 లక్షల మందిని చేరవేసే సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఐదు లక్షల మంది మాత్రమే రాకపోకలు సాగిస్తున్నారు. వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి ప్రవేశపెట్టిన ఈ మెట్రో రైళ్లలో తరుచూ ఎదురవుతున్న సమస్యల కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. -
నో ప్రోబ్లం.. మెట్రోనే నయం!
సాక్షి, ముంబై: పెరిగిన మెట్రో చార్జీలు ముంబైకర్లపై అంతగా ప్రభావం చూపించనట్లే కనిపిస్తోంది. వర్సోవ-అంధేరి-ఘాట్కోపర్ (11.04 కి.మీ) మెట్రో రైలు చార్జీలు గత మంగళవారం నుంచి పెరిగిన విషయం తెలిసిందే. చార్జీలు రూ.10-15-20 పెంచినప్పటికీ రోజూ మెట్రోను ఆశ్రయించే ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. కాగా స్మార్ట్ కార్డ్ కలిగిన ప్రయాణికులు చివరి (లాస్ట్) స్టేజీ వరకు కేవలం రూ.15 చెల్లించి ప్రయాణించవచ్చు. కాగా, స్మార్ట్ కార్డుల విక్రయాలు పెంచేందుకు తక్కువ చార్జీలను వసూలు చేస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. మెట్రో రైలు ఆరంభమై నెల రోజులు గడచిన తర్వాత ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ (ఎంఎంఓపీఎల్) అధికారులు కొత్త చార్జీలను ప్రకటించారు. మున్ముందు ప్రయాణికుల స్పందనను బట్టి చార్జీలను రూ. గరిష్టంగా రూ.40 పెంచనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం గరిష్ట చార్జీల పెంపకాన్ని నిలిపివేశామని అధికారి తెలిపారు. ఇదే గమ్యానికి బెస్ట్ బస్సులు వసూలుచేస్తున్న గరిష్ట చార్జీలతో పోలిస్తే ప్రస్తుతం పెంచిన మెట్రో రైలు చార్జీలు తక్కువేనని అధికారి అభిప్రాయపడ్డారు. కాగా, చార్జీలను పెంచిన మొదటి రోజు ప్రయాణికుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదని అధికారి తెలిపారు. కాగా, ఈ మెట్రో రైలు ప్రయాణికుల సమయాన్ని ఆదా చేస్తోందని ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సందర్భంగా విజయ్ వాఘేలా అనే ప్రయాణికుడు మాట్లాడుతూ.. ఈ మెట్రోను తూర్పు-పశ్చిమ శివార్లను అనుసంధానం చేసే ఫాస్ట్ రైలుగా అభివర్ణించారు. దీంతో తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించగలుగుతున్నామని, ఎక్కువ చార్జీలు విధించినా తప్పులేదని అభిప్రాయపడ్డారు. చార్జీలు గరిష్టంగా రూ.40 పెరిగినా ప్రయాణికులు పెద్దగా పట్టించుకునే అవకాశాలు తక్కువేనని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో ప్రయాణికుడు రత్నాకర్ సావంత్ మాట్లాడుతూ...ఒక నెల తర్వాత మెట్రో చార్జీలు పెంచనున్నట్లు ప్రయాణికులకు మొదటి నుంచి సమాచారం ఉండటం వల్ల పెరిగిన చార్జీలకు మానసికంగా సిద్ధపడే ఉన్నారని పేర్కొన్నారు. దీనికితోడు స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు డిస్కౌంట్ ఇవ్వడం హర్షించదగ్గ విషయమన్నారు. దీంతో టికెట్ కోసం భారీ క్యూలో నిలబడాల్సిన అవసరం లేకుండా పోయిందని తెలిపారు. మెరుగైన సౌకర్యాలు అందజేస్తున్నప్పుడు రవాణా విషయంలో చార్జీలు పెంచినా ఎవ్వరూ ఏమీ అనుకోరని అభిప్రాయపడ్డారు. కాకపోతే చార్జీలను పెంచడం ద్వారా జాయ్ రైడ్ కోసం వచ్చే ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందని మరో ప్రయాణికుడు తెలిపారు. -
మోనోరైలుకు విశేష స్పందన
సాక్షి, ముంబై : నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మోనో రైలుకు ముంబైకర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే దాదాపు కోటి మందికిపైగా ప్రయాణికులు రాకపోకలు సాగించారు. వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ ల మధ్య 11.4 కి.మీ ప్రయాణించే మెట్రో రైలును జూన్ 8వ తేదీన ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ప్రారంభించిన విషయం తెలి సిందే. మంగళవారానికి నెల రోజులు పూర్తవుతోంది. ఈ మెట్రో రైళ్లు మొత్తం 13 వేల ట్రిప్పులు కొట్టాయి. దాదాపు లక్షన్నర కి.మీ ప్రయాణించాయి. ప్రయాణికుల నుంచి వస్తున్న స్పందనను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయని రిలయన్స్ ఇన్ఫ్రా అభిప్రాయపడింది. సెలవుదినాల్లో చిన్నారులకు ఉచితం ముఖ్యంగా ప్రతీ శని, ఆదివారాల్లో 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణించేందుకు సౌకర్యం కల్పించింది. పిల్లలతోపాటు పెద్దలు కూడా అధిక సంఖ్యలోనే వస్తున్నారని ఇన్ఫ్రా స్పష్టం చేసింది. ప్రస్తుతం శని, ఆదివారాలు కార్యాలయలు, పాఠశాలలకు సెలవులు కావడంతో అత్యధిక శాతం జాయ్ రైడ్ కోసమే అందులో ప్రయాణిస్తున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద పొడుగాటి క్యూలు ఉంటున్నాయి. ప్లాట్‌ఫారాలపై రద్దీకూడా కనిపిస్తుంది. మిగతా రోజుల్లో ఉద్యోగులు, ఇతర పనుల నిమిత్తం వచ్చే వారు మినహా పిల్లలు, జాయ్ రైడ్ చేసే పెద్దల సంఖ్య అంతగా కనిపించడం లేదు. పర్యాటకుల ఆకర్షణ ముఖ్యంగా ఈ మెట్రో రైళ్లు స్థానిక ముంబైకర్లతోపాటు పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. బోగీలన్నీ మూసి ఉండడంతో బయటి శబ్ధం లోపలికి ఏమాత్రం వినిపించదు. రైలంతా ఏసీ, విశాలమైన కిటికీ అద్దాల్లోంచి బయట నగర అందాలను తిలకించేందుకు వీలుంది. దూర ప్రాంత ఎక్స్‌ప్రెస్ రైళ్ల మాదిరిగా ఈ చివర నుంచి ఆ చివర వరకు వెళ్లేందుకు బోగీలన్నీ జాయింట్ చేశారు. లోపల ఎలక్ట్రానిక్ ఇండికేటర్లు ఉన్నాయి. ప్రస్తుతం రైలు ఆగిన స్టేషన్, వచ్చే స్టేషన్ పేరు ముందుగానే హిందీ, ఇంగ్లిష్‌లో ప్రకటిస్తుంది. తత్ఫలితంగా ఈ రైళ్లు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇందులో కూర్చునే సామర్థ్యం తక్కువగా ఉంది. నిలబడి ప్రయాణించేందుకు ఎక్కువ స్థలం కేటాయించారు. అతి తక్కువ సమయంలో కోటికిపైగా ప్రయాణికులను చేరవేసిన ఘనత ముంబై మెట్రో రైళ్లు దక్కించుకున్నాయి.