VAT reduce
-
వ్యాట్ తగ్గింపుతో ఏపీలో పెట్టుబడులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాట్ తగ్గింపు నిర్ణయం ఆంధ్రప్రదేశ్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టడానికి వ్యాపార సంస్థలను ఆకర్షిస్తుందని ఏజీఅండ్‌పీ ప్రథమ్ ఎండీ, సీఈవో అభిలేశ్ గుప్తా తెలిపారు. ఇది తయారీ వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుందని, ఏపీ ఆధారిత కంపెనీలు ఇతర రా ష్ట్రాల్లోని తయారీదారులతో పోటీపడేలా చేస్తుందని అన్నారు. రాష్ట్రం స్థిర అభివృద్ధిలో సరికొత్త మార్గాన్ని రూపొందించడానికి, సహజ వాయువు ఆధారిత పారిశ్రామిక వృద్ధిలో కొత్త యుగానికి నాంది పలికేందుకు మార్గం సుగమం చేస్తుందని వివరించారు. పారిశ్రామికాభివృద్ధి, వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉందన్నారు. సీఎన్జీ, పై ప్డ్ నేచురల్ గ్యాస్ సేవల్లో ఉన్న ఏజీఅండ్‌పీ ప్రథమ్‌కు ఏపీలో 50కిపైగా సీఎన్జీ స్టేషన్లు ఉన్నా యి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్‌పై (సీఎన్జీ) ఏప్రిల్ 1 నుంచి విలువ ఆధారిత పన్నును (వ్యాట్) 24.5 నుంచి 5 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. -
ముందు మీ రాష్ట్రాల్లో తగ్గించమనండి
న్యూఢిల్లీ: పెట్రోల్‌పై వ్యాట్ తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌తో పాటు పలు పార్టీల నాయకులు స్పందించారు. ముందుగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సుంకాలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే బుధవారం ఏఎన్ఐతో మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ముందుగా కర్ణాటక, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వాలను పెట్రోల్-డీజిల్‌పై పన్నులు తగ్గించమని అడగాలని అన్నారు. కేంద్రం అత్యధిక ఎక్సైజ్ సుంకం విధించి రూ. 27 లక్షల కోట్లు వసూలు చేసిందని, తప్పనిసరిగా రాష్ట్రాలకు సబ్సిడీ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ ప్రతి సంవత్సరం రూ. 1 లక్ష కోట్ల ఇంధన సబ్సిడీ ఇచ్చారని గుర్తు చేశారు. మా రాష్ట్రాలే దొరికాయా? ఇంధనంపై పన్నులు తగ్గించాలని ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాలను మాత్రమే ప్రధాని మోదీ ఉటంకిస్తున్నారని డీఎంకే ఎంపీ టీకేఎస్ ఇలంగోవన్ అన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న గుజరాత్ లేదా కర్ణాటక పన్నులు తగ్గించాలని ఆయన అనరని ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సుంకాలు రాష్ట్రాలు వసూలు చేసే దానికంటే 3 రెట్లు ఎక్కువని ఆయన వెల్లడించారు. (చదవండి: పెట్రోల్ ధరలపై మోదీ కీలక వ్యాఖ్యలు) ఏకీకృత విధానం కావాలి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిర్వహించిన సమావేశాన్ని రాజకీయ సభలా ప్రధాని మోదీ మార్చేశారని జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా విమర్శించారు. కరోనా నియంత్రణకు గురించి తీసుకోవాల్సిన చర్యల కంటే.. పెట్రోల్-డీజిల్ పన్నుల గురించి ప్రధాని ఎక్కువగా మాట్లాడారని అన్నారు. పెట్రోలు, డీజిల్, ఎల్పీజీలను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి.. దేశవ్యాప్తంగా ఒకే ధర అమలయ్యేలా ఏకీకృత విధానం తీసుకురావాలని సూచించారు. (చదవండి: ద్వేషపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలంటూ మోదీకి లేఖ) -
ఢిల్లీలో పెట్రోలుపై రూ.8 తగ్గింపు.. కారణం ఇదే
Petrol Price In Delhi NCR to get cheaper by Rs.8 per litre: ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ తీపి కబురు చెప్పారు. పెరిగిన ఫ్యూయల్ ధరలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. పెట్రోవాత నుంచి ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (వాల్యూ యాడెడ్ ట్యాక్స్) తగ్గించాలని బుధవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 8 వరకు తగ్గింపు పెట్రోల్ ధరలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రస్తుతం ఢిల్లీ సర్కారు అమలు చేస్తోన్న వ్యాట్‌ను 30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లీటరు పెట్రోలు ధర ఇంచుమించు రూ.8 వరకు తగ్గనుంది. 2021 డిసెంబరు 1 అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ కొత్త తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కారు తెలిపింది. వారి వల్లే ఢిల్లీ నగర పరిధిలో హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇటీవల కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్ డ్యూటీని రూ.5 తగ్గించింది. ఆ తర్వాత వ్యాట్ తగ్గించుకోవాలంటూ రాష్ట్రాలకు సూచించింది. దీంతో బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్ , హర్యాణా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో పెట్రోలు, డీజిల్ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్క రకంగా ఉంటున్నాయి. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 103.97 ఉండగా నోయిడా (యూపీ)లో రూ.95.51, గురుగ్రామ్ (హర్యాణా)లో రూ. 95.90లుగా ఉంది. దీంతో పెట్రోలు రేటులో ఏకరూపత తెచ్చేందుకు ఆప్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.94 దగ్గరగా ఉండనుంది. చదవండి : ‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు -
పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం!
చెన్నై: లీటరు ధర వంద రూపాయల మార్క్‌ను దాటేసి వాహనదారులను బెంబేలెత్తిస్తోంది పెట్రోలు. ఆగకుండా పెరుగుతున్న ధరతో ఫ్యూయల్ కోసం బంకు వెళ్లిన ప్రతీసారీ బడ్జెట్ లెక్కలు వేసుకోవాల్సి వస్తోంది. పెట్రోలు ధరలతో సామాన్యులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట పద్దు తయారీ సందర్భంగా ఈ అనూహ్య నిర్ణయం తీసుకుంది. లీటరుపై రూ. 3 తగ్గింపు పెట్రోలు ధరలను తగ్గిస్తూ తమిళనాడు సర్కారు తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లినా పర్వాలేదు.. సామాన్యులకు ఊరట కలిగించేందుకు సిద్దమైంది. లీటరు పెట్రోలుపై రూ.3 వంతున ధర తగ్గించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్థికమంత్రి పళనివేల్ త్యాగరాజన్ ప్రకటించారు. సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. లీటరు పెట్రోలుపై రూ.3 ధర తగ్గించడం వల్ల తమిళనాడు రాష్ట్ర ఖజానాకు రూ. 1,160 కోట్ల నష్టం వస్తుందని, అయినా ప్రజా శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాట్‌లో కోత దేశవ్యాప్తంగా పెట్రోలు ధర లీటరుకు రూ.100 దాటేసింది. పెట్రోలో ధరలో 36 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్నులు ఉండగా దానిపై రాష్ట్ర ప్రభుత్వాలు వాల్యు యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)లను విధిస్తున్నాయి. ఇలా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల పోటుతో పెట్రోలు రేటు సెంచరీ మార్క్‌ని క్రాస్ చేసింది. దీంతో సామాన్యులకు పెట్రోలు ధరల నుంచి కొంత ఉపశమనం కలిగించేందుకు వ్యాట్‌ను తమిళనాడు ప్రభుత్వం తగ్గించింది. వంద దిగువకు ధరల తగ్గింపుకు ముందు చెన్నైలో లీటరు పెట్రోలు ధర రూ. 102.49గా ఉంది. మూడు రూపాయల తగ్గింపుతో పెట్రోలు ధర వందకు దిగువకు రానుంది. అయితే ధరల తగ్గింపు ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనే దానిపై స్పష్టత లేదు. అలాగే డీజిల్ రేట్ల తగ్గింపు ఉంటుందా లేదా అనేదానిపై కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. -
పెట్రో సెగలు : ఢిల్లీ కేబినెట్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : పెట్రో ఉత్పత్తుల ధరలు చుక్కలను తాకుతుంటే ప్రజలకు ఊరట కల్పించేందుకు ఢిల్లీ కేబినెట్ గురువారం కీలక నిర్ణయం తీసుకుంది. డీజిల్‌పై వ్యాట్‌ను 30 శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించాలని నిర్ణయించింది. దీంతో దేశ రాజధానిలో డీజిల్ ధరలు లీటర్‌కు 8.36 రూపాయలు తగ్గి 82 రూపాయల నుంచి 73 రూపాయలకు దిగివచ్చాయి. డీజిల్ ధరలు దిగిరానుండటంతో ఢిల్లీ ఆర్థిక వ్యవస్ధలో ఉత్తేజం నెలకొనేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని కేబినెట్ సమవేశానికి అధ్యక్షత వహించిన సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ సవాల్‌తో కూడుకున్నదని, ప్రజల సహకారంతో దీన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. డీజిల్ ధరను తగ్గించాలని కొంతకాలంగా నగర వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు డిమాండ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. డీజిల్‌పై వ్యాట్ తగ్గించడంతో దేశంలోనే డీజిల్ ధర తక్కువగా ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. రాజస్ధాన్‌లో అత్యధికంగా డీజిల్ లీటర్‌కు 82 రూపాయలు ఉండగా, మధ్యప్రదేశ్‌లో 81.29 రూపాయలు, మహారాష్ట్రలో 79.81 రూపాయలు పలుకుతోంది. గుజరాత్లో లీటర్ డీజిల్ 79 రూపాయలుగా ఉంది. చదవండి : పెట్రోల్‌తో డీజిల్ ధర సమానం! ఎందుకు? -
ఆ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ ధర రూ.1 తగ్గింపు
సాక్షి, తిరువనంతపురం: కేరళ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ రాష్ట్ర ప్రజలకు కొంతమేర ఉపశమనం కలిగించింది. ఇంధన ధరలకు చెక్ చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధనంపై రీటైల్ వాట్‌ను తగ్గించనుంది. దీంతో ఇటీవల అడ్డూ అదుపులేకుండా పరుగులు పెట్టిన పెట్రోల్, డీజిల్ ధరలకు అడ్డుకట్ట వేసిన తొలి రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఒకవైపు అంతర్జాతీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టినా, దేశీయంగా మాత్రం పెట్రో ధరల వాత తప్పడంలేదు. ఈ నేపథ్యంలో వామపక్ష పాలక రాష్ట్రం కేరళలో పెట్రోల్, డీజిల్ ధరల స్వల్పంగా నైనా శాంతించనుండటం విశేషం. జూన్ 1వ తేదీ శుక్రవారం నుంచి పెట్రోల్, డీజిల్ లీటర్ ధరపై ఒక రూపాయి తగ్గిస్తున్నట్టు కేరళ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. ఈ మేరకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. పెట్రోల్‌పై పన్నుపై కోత పెట్టడం ద్వారా వినియోగదారులపై ధరల భారాన్ని తగ్గించేందుకు కేరళ క్యాబినెట్ నిర్ణయించింది. దీంతో గత ఏడాది అక్టోబర్‌లో నరేంద్ర మోదీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు రూ .2 రూపాయల మేర ఎక్సైజ్ సుంకం తగ్గించాలని నిర్ణయించగా, నాలుగు రాష్ట్రాలు కేవలం వాట్ కట్‌ను ప్రకటించాయి. కాగా గత 16 రోజులుగా దేశవ్యాప్తంగా పెట్రోలు, డీజిల్ ధరలు భారీగా పెరుగుతూ వచ్చాయి. అయితే గ్లోబల్‌గా చమురు ధరలు శాంతించడంతో దేశీయంగా బుదవారం 1 పైసా ధర తగ్గిస్తున్నట్టు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ ప్రకటించింది. దీంతో ఇప్పటివరకూ భగ్గుమన్న ధరలను భరిస్తున్న ప్రజల్లో ఒక్కసారిగా మండిపడ్డారు. చమురు ధరలు చల్లబడిన తరువాత కూడా లీటరుకు కేవలం ఒక పైసా తగ్గింపుపై సర్వత్రా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. -
లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటకూడదని..
పణజి: పెట్రోల్ ధరలపై ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు గోవా సర్కారు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) తగ్గించింది. పెట్రోల్ పై వ్యాట్ ను 2 శాతం తగ్గించింది. దీంతో రాష్ట్రంలో పెట్రోల్ పై వ్యాట్ 22 శాతం నుంచి 20 శాతానికి తగ్గిందని వాణిజ్య పన్నుల విభాగం సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. లీటర్ పెట్రోల్ ధర రూ.60 దాటనీయబోమని బీజేపీ సర్కారు ఎన్నికల్లో హామీయిచ్చింది. చమురు కంపెనీలు గత రాత్రి పెట్రోల్ ధర లీటర్ కు 83 పైసలు పెంచాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర గోవాలో రూ.60 దాటిపోయింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం మేరకు వ్యాట్ తగ్గించి పెట్రోల్ ధర రూ.60 మించకుండా చేసింది. ప్రస్తుతం గోవాలో లీటర్ పెట్రోల్ ధర రూ.59.70గా ఉంది. గోవాలో 2012లో అధికారం చేపట్టిన బీజేపీ పెట్రోల్ పై వ్యాట్ పూర్తిగా రద్దు చేసింది. ఫలితంగా పెట్రోల్ ధర లీటరకు రూ.11 తగ్గింది. రాష్ట్ర ఖజానాకు రూ. 150 కోట్ల నష్టం వాటిల్లుతుండడంతో నిర్ణయాన్ని మార్చకుని మళ్లీ వ్యాట్ విధించింది.